వీడియో కాన్ఫరెన్స్‌లో మాట్లాడుతున్న ప్రధాని మోదీ
బెంగళూరు: విద్వేష రాజకీయాలను ఈశాన్య రాష్ట్రాల ప్రజలు తిరస్కరించారని, అదే సమయంలో బీజేపీకి ఏకగ్రీవంగా అధికారం కట్టబెట్టారని ప్రధాని నరేంద్ర మోదీ వ్యాఖ్యానించారు. త్రిపుర అసెంబ్లీ ఎన్నికల్లో వామపక్ష కూటమిని ఓడించి బీజేపీ జయకేతనం ఎగురవేసిన సంగతి తెలిసిందే. ఆదివారం బెంగళూరుకు 70 కిలోమీటర్ల దూరంలో ఉన్న తుమకూరులో నిర్వహించిన యూత్ కన్వెన్షన్‌ను ఉద్దేశించి మోదీ వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ప్రసంగించారు. ఈ సందర్భంగా త్రిపుర అసెంబ్లీ ఎన్నికల ఫలితం తమకు అమితానందం ఇచ్చిందని పేర్కొన్నారు.
తుమకూరులోని రామకృష్ణ వివేకానంద ఆశ్రమం సిల్వర్ జూబ్లీ వేడుకలు, స్వామీ వివేకానంద శిష్యురాలు సిస్టర్ నివేదిత 150వ జయంతి వేడుకల సందర్భంగా ఈ కన్వెన్షన్‌ను ఏర్పాటు చేశారు. ‘యూత్ పవర్: కొత్త భారతదేశానికి ఓ విజన్’అనే అంశంపై మోదీ ప్రసంగిస్తూ.. అతివాద భావజాలా నికి ఏకత్వంతోనే సరైన సమాధానం ఇవ్వగలమన్నారు. భారత భూభాగంతో సంబంధం లేదనే భావనను గత పాలకులు ఈశాన్య రాష్ట్రాల ప్రజల్లో నాటుకునేలా చేశారని, తమ ప్రభుత్వం వారిలోని ఈ ఆందోళనను తొలగించేం దుకు ప్రయత్నిస్తోందని చెప్పారు.
Comments
Please login to add a commentAdd a comment