silver jubilee celebrations
-
బ్రహ్మకుమారీస్ బాటలోనే తెలంగాణ ప్రభుత్వం ముందుకెళ్తుంది
-
ష్..గప్‌చుప్! ఆ టాలెంట్ రామోజీ రావుకే సొంతం
సాక్షి, హైదరాబాద్: ఎక్కడా రహస్యాలు, దాపరికాలు ఉండకూడదంటూ ఊదరగొట్టే రామోజీరావు, తన దినపత్రిక, తన గ్రూపు సంస్థల్లో జరిగే ఉదంతాలను మాత్రం అత్యంత గోప్యంగా ఉంచాలని చూస్తారు. ముఖ్యంగా ఫిల్మ్ సిటీలో ఏం జరిగినా అంత సులభంగా బయటకు పొక్కదు. రామోజీరావు అంగీకరిస్తే తప్ప ఫిల్మ్ సిటీ ఆనే కోటలోకి తమకు కూడా ఎంట్రీ ఉండదని పోలీసు వర్గాలే చెబుతుంటాయి. కాగా ఈ క్రమంలో తమతో పాటు అవస రమైతే ప్రభుత్వం పైనా ఒత్తిడి తీసుకువచ్చి విషయం బయట పడకుండా మేనేజ్ చేస్తారనే ఆరోపణలున్నాయి. ఇలాంటి ఉదంతాలు కొన్ని గతంలో చోటు చేసుకున్నాయి. అయితే గురువారం చోటు చేసుకున్న ప్రమాదంలో కన్నుమూసింది తమ ఉద్యోగి కాకపోవడం, బయటి వాడైన ప్రవాస భారతీయుడు కావడంతో విషయం వెలుగులోకి వచ్చిందని అంటున్నారు. అప్పట్లో 22 మంది ఉద్యోగులు గాయపడినా.. రామోజీ ఫిల్మ్ సిటీలో ప్రమాదాలు చోటు చేసుకోవడం కొత్తేంకాదు. చిన్న చిన్న ఉదంతాలు, తన ఉద్యోగులకు పరిమితమైన, ఒకరిద్దరికి సంబంధించిన అంశాలు ఆ కోట దాటి బయటకు రావు.. రానివ్వరు. కానీ 2008 నవంబర్‌లో చోటు చేసుకున్న ఓ భారీ అగ్నిప్రమాదం.. వారం తర్వాత ‘సాక్షి’ చొరవతో వెలుగులోకి వచ్చింది. ఓ అంతర్జాతీయ సంస్థకు చెందిన వార్షిక సమావేశానికి దాని నిర్వాహకులు రామోజీ ఫిల్మ్ సిటీని ఎంపిక చేసుకున్నారు. దీనికి సంబంధించిన ఒప్పందాలు పూర్తయిన తర్వాత వేదిక కూడా ఖరారైంది. ఆ ఏడాది నవంబర్ 2న దాదాపు 3,500 మంది హాజరైన ఆ కార్యక్రమానికి భారీ ఏర్పాట్లు చేశారు. ఫిల్మ్ సిటీకి చెందిన సిబ్బంది ప్రధాన వేదికను సిద్ధం చేశారు. కార్యక్రమం ప్రారంభానికి ముందు ఎగరేయడానికి ఎలాంటి జాగ్రత్తలు తీసుకోకుండా స్టేజీ సమీపంలో దాదాపు 200 హైడ్రోజన్ బెలూన్లను ఉంచారు. ఈ కార్యక్రమం నిర్వహణను అప్పట్లో ఫైర్ సూపర్వైజర్గా ఉన్న శ్రీనివాసరావు, ఫైర్ మెన్ లక్ష్మణ్‌లు పర్యవేక్షించారు. అయితే ఈ ఉత్సవాలకు హాజరైన ఓ ప్రతినిధి హైడ్రోజన్ బెలూన్ల సమీపంలో సిగరెట్ కాల్చే ప్రయత్నం చేసినా ఫిల్మ్ సిటీ ఉన్నతాధికారులు పట్టించుకోలేదు. ఫైర్ సూపర్వైజర్, ఫైర్ మెన్ మాత్రం వారించే ప్రయత్నం చేశారు. ఈలోపే ఆ ప్రతినిధి విసిరేసిన సిగరెట్ పీక సమీపంలో ఉన్న హైడ్రోజన్ బెలూన్లపై పడటం, అవి ఒక్కసారిగా పేలిపోయి మంటలు వ్యాపించడం జరిగిపోయింది. ఈ ప్రమాదంలో అక్కడ పని చేస్తున్న దాదాపు 22 మంది ఫిల్మ్ సిటీ ఉద్యోగులకు గాయాలయ్యాయి. వీరికి తన కోటలోనే ఉన్న ఆస్పత్రిలో గుట్టుచప్పుడు కాకుండా వైద్యం చేయించిన రామోజీరావు.. పోలీసులు, అగ్నిమాప శాఖ అధికారుల వరకు విషయం చేరనీయలేదు. తన సంస్థ కోసం పని చేస్తూ గాయపడిన వారికి మొండిచేయి చూపారు. దాదాపు వారం తర్వాత ఈ విషయం నాటకీయంగా వెలుగులోకి రావడంతో హయత్‌నగర్ (అప్పట్లో అబ్దుల్లాపూర్‌మెట్ ఠాణా లేదు) పోలీసులు సీన్లోకి వచ్చారు. దీంతో విషయం లీక్ చేశారంటూ రామోజీ సైన్యం రాద్ధాంతం చేసింది. చివరకు నామమాత్రంగా సిబ్బందికి సహాయం చేసింది. ఆ టాలెంట్ రామోజీ రావుకే సొంతం ఫిల్మ్ సిటీలో జరిగిన ప్రమాదాలను బాహ్య ప్రపంచానికి తెలియకుండా దాచి ఉంచే రామోజీ రావులో మరో టాలెంట్ కూడా ఉంది. తన సంస్థల్లో చోటు చేసుకునే ఉదంతాలు పోలీసు రికార్డులకు ఎక్కకుండా చూడటమే కాదు.. తప్పంతా క్షతగాత్రులు లేదా బాధితులదే అన్నట్టుగా కూడా చూపించగలరు. బాధితులే ఆ విధంగా చెప్పేలా చేయగల నైపుణ్యం రామోజీరావు సొంతం. 2009లో బాలానగర్‌లోని ఈనాడు ప్రింటింగ్ ప్రెస్‌లో జరిగిన ప్రమాదమే దీనికి ఉదాహరణ. ఈ ఉదంతాన్ని చాలా రోజులు గోప్యంగా ఉంచిన యాజమాన్యం ఎట్టకేలకు పోలీసులకు తెలిపినా.. ఫిర్యాదు లేకుండా చూసుకుంది. సీన్ కట్ చేస్తే తప్పు తనదే అంటూ చెప్పిన ఆ బాధితుడు అజ్ఞాతంలోకి వెళ్ళిపోవడం కొసమెరుపు. మధ్యప్రదేశ్ రాష్ట్రానికి చెందిన బిజయ్‌కుమార్ నిరుపేద. బతుకుతెరువు కోసం నగరానికి వలసవచ్చి భవన నిర్మాణ కార్మికుడిగా మారాడు. 2009 మే 19న బాలానగర్‌లోని ఈనాడు ప్రింటింగ్ ప్రెస్‌లో పనికి వచ్చాడు. అక్కడి మూడో అంతస్తులో పని చేస్తూ మధ్యాహ్నం వేళ కింద పడ్డాడు. ఇది గమనించిన సెక్యూరిటీ సిబ్బంది విషయం రామోజీ కోటరీకి తెలిపారు. వాళ్ళ ఆదేశాల మేరకు విషయం బయటకు రాకుండా ఉండాలనే ఉద్దేశంతో బిజయ్‌ను ఈనాడు ప్రింటింగ్ ప్రెస్ నుంచి గుట్టుచప్పుడు కాకుండా బయటకు తరలించాలని ప్రయత్నించారు. అక్కడ పండ్ల వ్యాపారం చేసే సయ్యద్ ముస్తఫా ఈ వ్యవహారం గమనించి అడ్డుకుని ప్రశ్నించారు. క్షతగాత్రుడికి తక్షణ వైద్యం అందాలనే ఉద్దేశంతో ‘108’కు సమాచారం ఇచ్చారు. ఈ పరిణామంతో కంగుతిన్న సెక్యూరిటీ సిబ్బంది ఆయనపై దాడి చేసి తమపైనే దాడి జరిగిందంటూ పోలీసులకు ఫిర్యాదు చేశారు. మరుసటి రోజు ముస్తాఫా ద్వారా ఈ ప్రమాదం విషయం వెలుగులోకి రావడంతో బాలానగర్ పోలీసులు జోక్యం చేసుకున్నారు. దీంతో హడావుడిగా బిజయ్‌కుమార్ వద్దకు వెళ్ళిన ఈనాడు సిబ్బంది కథ మార్చేశారు. అదే రోజు అతడిని తీసుకుని బాలానగర్ ఠాణాకు వచ్చారు. తన తప్పిదం వల్లే ఈనాడు కార్యాలయం పైనుంచి కింద పడ్డానని, దీనిపై కేసు వద్దని అతడితోనే రాయించి పంపారు. ఫిర్యాదు లేకపోవడంతో కేసు నమోదు చేయలేదని అప్పట్లో పోలీసులు ప్రకటించారు. విస్టెక్స్ ఉదంతంలోనూ అనేక ప్రయత్నాలు విస్టెక్స్ ఏషియా సీఈఓ సంజయ్ షా మరణానికి కారణమైన రామోజీ ఫిల్మ్ సిటీపై ఆ సంస్థ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ కలిదిండి జానకిరామ్ రాజు అబ్దుల్లాపూర్‌మెట్ పోలీసులకు లిఖిత పూర్వకంగా ఫిర్యాదు చేశారు. ఇందులో ఫిల్మ్ సిటీలోని భద్రతా లోపాలు, సిబ్బంది నిర్లక్ష్యం, రెస్క్యూ ఆపరేషన్‌లో ఉన్న వైఫల్యాలను ఎత్తిచూపారు. అయితే విస్టెక్స్ ఉదంతంలోనూ రామోజీ తన మార్క్‌ను చూపించారు. దుర్ఘటన జరిగినప్పుడు అక్కడ ఉన్న ఆర్ఎఫ్సీ ఉద్యోగుల ఫోన్లన్నీ స్వాధీనం చేసుకోవాలని, విషయం బయటకు పొక్కనివ్వొద్దని హెచ్చరించారు. పోలీసులకిచ్చిన ఫిర్యాదులోని అంశాలు రికార్డుల్లోకి ఎక్కకుండా ఉంచేందుకు ఆఖరి నిమిషం వరకు ప్రయత్నించారు. జరిగిన ఉదంతంపై కేసు నమోదు చేసుకోవాలని, కానీ భద్రతా లోపాలు, సిబ్బంది నిర్లక్ష్యం, అంబులెన్స్ రాక ఆలస్యం కావడం, అదనపు అంబులెన్స్ లేకపోవడం వంటివి ప్రాథమిక సమాచార నివేదికలో (ఎఫ్ఐఆర్) నమోదు కాకుండా చూడాలని అనేక ప్రయత్నాలు చేశారు. అవి రికార్డుల్లోకి ఎక్కి, బయటకు వస్తే ఫిల్మ్ సిటీ వ్యాపారం దెబ్బతింటుదంటూ తమ మందీమార్బలంతో పోలీసులపై తీవ్ర స్థాయిలో ఒత్తిడి తెచ్చారు. కానీ పోలీసులు ససేమిరా అన్నారు. విషయం ఉన్నతాధికారులకు తెలియజేయడమే కాకుండా ఫిర్యాదులోని ప్రతి అంశాన్నీ ఎఫ్ఐఆర్లో నమోదు చేశారు. -
ట్రిపుల్ ఐటీ హైదరాబాద్ కొత్త చైర్మన్‌గా ప్రొ.అశోక్
రాయదుర్గం (హైదరాబాద్): ట్రిపుల్ఐటీ హైదరాబాద్ నూతన చైర్మన్‌గా ప్రొఫెసర్ అశోక్ ఝన్‌ఝన్‌వాలా నియమితులయ్యారు. ఈ మేరకు శుక్రవారం నిర్వహించిన పాలక మండలి ప్రత్యేక సమావేశంలో ఒక ప్రకటన చేశారు. 1998లో ఆరంభం నుంచి ట్రిపుల్ఐటీ హైదరాబాద్ చైర్మన్‌గా కొన సాగిన ప్రొఫెసర్ రాజ్‌రెడ్డి పదవీ విరమణ చేశారు. శుక్రవారం సాయంత్రం గచ్చిబౌలిలో ట్రిపుల్ఐటీ హైదరాబాద్ సిల్వర్ జూబ్లీ వేడుకలను నిర్వహించారు. ఈ సందర్భంగా కొత్త చైర్మన్ అశోక్ ఝన్‌ఝన్‌వాలా, పదవీ విరమణ చేసిన ప్రొఫెసర్ రాజ్‌రెడ్డి, డైరెక్టర్ ప్రొఫెసర్ పీజే నారాయణన్, ఇతర ప్రొఫెసర్లతో కలసి నూతనంగా రూపొందించిన సిల్వర్‌జూబ్లీ శిల్పాన్ని ఆవిష్కరించారు. ప్రొఫెసర్ అశోక్ ఝన్‌ఝన్ వాలా మాట్లాడుతూ ట్రిపుల్ఐటీ హైదరాబాద్‌ను జాతీయ, అంతర్జాతీ య స్థాయిలో మంచి గుర్తింపు పొందేలా తీర్చిదిద్దు తానని తెలిపారు. ప్రొఫెసర్ పీజే నారాయణన్ మీడియాతో మాట్లాడుతూ, ట్రిపుల్ఐటీ హైదరా బాద్.. దేశంలో నంబర్‌వన్ స్థానంలో ఉందన్నారు. -
ప్రేమికుల దినోత్సవానికి టైటానిక్
సినిమా లవర్స్‌కి.. అందులోనూ ప్రేమకథా చిత్రాల ప్రేమికులకు ఈ ప్రేమికుల దినోత్సవానికి సిల్కర్ స్క్రీన్ పై ‘టైటానిక్’ ప్రత్యక్షం కానుంది. టైటానిక్ ఓడలో పరిచయం అయి, ప్రేమికులుగా దగ్గరయ్యే జాక్, రోజ్లు చివరికి ఓడ ప్రమాదంలో దూరమయ్యే ఈ విషాదభరిత ప్రేమకథ ప్రపంచవ్యాప్తంగా ప్రేక్షకులను అలరించింది. ప్రేమికులుగా లియో నార్డో డికాప్రియో, కేట్ విన్ ్సలెట్ల కెమిస్ట్రీని అంత సులువుగా ఎవరూ మరచిపోలేరు. జేమ్స్ కామెరూన్ తెరకెక్కించిన ఈ ఎవర్గ్రీన్ లవ్‌స్టోరీ విడుదలై 25 ఏళ్లయింది. ఈ సిల్వర్ జూబ్లీ సందర్భంగా ఈ చిత్రాన్ని హై క్వాలిటీతో మళ్లీ సిల్వర్ స్క్రీన్ పైకి తీసుకు రావాలనుకుంటున్నారు. ఈ విషయాన్ని సోషల్ మీడియా ద్వారా ప్రకటించి పోస్టర్ని, ట్రైలర్‌ని విడుదల చేసింది చిత్ర నిర్మాణ సంస్థల్లో ఒకటైన ట్వంటీయత్ సెంచురీ ఫాక్స్. ప్రేమికుల దినోత్సవం సందర్భంగా వచ్చే నెల 10న ఈ చిత్రాన్ని విడుదల చేయనున్నారు. 4కే ప్రింట్‌తో త్రీడీ వెర్షన్ లో ఈ లవ్‌స్టోరీ కొత్త హంగులతో రావడానికి సిద్ధమవుతోంది. ఇక 1997 నవంబర్‌లో విడుదలైన ‘టైటానిక్’ సంచలన విజయం సాధించిన విషయం తెలిసిందే. ప్రపంచవ్యాప్తంగా రూ. 13 వేల కోట్లకు పైగా కలెక్ట్ చేసి, రికార్డు సృష్టించింది. 2010లో జేమ్స్ కామెరూన్ అద్భుత సృష్టి ‘అవతార్’ విడుదలయ్యే వరకూ అత్యధిక వసూళ్లు సాధించిన చిత్రం రికార్డ్ ‘టైటానిక్’దే. కామెరూన్ తన సినిమా రికార్డ్‌ని తానే బద్దలు కొట్టడం విశేషం. ఇక ఆస్కార్ అవార్డ్స్‌లో 14 నామినేషన్లు దక్కించుకుని, 11 అవార్డులను సొంతం చేసుకున్న ఘనత కూడా ‘టైటానిక్’కి ఉంది. ప్రేక్షకుల ఆదరణతో పాటు ఇలా పలు రికార్డులు సొంతం చేసుకున్న ఈ చిత్రం త్రీడీ వెర్షన్‌ని 2012లో విడుదల చేశారు. ఇప్పుడు మరింత క్వాలిటీతో ‘టైటానిక్’ రానుంది. -
ద్రావిడ సంస్కృతిపై శోధన సాగాలంటే...
