అలంపూర్ రూరల్: తెలంగాణ గురుకులాలు దేశానికే ఆదర్శంగా నిలిచాయని సాంఘిక సంక్షేమశాఖ గురుకుల విద్యాలయాల సంస్థ కార్యదర్శి డాక్టర్ ఆర్‌ఎస్ ప్రవీణ్‌కుమార్ కొనియాడారు. గురుకులాలను ఆదర్శవంతంగా తీర్చిదిద్ది అం దరి ఆదరాభిమానాలు పొందానని అన్నా రు. ఇక్కడ చదువుతున్న పేదవిద్యార్థులకు అన్ని రకాల సౌకర్యాలు కల్పించానని పేర్కొన్నారు. శుక్రవారం ఆయన తన సొంతూరు అలంపూర్‌కు వచ్చారు. స్థానిక సంతోష్‌నగర్ కాలనీలో అంబేద్కర్ విజ్ఞానకేంద్రాన్ని సందర్శించి అక్కడివారితో మాట్లాడారు. ఈ సందర్భంగా విలేకరులతో మాట్లాడుతూ.. అనేక రాష్ట్రా లు తమ విద్యాలయాల విధానాలనే పాటిస్తున్నాయని చెప్పారు. అన్ని వి ద్యాలయాల్లో అన్ని హంగులతో అధునాతన సౌకర్యాలు కల్పించామన్నారు. ఇక్కడ విలువలతో కూడిన విద్యను అందిస్తున్నామని వివరించారు. గత వేసవిసెలవుల్లో విద్యార్థులకు ఎన్నో అంశాలతో శిక్షణ ఇచ్చామని తెలిపారు. వివిధ దేశాల నిపుణులతో కోచింగ్ ఇప్పించామన్నారు. జిల్లాలోని ఇటిక్యాల, గోపాలపేటలో రూ.30కోట్లతో గురుకుల విద్యాలయాన్ని నిర్మిస్తున్నామని వివరించారు. ఇటిక్యాల గురుకుల పాఠశాల విద్యార్థులు సుందర్‌రాజు, ఈదన్న థాయ్‌లాండ్‌లో జరిగిన యోగాపోటీల్లో చాంపియన్లుగా నిలవడం గర్వంగా ఉందన్నారు.
రాష్ట్రంలో ఉన్న 135 గురుకులాల్లో 19వేల సీట్ల కోసం 89వేల దరఖాస్తులు వచ్చాయని వివరించారు. కేజీ టు పీజీ విద్యావిధానంలో సాంఘిక సంక్షేమశాఖ గురుకుల విద్యాలయాలు ప్రధాన భూమిక పోషిస్తున్నాయని అన్నారు. పదో తరగతిలో ప్రైవేట్‌సంస్థలకు దీటుగా 89శాతం ఫలితాలు సాధించామన్నారు. 40మంది విద్యార్థులను ఐఐటీకి పంపించామని, ప్రముఖ అజీమ్ ప్రేమ్‌జీ యూనివర్సిటీలో 30సీట్లకు 27 సీట్లు తమ విద్యార్థులకే వచ్చాయని చెప్పారు. ఆయన వెంట ఏపీ ఉమెన్స్ కమిషన్ సభ్యురాలు సునితాకృష్ణన్ ఉన్నారు.
అక్టోబర్ నాటికి గురుకుల
పాఠశాలను ప్రారంభిస్తాం
ఇటిక్యాల: గోపాల్‌పేట, ఇటిక్యాల సాంఘిక సంక్షేమ గురుకుల పాఠశాలను అక్టోబర్ నాటికి ప్రారంభిస్తామని డాక్టర్ ఆర్‌ఎస్ ప్రవీణ్‌కుమార్ తెలిపారు. శుక్రవారం ఇటిక్యాల మండల కేంద్రంలో నిర్మాణమవుతున్న గురుకుల భవనాన్ని ఆయన పరిశీలించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. విద్యార్థులకు సౌకర్యాలు కల్పిస్తామన్నా రు.
భవన నిర్మాణాన్ని నాణ్యవంతంగా చేపట్టాలని కాంట్రాక్టర్‌కు సూచించారు. విద్యార్థుల్లో దాగిఉన్న సృజనాత్మకతను వెలికి తీసేందుకు పలు కార్యక్రమాలు చేపడుతున్న వివరించారు. ఆయన వెంట అలంపూర్ గురుకుల పాఠశాల ప్రిన్సిపాల్ రవీందర్, భవననిర్మాణ సైట్ ఇంజనీర్ ఆంజనేయులు ఉన్నారు.
గురుకులాలు దేశానికే గర్వకారణం
Published Sat, Jul 18 2015 1:13 AM | Last Updated on Sun, Sep 3 2017 5:41 AM
Advertisement
Advertisement