champions
-
Sakshi Premier League: చాంప్స్ ఎన్ఆర్ఐ, సర్ సీఆర్ రెడ్డి కాలేజీలు
చేబ్రోలు: సాక్షి ప్రీమియర్ లీగ్ (ఎస్పీఎల్) ఆంధ్రప్రదేశ్ రాష్ట్రస్థాయి క్రికెట్ టోర్నీలో జూనియర్ విభాగంలో ఎన్ఆర్ఐ కాలేజి (విజయవాడ), సీనియర్ విభాగంలో సర్ సీఆర్ రెడ్డి ఇంజినీరింగ్ కాలేజి (ఏలూరు) జట్లు చాంపియన్స్‌గా నిలిచాయి. గుంటూరు జిల్లా చేబ్రోలు మండలం వడ్లమూడి విజ్ఞాన్స్ యూనివర్సిటీలో శనివారం ఎస్పీఎల్ టోర్నీ ఘనంగా ముగిసింది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర జలవనరుల శాఖ అంబటి రాంబాబు, నరసరావుపేట ఎంపీ లావు శ్రీకృష్ణదేవరాయలు ముఖ్య అతిథులుగా హాజరై విన్నర్స్, రన్నరప్ జట్లకు నగదు పురస్కారాలు, ట్రోఫీలను అందజేశారు. చాంపియన్ జట్లకు రూ. 25 వేలు... రన్నరప్ జట్లకు రూ. 15 వేలు చొప్పున నగదు పురస్కారం లభించింది. జూనియర్ విభాగం ఫైనల్లో ఎన్ఆర్ఐ కాలేజి 35 పరుగులతో సాయి గణపతి పాలిటెక్నిక్ కాలేజి (విశాఖపట్నం)పై నెగ్గింది. తొలుత బ్యాటింగ్ ఎంచుకున్న ఎన్ఆర్ఐ జట్టు నిర్ణేత 20 ఓవర్లలో 3 వికెట్లకు 151 పరుగులు సాధించింది. రూపేష్ (60 బంతుల్లో 73 నాటౌట్; 7 ఫోర్లు, 1 సిక్స్), కెప్టెన్ రేవంత్ (45 బంతుల్లో 62; 8 ఫోర్లు, 1 సిక్స్) అర్ధ సెంచరీలతో మెరిశారు. అనంతరం సాయి గణపతి కాలేజి 16.3 ఓవర్లలో 116 పరుగులకు ఆలౌటై ఓడిపోయింది. ఎన్ఆర్ఐ జట్టు బౌలర్లలో తరుణ్ 4 వికెట్లు, రేవంత్ 2 వికెట్లు పడగొట్టారు. రేవంత్‌కు ‘ప్లేయర్ ఆఫ్ ద ఫైనల్’ అవార్డు లభించింది. సీనియర్ విభాగం ఫైనల్లో సర్ సీఆర్ రెడ్డి ఇంజినీరింగ్ కాలేజి తొమ్మిది వికెట్ల తేడాతో శ్రీనివాస ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ కామర్స్ (సీకామ్) డిగ్రీ కాలేజి (తిరుపతి) జట్టును ఓడించి టైటిల్ సొంతం చేసుకుంది. మొదట సీకామ్ కాలేజి 19.3 ఓవర్లలో 116 పరుగులకు ఆలౌటైంది. శివ కార్తీక్ (51 బంతుల్లో 42 పరుగులు; 3 ఫోర్లు) రాణించాడు. సీఆర్ రెడ్డి కాలేజి బౌలర్ మనోజ్ నాలుగు, వికెట్లు పడగొట్టాడు. అనంతరం సర్ సీఆర్ రెడ్డి కాలేజి 15.1 ఓవర్లలో ఒక వికెట్ నష్టానికి 117 పరుగులు చేసి గెలిచింది. ‘ప్లేయర్ ఆఫ్ ద ఫైనల్’ గగన్ కుమార్ (47 బంతుల్లో 57 నాటౌట్; 5 ఫోర్లు, 1 సిక్స్), సంజయ్ (27 బంతుల్లో 23; 3 ఫోర్లు) రాణించారు. జూనియర్ విభాగంలో ఎన్ఆర్ఐ కాలేజి ఆటగాడు రేవంత్... సీనియర్ విభాగంలో సీఆర్ రెడ్డి కాలేజి ఆటగాడు మనోజ్ ‘ప్లేయర్ ఆఫ్ ద సిరీస్’ అవార్డులు దక్కించుకున్నారు. -
సల్మాన్.. ఆమిర్... ఓ సినిమా!
సల్మాన్ ఖాన్, ఆమిర్ ఖాన్లు కలిసి ఓ సినిమా చేయనున్నారా? అంటే అవుననే అంటున్నాయి బాలీవుడ్ వర్గాలు. స్పానిష్ ఫిల్మ్ ‘చాంపియన్స్’ హిందీ రీమేక్‌ను నిర్మించి, నటించా లనుకున్నారు ఆమిర్. అయితే ఇప్పుడు ఈ రీమేక్‌కు సల్మాన్ ఖాన్ బాగుంటారని భావించారట. ఈ సినిమా గురించి చర్చించడానికి సల్మాన్‌ను ఇంటికి ఆహ్వానించారట ఆమిర్. కాగా తాను నటించిన ‘ది ఫారెస్ట్ గంప్’ హిందీ రీమేక్ ‘లాల్‌సింగ్ చడ్డా’ సరిగ్గా ఆడకపోవడంతో వెంటనే మరో రీమేక్‌లో నటించాలనే నిర్ణయాన్ని ఆమిర్ మార్చుకున్నారట. అందుకే హీరోగా నటించాల్సిందిగా సల్మాన్‌ను రిక్వెస్ట్ చేశారని టాక్. -
ఉక్కు సంకల్పం కలిగిన అమ్మాయిలకు అభినందనలు: సీఎం జగన్
సాక్షి, అమరావతి: ఖేలో ఇండియా యూత్ గేమ్స్‌లో విజయం సాధించిన అమ్మాయిలకు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి బుధవారం సాయంత్రం ట్విటర్ ద్వారా అభినందనలు తెలియజేశారు. ‘‘ఖేలో ఇండియా యూత్ గేమ్స్‌లో అద్భుత విజయాలు సాధించినందుకు ఛాంపియన్లు రజిత, పల్లవి, శిరీషలకు అభినందనలు. ఉక్కు సంకల్పం కలిగిన ఈ అమ్మాయిలు ఏపీకి గర్వకారణంగా నిలిచారు. వీళ్ల విజయం.. అన్ని అసమానతలకు వ్యతిరేకంగా పోరాడిన పటిమ, కలలను సాధనకు చేసిన కృషి.. ఎంతో మంది ఔత్సాహికులకు ప్రేరణ అంటూ సీఎం జగన్ ట్వీట్ చేశారు. Congratulating champions Rajitha, Pallavi & Sireesha for their spectacular victories in the Khelo India Youth Games. The iron-willed girls have made AP proud. Their fighting spirit to succeed against all odds is an inspiration for countless aspirants to achieve their dreams. — YS Jagan Mohan Reddy (@ysjagan) June 8, 2022 -
Sameeha Barwin: ఈ పెద్దలు ఎందుకు ‘వినరు?’
