మణికొండ: ఔటర్ రింగ్‌రోడ్డుపై పెరుగుతున్న ట్రాఫిక్‌తో టోల్‌గేట్ల వద్ద వాహనదారుల పడిగాపులు పెరిగిపోతున్నాయి. వాటిని నివారించే ఉద్దేశంతో అధిక రద్దీ ఉండే పుప్పాలగూడ టోల్‌గేట్ వద్ద నిర్వాహకులు ప్రత్యేక దారులను ఏర్పాటు చేసి రద్దీ నివారణ చర్యలు చేపట్టారు.
ఆదివారం నుంచి శంషాబాద్ వైపు నుంచి వచ్చే వాహనాల కోసం ఉన్న మూడు టోల్ వసూలు కౌంటర్లలోకి కార్లను మాత్రమే అనుమతించారు. గచ్చిబౌలి నుంచి శంషాబాద్ వెళ్లే మార్గంలో కార్లకు ప్రత్యేక మార్గం ఏర్పాటు చేశారు. ఫాస్ట్‌ట్యాగ్ ఉన్న వాహనదారులే ప్రవేశించాలని సూచిక బోర్డులను ఏర్పాటు చేశారు. ఫాస్ట్‌ట్యాగ్ లేకుండా ఆయా మార్గాల్లోకి ప్రవేశిస్తే చెల్లించాల్సిన డబ్బుకు రెండితలు వసూలు చేస్తున్నామని టోల్‌గేట్ నిర్వాహకులు తెలిపారు.
ఫాస్టాగ్‌లకు ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన మార్గాల్లోకి ఇతర వాహనదారులు రావొద్దని బోర్డులు ఏర్పాటు చేసినా వారు ప్రవేశించి నగదు రూపంలో టోల్ చెల్లిస్తుండటంతో రద్దీ పెరిగిపోతోందన్నారు. అందుకే కచ్చితంగా ఫాస్టాగ్ ఉన్న కార్లను ఆయా మార్గాల్లో.. మిగతా వాహనాలను ఇతర కౌంటర్లలోకి అనుమతిస్తున్నామన్నారు. దాంతో ఆదివారం ఎక్కువగా ట్రాఫిక్ స్తంభించలేదని చెప్పారు. రాబోయే రోజుల్లో అధిక రద్దీ ఉండే మరిన్ని టోల్ కేంద్రాల వద్ద ఇలాంటి ఏర్పాట్లను చేస్తామని వారు తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment