సాక్షి, హైదరాబాద్: సైదాబాద్ చిన్నారి అత్యాచార, హత్య ఘటనపై హైదరాబాద్ సీపీ అంజనీ కుమార్ స్పందించారు. ఈ రోజు (గురువారం) ఉదయం స్టేషన్ ఘన్‌పూర్ రైల్వే పట్టాల వద్ద రాజు మృతదేహం లభ్యమైనట్లు అంజనీ కుమార్ తెలిపారు. రైల్వే ట్రాక్‌పై మృత దేహం పడి ఉన్నదని సమాచారం వచ్చిందని, లభించిన ఆనవాళ్ల ప్రకారం నిందితుడి చేతిపై మౌనిక అనే టాటూ ఉన్నట్లు పేర్కొన్నారు.
మరో చేతికి 5 స్టార్ మార్క్‌లు ఉన్నాయని, నిందితుడి కుటుంబ సభ్యులు రాజు మృతదేహాన్ని గుర్తించారని పేర్కొన్నారు. గత 5,6 రోజులుగా రాజు కోసం రాష్ట్రమంతా పోలీసులు తీవ్రంగా గాలిస్తున్నారని తెలిపారు. పోలీసుల నుంచి తప్పించుకోలేనని నిందితుడి మైండ్‌లో పడిపోయిందని, ఆ భయంతోనే రాజు ఆత్మ హత్య చేసుకున్నాడని వెల్లడించారు.
చదవండి: రాజు ఆత్మహత్య: కేటీఆర్ స్పందన..
సైదాబాద్ చిన్నారి అత్యాచారం, హత్యకేసు నిందితుడు రాజు ఆత్మహత్య చేసుకున్న విషయం తెలిసిందే. వరంగల్-ఘట్కేసర్ మార్గంలో స్టేషన్ ఘన్‌పూర్ వద్ద రైలు పట్టాలపై రాజు మృతదేహం కనిపించింది. చేతిపై ఉన్న టాటూ ఆధారంగా రాజు మృతదేహాన్ని గుర్తించారు. 8 రోజులుగా రాజు కోసం పోలీసులు ముమ్మరంగా గాలిస్తున్నారు. పంచనామా అనంతరం రాజు మృతదేహాన్ని వరంగల్ ఎంజీఎం ఆస్పత్రికి తరలించారు. రాజు ఆత్మహత్య చేసుకోవడం పట్ల సర్వత్రా హర్షాతిరేకాలు వ్యక్తమౌతున్నాయి. చిన్నారి ప్రాణాన్ని చిదిమేసిన కామాంధుడు రాజు మరణించడంతో బాధిత కుటుంబంతో పాటు అనేకమంది సంతోషం వ్యక్తం చేస్తున్నారు.
చదవండి: సైదాబాద్ చిన్నారి కేసు: నిందితుడు రాజు ఆత్మహత్య
Comments
Please login to add a commentAdd a comment