ముంబైలో శ్రీవారి కల్యాణ రజతోత్సవాలు | Lord venkateswara swamy kalyanam Silver Jubilee celebrations in mumbai | Sakshi
Sakshi News home page

ముంబైలో శ్రీవారి కల్యాణ రజతోత్సవాలు

Published Thu, Nov 24 2016 7:45 PM | Last Updated on Sat, Aug 11 2018 6:59 PM

ముంబైలో శ్రీవారి కల్యాణ రజతోత్సవాలు - Sakshi

ముంబైలో శ్రీవారి కల్యాణ రజతోత్సవాలు

ముంబై: ఠాణే జిల్లా డోంబివలిలోని ‘ఆంధ్ర కళా సమితి’ ఆధ్వర్యంలో శ్రీ వెంకటేశ్వర కళ్యాణ రజత్సోవాలు జరగనున్నాయి. గత 24 ఏళ్లుగా శ్రీ వెంకటేశ్వర కళ్యాణ మహోత్సవాలు నిర్వహిస్తున్న ఈ సంస్థ ఈసారి రజతోత్సవాలను ఘనంగా నిర్వహించేందుకు ఏర్పాట్లు చేసింది.

తూర్పు డోంబివలి, గర్ద సర్కిల్ వద్ద ఉన్న కళ్యాణ్-డోంబివలి మున్సిపల్ కార్పొరేషన్ గ్రౌండ్ (కేడీఎంసీ స్పోర్స్ట్ కాంప్లెక్స్)లో స్వామివారి కళ్యాణ రజతోత్సవాలు ఈ నెల 26, 27న (శని, ఆదివారాల్లో) జరగనున్నాయి. ఈ సందర్భంగా వివిధ సంస్కృతిక కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. ముఖ్యంగా తిరుపతిలో మాదిరి పూజా కార్యక్రమాలుంటాయి. ప్రస్తుతం ‘ఆంధ్ర కళా సమితి’ సంస్థకు 600 మందిపైగా సభ్యులున్నారు. సమితి ప్రస్తుత అధ్యక్షుడు ఎ శంకర్‌రావు, ప్రధాన కార్యదర్శులు కేవీ నారాయణ రెడ్డి, ఉపాధ్యక్షుడు కేవీ రమణా రెడ్డి, సంయుక్త కార్యదర్శి ఉపేంద్ర కుమార్, కోశాధికారి విజయ్‌మోహన్ తదితరులు ఉన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement