సాక్షి, హైదరాబాద్: సుప్రీంకోర్టు ధర్మాసనం హజరత్ హుస్సేన్ షావలీ దర్గా మణికొండ జాగీర్ భూముల విషయంలో ఇచ్చిన ఆదేశాలపై అప్పీల్‌కు వెళ్తామని రాష్ట్ర వక్ఫ్‌బోర్డు చైర్మన్ మహ్మద్ సలీం స్పష్టం చేశారు. మంగళవారం హైదరాబాద్ హజ్‌హౌస్‌లోని రాష్ట్ర వక్ఫ్ బోర్డు కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లా డారు. దర్గా భూముల అంశాన్ని సీరియస్‌గా తీసుకుంటామన్నారు. కోర్టు ఆదేశాలపై న్యాయ నిపుణలతో సమీక్షి స్తామని చెప్పారు. ఆ 1,654 ఎకరాల 32 గుంటల భూమి వక్ఫ్‌బోర్డుదేనని, అందుకు ఆధారాలు, సర్వే నివేదికలు తమ వద్ద ఉన్నాయని పేర్కొన్నారు.
గతంలో వక్ఫ్ ట్రిబ్యునల్, రాష్ట్ర హైకోర్టు కూడా అవి వక్ఫ్ భూములేనని తేల్చి చెప్పిందని గుర్తు చేశారు. సుప్రీంకోర్టు ఆదేశాల్లో గెజిట్‌ను రద్దు చేయలేదని, మరోవైపు కట్టడాలకు సంబంధించి వక్ఫ్ బోర్డుకు పరిహారం చెల్లించాలని ప్రభు త్వాన్ని ఆదేశించిందన్నారు. ఒక్క సారి భూమి వక్ఫ్ అయితే ప్రపంచం అంతం వరకు అలానే ఉంటుందని స్పష్టం చేశారు. న్యాయ వ్యవస్థపై నమ్మకంతో అప్పీల్‌కు వెళ్తున్నట్లు వెల్లడించారు. మణి కొండతోపాటు శామీర్‌పేట వక్ఫ్ భూములూ బోర్డువేనని చెప్పారు. గతంలో టీడీపీ, కాంగ్రెస్ హయాంలోనే పెద్ద ఎత్తున వక్ఫ్ భూములు అన్యాక్రాంత మయ్యాయని ఆరోపించారు.
Comments
Please login to add a commentAdd a comment