ఇటీవల రోజుల్లో దాంపత్యం అన్న మాట విలువలేనిదిగా అయిపోతోంది. ఎక్కడ చూసినా..విడాకులు కేసులే అధికమవుతున్నాయి. అలాంటి పరిస్థితుల్లో ఈ వృద్ధ జంటను చూస్తే భార్యభర్తల బంధం అంటే ఇది కదా అనిపిస్తుంది. ప్రేమ అనే ఒక్క పదం ఇరువురి మధ్య ఉంటే ఎలాంటి వైకల్యమైనా జయించొచ్చు అనిపిస్తుంది. ఈ ఏజ్‌లో తమ కాళ్లపై తాము నిలబడాలనే తపనతో ఆ జంట పడుతున్న పాట్లు చూస్తే..ఎవ్వరైనా ఫిదా అవ్వాల్సిందే.
ఇంతకీ ఎవరంటే వారు..థానే రైల్వే స్టేషన్(Thane Station) వద్ద స్నాక్ అమ్ముకుని జీవించే వృద్ధ జంట(Elderly Couple). వారితో ఇన్‌స్టాగ్రామ్ వ్లాగర్(vlogger) సిద్ధేష్ లోకారే మాటలు కలిపి..ఆ సంభాషణను నెట్టింట వీడియో రూపంలో పోస్ట్ చేశాడు. దీంతో ఆ వృద్ధ జంట కథ నెట్టింట వైరల్‌గా మారింది. బీం రావు శోభ దంపతులతో వ్లాగర్ సిద్ధేష్ సంభాషిస్తూ..మీకు ఎప్పుడు పెళ్లి అయ్యిందని ప్రశ్నిస్తారు. వారు 1982లో పెళ్లై అయ్యిందని బదులిస్తారు.
మూడు దశాబ్దాలకు పైగా కలిసే ఉన్నామని అంటారు. ఇక్కడకి ప్రతిరోజు వచ్చి స్నాక్స్ అమ్ముతామని, ఎవ్వరైన స్నాక్స్/స్వీట్‌లు కావాలని ఆర్డర్ చేస్తే ఇంటికి కూడా వెళ్లి డెలివరీ చేస్తామని చెప్పారు. బీంరావు తాను రెండేళ్ల వయసులో చూపుకోల్పోగా, భార్య శోభాకు ఒక చేయి సరిగా లేదు. అయినా ఇరువరు ఎంతో అన్యోన్యంగా ఉంటామని చెప్పారు. రోజువారీ పనులను ఎలా ఇరువురు చకచక చేసుకోగలరో కూడా వివరించారు.
అంతేగాదు భీంరావు తనకు చూపులేకపోయినా తన భార్యకు వంట చేయడంలో సహకరిస్తారట. పైగా కూరగాయాలు కట్ చేయడంలో ఆయనకు ఎంతో నైపుణ్యం ఉందని భర్తపై ప్రశంసలు జల్లు కురిపిస్తోంది శోభా. ఆ జంటని వ్లాగర్ సిద్ధేష్ ప్రేమంటే ఏంటనీ అడగగా..వారు "ఒకరికొకరు" అని గొప్పగా సమాధానం ఇచ్చారు.
యవతకు మీరిచ్చే సందేశం ఏంటని అడిగితే.." "కష్టపడితే దేన్నైనా పొందగలం". అలాగే నీ కోసం బతకడం కాదు ఇతరుల మేలు కోరితేనే జీవితానికి అసలైన అర్థం అని చెప్పారు". చివరిగా వ్లాగర్ మీకు ఏదైనా కావాలా అని అడగగా..ఒక స్టాల్ ఉంటే బాగుండునని, ఇంతలా నిలబడాల్సిన శ్రమ ఉండదని నవ్వుతూ చెబుతారు ఆ దంపతులు. ఈ వీడియో నెటిజన్లను కదలించింది. ప్రేమకు అసలైన నిర్వచనం ఆ దంపతులు అని ప్రశంసిస్తూ..పోస్టులు పెట్టారు.
(చదవండి: ఏజ్‌లో సెంచరీ కొట్టిన మరో బామ్మ..హెల్త్ సీక్రెట్ ఏంటంటే..)
Comments
Please login to add a commentAdd a comment