
ఉమారాణి మృతదేహం
సాక్షి, సైదాబాద్ : సహజీవనం చేస్తున్న ప్రియుడు పెళ్లికి అంగీకరించకపోవడంతో మనస్థాపానికి లోనైన మహిళ ఆత్మహత్య చేసుకున్న సంఘటన సైదాబాద్ పోలీస్‌స్టేషన్ పరిధిలో జరిగింది. ఇన్‌స్పెక్టర్ సత్తయ్య కథనం మేరకు వివరాలిలా ఉన్నాయి. ఐఎస్‌సదన్ డివిజన్ బాలాజీనగర్‌కు చెందిన ఉమారాణికి 1997లో నర్సింగ్‌రావు అనే వ్యక్తితో వివాహం జరిగింది. వీరికి ఒక కుమార్తె . మూడేళ్లకే భర్త చనిపోవడంతో కుమార్తెతో కలిసి కేశవనగర్ కాలనీలో ఉంటూ సిద్దేశ్వర ఆసుపత్రిలో నర్సుగా పని చేస్తుంది. ఈ క్రమంలో కారు డ్రైవర్‌గా పని చేస్తున్న శ్రావణ్‌కుమార్‌తో పరిచయం ఏర్పడటంతో గత కొంత కాలంగా సహజీవనం చేస్తున్నారు.
అయితే పెళ్లి విషయమై గత కొద్ది రోజులుగా వారి మధ్య గొడవలు జరుగుతున్నాయి. బుధవారం కూడా ఆమె పెళ్లి ప్రస్తావన తేవడంతో తన చెల్లెళ్ల పెళ్లి అయిపోగానే చేసుకుదామని చెప్పి డ్యూటీకి వెళ్లిపోయాడు. ఆ తర్వాత ఆమె పలుమార్లు ఫోన్ చేసినా స్పందించకపోవడంతో మనస్థాపానికి గురైన ఉమారాణి ఇంట్లో ప్యాన్‌కు ఉరి వేసుకుని ఆత్మహత్యకు పాల్పడింది. మధ్యాహ్నం ఇంటికి వచ్చిన శ్రావణ్ తలుపుకొట్టినా స్పందన లేకపోవడంతో అనుమానంతో ఆమె సోదరుడికి ఫోన్ చేశారు. ఇద్దరూ గడియ విరగొట్టి లోపలికి వెళ్లగా ఉమారాణి ఫ్యాన్‌కు వేలాడుడూ కనిపిచింది. సంఘటనా స్థలానికి చేరుకుని శ్రావణ్ అదుపులోకి తీసుకున్నారు. మృతురాలి సోదరుడు రాంచందర్ ఫిర్యాదు మేర కు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.
Comments
Please login to add a commentAdd a comment