లిఫ్ట్‌ కిందపడి బాలుడు మృతి | Boy dies in lift accident in Manikonda | Sakshi
Sakshi News home page

మణికొండలో లిఫ్ట్‌ ప్రమాదం, బాలుడి మృతి

Published Sun, Nov 24 2019 7:34 PM | Last Updated on Sun, Nov 24 2019 7:53 PM

Boy dies in lift accident in Manikonda - Sakshi

సాక్షి, హైదరాబాద్‌ : రాయదుర్గం పోలీస్‌ స్టేషన్‌ పరిధిలోని పంచవటి కాలనీలోని రోడ్‌ నెంబర్‌ 10, టీవీఎస్‌ లేక్‌ వ్యూ అపార్ట్‌మెంట్‌లో ఆదివారం విషాదం చోటుచేసుకుంది. ప్రమాదవశాత్తూ ధనుష్‌ అనే ఓ బాలుడు ఆడుకుంటూ లిఫ్ట్‌ కిందపడి చనిపోయాడు. ఈ సంఘటన బాలుడి కుటుంబంలో అంతులేని విషాదాన్ని నింపింది. సమాచారం అందుకున్న రాయదుర్గం పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని పరిస్థితిని సమీక్షించారు. కేసు నమోదు చేసి మృతదేహాన్ని పోస్ట్‌మార్టంకు తరలించారు.  కాగా ధనుష్‌ కుటుంబం రెండు నెలల క్రితమే ఈ అపార్ట్‌మెంట్‌కు వచ్చింది. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement