shortcircute
-
షార్టసర్క్యూట్తో ఇల్లు దగ్ధమై భారీ నష్టం
భువనగిరి క్రైం: షార్ట్‌సర్క్యూట్‌తో మంటలు వ్యాపించి ఓ ఇల్లు దగ్ధమైంది. ఈ సంఘటన పట్టణంలోని కిసాన్‌నగర్‌లో శనివారం రాత్రి చోటు చేసుకుంది. వివరాల ప్రకారం.. కిసాన్‌నగర్‌కు చెందిన మోట శ్రీశైలం కుటుంబంతో కలిసి కర్నాటక రాష్ట్రానికి పనినిమిత్తం వెళ్లాడు. తాళం వేసిన ఇంట్లో శనివారం రాత్రి షార్ట్‌సర్క్యూట్ జరిగి అగ్నిప్రమాదం సంభవించడంతో ఇల్లు దగ్ధమై ఇంట్లోని సిలిండర్ పేలడంతో భారీ నష్టం వాటిల్లింది. దీంతో స్థానికులు ఫైర్ అధికారులకు సమాచారం ఇవ్వడంతో వారు వచ్చి మంటలను అదుపు చేశారు. అప్పటికే ఇల్లు మొత్తం కాలిపోయింది. పట్టణంతో పాటు, మండలంలో రెండు రోజుల నుంచి విద్యుత్ సరఫరాతో తరచూ అంతరాయం ఏర్పడుతుండడంతో ప్రమాదం జరిగి ఉండవచ్చని స్థానికులు తెలిపారు. బైక్‌ను ఢీకొట్టిన లారీ.. వ్యక్తి మృతి శాలిగౌరారం: లారీ ఢీకొట్టడంతో బైక్‌పై వెళ్తున్న వ్యక్తి మృతిచెందాడు. ఈ ఘటన శాలిగౌరారం మండలంలోని పెర్కకొండారం గ్రామ సమీపంలో 365వ నంబర్ జాతీయ రహదారిపై శనివారం రాత్రి జరిగింది. ఎస్ఐ సతీష్ తెలిపిన వివరాల ప్రకారం.. శాలిగౌరారం మండలంలోని చిత్తలూరు గ్రామానికి చెందిన బాలెం వెంకన్న(45) శనివారం రాత్రి నకిరేకల్ నుంచి 365వ నంబర్ జాతీయ రహదారి మీదుగా చిత్తలూరుకు బైక్‌పై వెళ్తున్నాడు. ఈ క్రమంలో పెర్కకొండారం గ్రామ సమీపంలోకి రాగానే వెనక నుంచి వేగంగా వచ్చిన లారీ ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో వెంకన్న అక్కడికక్కడే మృతిచెందాడు. లారీ డ్రైవర్ లారీని అక్కడే వదిలి పరారయ్యాడు. మృతుడికి భార్య, కుమార్తె, కుమారుడు ఉన్నారు. సమాచారం తెలుసుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం నకిరేకల్ ప్రభుత్వాస్పత్రికి తరలించారు. ఈ ఘటనపై ఫిర్యాదు అందగానే కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టనున్నట్లు ఎస్ఐ తెలిపారు. బొలేరో వాహనం బోల్తా.. పలువురికి గాయాలు మిర్యాలగూడ: బొలెరో వాహనం బోల్తా పడగా.. నలుగురు గాయపడ్డారు. ఈ ఘటన దామరచర్ల మండల కేంద్రం శివారులో శనివారం జరిగింది. వాడపల్లి పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. దామరచర్లలోని యాదాద్రి పవర్ ప్లాంట్‌లో కూలీలుగా పనిచేస్తున్న సుమారు 16 మంది విధులు ముగించుకుని బొలేరో వాహనంలో దామరచర్లకు వస్తుండగా వీర్లపాలెం రహదారిలో ముత్యాలమ్మ గుడి మూలమలుపు వద్ద అదుపుతప్పి బోల్తాపడింది. ఈ ప్రమాదంలో పలువురు గాయపడగా.. వారిని చికిత్స నిమిత్తం 108 వాహనంలో మిర్యాలగూడ ఏరియా ఆస్పత్రికి తరలించారు. గాయపడిన వారు బిహార్ రాష్ట్రానికి చెందిన కూలీలుగా పోలీసులు భావిస్తున్నారు. -
short circuit: పొలంలో పని చేస్తుండగా వరికోత మిషన్ దగ్ధం
పెన్‌పహాడ్ : షార్ట్‌సర్క్యూట్‌తో వరికోత మిషన్ దగ్ధమైంది. ఈ ఘటన పెన్‌పహాడ్ మండల పరిధిలోని సింగారెడ్డిపాలెం గ్రామంలో శుక్రవారం చోటు చేసుకుంది. యాదాద్రి భువనగిరి జిల్లా చౌటుప్పల్ మండలం శివారెడ్డిగూడెం గ్రామానికి చెందిన రవీందర్‌రెడ్డికి చెందిన వరికోత చైన్ మిషన్ సింగారెడ్డిపాలెంలోని రైతు పేర్ల లింగయ్య పొలాన్ని కోస్తున్న సమయంలో విద్యుత్ తీగలకు తగిలి షార్ట్‌సర్క్యూట్‌కు గురై దగ్ధమైనట్లు బాధితులు తెలిపారు. అగ్నిమాపక శాఖ అధికారులకు సమాచారం ఇవ్వడంతో ఫైర్ ఇంజన్‌తో వచ్చి మంటలను అదుపు చేశారు. రోడ్డు ప్రమాదంలో గాయపడిన వ్యక్తి మృతి మునగాల(కోదాడ): రోడ్డు ప్రమాదంలో గాయపడి ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న వ్యక్తి మృతిచెందాడు. మునగాల మండలం ముకుందాపురం గ్రామానికి చెందిన రైతు మాదాసు సైదులు(58) గురువారం ట్రాక్టర్ నడుపుకుంటూ ఆకుపాముల శివారులో గల కంకర మిల్లు నుంచి కోదాడ వైపు వెళ్లే రహదారిలో హైవే ఎక్కుతున్నాడు. ఈ క్రమంలో హైదరాబాద్ నుంచి విజయవాడ వైపు వెళ్లే ఆర్టీసీ బస్సు ట్రాక్టర్‌ను వెనుకనుంచి ఢీకొట్టింది. ప్రమాదంలో ట్రాక్టర్ బోల్తాకొట్టడంతో సైదులుకు తీవ్ర గాయాలయ్యాయి. స్థానికులు సైదులును 108వాహనంలో సూర్యాపేట ఏరియా ఆస్పత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతున్న సైదులు శుక్రవారం తెల్లవారుజామున మృతిచెందినట్లు కుటుంబసభ్యులు తెలిపారు. మృతుడికి భార్య, ముగ్గురు కుమార్తెలు, కుమారుడు ఉన్నారు. ఈ మేరకు మునగాల పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు. విద్యుదాఘాతంతో ఆవు మృతి నిడమనూరు: మండలంలోని రేగులడ్డ గ్రామంలో శుక్రవారం లింగాల రాజ మ్మకు చెందిన ఆ వు విద్యుదాఘాతంతో మృతిచెందింది. రోజు వారీగా ఆవులను మేత కోసం గ్రామ సమీపంలోకి తీసుకువెళ్లారు. ట్రాన్స్ఫార్మర్ వద్ద ఆవు గడ్డి మేస్తూ వైర్లకు తగలడంతో విద్యుదాఘాతానికి గురై అక్కడికక్కడే మృతి చెందిందని యజమానురాలు తెలిపింది. ఇది చదవండి: పొలం ఇప్పుడే ఇవ్వడం కుదరదన్న అత్తమామ.. మామపై అల్లుడి దారుణం! -
మణికొండ: ప్లే స్కూల్లో మంటలు.. పరుగు తీసిన చిన్నారులు
సాక్షి, హైదరాబాద్: మణికొండలోని జోల్లి కిడ్స్ ప్లేస్కూల్ అగ్ని ప్రమాద ఘటన చోటుచేసుకుంది. మంగళవారం ఉదయం షార్ట్ సర్క్యూట్‌తో మొదటి అంతస్తులో మంటలు చెలరేగాయి. కాగా, మంటలు ఎగసిపడటం, పొగ బయటకు రావడంతో భయంతో చిన్నారులు పరుగు తీశారు. ఇక, అగ్ని ప్రమాదం సంభవించడంతో చిన్నారుల పేరెంట్స్ భయబ్రాంతులకు గురయ్యారు. వెంటనే స్కూల్ సిబ్బంది అగ్నిమాపక సిబ్బందికి సమాచారం అందించడంతో ఫైర్ టెండర్స్ అక్కడికి చేరుకొని మంటలను అదుపు చేస్తున్నారు. ఈ ఘటనపై మరింత సమాచారం తెలియాల్సి ఉంది. ఇది కూడా చదవండి: ఆరు లేన్లుగా ఎన్‌హెచ్-65.. నితిన్ గడ్కరీ హామీ! -
సికింద్రాబాద్ గాంధీ ఆస్పత్రిలో అగ్నికీలలు
సాక్షి, హైదరాబాద్: సికింద్రాబాద్ గాంధీ ఆస్పత్రిలో బుధవారం అగ్ని ప్రమాదం సంభవించింది. సెల్లార్‌లోని విద్యుత్ ప్యానల్ బోర్డులో షార్ట్‌సర్క్యూట్ కావడంతో కేబుళ్లకు మంటలు అంటుకుని క్షణాల్లో అయిదో అంతస్తుకు వరకూ విస్తరించాయి. దట్టమైన పొగతో మంటలు చెలరేగడంతో ఆయా వార్డుల్లో చికిత్స పొందుతున్న రోగులతోపాటు వైద్యులు, సిబ్బంది తీవ్ర భయాందోళనతో హాహాకారాలు చేస్తూ బయటకు పరుగులు తీశారు. అప్రమత్తమైన సెక్యూరిటీ సిబ్బంది, అధికారులతో పాటు ఆస్పత్రి ప్రాంగణంలోని ఫైర్ స్టేషన్‌కు సమాచారం అందించారు. ఘటన స్థలానికి చేరుకున్న అగ్నిమాపక సిబ్బంది, పోలీసులు, సెక్యూరిటీ గార్డులు మంటలను అదుపు చేశారు. ఎవరికీ ఎలాంటి ప్రాణాపాయం జరగలేదు. బయటపడి.. ఊపిరి పీల్చుకుని.. ► బుధవారం ఉదయం 7.30 గంటల సమయం. ఆస్పత్రి సెల్లార్‌లోని ఎలక్ట్రికల్ విభాగంలోని విద్యుత్ ప్యానల్‌బోర్డులో నిప్పురవ్వలు ఎగిసిపడ్డాయి. ప్రతి అంతస్తుకు అనుసంధానం చేసిన విద్యుత్ తీగలు, కేబుళ్లకు మంటలు అంటుకుని నిలువుగా అయిదో అంతస్తు వరకు వ్యాపించాయి. విద్యుత్ సరఫరా నిలిపివేయడంతో చిమ్మచీకట్లు అలముకున్నాయి. ► దట్టమైన పొగలను గమనించిన రోగులు, సిబ్బంది భయాందోళనతో మెట్లు, ర్యాంపు మార్గాల ద్వారా బయటకు పరుగులు తీశారు. ఈ క్రమంలో కొంతమంది రోగులు కిందపడి స్వల్ప గాయాల పాలయ్యారు. గ్రౌండ్‌ఫ్లోర్, మొదటి అంతస్తులోని గైనకాలజీ, చిన్నపిల్లల (పీడియాట్రిక్) వార్డుల్లో చికిత్స పొందుతున్న గర్భిణులు, బాలింతలు, పీఐసీయూ, ఎన్ఐసీయూల్లోని శిశువులను తీసుకుని వార్డుల నుంచి బయటపడి ఊపిరి పీల్చుకున్నారు. ► అగ్నిమాపక, పోలీస్, సెక్యూరిటీ సిబ్బంది సుమారు 40 నిమిషాల పాటు తీవ్రంగా శ్రమించి మంటలను అదుపు చేశారు. డీఎంఈ రమేష్‌రెడ్డి గాంధీ ఆస్పత్రిని సందర్శించి ప్రమాదంపై ఆరా తీశారు. చేపట్టాల్సిన చర్యలపై సూపరింటెండెంట్ రాజారావు, వైద్యులతో కలిసి సమీక్షించారు. విద్యుత్ అంతరాయంతో వైద్యసేవల్లో జాప్యం ఏర్పడింది. పలు శస్త్రచికిత్సలను వాయిదా వేశారు. పురాతన కేబుళ్లతో ప్రమాదాలు.. గాంధీఆస్పత్రి నిర్మాణ సమయంలో ఏర్పాటు చేసిన విద్యుత్ కేబుళ్ల వ్యవస్థ శిధిలావస్థకు చేరుకోవడంతో తరచూ షార్ట్‌సర్క్యూట్‌తో అగ్ని ప్రమాదాలు సంభవిస్తున్నాయని నిపుణులు అభిప్రాయపడ్డారు. వైర్లు, కేబుళ్లను ఎలుకలు, పందికొక్కులు కొరికివేయడంతో విద్యుత్ వ్యవస్థ ఛిన్నాభిన్నమైంది. అగ్నిప్రమాదాల కారణంగా లక్షలాది రూపాయల విలువైన