ఈ దేశ మూలవాసులైన ద్రావిడులు మొదట్లో ఉత్తర భారతంలో నివసించేవారు. ఆర్యుల రాక తర్వాత వారు దక్షిణ ప్రాంతానికి వచ్చి స్థిర నివాసం ఏర్పరచుకుని ఒక విలక్షణమైన సాంస్కృతిక వారసత్వాన్ని ప్రోది చేశారు. దక్షిణ భారతీయ సమాజం వేల సంవత్సరాలుగా అనేక జాతులతో కలిసి జీవన గమనాన్ని సాగించినప్పటికీ వారి సాంస్కృతిక విలక్షణత మాత్రం పుస్తె కట్టడం నుండి పాడె కట్టడం వరకు కొట్టొచ్చినట్లు కనిపిస్తూనే ఉంటుంది. దక్షిణ భారతదేశంలో ద్రవిడ జాతులు అత్యంత ప్రాచీనమైన సాంస్కృతిక నేపథ్యం కలిగి ఉన్నప్పటికీ ఈ భాషల్లో సాహిత్యం మాత్రం పదో శతాబ్దానికి అటూ ఇటుగా మాత్రమే లభిస్తోంది. తమిళులు మాత్రమే తమ సంగ సాహిత్యం అత్యంత ప్రాచీనమైనదనీ, ఈ సాహిత్యం క్రీ.పూ. 500 నుండి కనిపిస్తున్నదనీ ప్రకటించుకున్నారు. దాదాపుగా క్రీస్తుశకం ఒకటో శతాబ్దం వాడైన శాతవాహన చక్రవర్తి హాలుడు సేకరించి గుదిగుచ్చిన ‘గాథా సప్తశతి’ అనే ప్రాకృత గ్రంథంలో పిల్ల, పొట్ట, కరణి వంటి తెలుగు పదాలు కనిపిస్తున్నాయి. దీన్ని బట్టి ఆనాటికే తెలుగు భాష సమాజంలో బాగా స్థిరపడిన వ్యవహారిక భాషగా ఉందని చెప్పవచ్చు. అంతేగాకుండా, సాహిత్య భాషలుగా పేరుపడిన తెలుగు, తమిళ, కన్నడ, మలయాళ భాషల్లో గ్రంథ రూపంలో లభిస్తున్న సాహిత్యం కంటే ముందే మౌఖిక రూపంలో నిక్షిప్తమైన జానపద సాహిత్యం పుంఖానుపుంఖాలుగా తప్పకుండా ఉండి ఉంటుంది. ఉదా హరణకు ఇప్పటివరకు ఉన్న ఆధారాలను అనుసరించి తెలుగులో నన్నయ భారతాన్ని ఆది గ్రంథంగా భావిస్తున్నాం. అయితే, నన్నయ తల్లి పాడిన జోల పాట కూడా మౌఖిక వాఙ్మయంలో ఆనాటికే నెలకొని ఉంది అన్న సత్యాన్ని ఇక్కడ మనం మరచిపోకూడదు. కాబట్టి, నన్నయకు పూర్వమే తెలుగువారికి విస్తృతమైన మౌఖిక సాహిత్యం కూడా తప్పకుండా ఉంది. ఇటువంటి సాహిత్యం మాత్రమే ఒక జాతికి సంబంధించిన సహజమైన సంస్కృతికి ప్రతీకగా నిలుస్తుంది. అందుచేత, పరిశోధకులు ప్రధానంగా మూల వాసులు మౌఖికంగా నిక్షిప్తం చేసిన జానపద సాహిత్యంపై విరివిగా పరిశోధనలు జరపాల్సిన అవసరం ఉంది. నేటి భాషా శాస్త్ర పరిశోధకుల అంచనాలకు అందినంతవరకు ద్రావిడ భాషలు 27 కనిపిస్తున్నాయి. ఈ విషయంలో కూడా మరింత పరిశోధన జరగాల్సిన ఆవశ్యకత ఎంతైనా ఉంది. అంతే కాకుండా, ఈ ఆదిమ జాతులు అందించిన సంస్కృతిపై తగినంత పరిశోధన జరగలేదు అన్నది నిర్వివాదాంశం. ఈ లోటును భర్తీ చేయడం కోసమే ప్రొఫెసర్ వీఐ సుబ్రహ్మణ్యం, ఐఏఎస్ అధికారి కాశీ పాండ్యన్ వంటి మేధావులు కొందరు ద్రవిడ సంస్కృతిపై పరిశోధన కోసం ఒక కేంద్రాన్ని మంజూరు చేయాలని నాటి సీఎం నందమూరి తారక రామారావుని కోరారు. అయితే ద్రవిడ సంస్కృతిపై అత్యంత ఆదరాభిమానాలు కలిగిన రామారావు ఏకంగా ఒక విశ్వవిద్యాలయాన్నే మంజూరు చేశారు. అది 1997 అక్టోబర్ 20న కుప్పంలో ప్రారంభమైంది. ద్రావిడ విశ్వవిద్యాలయం ప్రధాన లక్ష్యాలలో కొన్ని... ద్రవిడ సంస్కృతిలోని ప్రాచీనత, విలక్షణతను, విశిష్టతను లోక విదితం చేయడం; ద్రవిడ సంస్కృతిపై వివిధ భాషల్లో నేటి వరకు జరిగిన పరి శోధనలు, ప్రచురణలను పదిల పరచడం, ప్రచారం చేయడం; తద్వారా, భావ వినిమయానికి, సంస్కృతీ పరిరక్షణకు బాటలు వేయడం. ద్రావిడ కుటుంబానికి చెందిన గిరిజన భాషలతో సహా లిఖిత భాషలు, మాట్లాడే ద్రావిడ భాషల సమగ్ర అభివృద్ధికి కృషి చేయడం; ద్రావిడ భాషలు, సాహిత్యం, సంస్కృతికి సంబంధించిన కళలు, హస్తకళలు, అనుబంధ విషయాలలో ఉన్నత స్థాయిలో బోధనను, శిక్షణను అందించడం. భారత దేశం లోపల, వెలుపల ద్రావిడ భాషలు, సాహిత్యం, సంస్కృతి, ఆధునిక శాస్త్రాలు, వైద్యం, ఇంజనీరింగ్, సాంకేతికత వాటి అనుబంధ విషయాలపై అధ్యయనం చేయాలనుకునే వారికి శిక్షణ ఇవ్వడం. విశ్వ విద్యాలయ లక్ష్యాలకు అనుగుణంగా, అవసరాలకు అనుగుణంగా ఇతర భాషల సాహిత్యాన్ని ద్రావిడ భాషలలోకి అనువదించడం అలాగే ద్రావిడ భాషల సాహిత్యాన్ని ఇతర భాషలలోకి అనువదించడం. ద్రావిడ విశ్వవిద్యాలయంలో ఇప్పటికే మూలికా వనం ఏర్పాటయింది. ఈ వనంలో ద్రవిడ సాహిత్యంలోనూ, వైద్యంలోనూ కనిపించే చాలా అరుదైన, వివిధ జాతులకు చెందిన 250 వన మూలికలు సేకరించి, పెంచుతున్నారు. జానపద గిరిజన విజ్ఞానాలపై ప్రత్యేకమైన మ్యూజియం ఏర్పాటు చేశారు. అరుదైన తాళ పత్రాలను సేకరించి భద్రపరిచారు. ఒక ద్రావిడ భాషలో ప్రచురితమైన విలువైన పుస్తకాలను, పదకోశాలను ఇతర ద్రావిడ భాషల్లోకి అనువదించి ముద్రించారు. ద్రావిడ సంస్కృతిని మరింత మూలాల్లోకి వెళ్లి పరిశోధించడానికి తగిన విధంగా ఏపీ ప్రభుత్వం కూడా చొరవ తీసుకుని ‘తెలుగు ప్రాచీన హోదా కేంద్రా’న్ని ద్రావిడ విశ్వవిద్యాలయంలో ఏర్పాటు చేయడానికి గట్టి కృషి చేయాలి. అలాగే, తెలుగు అకాడమీని (ప్రస్తుతం తెలుగు సంస్కృత అకాడమీని) కూడా ద్రావిడ విశ్వ విద్యాలయంలో ఏర్పాటు చేయడం ద్వారా తెలుగు భాషా సాహిత్యాలపై జరిగిన, జరుగుతున్న విశేష కృషిని సమన్వయం చేసుకోవడానికి వీలు కలుగుతుంది. సంస్కృత సాహిత్యంలో ప్రవేశించిన ద్రావిడ సాంస్కృతిక మూలాలను కూడా మరింత లోతుగా అన్వేషించే అవకాశం ఏర్పడుతుంది. ఇటువంటి అంశాలపై చొరవను చూపినట్లయితే ప్రభుత్వం ద్రావిడ సంస్కృతి పట్ల తన చిత్తశుద్ధిని చాటుకున్నట్లవుతుంది. (క్లిక్ చేయండి: ఆనీ ఎర్నౌ.. ఆమె కథ మన జీవిత కథ) – డాక్టర్ వేలం పళని సహాయ ఆచార్యులు, తెలుగు శాఖ, ద్రావిడ విశ్వవిద్యాలయం (అక్టోబర్ 20న ద్రావిడ విశ్వవిద్యాలయం రజతోత్సవాల సందర్భంగా) -
కొడుకుల ప్రోత్సాహంతో.. పెళ్లైన 25 ఏళ్లకు మళ్లీ పెళ్లి..!
సాక్షి, మణికొండ: ఓ జంట పెళ్లైన 25 ఏళ్లకు వారి కుమారుల ప్రోత్సాహంతో మళ్లీ పెళ్లి పీటలెక్కారు. హైదరాబాద్‌లోని చంపాపేటకు చెందిన సి.నాగిరెడ్డి చదువుకునే సమయంలో తన జూనియర్ సంస్కృతిని ప్రేమించి పెళ్లి చేసుకున్నారు. అప్పట్లో పెద్దలు ఒప్పుకోకపోవడంతో స్నేహితుల మధ్య వీరి వివాహం 1996లో నిరాడంబరంగా జరిగింది. కొన్ని రోజులకే కుటుంబ సభ్యులు అంగీకరించి ఘనంగా రిసెప్షన్ నిర్వహించారు. చదవండి: న్యూఇయర్ వేడుకలు: లిక్కర్ టార్గెట్‌పై ఒమిక్రాన్ ఎఫెక్ట్ అప్పట్లో ప్రేమ వివాహం, కానీ వివాహం బంధువుల మధ్య జరగలేదనే కోరిక ఆ దంపతుల్లో ఉండిపోయింది. దీంతో వారి కుమారులు శ్రీజయసింహారెడ్డి, సుజయ్సింహారెడ్డిలు పెళ్లి పెద్దలుగా వ్యవహరించారు. శుక్రవారం రాత్రి శంషాబాద్ సమీపంలోని అమ్మపల్లి దేవాలయంలో తిరిగి వివాహం చేసుకున్నారు. చదవండి: పోలీసు కొలువులకు కేరాఫ్ అడ్రస్‌గా ఆ గ్రామం.. ఇదంతా ఆయన స్ఫూర్తితోనే.. ఇప్పడు తిరిగి వివాహం చేసుకుంటున్న దంపతులు -
రచయితలు సరస్వతీ పుత్రులు
‘‘రచయితల సంఘం అంటే సరస్వతీ పుత్రుల సంఘం. అలాంటి సరస్వతీపుత్రుల సంఘం లక్ష్మీదేవి కటాక్షంతో అద్భుతమైన సొంత భవనం కట్టుకునేలా అభివృద్ధి చెందాలి’’ అని సీనియర్ నటుడు కృష్ణంరాజు అన్నారు. ఈ ఏడాది నవంబరు 3న రచయితల సంఘం రజతోత్సవ వేడుక జరగనుంది. ఈ సందర్భంగా హైదరాబాద్‌లో ని ఫిలిం నగర్ ప్రొడ్యూసర్ కౌన్సిల్ హాల్లో జరిగిన కరై్టన్ రైజర్ వేడుకకు సంబంధించిన టీజర్‌ను కృష్ణంరాజు ఆవిష్కరించారు. 1932 నుంచి ఇప్పటి వరకు తెలుగు చిత్రపరిశ్రమ అభివృద్ధి కోసం సినీ రచయితల కృషిని గుర్తు చేసుకున్నారు కొందరు అగ్ర రచయితలు. ఈ వేడుకలో కృష్ణంరాజు మాట్లాడుతూ – ‘‘‘లక్ష్మీ ఎదురుగా వస్తే నమస్కరించు. కానీ సరస్వతి ఎక్కడ ఉన్నా వెతికి వెతికి నమస్కరించు’ అని మా నాన్నగారు చెప్పారు. అందుకే ఈ వేడుకకు వచ్చాను. రచయితలకు ఏకాగ్రత, అంకితభావం ఉండాలి. కాలంతో పాటు రచయిత రచనల్లోనూ మార్పు వచ్చింది. ఆ రచనలు మంచి మర్గానికి దోహదపడాలి. నేను పెద్ద పెద్ద మహానుభావులతో పని చేశాను. ఆత్రేయగారు ఏదైనా సీన్ రాసేప్పుడు ఆయన ఆ క్యారెక్టర్లోకి వెళ్లిపోయి డైలాగ్స్ రాసేవారు’’ అని అన్నారు. ప్రముఖ రచయిత పరుచూరి గోపాలకృష్ణ సినిమా పుట్టుపూర్వోత్తరాల గురించి మాట్లాడారు. ఆ రోజుల్లో పద్యానికి దగ్గరగా పాట ఉండేదని అభిప్రాయపడ్డారు. రచయిత సముద్రాల రాఘవాచారి నుంచి చక్రపాణి వరకు సాగిన చరిత్రను గుర్తు చేశారు ఎస్.వి. రామారావు. పాతాళభైరవి, మిస్సమ్మ...వంటి నాటి ప్రముఖ సినిమాలు, దర్శకులు, రచయితల గురించి మాట్లాడారు నాగబాల సురేష్. 1 950 నుంచి 60వరకు వచ్చిన సినిమాల గురించి మాట్లాడారు. 1961–70 నాటి కాల సినిమాల గురించి ప్రస్తావించారు వడ్డేపల్లి కృష్ణమూర్తి. పాతతరం, కొత్తతరం రచయితలు కలిసి ముందుకు వెళ్లాల్సిన దశాబ్దం ఇదే అన్నారు చిలుకుమార్ నట్రాజ్. 1981–90 కాలంలో ఉన్న రచయితలు, దర్శకులు, సినిమాల గురించి మాట్లాడారు అనురాధ. ఈ కార్యక్రమంలో బలభద్రపాత్రుని రమణి, ప్రధాన కార్యదర్శి ఆకెళ్ల, పరుచూరి వెంకటేశ్వరరావు తదితర ప్రముఖులు పాల్గొన్నారు. -
శంకర్@25 ఆనందలహరి
తమిళసినిమా: శంకర్@25 అనగానే అందరికీ అర్థంఅయిపోయే ఉంటుంది. ఇది స్టార్ దర్శకుడు శంకర్‌కు సంబంధించిన సమాచారం అని. సినిమా కచ్చితంగా వ్యాపారమే. దానికి బ్రహ్మండాన్ని, ప్రపంచ స్థాయి మార్కెట్‌ను తీసుకొచ్చిన దర్శకుల్లో ఆధ్యుడు శంకర్ అని చెప్పడంలో అతిశయోక్తి ఉండదు. ఎక్కడో తమిళనాడులోని కోయంబత్తూర్‌లో పుట్టిన శంకర్ అనే ఒక సాధారణ యువకుడు ఇప్పుడు ప్రపంచ సినిమా తిరిగి చూసే స్థాయికి ఎదిగారు. 25 ఏళ్ల క్రితం నటుడవ్వాలన్న కలతో చెన్నైనగరానికి చేరిన శంకర్ చిన్న చిన్న వేషాలు వేసినా, ఆయన్ని విధి దర్శకత్వం వైపు పరుగులు దీయించింది. అంతే అప్పటికే ప్రముఖ దర్శకుడిగా వెలుగొందుతున్న ఎస్ఏ.చంద్రశేఖర్ వద్ద శిష్యుడిగా చేరిపోయారు. అలా కొన్నేళ్లు ఆయన వద్ద పని చేసి జంటిల్మెన్ చిత్రంతో దర్శకుడిగా మెగాఫోన్ పట్టారు.అది బ్రహ్మ ముహూర్తం అయ్యి ఉంటుంది. తొలి చిత్రంతోనే విజయాన్ని అందించింది. ఆ తరువాత ముదల్వన్, బాయ్స్, జీన్స్, శివాజి, ఇండియన్, ఐ, ఎందిరన్ వంటి పలు బ్రహ్మాండమైన చిత్రాలను వెండితెరపై ఆవిష్కరించారు. ఇటీవల ఆయన దర్శకత్వం వహించిన 2.ఓ చిత్రంతో హాలీవుడ్ చిత్రాలకు ఏ మాత్రం తమిళులు తగ్గరని సవాల్ చేశారు. కాగా అలాంటి బ్రహ్మాండ చిత్రాల సృష్టికర్త శంకర్ సినీ పయనం 25 ఏళ్లకు చేరుకుంది. ఈ సందర్భాన్ని పురస్కరించుకుని ఆయన తన శిష్యులతో కలిసి సరదాగా గడిపారు ఆదివారం ఉదయం స్థానిక చెన్నైలోని దర్శకుడు మిష్కన్ కార్యాలయంలో దర్శకుడు శంకర్‌తో పాటు ఆయన శిష్యులు వసంతబాలన్, బాలాజీశక్తివేల్, అట్లీ కలిసి సరదాగా గడిపారు. కాగా ప్రముఖ దర్శకుడు మణిరత్నం, గౌతమ్‌మీనన్, లింగుసామి, శశి, పా.రంజిత్, పాండిరాజ్, మోహన్‌రాజా కూడా శంకర్ ఆనందంలో పాలు పంచుకున్నారు. అందరూ కలిసి దిగిన సెల్ఫీ ఇప్పుడు సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతోంది. -
హక్కులతోనే మెరుగైన జీవితం
న్యూఢిల్లీ: మానవ హక్కులు సవ్యంగా అమలుపరచడం ద్వారా ప్రజల జీవితాల్ని మెరుగుపరిచేందుకు కేంద్రం కట్టుబడి ఉందని ప్రధాని మోదీ అన్నారు. దేశంలో మానవ హక్కుల పరిరక్షణకు ప్రభుత్వం ఎన్నో చట్టాలు చేసిందని గుర్తుచేశారు. జాతీయ మానవ హక్కుల కమిషన్(ఎన్హెచ్ఆర్సీ) 25వ వ్యవస్థాపక దినోత్సవంలో శుక్రవారం మోదీ ప్రసంగించారు. సుస్థిరాభివృద్ధి లక్ష్యాల సాధన దిశగా కేంద్రం చేస్తున్న ప్రయత్నాల్లో ఎన్హెచ్ఆర్సీ ముఖ్య పాత్ర పోషించాలని పిలుపునిచ్చారు. స్వాతంత్య్రం వచ్చిన తరువాత మానవ హక్కుల పరిరక్షణకు స్వతంత్ర, నిష్పాక్షిక న్యాయ వ్యవస్థ, చురుకైన మీడియా, క్రియాశీల పౌర సంఘాలు, ఎన్హెచ్ఆర్సీ లాంటి సంస్థలు ఉనికిలోకి వచ్చాయని అన్నారు. 17 లక్షల కేసులు..వంద కోట్ల పరిహారం: మానవ హక్కుల వాచ్‌డాగ్‌గా పేరొందిన జాతీయ మానవ హక్కుల కమిషన్(ఎన్హెచ్ఆర్సీ) ఏర్పాటై శుక్రవారానికి 25 ఏళ్లు పూర్తయ్యాయి. ఇప్పటి వరకు సుమారు 17 లక్షలకు పైగా కేసులను పరిష్కరించిన కమిషన్...మానవ హక్కుల ఉల్లంఘనలకు గురైన బాధితులకు సుమారు రూ.100 కోట్లకు పైగా పరిహారం ఇప్పించింది. ఈ కమిషన్ ముందుకు వచ్చిన కేసుల్లో పశ్చిమబెంగాల్లోని నందిగ్రామ్ హింస, ఛత్తీస్‌గఢ్‌లోని సల్వాజుడుం సంబంధిత ఘటనలు కొన్ని ముఖ్యమైనవి. 28న జపాన్‌కు మోదీ మోదీ ఈ నెల 28–29న జపాన్‌లో పర్యటించనున్నారు. ఈ సందర్భంగా జపాన్ ప్రధాని షింజో అబేతో మోదీ ఇండియా–జపాన్ వార్షిక సమావేశంలో పాల్గొని పలు ద్వైపాక్షిక, అంతర్జాతీయ, ప్రాంతీయ అంశాలపై చర్చిస్తారని విదేశాంగ శాఖ వెల్లడించింది. ఇండో–పసిఫిక్ ప్రాంతంలోని పరిస్థితులు కూడా ఇరువురు అధినేతల భేటీలో ప్రస్తావనకు వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి. -
‘మా’ సమస్య పరిష్కారమైంది
‘మా’ (మూవీ ఆర్టిస్ట్స్ అసోసియేషన్ ) సిల్వర్ జూబ్లీ వేడుకల్లో నిధులు దుర్వినియోగం అయ్యాయంటూ ‘మా’ జనరల్ సెక్రటరీ నరేశ్ ఆరోపించిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ‘మా’ అధ్యక్షుడు శివాజీరాజా, నరేశ్ మధ్య వాగ్వివాదాలు జరిగాయి. ఈ వివాదం త్వరగానే సద్దుమణిగింది. ఇండస్ట్రీ ప్రముఖులం ‘తెలుగు ఇండస్ట్రీ కలెక్టీవ్ కమిటీ’ ఏర్పరచుకొని, జరిగిన సమస్యను పరిష్కరించుకున్నాం అంటూ శనివారం ప్రెస్మీట్లో వెల్లడించారు. ఈ సందర్భంగా నిర్మాత సురేశ్‌బాబు మాట్లాడుతూ – ‘‘మూవీ ఆర్టిస్ట్స్ అసోసియేషన్, ఫెడరేషన్, ఫిల్మ్ చాంబర్, కౌన్సిల్ మరికొన్ని.. వాటిన్నింటిని కలిపితేనే తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీ. ఇటీవల మా మధ్యలో కొన్ని మనస్పర్థలు వచ్చాయి. దాని కోసం అందరం కలసి ఓ సపరేట్ బాడీ ఏర్పర్చుకున్నాం. ఏదైనా ఇష్యూ ఉంటే ముందు మాలో మేం మాట్లాడుకోవాలని నిర్ణయించుకున్నాం. ఆ ఇష్యూ జరిగినట్టు ఇంకోసారి జరగకూడదని భావించాం. ‘మా’కి రావాల్సిన డబ్బులన్నీ వచ్చేశాయి. అందులో ఎటువంటి అవకతవకలు జరగలేదు. వాళ్లు సైన్ చేసుకున్న అగ్రిమెంట్స్ అన్నీ క్లియర్‌గా ఉన్నాయి. అగ్రిమెంట్లో లేని చాలా విషయాలు ఇండస్ట్రీ చేతుల్లో ఉండవు. థర్డ్ పార్టీ వాళ్ళ వల్ల ఏర్పడే వాటిని మేం సెటిల్ చేయలేం కదా? దాని వల్ల మాకు ఎటువంటి లాస్ రాలేదు’’ అన్నారు. తమ్మారెడ్డి భరద్వాజ మాట్లాడుతూ – ‘‘ఇటీవలే ‘తెలుగు ఇండస్ట్రీ కలెక్టీవ్ కమిటీ’ అని పెట్టుకున్నాం. ఏదైనా సమస్యలు వస్తే పరిష్కరించుకోవాలి అనుకుంటూ వస్తున్నాం. అనుకోకుండా చిన్న సమస్య ఏర్పడింది. అది పరిష్కరించాం. ఇక నుంచి కూడా హెల్తీగానే జరుగుతుంది, జరగాలి కూడా. సినిమాకు సంబంధించిన ఏ విషయమైనా కలెక్టివ్ కమిటీనే చూస్తుంది. సాల్వ్ చేస్తుంది. ప్యూచర్లో చేసే ఈవెంట్స్ కూడా ఇది వరకులానే మాములుగానే చేస్తారు’’ అన్నారు. ‘మా’ జనరల్ సెక్రటరీ నరేశ్ మాట్లాడుతూ – ‘‘ఫిల్మ్ ఇండస్ట్రీ సెలబ్రిటీలకు, సామాన్యులకు డైరెక్ట్‌గా కనెక్ట్ అయి ఉంది. ఇందులో కొన్ని వెల్ఫేర్ కార్యక్రమాలు చేస్తూ ఉంటాం. కొన్నిసార్లు అభిప్రాయభేదాలు రావడం సహజం. మనుషులు కలసి పని చేసేది కాబట్టి. టీఎఫ్ఐ కమిటీ ఏర్పాటు చేసి పెద్దలను కూర్చోబెట్టి వాళ్ళకు మా సమస్యలను వివరించి, చర్చించుకున్నాం. ఇండస్ట్రీ ఇంకా బెటర్ అవ్వడానికి ఈ కమిటీ ఏర్పాటు చేసుకున్నాం. గతం గతః. రానున్న రోజుల్లో సిల్వర్ జూబ్లీ ఫంక్షన్ బాగా చేయడమే మా లక్ష్యం. త్వరలో మహేశ్‌బాబు ప్రోగ్రామ్ కూడా ఉంది. ఇవన్నీ సక్సెస్ చేస్తాం. దానికి పూర్తి సపోర్ట్ చేస్తాం. ఇక నుంచి అన్ని కార్యక్రమాలు పారదర్శకంగా 100శాతం సక్సెస్ చేస్తాం. ఒకటో తారీఖు నుంచి జనరల్ సెక్రటరీగా పూర్తి బాధ్యతలు తీసుకుంటున్నాను’’ అన్నారు. ‘‘టీఎఫ్‌సీసీ నిర్ణయమే మా అందరి నిర్ణయం. చిన్న చిన్న మనస్పర్థలు ఉన్నాయి. అన్ని ఫైల్స్‌నీ పెద్దల చేతుల్లో పెట్టాం. ఈ పెద్దలంతా మా ఇద్దరికీ చుట్టాలు కాదు. మొత్తం చూసి ఇందులో ఎటువంటి తప్పు జరగలేదని చెప్పారు. ఇకముందు మహేశ్‌బాబు, ప్రభాస్ ప్రోగ్రామ్‌లను కలసి కట్టుగా చేస్తాం. మూవీ ఆర్టిస్ట్స్ అసోసియేషన్ ని ఉన్నత స్థితిలో నిలబెట్టడమే మా లక్ష్యం’’ అని ‘మా’ అధ్యక్షుడు శివాజీ రాజా అన్నారు. ఈ కార్యక్రమంలో పి.కిరణ్, డా. కె.ఎల్. నారాయణ తదితరులు పాల్గొన్నారు. -
‘మా’ డబ్బుతో టీ కూడా తాగలేదు
మూవీ ఆర్టిస్ట్స్ అసోసియేషన్‌లో(మా) మరో వివాదం తలెత్తింది. ‘మా’ సిల్వర్ జూబ్లీ వేడుకల్లో నిధులు దుర్వినియోగం అయ్యాయని ఆరోపణలు రావడం ఇండస్ట్రీలో హాట్‌టాపిక్ అయింది. దీనిపై స్పందించిన ‘మా’ కార్యవర్గం సోమవారం ఫిల్మ్‌ఛాంబర్‌లో సమావేశమై చర్చించింది. సమావేశం అనంతరం ‘మా’ అధ్యక్షుడు శివాజీరాజా విలేకరులతో మాట్లాడుతూ –‘‘మా’ నిధులు దుర్వినియోగం అయ్యాయనే వార్తల్లో నిజం లేదు. అసోసియేషన్ డబ్బుతో నేను ఇప్పటి వరకూ టీ కూడా తాగలేదు. ఫోన్ కూడా సొంతదే వాడుతున్నా. నా పిల్లల మీద ఒట్టు.. నేను తప్పు చేశానని, డబ్బులు తిన్నానని.. కనీసం 5పైసలు దుర్వినియోగమైనట్లు నిరూపిస్తే పెద్దమ్మ తల్లి సాక్షిగా గుండు చేయించుకుని, నా ఆస్తి మొత్తం ‘మా’కు రాసిస్తా. అంతేకాదు.. ‘మా’ సభ్యత్వం శాశ్వతంగా రద్దు చేసుకుంటా. సిల్వర్ జూబ్లీ వేడుకలకు ఒప్పందం ప్రకారమే డబ్బు వసూలైంది. త్వరలో ‘మా’ ఎన్నికలు సమీపిస్తున్నందున కొంతమంది తాము చేసే ప్రతి పనిని తప్పుబడుతూ ఆరోపణలు చేస్తున్నారు. ‘మా’లో సభ్యుల మధ్య ఎలాంటి విభేదాలు లేవు’’ అన్నారు. ‘మా’ కార్యవర్గ సభ్యుడు, హీరో శ్రీకాంత్ మాట్లాడుతూ– ‘‘తనపై ఆరోపణలు నిరూపిస్తే మా అసోసియేషన్ నుంచి శాశ్వతంగా తప్పుకుంటా. మా సిల్వర్ జూబ్లీ ఇయర్ సందర్భంగా నూతన బిల్డింగ్ కట్టబోతున్నాం. దీని కోసం చిరంజీవిగారిని కలిస్తే రెండు కోట్లు డొనేషన్ ఇస్తానని చెప్పి, ఇప్పటికే కోటి రూపాయలు ఇచ్చారు. ఫండ్స్ కోసం అమెరికాలో ప్రోగ్రాం చేయడంతో చిరంజీవిగారు ముఖ్య అతిథిగా వచ్చారు. తర్వాత హీరోలు మహేశ్‌బాబు, ప్రభాస్ కూడా వస్తారు’’ అన్నారు. ‘‘మా’ అసోసియేషన్‌లో ప్రస్తుతం రూ.5 కోట్ల వరకు డబ్బులున్నాయి’’ అని ‘మా’ కోశాధికారి, రచయిత పరుచూరి వెంకటేశ్వరరావు చెప్పారు. నన్ను దూరం పెట్టారు ‘మా’ సిల్వర్ జూబ్లీ వేడుకల్లో నిధులు దుర్వినియోగం ఆరోపణలపై ‘మా’ జనరల్ సెక్రటరీ, నటుడు నరేశ్ స్పందించారు. ఈ సందర్భంగా ఆయన ఫిల్మ్‌ఛాంబర్‌లో విలేకరులతో మాట్లాడుతూ– ‘‘మా’ అధ్యక్షుడు శివాజీరాజా బాధ్యతా రాహిత్యంగా వ్యవహరించడం వల్లే ఈ పరిస్థితి వచ్చింది. తనపై వచ్చిన ఆరోపణలకు శివాజీరాజా సమాధానం చెప్పాల్సిందే. విదేశీ కార్యక్రమాల గురించి తను ఎటువంటి వివరాలు నాకు చెప్పలేదు. అమెరికా ఈవెంట్ కోసం శివాజీరాజాతో సహా మరికొందరు బిజినెస్ క్లాస్‌లో 3 లక్షలు చెల్లించి మరీ ప్రయాణం చేసిన డబ్బంతా ఎవరిది? మహేశ్‌బాబు ప్రోగ్రాం కోసం శివాజీరాజాను నమ్రత దగ్గరకు నేనే తీసుకువెళ్లా. ఆ తర్వాత వేరే వాళ్ల నుంచి నాకు కాల్స్ వచ్చాయని నమ్రత నాకు చెప్పారు. ఈ ప్రయత్నాలు నన్ను తప్పించడానికే. వచ్చే ‘మా’ ఎన్నికల్లో పోటీచేయదలచుకోవడం లేదు. ఏప్రిల్ నుంచి నా కాల్స్‌కి శివాజీరాజా స్పందించటం లేదు. నిధుల దుర్వినియోగం వివాదంపై రిటైర్డ్ ఐపీఎస్ అధికారితో హైపవర్ నిజనిర్ధాణ కమిటీ వేద్దామంటే శివాజీరాజా అంగీకరించడం లేదు. ఈ విషయాన్ని చిరంజీవిగారి దృష్టికి కూడా తీసుకువెళ్లాను’’ అన్నారు. -
విద్వేష రాజకీయాలను తిరస్కరించారు
బెంగళూరు: విద్వేష రాజకీయాలను ఈశాన్య రాష్ట్రాల ప్రజలు తిరస్కరించారని, అదే సమయంలో బీజేపీకి ఏకగ్రీవంగా అధికారం కట్టబెట్టారని ప్రధాని నరేంద్ర మోదీ వ్యాఖ్యానించారు. త్రిపుర అసెంబ్లీ ఎన్నికల్లో వామపక్ష కూటమిని ఓడించి బీజేపీ జయకేతనం ఎగురవేసిన సంగతి తెలిసిందే. ఆదివారం బెంగళూరుకు 70 కిలోమీటర్ల దూరంలో ఉన్న తుమకూరులో నిర్వహించిన యూత్ కన్వెన్షన్‌ను ఉద్దేశించి మోదీ వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ప్రసంగించారు. ఈ సందర్భంగా త్రిపుర అసెంబ్లీ ఎన్నికల ఫలితం తమకు అమితానందం ఇచ్చిందని పేర్కొన్నారు. తుమకూరులోని రామకృష్ణ వివేకానంద ఆశ్రమం సిల్వర్ జూబ్లీ వేడుకలు, స్వామీ వివేకానంద శిష్యురాలు సిస్టర్ నివేదిత 150వ జయంతి వేడుకల సందర్భంగా ఈ కన్వెన్షన్‌ను ఏర్పాటు చేశారు. ‘యూత్ పవర్: కొత్త భారతదేశానికి ఓ విజన్’అనే అంశంపై మోదీ ప్రసంగిస్తూ.. అతివాద భావజాలా నికి ఏకత్వంతోనే సరైన సమాధానం ఇవ్వగలమన్నారు. భారత భూభాగంతో సంబంధం లేదనే భావనను గత పాలకులు ఈశాన్య రాష్ట్రాల ప్రజల్లో నాటుకునేలా చేశారని, తమ ప్రభుత్వం వారిలోని ఈ ఆందోళనను తొలగించేం దుకు ప్రయత్నిస్తోందని చెప్పారు. -
నాటకాలను బతికిద్దాం – రాఘవేంద్రరావు
‘‘మనకు తెలిసి రాజులెందరో ఉంటారు. ఆ రాజుల్లో రారాజు రామానాయుడుగారు. నార్త్ ఇండియాలోనే తెలుగు ఇండస్ట్రీకి ఎంతో ౖÐð భవం తీసుకొచ్చారా యన’’ అని దర్శకుడు కె. రాఘవేంద్రరావు అన్నారు. ‘మా’ (మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్) రజతోత్సవ వేడుకల్లో భాగంగా డా. డి. రామానాయుడు 3వ వర్ధంతి సందర్భంగా హైదరాబాద్‌లో ‘మా’ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న నాటకోత్సవాలు ఆదివారంతో ముగిశాయి. ఈ సందర్భంగా నాటక రంగం నుంచి సినిమారంగానికి వచ్చిన నటుడు జయప్రకాశ్‌రెడ్డిని సన్మానించారు. అనంతరం రాఘవేంద్రరావు మాట్లాడుతూ– ‘‘మరుగున పడిపోతున్న నాటకాలను బయటకి తీసుకురావాలి. నాటకాలను బతికించి పూర్వ వైభవం తీసుకురావాల్సిన అవసరం ఉంది. అప్పుడే కొత్త కళాకారులు బయటికొస్తారు’’ అన్నారు. ‘‘నా కల్యాణ మండపం కార్ల షెడ్లా అయిపోతోంది. అందులో నాటకాలు వేయించండి’ అని రామానాయుడుగారు చనిపోయే ముందు నాతో అన్నారు. ‘రామానాయుడు కళా సమితి’ ఏర్పాటు చేసి నాటకాలను ప్రోత్సహించ నున్నాం. ఈ సమితిలో సభ్యత్వం తీసుకొని నాటకరంగ అభివృద్ధికి తోడ్పడాలి’’ అన్నారు రచయిత పరుచూరి గోపాలకృష్ణ. ‘‘భారతదేశ చలనచిత్ర రంగానికి రామానాయుడుగారు ఓ మోనార్క్. ప్రపంచ చలనచిత్ర పరిశ్రమలో మూవీ మొఘల్ అయిన ఆయన ఓ మహాసముద్రం’’ అన్నారు నటుడు ఆర్. నారాయణ మూర్తి. ‘‘మా నాన్నగారు స్థాపించిన సంస్థ ఈ స్థాయిలో ఉందంటే ఎందరో దర్శకులు, నటులు, సాంకేతిక నిపుణులే కారణం’’ అన్నారు నిర్మాత డి.సురేశ్‌బాబు. ‘‘నలుగురు సన్మాన గ్రహీతలకు ఒక్కొక్కరికి 11వేల నగదును దర్శకుడు హరీష్‌శంకర్ అందించారు’’ అన్నారు ‘మా’ అధ్యక్షుడు శివాజీరాజా. నటులు కోటా శ్రీనివాసరావు, విద్యాసాగర్, ‘మా’ జనరల్ సెక్రటరీ నరేష్, ఎగ్జిక్యూటివ్ వైఎస్ ప్రెసిడెంట్ శ్రీకాంత్, కోశాధికారి పరుచూరి వెంకటేశ్వరరావు, ఉపాధ్యక్షుడు బెనర్జీ, కార్పొరేటర్ ఖాజా సూర్యనారాయణ, ‘మా’ సభ్యులు పాల్గొన్నారు. -
ఐయామ్ విత్ ‘మా’
మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ (మా) 25వ వసంతంలోకి అడుగుపెట్టిన సందర్భంగా సిల్వర్ జూబ్లీ వేడుకలు ఘనంగా నిర్వహించేందుకు ‘మా’ నూతన కార్యవర్గం ప్లాన్ చేసింది. ఈ విశేషాలను మీడియాతో పంచుకున్నారు. ‘మా’ అధ్యక్షుడు శివాజీ రాజా మాట్లాడుతూ–‘‘24 ఏళ్ల కిందట చిరంజీవిగారు స్థాపించిన ‘మా’ 25 సంవత్సరంలోకి అడుగుపెట్టడం చాలా సంతోషంగా ఉంది. ఈ సందర్భంగా ‘ఐయామ్ విత్ మా’ నినాదంతో సిల్వర్ జూబ్లీ వేడుకలు ఘనంగా నిర్వహిస్తున్నాం. ఈ వేడుకలకు శుభ సూచికంగా ‘ఓల్డేజ్ హోమ్’ ఏర్పాటు చేయబోతున్నాం’’ అన్నారు. ‘‘ఓల్డేజ్ హోం, ‘మా’కు సొంత భవనం ఏర్పాటు దిశగా అడుగులు వేస్తున్నాం’’ అన్నారు ‘మా’ జనరల్ సెక్రటరీ నరేశ్. ఈ వేదికపై సీనియర్ నటుడు రాళ్లపల్లి, సీనియర్ పాత్రికేయలు గుడిపూడి శ్రీహరి, నటుడు శివ బాలాజీలను ‘మా’ తరఫున సన్మానించారు. -
ముంబైలో శ్రీవారి కల్యాణ రజతోత్సవాలు
ముంబై: ఠాణే జిల్లా డోంబివలిలోని ‘ఆంధ్ర కళా సమితి’ ఆధ్వర్యంలో శ్రీ వెంకటేశ్వర కళ్యాణ రజత్సోవాలు జరగనున్నాయి. గత 24 ఏళ్లుగా శ్రీ వెంకటేశ్వర కళ్యాణ మహోత్సవాలు నిర్వహిస్తున్న ఈ సంస్థ ఈసారి రజతోత్సవాలను ఘనంగా నిర్వహించేందుకు ఏర్పాట్లు చేసింది. తూర్పు డోంబివలి, గర్ద సర్కిల్ వద్ద ఉన్న కళ్యాణ్-డోంబివలి మున్సిపల్ కార్పొరేషన్ గ్రౌండ్ (కేడీఎంసీ స్పోర్స్ట్ కాంప్లెక్స్)లో స్వామివారి కళ్యాణ రజతోత్సవాలు ఈ నెల 26, 27న (శని, ఆదివారాల్లో) జరగనున్నాయి. ఈ సందర్భంగా వివిధ సంస్కృతిక కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. ముఖ్యంగా తిరుపతిలో మాదిరి పూజా కార్యక్రమాలుంటాయి. ప్రస్తుతం ‘ఆంధ్ర కళా సమితి’ సంస్థకు 600 మందిపైగా సభ్యులున్నారు. సమితి ప్రస్తుత అధ్యక్షుడు ఎ శంకర్రావు, ప్రధాన కార్యదర్శులు కేవీ నారాయణ రెడ్డి, ఉపాధ్యక్షుడు కేవీ రమణా రెడ్డి, సంయుక్త కార్యదర్శి ఉపేంద్ర కుమార్, కోశాధికారి విజయ్‌మోహన్ తదితరులు ఉన్నారు. -
కంట్రీ ఫెస్ట్
చిన్నపిల్లల కేరింతలు, బాణసంచా పేలుళ్లతో బేగంపేట కంట్రీక్లబ్ హోరెత్తింది. బుధవారం రాత్రి కంట్రీక్లబ్ 25వ వార్షికోత్సవాన్ని పురస్కరించుకొని సిల్వర్‌జూబ్లీ వేడుకలు ఘనంగా నిర్వహించారు. అందులో భాగంగా దివాలీ మేళా కార్యక్రమం చేశారు. క్లబ్ సభ్యులు వారి కుటుంబ సభ్యులు ఈ వేడుకల్లో పాల్గొని సందడి చేశారు. మిరుమిట్లుగొలిపే క్రాకర్స్‌తో క్లబ్ ప్రాంగణం మెరిసిపోయింది. సిల్వర్ జూబ్లీ సందర్భంగా క్లబ్ సభ్యులకు మరిన్ని వసతులు కల్పించనున్నట్టు సీఎండీ రాజిరెడ్డి తెలిపారు. - ఫొటోలు: అమర్ -
నేడు ‘ఆర్సీఐ’ రజతోత్సవాలు
సాక్షి, హైదరాబాద్: దేశానికే గర్వకారణమైన రక్షణ పరిశోధన సంస్థ రీసెర్చ్ సెంటర్ ఇమారత్(ఆర్సీఐ) రజతోత్సవాలకు సిద్ధమవుతోంది. దీన్ని పురస్కరించుకుని ఈనెల 26న కాంచన్‌బాగ్‌లోని ఆర్సీఐ ప్రధాన కేంద్రంలో జరిగే వేడుకలకు గవర్నర్ నరసింహన్‌తోపాటు మాజీ రాష్ట్రపతి అబ్దుల్ కలాం, రక్షణశాఖ సహాయ మంత్రి జితేంద్రసింగ్ హాజరుకానున్నారు. 1984లో కలాం ఆలోచనల మేరకు ఈ కేంద్రం ఏర్పాటుకు అంకురం పడగా, 1985 ఆగస్టు 3న అప్పటి ప్రధాని రాజీవ్‌గాంధీ శంఖుస్థాపన చేశారు. 1988 ఆగస్టు 27న అప్పటి రాష్ట్రపతి ఆర్.వెంకటరామన్ జాతికి అంకితమిచ్చారు. అబ్దుల్ కలాం, లెఫ్టినెంట్ జనరల్ వి.జె.సుందరం, కెవిఎస్ఎస్ ప్రసాదరావు, వి.కె.సారస్వత్, ఎస్.కె.రే, అవినాశ్ చందర్, ఎస్.కె.చౌదరీ లాంటి దిగ్గజ శాస్త్రవేత్తల నేతృత్వంలో పలు విజయాలు సాధించిన ఈ సంస్థకు ప్రస్తుతం జి.సతీశ్‌రెడ్డి సంచాలకుడిగా వ్యవహరిస్తున్నారు. అగ్ని, పృథ్వీలతోపాటు దేశీయ క్షిపణులన్నింటికీ అవసరమైన ఏవియానిక్స్ వ్యవస్థల డిజైనింగ్, తయారీ జరిగేది ఈ కేంద్రం లోనే. హైదరాబాద్‌లోని కాంచన్‌బాగ్‌లో ఉన్న ఆర్సీఐ రక్షణ రంగంలో స్వావలంబన సాధిం చేందుకు జరుగుతున్న ప్రయత్నాల్లో కీలకపాత్ర పోషిస్తోంది.