
జిమ్ 'మాస్టర్'
మెగాస్టార్ చిరంజీవి జిమ్ 'మాస్టర్'గా మారారు. అదేంటి అనుకుంటున్నారా..?
హైదరాబాద్: మెగాస్టార్ చిరంజీవి జిమ్ 'మాస్టర్'గా మారారు. అదేంటి అనుకుంటున్నారా..? ఏం లేదండి.. ఆయన కొద్దిసేపు జిమ్ లో వ్యాయామం చేసి సందడి చేశారు. చిరు వ్యక్తిగత ట్రైనర్ జి.ప్రవీణ్ రెడ్డి మణికొండలో 'రాగాస్ ఫ్లెక్స్ జిమ్'ను ఏర్పాటు చేయగా, దానిని మెగాస్టార్ ఆదివారం ప్రారంభించారు. అత్యాధునిక ప్రమాణాలతో మోడ్రన్ జిమ్ ను నెలకొల్పాడని ప్రవీణ్ ను చిరంజీవి అభినందించారు. చేతికి కట్టుతోనే ఆయన ఈ కార్యక్రమానికి హాజరయ్యారు.
ముంబైలోని బ్రీచ్ కాండీ ఆస్పత్రిలో చిరంజీవి తన భుజానికి శస్త్రచికిత్స చేయించుకున్న సంగతి తెలిసిందే. తన కుమార్తె శ్రీజ పెళ్లి వేడుకల్లో భాగంగా చిరంజీవి, ఆయన సతీమణి సురేఖ కలిసి పసుపు దంచే కార్యక్రమంలో పాల్గొన్నట్టు సోషల్ మీడియాలో షేర్ అయిన ఫొటోలోనూ మెగాస్టార్ చేతికి కట్టుతోనే కనిపించారు.