వైద్యపరికరాలు దగ్ధమవు తున్నా ఆస్పత్రి పాలనా యంత్రాంగం సరైన రీతిలో స్పందించడంలేదనే విమర్శలు వినిపిస్తున్నాయి. అక్కరకురాని అగ్నిమాపక పరికరాలు.. గాంధీఆస్పత్రిలో ఫైర్ ఫైటింగ్ సిస్టం పూర్తిగా నిరుపయోగంగా మారింది. ఆస్పత్రి ప్రారంభినప్పుడు ఏర్పాటు చేసిన పరికరాలు తుప్పుపట్టి మూలనపడ్డాయి. ఫైర్ ఎంగ్విస్టర్లు పనిచేయడంలేదు. నూతన ఫైర్ సిస్టం ఏర్పాటు చేసేందుకు రూపొందించిన ప్రతిపాదనలు బుట్టదాఖలయ్యాయి. ఆస్పత్రి పాలనా యంత్రాంగం పలుమార్లు ఈ విషయమై వైద్య ఉన్నతాధికారులు, ప్రభుత్వానికి లేఖలు రాసినా ఫలితం లేకపోవడం గమనార్హం. ఘటనపై మంత్రి తలసాని ఆరా గాంధీఆస్పత్రిలో అగ్ని ప్రమాద ఘటనపై మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ ఆరా తీశారు. హుజూరాబాద్ ఎన్నికల ప్రచారంలో ఉన్న ఆయన ప్రమాద సమాచారం తెలిసిన వెంటనే గాంధీ సూపరింటెండెంట్ రాజారావుకు ఫోన్ చేసి వివరాలు అడిగి తెలుసుకున్నారు. నగరానికి చేరుకున్న వెంటనే గాంధీఆస్పత్రిని సందర్శిస్తానన్నారు. వైద్యసేవలు యథాతథం.. నార్త్‌బ్లాక్‌లోని ఆయా విభాగాల్లో చికిత్స పొందుతున్న రోగులను సౌత్ బ్లాక్‌కు తరలించి వైద్యసేవలు అందిస్తున్నాం. అగ్ని ప్రమాదాన్ని గుర్తించి 20 నిమిషాల్లో మంటలను అదుపు చేయించాం. వైద్య సేవలు యథావిధిగా కొనసాగుతాయి. – రాజారావు, గాంధీ ఆస్పత్రి సూపరింటెండెంట్ అంధకారంలోనే పరిపాలనా విభాగం, వార్డులు.. ► అగ్ని ప్రమాదంతో గాంధీ ఆస్పత్రిలో చిమ్మచీకట్లు అలముకున్నాయి. సుమారు గంటన్నర సమయం తర్వాత కొన్ని బ్లాకుల్లో విద్యుత్ సరఫరాను పునరుద్ధరించారు. నార్త్‌బ్లాక్ మొత్తం చీకట్లోనే ఉంది. విద్యుత్ అంతరాయంతో నార్త్‌బ్లాక్‌లోని ప్లాస్టిక్ సర్జరీ, ఆర్థోపెడిక్, ఈఎన్టీ ఆపరేషన్ థియేటర్లు మూతపడ్డాయి. ► సూపరింటెండెంట్ పేషీ, ఆరోగ్యశ్రీ, మెడికల్ రికార్డు సెక్షన్, ఆర్ఎంఓ, నర్సింగ్ సూపరింటెండెంట్, శానిటేషన్, ఎస్టాబ్లిష్మెంట్, పరిపాలన, బయోమెట్రిక్ విభాగాల పనుల్లో తీవ్ర జాప్యం ఏర్పడనుంది. -
విద్యుద్ఘాతంతో ఏనుగు మృతి
విజయనగరం(సాలూరు): విద్యుద్ఘాతంతో ఓ ఏనుగు మృతి చెందింది. విజయనగరం జిల్లా సాలూరు మండలం గాదిపిల్లివలస గ్రామ సమీపంలో గంగులు అనే రైతుకు చెందిన అరటితోటలో ఈ ఘటన చోటుచేసుకుంది. పంటపొలాలకు విద్యుత్ సరఫరా చేసే ఎల్టీలైన్ వైర్లు దిగువగా ఉండటం వల్లనే ఈ ప్రమాదం జరిగిందని అధికారులు భావిస్తున్నారు. అటవీ అధికారులు సంఘటన స్థలానికి చేరుకొని దర్యాప్తు చేపట్టి, ఏనుగుకు పోస్టుమార్టం నిర్వహించారు. కాగా, దానితోపాటు ఉన్న చిన్న ఏనుగును వైల్డ్‌లైఫ్ ప్రొటక్షన్‌యాక్ట్ 1972 ప్రకారం తిరిగి వచ్చిన ప్రదేశానికి తరలించేందుకు చర్యలు తీసుకుంటామని అధికారులు తెలిపారు.