
సాక్షి, హైదరాబాద్: మణికొండలోని జోల్లి కిడ్స్ ప్లేస్కూల్ అగ్ని ప్రమాద ఘటన చోటుచేసుకుంది. మంగళవారం ఉదయం షార్ట్ సర్క్యూట్‌తో మొదటి అంతస్తులో మంటలు చెలరేగాయి.
కాగా, మంటలు ఎగసిపడటం, పొగ బయటకు రావడంతో భయంతో చిన్నారులు పరుగు తీశారు. ఇక, అగ్ని ప్రమాదం సంభవించడంతో చిన్నారుల పేరెంట్స్ భయబ్రాంతులకు గురయ్యారు. వెంటనే స్కూల్ సిబ్బంది అగ్నిమాపక సిబ్బందికి సమాచారం అందించడంతో ఫైర్ టెండర్స్ అక్కడికి చేరుకొని మంటలను అదుపు చేస్తున్నారు. ఈ ఘటనపై మరింత సమాచారం తెలియాల్సి ఉంది.
ఇది కూడా చదవండి: ఆరు లేన్లుగా ఎన్‌హెచ్-65.. నితిన్ గడ్కరీ హామీ!
Comments
Please login to add a commentAdd a comment