కిరోసిన్ పోసుకుని దంపతులు ఆత్మహత్యాయత్నం | Couple attempt suicide at manikonda village in krishna district | Sakshi
Sakshi News home page

కిరోసిన్ పోసుకుని దంపతులు ఆత్మహత్యాయత్నం

Published Sat, Nov 8 2014 9:25 AM | Last Updated on Wed, Jul 10 2019 7:55 PM

Couple attempt suicide at manikonda village in krishna district

విజయవాడ: కృష్ణాజిల్లా ఉంగుటూరు మండలం మానికొండలో శనివారం తెల్లవారుజామున కుటుంబ కలహాలతో దంపతులు ఒంటిపై కిరోసిన్ పోసుకుని ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డారు. దంపతుల ఒంటిపై మంటలు త్వరగా వ్యాపించాయి. దీంతో వారు బిగ్గరగా అరవడంతో స్థానికులు వెంటనే స్పందించి... మంటలార్పివేసి... వారిని గుడివాడలోని ఆసుపత్రికి తరలించారు. 

అయితే వారి పరిస్థితి విషమంగా ఉందని మెరుగైన వైద్య చికిత్స కోసం విజయవాడ తరలించాలని వైద్యులు బంధువులకు సూచించారు. దీంతో వారిని విజయవాడ తరలించారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement