సాక్షి, హైదరాబాద్: ప్రజావసరాల నిమిత్తం రోడ్డు వేయాలని హైదరాబాద్ రోడ్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్ లిమిటెడ్ (హెచ్‌ఆర్‌డీసీఎల్) పనులు చేపట్టింది. తమ హౌసింగ్ సొసైటీ స్థలంలోనుంచి సదరు పనులను అనుమతించేది లేదని ఇండియన్ సర్వీసెస్ విశ్రాంత అధికారులు అడ్డుకుంటున్నారు. దీంతో ఇరు వర్గాల మధ్య రోడ్డు వార్ కొనసాగుతోంది.
హైదరాబాద్ నగర శివారు మణికొండ మున్సిపాలిటీ పరిధిలోని పుప్పాలగూడ రెవెన్యూలో సర్వే నెంబర్ 454లో 2007 సంవత్సరంలో అప్పటి ప్రభుత్వం ఐఏఎస్, ఐపీఎస్ అధికారుల ‘ఆదర్శ్‌నగర్ కోఆపరేటివ్ హౌసింగ్ సొసైటీ’కి 57 ఎకరాలను కేటాయించింది. హౌసింగ్ సొసైటీలకు భూమి కేటాయింపు కేసు ప్రస్తుతం సుప్రీం కోర్టులో ఉంది. కాగా, మణికొండ మున్సిపాలిటీ పరిధిలో పెరుగుతున్న జనాభా అవసరాల నిమిత్తం ల్యాంకోహిల్స్ సర్కిల్ నుంచి ఔటర్ రింగ్ రోడ్డు వరకు 2.35 కిలోమీటర్ల వంద అడుగుల రోడ్డు నిర్మాణం చేపట్టాలని రెండేళ్లకిందట రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది.
అందుకు అనుగుణంగా టెండర్లు పిలిచింది. కొంత మేర పనులు పూర్తి చేశారు. మిగిలిపోయిన పనులను పూర్తి చేసేందుకు శనివారం పునఃప్రారంభించారు. దీంతో.. తమ స్థలంలో పనులు చేపట్టనివ్వబోమని ఆదర్శ్ హౌసింగ్ సొసైటీ భీషి్మంచింది. అయినా పనులను కొనసాగించారు.
ఆదివారం రాత్రి తిరిగి పనులు..
మరునాడు ఆదివారం సొసైటీవాసులు పనులను అడ్డుకుంటారని భావించి రోజంతా పనులను చేయలేదు. ఆదివారం రాత్రి 9.30 గంటల సమయంలో హెచ్‌ర్‌డీసీఎల్ సీఈ సరోజ ఆధ్వర్యంలో అధికారుల బృందం అక్కడకు చేరుకుని పనులు ప్రారంభించారు. ఈ విషయాన్ని ముందే పసిగట్టిన ఇండియన్ సరీ్వసెస్ విశ్రాంత అధికారులు తమ న్యాయవాదులు, సిబ్బందితో పాటు అక్కడే ఉండి పనులను అడ్డుకున్నారు. తమ స్థలంలోకి వస్తే ఊరుకునే ప్రసక్తే లేదని హెచ్చరించారు. తమకు హైకోర్టు నుంచి స్టే ఉందని, శనివారం కోర్టు ధిక్కరణ పిటిషన్‌ను సైతం వేశామని అధికారులతో వాదనలకు దిగారు.
తమ పిటిషన్‌కు కోర్టులో సమాధానం చెప్పకుండా అడ్డగోలుగా పనులు చేపట్టడం ఏమిటని రిటైర్డ్ ఐఏఎస్ అధికారులు రాంనారాయణ్‌రెడ్డి, రాయుడు, వెంకట్‌రాంరెడ్డి, రిటైర్డ్ ఐపీఎస్ అధికారి ఎన్‌జీ మురళి, రిటైర్డ్ ఐఎఫ్‌ఎస్ అధికారి ఎంజీ అక్బర్‌లు ప్రశ్నించారు. తమ స్థలంలో పనులు చేస్తే అడ్డుకుంటామని అధికారులు, ఎలాగైనా పనులు చేస్తామని హెచ్‌ఆర్‌డీసీఎల్ అధికారులు బీష్మించడంతో ఎప్పుడు, ఏం జరుగుతుందో తెలియని పరిస్థితి నెలకొంది. అర్థరాత్రి వరకు సొసైటీ స్థలంలో కాకుండా వేరేచోట పనులను కొనసాగించారు. కోర్టు నుంచి సోమవారం వచ్చే ఆదేశాలకోసం అందరూ ఉత్కంఠగా ఎదురుచూస్తున్నారు.
చదవండి: టెక్సాస్ కాల్పుల ఘటన.. హైదరాబాద్ యువతి మృతి
Comments
Please login to add a commentAdd a comment