
ప్రతీకాత్మక చిత్రం
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ స్కూల్ ఎడ్యుకేషన్‌లో బుధవారం ఏసీబీ సోదాలు నిర్వహించింది. రూ. 40వేలు లంచం తీసుకుంటూ అసిస్టెంట్ డైరెక్టర్ శ్రీనివాస్ ఏసీబీకి పట్టుబడ్డాడు. అసలు విషయంలోకి వెళితే ఫైల్ క్లియరెన్స్ కోసం శ్రీనివాస్ రూ. లక్ష డిమాండ్ చేశాడు. అయితే రూ. 40వేలు లంచం తీసుకుంటుండగా ఏసీబీకి చిక్కడంతో శ్రీనివాస్‌ను అదుపులోకి తీసుకున్నారు. కాగా సైఫాబాద్ కార్యాలయంలో సోదాలు కొనసాగుతున్నాయి.
Comments
Please login to add a commentAdd a comment