సైదాబాద్: అఖిల భారత గోసేవా ఫౌండేషన్ ప్రతినిధులు సినిమా హీరోయిన్ సాయిపల్లవిపై సైదాబాద్ ఠాణాలో ఫిర్యాదు చేశారు. ఫౌండేషన్ అధ్యక్షుడు బాలకృష్ణ గురుస్వామి మాట్లాడుతూ... తన సినిమా ప్రచారం కోసం ఒక యూట్యూబ్ చానల్‌కు ఇంటర్వ్యూ ఇస్తూ హీరోయిన్ సాయిపల్లవి గో రక్షకులపై అనుచిత వ్యాఖ్యలు చేయటం సమంజసం కాదన్నారు.
సైదాబాద్ ఇన్‌స్పెక్టర్‌కు ఫిర్యాదు చేస్తున్న ఫౌండేషన్ ప్రతినిధులు
తమ ప్రాణాలు పణంగా పెట్టి గోవులు కబేళాలకు తరలకుండా అడ్డుకుంటున్న గో–రక్షకులను సాయిపల్లవి ఉగ్రవాదులుగా చిత్రీకరిస్తూ చేసిన వ్యాఖ్యలను ఖండిస్తున్నామన్నారు. గోరక్షకులకు బహిరంగంగా క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేశారు. లేకుంటే ఆమె నటించిన సినిమాను అడ్డుకుంటామని తెలిపారు. ఈ మేరకు ఫౌండేషన్ ప్రతినిధుల బృందం గురువారం సాయంత్రం సైదాబాద్ ఇన్‌స్పెక్టర్ సుబ్బిరామిరెడ్డికి ఫిర్యాదు చేశారు.
చదవండి: (‘విరాటపర్వం’ మూవీ రివ్యూ)
Comments
Please login to add a commentAdd a comment