ప్రతిభ వినని పెద్దలుపోలాండ్లోని లుబ్లిన్‌లో ఆగస్టు 23 – 28 తేదీల మధ్య ప్రపంచ బధిర అథ్లెటిక్స్ చాంపియన్ షిప్స్ జరగనున్నాయి. మన దేశం నుంచి ఐదు మంది ‘పురుష’ బధిర అథ్లెటిక్స్ వెళుతున్నారు. మన దేశం నుంచి ఒక ‘మహిళా’ బధిర అథ్లెట్‌ను డ్రాప్ చేశారు. ఎందుకంటే ‘నిధులు లేవట’. ఆమె స్త్రీ కనుక ఎస్కార్ట్ ఇవ్వలేరట. అలాగని ఒక్కదాన్నీ పంపలేరట. తమిళనాడుకు చెందిన సమీహా పర్వీన్ నిరాశలో కూరుకుపోయింది. ఒకవైపు ఒలింపిక్స్‌లో మహిళలు పతకాలు తెస్తే మరోవైపు ఈ ఉదంతం. సమీహా గత రికార్డులు ఈ పెద్దలు ఎందుకు ‘వినరు?’. కన్యాకుమారి నుంచి ఢిల్లీకి దాదాపు రెండున్నర రోజుల రైలు ప్రయాణం. సుమారు 3 వేల కిలోమీటర్ల దూరం. ఒక బధిర అథ్లెట్, 18 ఏళ్ల సమీహా ఒంటరిగా ప్రయాణించాలి. ఎందుకు? ఆగస్టు చివరి వారంలో పోలెండ్‌లో బధిర అథ్లెట్ల ప్రపంచ ఛాంపియన్ షిప్స్ జరుగుతున్నాయి. అందుకుగాను జూలై 22న జాతీయ సెలక్షన్‌కు ఢిల్లీకి హాజరు కమ్మని దేశ వ్యాప్తంగా ఉన్న 12 మంది బధిర అథ్లెట్లకు ఆహ్వానం అందింది. ఆహ్వానించింది ‘స్పోర్ట్ అథారిటీ ఆఫ్ ఇండియా’ (ఎస్.ఏ.ఐ) ఆధ్వర్యంలోని ‘ఆల్ ఇండియా స్పోర్ట్స్ కౌన్సిల్ ఫర్ ది డెఫ్’ (ఏ.ఐ.ఎస్.సి.డి). కాని ఇందుకు చేసిన ఏర్పాట్లు? ఒంటరి సమీహా కన్యాకుమారి జిల్లాలోని కడయాల్ టౌన్‌కు చెందిన సమీహా పర్వీన్ 90 శాతం బధిరురాలు. వాళ్ల నాన్న చిన్న టీ అంగడి నడుపుతాడక్కడ. ఐదేళ్ల వయసులో తీవ్రమైన జ్వరం రాగా అప్పటివరకూ ఆరోగ్యంగా ఉన్న సమీహా వినిడికి శక్తి కోల్పోయింది. అయినప్పటికీ ఆమెకు బాల్యం నుంచి ఆటలంటే ఇష్టం ఏర్పడింది. తల్లిదండ్రలు తమ స్తోమత చాలకపోయినా ప్రోత్సహించారు. సమీహా లాంగ్ జంప్‌లో, 100 మీటర్ల పరుగులో రాణించింది. మూడు జాతీయ బధిర అథ్లెటిక్స్ లో (2017– జార్ఖండ్, 2018–చెన్నై, 2019–కోల్కటా) గోల్డ్ మెడల్స్ సాధించింది. ఇంకా అనేక పోటీల్లో ఆమె సాధించిన మెడల్స్ అనేకం ఉన్నాయి. అందుకనే సెలక్షన్స్ కోసం ఆమెకు పిలుపు వచ్చింది. కాని తేదీ హటాత్తుగా చెప్పడం వల్ల, కోవిడ్ రీత్యా ఆమెతో పాటు వచ్చే తల్లి ఆమెతో రాలేకపోయింది. రాష్ట్ర క్రీడా శాఖకు ఎన్ని వినతులు చేసినా ఇవ్వాల్సిన బాధ్యత ఉన్నా ఎస్కార్ట్‌ను ఇవ్వలేదు. చివరకు సమీహా నలుగురు పురుష బధిర క్రీడాకారులతోనే ప్రయాణించాల్సి వచ్చింది. ఎందుకంటే ఆమెకు పోలాండ్‌లో జరిగే పోటీలలో పాల్గొనాలనే లక్ష్యం ఉంది. అందులో మెడల్ కొట్టగలననే విశ్వాసం ఉంది. కాని ఆమె ఒకటి తలిస్తే అధికారులు మరొకటి తలిచారు. క్వాలిఫై అయినా పోలాండ్‌లో జరిగే ప్రపంచ ఛాంపియన్ షిప్‌కు సమీహా లాంగ్‌జంప్‌లో, పరుగులో పాల్గొనాలనుకుంది. లాంగ్ జంప్‌కు ప్రమాణం 5 మీటర్లుగా అధికారులు నిర్ధారిస్తే సమీహా 5 మీటర్లను దూకి క్వాలిఫై అయ్యింది. అయినప్పటికీ ఫైనల్ లిస్ట్‌లో 5 మంది బధిర పురుష అథ్లెట్లను ఎంపిక చేశారు. ప్రమాణాన్ని అందుకోలేకపోయిన మరో బధిర అథ్లెట్ వర్షా గులియా (ఢిల్లీ) ని నిరాకరించినా సమీహాను ఎందుకు సెలెక్ట్ చేయలేదో ఆమె కుటుంబానికి అర్థం కాలేదు. వివక్ష ఉంది ‘బధిర క్రీడాకారుల్లో స్త్రీల పట్ల వివక్ష ఉంది. గతంలో జార్ఖండ్‌లో జాతీయ ఛాంపియన్ షిప్ జరిగినప్పుడు మాకు ఉండే చోటు ఇవ్వలేదు. తినడానికి తిండి పెట్టలేదు’ అని సమీహా తల్లి సలామత్ అంది. కూతురికి ప్రతిభ ఉన్నా పోలాండ్‌కు సెలక్ట్ చేయకపోవడంతో ఆమె హతాశురాలైంది. ‘మాకు చెప్పిందేమిటంటే మీ అమ్మాయి ఒక్కదాన్నే పంపాలంటే ఇబ్బందులున్నాయి. ఎస్కార్ట్ ఇవ్వలేము. అలాగని ఒంటరిగా పంపలేము. అలాగే మా దగ్గర ఫండ్స్ తక్కువ ఉన్నాయి అని. దీనికి మించిన అన్యాయం లేదు’ అంది సలామత్. పోలాండ్‌కు వెళ్లే టీమ్ ఆగస్టు 14న దేశం నుంచి బయలుదేరుతోంది. కాని అందులో తాను లేకపోవడం సమీహాకు ఆవేదన కలిగిస్తోంది. కన్యాకుమారి ఎం.పి ఈ సంగతి తెలిసి స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియాకు లేఖ రాశారు– ఆమె ఫండింగ్ మేము చూసుకుంటాం తీసుకెళ్లండి అని. దానికి కూడా సంబంధీకులు స్పందించలేదు. టోక్యో ఒలింపిక్స్‌లో మహిళాతేజం అందరూ చూశారు. సమీహా వెళ్లి ఉంటే అక్కడా అలాంటి విజయమే వచ్చి ఉండేదేమో. ఆమె ఆటకూ, పతకానికి కూడా అధికారుల ‘వినికిడి లోపం’ అన్యాయం చేసిందని దేశంలో చాలామంది క్రీడా అభిమానులు ట్వీట్లు చేస్తున్నారు. విమర్శిస్తున్నారు. సారీ సమీహా. ‘బధిర క్రీడాకారుల్లో స్త్రీల పట్ల వివక్ష ఉంది. గతంలో జార్ఖండ్‌లో జాతీయ ఛాంపియన్ షిప్ జరిగినప్పుడు మాకు ఉండే చోటు ఇవ్వలేదు. తినడానికి తిండి పెట్టలేదు’ ‘మాకు చెప్పిందేమిటంటే మీ అమ్మాయి ఒక్కదాన్నే పంపాలంటే ఇబ్బందులున్నాయి. ఎస్కార్ట్ ఇవ్వలేము. అలాగని ఒంటరిగా పంపలేము. అలాగే మా దగ్గర ఫండ్స్ తక్కువ ఉన్నాయి అని. దీనికి మించిన అన్యాయం లేదు’ -
30 ఏళ్ల నిరీక్షణకు తెర
లండన్: ఒకటి కాదు... రెండు కాదు... ఏకంగా 30 ఏళ్ల సుదీర్ఘ నిరీక్షణకు లివర్‌పూల్ ఫుట్‌బాల్ క్లబ్ (ఎఫ్‌సీ) తెరదించింది. ప్రతిష్టాత్మక ఇంగ్లిష్ ప్రీమియర్ లీగ్ (ఈపీఎల్) 2019–2020 సీజన్ చాంపియన్‌గా ఆవిర్భవించింది. డిఫెండింగ్ చాంపియన్ మాంచెస్టర్ సిటీ జట్టు శుక్రవారం జరిగిన మ్యాచ్‌లో 1–2 గోల్స్‌తో చెల్సీ ఎఫ్‌సీ చేతిలో ఓడటంతో లివర్‌పూల్ టైటిల్ కల సాకారమైంది. టైటిల్ రేసులో నిలవాలంటే ఓటమి తప్పించుకోవాల్సిన మ్యాచ్‌లో మాంచెస్టర్ సిటీ ఓడిపోవడంతో కరోనా విరామం అనంతరం బరిలోకి దిగకుండానే లివర్‌పూల్‌కు టైటిల్ లభించింది. ఈ సీజన్లో ఈపీఎల్‌లో ఉన్న 20 జట్లకు తలా ఏడు మ్యాచ్‌లు మిగిలి ఉండగా... లివర్‌పూల్ 86 పాయింట్లు, మాంచెస్టర్ సిటీ 63 పాయింట్లతో తొలి రెండు స్థానాల్లో ఉన్నాయి. మిగిలిన ఏడు మ్యాచ్‌ల ఫలితాలు ఎలా ఉన్నా పాయింట్ల పట్టికలో లివర్‌పూల్‌ను ఏ జట్టూ అందుకునే పరిస్థితి లేకపోవడంతో ఆ జట్టుకు టైటిల్ ఖాయమైంది. 1989–90 సీజన్లో చివరిసారిగా లివర్‌ఫూల్ విజేతగా నిలిచింది. ఈపీఎల్ చరిత్రలో ఓ జట్టు ఏడు మ్యాచ్‌లు మిగిలి ఉండగానే చాంపియన్‌గా అవతరించడం ఇదే తొలిసారి. -
చాంప్స్ తై జు యింగ్, అక్సెల్సన్
బర్మింగ్‌హామ్: ప్రతిష్టాత్మక ఆల్ ఇంగ్లండ్ బ్యాడ్మింటన్ చాంపియన్‌షిప్‌లో పురుషుల సింగిల్స్‌లో ప్రపంచ మాజీ నంబర్‌వన్ విక్టర్ అక్సెల్సన్ (డెన్మార్క్)... మహిళల సింగిల్స్‌లో ప్రపంచ రెండో ర్యాంకర్ తై జు యింగ్ (చైనీస్ తైపీ) చాంపియన్స్‌గా నిలిచారు. 120 ఏళ్ల చరిత్ర కలిగిన ఈ టోర్నమెంట్లో ఆదివారం జరిగిన ఫైనల్స్‌లో అక్సెల్సన్ 21–13, 21–14తో ప్రపంచ రెండో ర్యాంకర్, టాప్ సీడ్ చౌ తియెన్ చెన్ (చైనీస్ తైపీ)పై నెగ్గగా... తై జు యింగ్ 21–19, 21–15తో టాప్ సీడ్, ప్రపంచ నంబర్‌వన్ చెన్ యుఫె (చైనా)ను బోల్తా కొట్టించింది. 1999లో పీటర్ గేడ్ తర్వాత ఆల్ ఇంగ్లండ్ ఓపెన్ టైటిల్‌ను గెలిచిన తొలి డెన్మార్క్ ప్లేయర్‌గా అక్సెల్సన్ గుర్తింపు పొందాడు. సింగిల్స్ టైటిల్స్ నెగ్గిన అక్సెల్సన్, తై జు యింగ్‌లకు 77 వేల డాలర్ల చొప్పున (రూ. 57 లక్షలు) ప్రైజ్‌మనీ లభించింది. -
ఓవరాల్ చాంప్ పంజాబ్ యూనివర్సిటీ
భువనేశ్వర్: తొలిసారి నిర్వహించిన ఖేలో ఇండియా యూనివర్సిటీ గేమ్స్‌లో పంజాబ్ యూనివర్సిటీ జట్టు ఓవరాల్ చాంపియన్‌గా నిలిచింది. ఆదివారం ముగిసిన ఈ క్రీడల్లో పంజాబ్ వర్సిటీ మొత్తం 46 పతకాలు సాధించింది. ఇందులో 17 స్వర్ణాలు, 19 రజతాలు, 10 కాంస్యాలు ఉన్నాయి. ముగింపు ఉత్సవానికి ఒడిశా ముఖ్యమంత్రి నవీన్ పట్నాయక్, కేంద్ర క్రీడల మంత్రి కిరణ్ రిజిజు ముఖ్య అతిథులుగా హాజరై విజేతలకు ట్రోఫీలు అందజేశారు. మొత్తం పది రోజులపాటు జరిగిన ఈ క్రీడల్లో 64 యూనివర్సిటీలు కనీసం ఒక స్వర్ణమైనా సాధించాయి. 113 యూనివర్సిటీలు కనీసం ఒక కాంస్యమైనా గెలిచాయి. ఆంధ్రప్రదేశ్‌కు చెందిన ఆచార్య నాగార్జున యూనివర్సిటీ నాలుగు పతకాలతో (స్వర్ణం, రజతం, రెండు కాంస్యాలు) 38వ ర్యాంక్‌లో... ఆంధ్ర యూనివర్సిటీ రెండు పతకాలతో (స్వర్ణం, కాంస్యం) 50వ ర్యాంక్‌లో... కృష్ణా యూనివర్సిటీ రెండు రజతాలతో 72వ ర్యాంక్‌లో... డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ యూనివర్సిటీ ఒక కాంస్యంతో 97వ ర్యాంక్‌లో.... తెలంగాణకు చెందిన ఉస్మానియా యూనివర్సిటీ రెండు పతకాలతో (స్వర్ణం, రజతం) 45వ ర్యాంక్‌లో... పాలమూరు యూనివర్సిటీ ఒక రజతంతో 81వ ర్యాంక్‌లో నిలిచాయి. -
ఇదొక్కటే లోటు
క్రికెట్లో అందుబాటులో ఉన్న అన్ని ఘనతలూ సాధించిన ఆసీస్ జట్టు ఇప్పటివరకూ ఒక్కసారి కూడా టి20 ప్రపంచకప్ గెలవలేదు. ఇదొక్కటే లోటుగా కనిపిస్తోందని, భారత్‌లో కప్ గెలవడం ద్వారా టి20ల్లోనూ చాంపియన్లుగా అవతరిస్తామని ఆసీస్ కెప్టెన్ స్టీవ్ స్మిత్ అన్నాడు. -
చాంప్ ముంబై గరుడ
♦ ఫైనల్లో హరియాణా హ్యామర్స్‌పై 7-2తో విజయం ♦ ముగిసిన ప్రొ రెజ్లింగ్ లీగ్ న్యూఢిల్లీ: ఆద్యంతం అజేయంగా నిలిచిన ముంబై గరుడ జట్టు ప్రొ రెజ్లింగ్ లీగ్‌లో చాంపియన్‌గా అవతరించింది. ఆదివారం జరిగిన ఫైనల్లో ముంబై గరుడ 7-2 బౌట్ల తేడాతో హరియాణా హ్యామర్స్‌పై విజయం సాధించింది. లీగ్ దశలో ఆడిన ఐదు మ్యాచ్‌ల్లో నెగ్గిన ముంబై గరుడ... సెమీఫైనల్లో, ఫైనల్లో అదే జోరును కనబరిచింది. మహిళల విభాగంలో ఒడునాయో అడుకురోయె (ముంబై గరుడ), వినేశ్ ఫోగట్ (ఢిల్లీ వీర్)... పురుషుల విభాగంలో నర్సింగ్ పంచమ్ యాదవ్ (బెంగళూరు యోధాస్) ‘ఉత్తమ రెజ్లర్’ పురస్కారాలు గెలుచుకున్నారు. ఫైనల్‌కు వేదికగా నిలిచిన స్థానిక కె.డి. జాదవ్ స్టేడియం హౌస్‌ఫుల్ అయ్యింది. భారత క్రికెటర్లు రోహిత్ శర్మ, హర్భజన్ సింగ్, వీరేంద్ర సెహ్వాగ్, స్టార్ బాక్సర్ విజేందర్ సింగ్ తదితరులు ఫైనల్ మ్యాచ్‌కు హాజరయ్యారు. సెమీఫైనల్ వరకు ‘బెస్ట్ ఆఫ్ సెవెన్’ పద్ధతిలో మ్యాచ్‌లను నిర్వహించగా... ఫైనల్‌ను ‘బెస్ట్ ఆఫ్ నైన్’గా నిర్వహించారు. పురుషుల 65 కేజీల బౌట్లో అమిత్ ధన్కర్ (ముంబై గరుడ) మూడు నిమిషాల ఆరు సెకన్ల వ్యవధిలో 12-0తో విశాల్ రాణా (హరియాణా)పై టెక్నికల్ సుపీరియారిటీ (10 పాయింట్ల తేడా ఉండటం) పద్ధతిలో నెగ్గి ముంబైకి 1-0 ఆధిక్యాన్ని అందించాడు. మహిళల 58 కేజీల బౌట్లో ప్రపంచ చాంపియన్ ఒక్సానా హెర్హెల్ (హరియాణా) రెండు నిమిషాల రెండు సెకన్లలో ‘బై ఫాల్’ పద్ధతిలో సాక్షి మాలిక్ (ముంబై)ను ఓడించి స్కోరును 1-1తో సమం చేసింది. పురుషుల 74 కేజీల బౌట్లో లివాన్ లోపెజ్ (హరియాణా) 11-6తో ప్రదీప్ (ముంబై)పై నెగ్గడంతో హరియాణా 2-1తో ఆధిక్యంలోకి వెళ్లింది. అయితే ముంబై గరుడ రెజ్లర్లు అద్భుత పోరాటం కనబరిచి తర్వాతి ఐదు బౌట్లలో విజయం సాధించి విజేతగా నిలిచారు. మహిళల 69 కేజీల బౌట్లో అడెలైన్ గ్రే (ముంబై) 10-0తో గీతిక (హరియాణా)పై... పురుషుల 125 కేజీల బౌట్లో గియోర్గి (ముంబై) ఒక నిమిషం 43 సెకన్లలో 10-0తో హితేందర్ (హరియాణా)పై... మహిళల 53 కేజీల బౌట్లో ఒడునాయో (ముంబై) 9-0తో తాతియానా కిట్ (హరియాణా)పై.. పురుషుల 97 కేజీల బౌట్లో ఎలిజ్బార్ (ముంబై) 6-4తో వలెరీ (హరియాణా)పై... మహిళల 48 కేజీల బౌట్లో నిర్మలా దేవి (హరియాణా)పై రీతూ ఫోగట్ (ముంబై)... పురుషుల 57 కేజీల బౌట్లో రాహుల్ అవారె (ముంబై) 6-3తో నితిన్ (హరియాణా)పై గెలిచారు. -
గురుకులాలు దేశానికే గర్వకారణం
అలంపూర్ రూరల్: తెలంగాణ గురుకులాలు దేశానికే ఆదర్శంగా నిలిచాయని సాంఘిక సంక్షేమశాఖ గురుకుల విద్యాలయాల సంస్థ కార్యదర్శి డాక్టర్ ఆర్ఎస్ ప్రవీణ్‌కుమార్ కొనియాడారు. గురుకులాలను ఆదర్శవంతంగా తీర్చిదిద్ది అం దరి ఆదరాభిమానాలు పొందానని అన్నా రు. ఇక్కడ చదువుతున్న పేదవిద్యార్థులకు అన్ని రకాల సౌకర్యాలు కల్పించానని పేర్కొన్నారు. శుక్రవారం ఆయన తన సొంతూరు అలంపూర్‌కు వచ్చారు. స్థానిక సంతోష్‌నగర్ కాలనీలో అంబేద్కర్ విజ్ఞానకేంద్రాన్ని సందర్శించి అక్కడివారితో మాట్లాడారు. ఈ సందర్భంగా విలేకరులతో మాట్లాడుతూ.. అనేక రాష్ట్రా లు తమ విద్యాలయాల విధానాలనే పాటిస్తున్నాయని చెప్పారు. అన్ని వి ద్యాలయాల్లో అన్ని హంగులతో అధునాతన సౌకర్యాలు కల్పించామన్నారు. ఇక్కడ విలువలతో కూడిన విద్యను అందిస్తున్నామని వివరించారు. గత వేసవిసెలవుల్లో విద్యార్థులకు ఎన్నో అంశాలతో శిక్షణ ఇచ్చామని తెలిపారు. వివిధ దేశాల నిపుణులతో కోచింగ్ ఇప్పించామన్నారు. జిల్లాలోని ఇటిక్యాల, గోపాలపేటలో రూ.30కోట్లతో గురుకుల విద్యాలయాన్ని నిర్మిస్తున్నామని వివరించారు. ఇటిక్యాల గురుకుల పాఠశాల విద్యార్థులు సుందర్రాజు, ఈదన్న థాయ్‌లాండ్‌లో జరిగిన యోగాపోటీల్లో చాంపియన్లుగా నిలవడం గర్వంగా ఉందన్నారు. రాష్ట్రంలో ఉన్న 135 గురుకులాల్లో 19వేల సీట్ల కోసం 89వేల దరఖాస్తులు వచ్చాయని వివరించారు. కేజీ టు పీజీ విద్యావిధానంలో సాంఘిక సంక్షేమశాఖ గురుకుల విద్యాలయాలు ప్రధాన భూమిక పోషిస్తున్నాయని అన్నారు. పదో తరగతిలో ప్రైవేట్‌సంస్థలకు దీటుగా 89శాతం ఫలితాలు సాధించామన్నారు. 40మంది విద్యార్థులను ఐఐటీకి పంపించామని, ప్రముఖ అజీమ్ ప్రేమ్‌జీ యూనివర్సిటీలో 30సీట్లకు 27 సీట్లు తమ విద్యార్థులకే వచ్చాయని చెప్పారు. ఆయన వెంట ఏపీ ఉమెన్స్ కమిషన్ సభ్యురాలు సునితాకృష్ణన్ ఉన్నారు. అక్టోబర్ నాటికి గురుకుల పాఠశాలను ప్రారంభిస్తాం ఇటిక్యాల: గోపాల్పేట, ఇటిక్యాల సాంఘిక సంక్షేమ గురుకుల పాఠశాలను అక్టోబర్ నాటికి ప్రారంభిస్తామని డాక్టర్ ఆర్ఎస్ ప్రవీణ్‌కుమార్ తెలిపారు. శుక్రవారం ఇటిక్యాల మండల కేంద్రంలో నిర్మాణమవుతున్న గురుకుల భవనాన్ని ఆయన పరిశీలించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. విద్యార్థులకు సౌకర్యాలు కల్పిస్తామన్నా రు. భవన నిర్మాణాన్ని నాణ్యవంతంగా చేపట్టాలని కాంట్రాక్టర్‌కు సూచించారు. విద్యార్థుల్లో దాగిఉన్న సృజనాత్మకతను వెలికి తీసేందుకు పలు కార్యక్రమాలు చేపడుతున్న వివరించారు. ఆయన వెంట అలంపూర్ గురుకుల పాఠశాల ప్రిన్సిపాల్ రవీందర్, భవననిర్మాణ సైట్ ఇంజనీర్ ఆంజనేయులు ఉన్నారు. -
ఆసియాకప్‌లో 5సార్లు భారత్ జయకేతనం