టీమిండియా స్టార్ క్రికెటర్ విరాట్ కోహ్లి హైదరాబాద్‌లోని మణికొండలో సందడి చేశాడు. మణికొండ గ్రీన్ లివింగ్ అపార్ట్‌మెంట్‌లోని హైకీ జిమ్‌లో ఓ యాడ్ షూటింగ్‌లో కింగ్ కోహ్లి పాల్గొన్నాడు. ఈ విషయం తెలుసుకున్న అభిమానులు పెద్ద ఎత్తున అక్కడికి తరలివచ్చారు. దీంతో, ఆ ప్రాంతమంతా కిక్కిరిసిపోయింది.
కాగా మణికొండలోని పైపులైను రోడ్డులో గల హాల్‌మార్క్ హబ్‌లో హైకీ ఫిట్‌నెస్ స్టూడియో ఉంది. ఫిట్‌నెస్‌కు అత్యంత ప్రాధాన్యం ఇచ్చే కోహ్లి.. అత్యాధునికంగా డిజైన్ చేసిన ఈ జిమ్‌లో దాదాపు రెండు గంటల సేపు సమయం గడిపాడు. ఓ సంస్థకు సంబంధించిన వ్యాపార ప్రకటనను ఇక్కడే షూట్ చేశారు. షూట్ ముగిసిన తర్వాత హైకీ ఫిట్‌నెస్ స్టూడియోని ఆరంభించిన యంగ్ ఎంటర్‌ప్రెన్యూర్ మనీషాతో కోహ్లి ముచ్చటించాడు.
కాగా ఉప్పల్ స్టేడియం వేదికగా న్యూజిలాండ్‌తో తొలి వన్డేలో పాల్గోనేందుకు కోహ్లి భాగ్యనగరానికి వచ్చిన సంగతి తెలిసిందే. ఇక కివీస్‌తో జరిగిన తొలి వన్డేలో 12 పరుగుల తేడాతో భారత్ విజయం సాధించింది.
ఈ మ్యాచ్‌లో కోహ్లి 8 పరుగులు మాత్రమే చేశాడు. యువ ఓపెనర్ శుబ్‌మాన్ గిల్ అద్భుతమైన డబుల్ సెంచరీతో చెలరేగాడు. గిల్ 143 బంతుల్లో 19 ఫోర్లు, 9 సిక్స్‌లతో 208 పరుగులు సాధించాడు. ఇక ఇరు జట్ల మధ్య రెండో వన్డే రాయ్‌పూర్ వేదికగా జనవరి 21న జరగనుంది.
చదవండి: SA20 2023: రషీద్ ఖాన్‌కు చుక్కలు చూపించిన సన్‌రైజర్స్ బ్యాటర్.. ఒకే ఓవర్‌లో 28 పరుగులు!
Comments
Please login to add a commentAdd a comment