
అప్పట్లో ప్రేమ వివాహం, ఇప్పడు తిరిగి వివాహం చేసుకుంటున్న దంపతులు
సాక్షి, మణికొండ: ఓ జంట పెళ్లైన 25 ఏళ్లకు వారి కుమారుల ప్రోత్సాహంతో మళ్లీ పెళ్లి పీటలెక్కారు. హైదరాబాద్‌లోని చంపాపేటకు చెందిన సి.నాగిరెడ్డి చదువుకునే సమయంలో తన జూనియర్ సంస్కృతిని ప్రేమించి పెళ్లి చేసుకున్నారు. అప్పట్లో పెద్దలు ఒప్పుకోకపోవడంతో స్నేహితుల మధ్య వీరి వివాహం 1996లో నిరాడంబరంగా జరిగింది. కొన్ని రోజులకే కుటుంబ సభ్యులు అంగీకరించి ఘనంగా రిసెప్షన్ నిర్వహించారు.
చదవండి: న్యూఇయర్ వేడుకలు: లిక్కర్ టార్గెట్‌పై ఒమిక్రాన్ ఎఫెక్ట్
అప్పట్లో ప్రేమ వివాహం,
కానీ వివాహం బంధువుల మధ్య జరగలేదనే కోరిక ఆ దంపతుల్లో ఉండిపోయింది. దీంతో వారి కుమారులు శ్రీజయసింహారెడ్డి, సుజయ్‌సింహారెడ్డిలు పెళ్లి పెద్దలుగా వ్యవహరించారు. శుక్రవారం రాత్రి శంషాబాద్ సమీపంలోని అమ్మపల్లి దేవాలయంలో తిరిగి వివాహం చేసుకున్నారు.
చదవండి: పోలీసు కొలువులకు కేరాఫ్ అడ్రస్‌గా ఆ గ్రామం.. ఇదంతా ఆయన స్ఫూర్తితోనే..
ఇప్పడు తిరిగి వివాహం చేసుకుంటున్న దంపతులు
Comments
Please login to add a commentAdd a comment