సాక్షి, హైదరాబాద్: హైదరాబాద్ నగరానికి మణిహారంగా కాంగ్రెస్ హయాంలో నిర్మించిన ఔటర్ రింగ్ రోడ్డును కేసీఆర్ సర్కార్ ప్రైవేటు వ్యక్తులకు అమ్మకానికి పెట్టిందని టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి విమర్శించారు. ప్రజలకు అవసరమయ్యే ఔటర్ రింగ్ రోడ్డును అమ్మాల్సిన అవసరం ఏం వచ్చిందని ప్రశ్నించారు. 2004లో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చాక రాష్ట్రంలో అంతర్జాతీయ విమానాశ్రయం నిర్మించారని తెలిపారు. అంతర్జాతీయ ప్రమాణాలతో ఔటర్ రింగ్ రోడ్డును నిర్మించినట్లు పేర్కొన్నారు.
ఈ మేరకు శనివారం గాంధీభవన్‌లో రేవంత్‌రెడ్డి మాట్లాడుతూ.. వేల కోట్ల ఆదాయం వచ్చే ఓఆర్‌ఆర్‌ను కేటీఆర్ ప్రైవేటుకు తాకట్టు పెట్టారని మండిపడ్డారు. సూమారు 30వేల కోట్లు ఆదాయం వచ్చే సంపదను రూ. 7,380 కోట్లకే కారుచౌకగా ముంబై కంపెనీకి కట్టబెట్టారని విమర్శించారు. దేశంలోనే ఇది అత్యంత పెద్ద కుంభకోణమని ఆరోపించారు. ఇందులో రూ. 1,000 కోట్లు చేతులు మారాయని తెలిపారు. ఈ నిర్ణయాన్ని కాంగ్రెస్ పార్టీ ఎట్టి పరిస్థితుల్లో ఆమోదించదని.. తాము మేం అధికారంలోకి వచ్చాక దీనిపై విచారణకు ఆదేశిస్తామని తెలిపారు. యాజమాన్యం కూడా జైలుకు వెళ్లాల్సి వస్తుందని హెచ్చరించారు.
చదవండి: కొత్త సచివాలయంపై బండి సంజయ్ సంచలన వ్యాఖ్యలు
సోమేశ్ కుమార్, అరవింద్ కుమార్, జయేష్ రంజన్ నిర్ణయాలన్నింటిపై కాంగ్రెస్ పార్టీ సమీక్షిస్తుందన్నారు. ఈ నిర్ణయాలపై బీజేపీ ఎందుకు మౌనంగా ఉందని ప్రశ్నించారు. ప్రజల ఆస్తులు కేసీఆర్ అమ్ముతుంటే బండి సంజయ్, కిషన్ రెడ్డి ఎందుకు స్పందించడం లేదని నిలదీశారు. 2018 నుంచి టోల్ వసూలు బాధ్యత ఎవరికి ఇచ్చారో హెచ్ఎండీఏ అధికారులు బయట పెట్టాలని డిమాండ్ చేశారు. పెట్టుబడులు అంటే నూతన ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఏర్పాటు చేయాలి కానీ.. ఉన్న వాటిని తాకట్టు పెట్టడం కాదని హితవు పలికారు.
చదవండి: హైదరాబాదీలకు అలర్ట్.. రేపు పార్కుల మూసివేత
Comments
Please login to add a commentAdd a comment