సాక్షి, హైదరాబాద్: రాయదుర్గం పోలీస్ స్టేషన్ పరిధిలో దారుణం జరిగింది. మణికొండ ఆంధ్రా కాలనీలో తల్లి, కూతురు ఆత్మహత్యకు పాల్పడ్డారు. మృతులు అలివేలు, ఆమె కుమార్తె లాస్యగా గుర్తించారు. నిన్న సాయంత్రం భర్తకు రూ.5 వేలు ఇచ్చి యాదాద్రి ఆలయానికి వెళ్లమని అలివేలు చెప్పినట్లు సమాచారం.
ఈ రోజు(శుక్రవారం) తెల్లవారుజామున పడక గదిలో కూతురు లాస్య, వంటగదిలో తల్లి అలివేలు ఆత్మహత్య చేసుకున్నారు. ఆత్మహత్యకు ముందు పాత దుస్తుల్ని అలివేలు తగులబెట్టింది. తల్లి పాత బట్టలను తగులబెడుతుండగా ప్రశ్నించిన కుమారుడికి సమాధానం ఇవ్వలేదు.
కూతురు లాస్యకి ఉరి వేసి చంపి, తల్లి అలివేలు ఆత్మహత్య చేసుకున్నట్లు పోలీసులు గుర్తించారు. ఎనిమిదేళ్ల కొడుకును కూడా చంపే ప్రయత్నం చేసిన తల్లి.. గాడ నిద్రలో ఉండటంతో వదిలేసింది. లాస్య, అలివేలు మానసిక స్థితి సరిగ్గా లేదని, కరోనా టైం నుంచి అందరికీ దూరంగా ఉంటున్నారన్నారని రాయదుర్గం సీఐ మహేష్ తెలిపారు.
చదవండి: నాచారంలో సెల్ఫీ సూసైడ్
Comments
Please login to add a commentAdd a comment