lands issue
-
సీఎం జగన్ నూజివీడు పర్యటన.. భూముల పట్టాలు పంపిణీ
సాక్షి, అమరావతి: ఆంక్షలు, వివాదాల్లో ఇరుక్కుపోయిన భూముల సమస్యలను ఒక్కొక్కటిగా పరిష్కరించిన సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి ఆ దిశగా మరో కీలక ముందడుగు వేస్తున్నారు. భూములకు సంబంధించి కొద్ది నెలలుగా ప్రభుత్వం తీసుకున్న కీలక నిర్ణయాలను అమల్లోకి తెస్తూ శుక్రవారం ఏలూరు జిల్లా నూజివీడులో నిర్వహిస్తున్న బహిరంగ సభలో సీఎం జగన్ పాల్గొననున్నారు. దళితులు, పేదల జీవితాలు పూర్తిగా మారిపోయే అత్యంత కీలకమైన 12 అంశాలు ఇందులో ఉన్నాయి. నిరుపేదలకు భూముల పంపిణీని ప్రారంభించడంతోపాటు అసైన్డ్ భూములకు యాజమాన్య హక్కులు కల్పించడం, లంక భూములకు పట్టాలతోపాటు చుక్కల భూములు, షరతుల గల పట్టా భూములు, సర్వీస్ ఈనాం భూములను 22 ఏ జాబితా నుంచి తొలగించడం, దళిత వాడలకు శ్మశాన వాటికలు కేటాయిస్తూ పత్రాలు ఇవ్వడం, భూమి కొనుగోలు పథకం కింద ఇచ్చిన భూములపై హక్కుల కల్పన, గిరిజనులకు ఆర్ఓఎఫ్ఆర్ పట్టాల పంపిణీని సీఎం జగన్ ఈ సభలో ప్రారంభించనున్నారు. 46 వేల ఎకరాలకుపైగా పంపిణీ రాష్ట్రంలో సుదీర్ఘకాలం తర్వాత భూముల పంపిణీని ముఖ్యమంత్రి జగన్ చేపడుతున్నారు. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీలను ఆర్థికంగా మెరుగైన స్థితికి చేర్చడమే లక్ష్యంగా భూ పంపిణీకి శ్రీకారం చుట్టారు. రాష్ట్రవ్యాప్తంగా 46,463.82 ఎకరాలను వ్యవసాయం కోసం కొత్తగా 42,307 మందికి డీకేటీ పట్టాలుగా ఇవ్వనున్నారు. జిల్లాల వారీగా అందుబాటులో ఉన్న ప్రభుత్వ భూములను గుర్తించి ఇప్పటికే పంపిణీకి అసైన్మెంట్ కమిటీల ఆమోదం తీసుకున్నారు. డీకేటీ పట్టాలతోపాటు ఎఫ్ఎంబీ, అడంగల్ కాపీలు కూడా జారీ అయ్యాయి. వాటిని అర్హులకు ఇచ్చే కార్యక్రమాన్ని సీఎం ప్రారంభించనున్నారు. లంక భూములకు పట్టాలు దశాబ్దాల నాటి లంక భూముల సమస్యను పరిష్కరించి అర్హులైన రైతులకు పట్టాలు ఇవ్వనున్నారు. ఏళ్ల తరబడి వీటిని సాగు చేసుకుంటున్నా పత్రాలు లేకపోవడంతో రైతు భరోసా, ఇన్పుట్ సబ్సిడీ, పంటల బీమా లాంటి ప్రయోజనాలు అందుకోలేకపోతున్నారు. ఎనిమిది జిల్లాల్లో విస్తరించిన లంక గ్రామాల్లోని 9,064 ఎకరాలు 17,768 మంది రైతుల సాగులో ఉన్నట్లు ఎంజాయ్మెంట్ సర్వే ద్వారా గుర్తించారు. ఏ, బీ కేటగిరీ లంక భూములకు డీకేటీ పట్టాలతోపాటు సీ కేటగిరీ భూములకు లీజు పట్టాల పంపిణీని సీఎం ప్రారంభించనున్నారు. సర్వీస్ ఈనాం భూములపై ఆంక్షల తొలగింపు ఏళ్ల తరబడి గ్రామాల్లో వివాదాస్పదంగా ఉన్న సర్వీస్ ఈనాం భూముల సమస్యను సైతం సీఎం వైఎస్ జగన్ ప్రభుత్వం పరిష్కరించింది. 1,61,584 మంది రైతులకు సంబంధించి 1,58,113 ఎకరాలను నిషేదిత జాబితా నుంచి తొలగించారు. గతంలో ఈనాం చట్టం ప్రకారం దేవదాయ భూములను 22 ఏ జాబితాలో పొందుపరచినప్పుడు కుల వృత్తులు చేసుకునే వారికిచ్చిన సర్వీస్ ఈనాం భూములు కూడా పొరపాటున అందులో చేరిపోయాయి. అప్పటి నుంచి వాటిపై ఆంక్షలు తొలగించకపోవడంతో లక్షలాది మంది రైతులు ఇబ్బందులు పడుతున్నారు. ఇప్పుడు కుమ్మరి, కమ్మరి, రజక, నాయీ బ్రాహ్మణులు తదితర వృత్తుల వారికి కేటాయించిన సర్వీస్ ఈనాం భూములపై ఆంక్షలు తొలగిపోయాయి. దళిత వాడలకు శ్మశాన వాటికలు శ్మశాన వాటికలు లేని దళిత వాడలు ఉండరాదనే ఉద్దేశంతో ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. రాష్ట్రంలో 1,563 గ్రామాల్లో 951 ఎకరాల ప్రభుత్వ భూమిని శ్మశాన వాటికల కోసం కేటాయించారు. ఈ భూమిని ఇప్పటికే ఆయా గ్రామ పంచాయతీలకు అప్పగించారు. 2.06 లక్షల ఎకరాల చుక్కల భూములకు విముక్తి గత సర్కారు తప్పిదాలతో వివాదాస్పదంగా మారిన చుక్కల భూముల సమస్యను వైఎస్సార్సీపీ ప్రభుత్వం సునాయాసంగా పరిష్కరించింది. ఒకేసారి 15 జిల్లాల్లో 2.06 లక్షల ఎకరాల చుక్కల భూములను నిషేధిత ఆస్తుల జాబితా నుంచి తొలగించింది. తద్వారా సంబంధిత రైతులకు తమ భూములపై సర్వ హక్కులు లభించాయి. ఈ సమస్య పరిష్కారంతో చాలా ఏళ్లుగా నిలిచిపోయిన రిజిస్ట్రేషన్లు ఇప్పుడు జరుగుతున్నాయి. పంట రుణాలు కూడా వస్తున్నాయి. రాష్ట్ర చరిత్రలో లక్షల ఎకరాల భూములకు విముక్తి కల్పించడం ఇదే తొలిసారి. వాటిని రైతులు స్వేచ్ఛగా అమ్ముకునే హక్కు కల్పించడంతోపాటు రుణాలు పొందేందుకు ఎటువంటి ఇబ్బంది లేకుండా ప్రభుత్వం చర్యలు తీసుకుంది. షరతుల పట్టా భూముల సమస్యకు పరిష్కారం సమస్యాత్మకంగా మారిన షరతుల గల పట్టా భూములకు ప్రభుత్వం పరిష్కారం చూపింది. 33 వేల ఎకరాల షరతుల గల పట్టా భూములను నిషేధిత ఆస్తుల జాబితా నుంచి తొలగించి రైతులకు మేలు చేకూర్చింది. బ్రిటీష్ హయాం నుంచి రైతుల చేతుల్లో ఉన్న భూములను టీడీపీ పాలనలో 22 ఏ కేటగిరీలో చేర్చారు. ఈ అన్యాయాన్ని సరిదిద్దుతూ నిబంధనల ప్రకారమే వాటిని ఆ జాబితా నుంచి ప్రభుత్వం తొలగించింది. 17,730 సర్వే నెంబర్లకు సంబంధించి 33 వేలకుపైగా ఎకరాలను 22ఏ జాబితా నుంచి తీసివేసింది. ఒక్క కృష్ణా జిల్లా అవనిగడ్డ నియోజకవర్గంలోనే 18 వేలకుపైగా ఎకరాలను 22ఏ నుంచి తొలగించడం గమనార్హం. భూమి కొనుగోలు పథకం భూములకు హక్కులు భూమి లేని నిరుపేద దళితులకు భూమి కొనుగోలు పథకం ద్వారా ఇచ్చిన భూములపైనా అమలులో ఉన్న ఆంక్షలను ప్రభుత్వం తొలగించింది. ఆ భూములు ఎస్సీ కార్పొరేషన్ తనఖాలో ఉండడంతో వాటిని నిషేధిత జాబితాలో చేర్చారు. దీనికి సంబంధించి 22,837 ఎకరాలకు ఇప్పుడు విముక్తి లభించడంతో 22,346 మంది దళితులకు మేలు జరిగింది. సీఎం వైఎస్ జగన్ ఈ సమస్య తన దృష్టికి రాగానే సత్వరమే పరిష్కరించారు. అసైన్డ్ భూములపై హక్కులు రాష్ట్రంలో తొలిసారిగా అసైన్డ్ భూములకు యాజమాన్య హక్కులు కల్పించేందుకు వాటిని 22 ఏ జాబితా నుంచి తొలగిస్తున్నారు. భూములున్నా వాటికి విలువ లేకుండాపోవడంతో హక్కులు కల్పించాలని దీర్ఘకాలంగా దళిత, పేద రైతులు కోరుతున్నా గత ప్రభుత్వాలు పట్టించుకోలేదు. ఈ నేపథ్యంలో విస్తృత అధ్యయనం, ఇతర రాష్ట్రాల్లో విధానాలపై ప్రజాప్రతినిధుల కమిటీ ఇచ్చిన నివేదిక ప్రకారం అసైన్మెంట్ జరిగి 20 ఏళ్లు పైబడిన భూములపై పేదలకు పూర్తి యాజమాన్య హక్కులు కల్పించాలని నిర్ణయించిన రాష్ట్ర ప్రభుత్వం ఆ మేరకు చట్ట సవరణ చేసింది. ఒరిజినల్‌గా భూముల పొందిన రైతులకు హక్కులు ఇవ్వాలని నిర్ణయించి అమలు చేయడం ప్రారంభించింది. దీనివల్ల రాష్ట్రవ్యాప్తంగా 15,21,160 మంది ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ వర్గాలకు చెందిన పేద రైతులు తమకు అసైన్ అయిన 27,41,698 ఎకరాలపై పూర్తి యాజమాన్య హక్కులు పొందనున్నారు. ఆ భూములను నిషేధిత ఆస్తుల జాబితా నుంచి తొలగించారు. నేడు నూజివీడుకు సీఎం జగన్ సాక్షి ప్రతినిధి, ఏలూరు: భారీ భూ పంపిణీ కార్యక్రమానికి నేడు నూజివీడు వేదికగా సీఎం జగన్ శ్రీకారం చుట్టనున్నారు. ఒక్క ఏలూరు జిల్లాలోనే 10,303 మందికి 12,886.37 ఎకరాల భూమిని శాశ్వత హక్కుతో అందించనున్నారు. 31 గ్రామాల్లో ఎస్సీ శ్మశాన వాటికలకు 33.32 ఎకరాలను ఇదే వేదిక నుంచి మంజూరు చేయనున్నారు. శుక్రవారం సీఎం జగన్ నూజివీడు రాక సందర్భంగా హెలీప్యాడ్, బహిరంగ సభ వద్ద భద్రతా ఏర్పాట్లను ఎమ్మెల్యే మేకా వెంకట ప్రతాప అప్పారావు, కలెక్టర్ వై.ప్రసన్న వెంకటేష్, ఎస్పీ డి.మేరిప్రశాంతి ఏర్పాట్లను పర్యవేక్షించారు. సీఎం పర్యటన ఇలా.. ► ఉదయం 10.25 గంటలకు నూజివీడులోని హెలీప్యాడ్‌కు చేరుకుని ప్రజాప్రతినిధులు, స్థానిక నాయకులతో మాట్లాడతారు. ► 10.55 గంటలకు సభా ప్రాంగణానికి చేరుకుని వివిధ శాఖలు ఏర్పాటు చేసిన ఎగ్జిబిషన్ స్టాల్స్, ఫొటో ఎగ్జిబిషన్‌ను తిలకిస్తారు. ► 11.10 నుంచి 12.25 గంటల వరకు భూ పంపిణీ కార్యక్రమంలో పాల్గొని పట్టాలు పంపిణీ చేసి సభలో ప్రసంగిస్తారు. ► 12.50 గంటలకు హెలీప్యాడ్‌కు చేరుకుని స్థానిక నాయకులు, ప్రజలను కలుసుకుంటారు. అనంతరం 1.55 గంటలకు తాడేపల్లి పయనం కానున్నారు. గోడు విన్నారు.. పోడు భూములిచ్చారు సాక్షి, అమరావతి: గిరిజనుల గోడును ఆలకించి నేను ఉన్నానంటూ భరోసా ఇచ్చిన ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి పోడు భూములకు అటవీ హక్కుల గుర్తింపు చట్టం(ఆర్వోఎఫ్ఆర్ యాక్ట్) ద్వారా పట్టాలిచ్చి రికార్డు సృష్టించారు. గిరిజనులకు పోడు భూముల పంపిణీలో దేశంలోనే ఆంధ్రప్రదేశ్‌ను ఆదర్శంగా నిలిపారు. 2008 నుంచి 2019 వరకు గత ప్రభుత్వాలు 95,649 గిరిజన కుటుంబాలకు 2,33,410 ఎకరాలకు ఆర్వోఎఫ్ఆర్ పట్టాలిచ్చాయి. వీటిల్లో గత పదకొండేళ్లలో ఇచ్చిన మొత్తం పట్టాల్లో అత్యదికంగా మాజీ ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్‌రెడ్డి పంపిణీ చేసినవే కావడం గమనార్హం. వాస్తవానికి పోడు భూములకు పట్టాల పంపిణీకి శ్రీకారం చుట్టింది కూడా వైఎస్సారే. సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి బాధ్యతలు చేపట్టిన నాటి నుంచి గత నాలుగున్నరేళ్లలో ఏకంగా మొత్తం 1,30,368 కుటుంబాలకు 2,87,710 ఎకరాలకు పట్టాలిచ్చి పేదలకు మేలు చేయడంలో తండ్రి కంటే రెండు అడుగులు ముందుంటానని నిరూపించుకున్నారు. వీటిలో 1,29,842 మందికి 2,19,763 ఎకరాలు, 526 సామూహిక(కమ్యూనిటీ) టైటిల్స్ ద్వారా 67,947 ఎకరాల పోడు భూములకు పట్టాలుగా పంపిణీ చేయడం విశేషం. డీకేటీ పట్టాల పంపిణీ.. గిరిజన ప్రాంతాల్లో ప్రభుత్వ భూమిని (రిజర్వ్ ఫారెస్ట్ కాని భూమి) వారు సాగు చేసుకొని జీవించేలా రాష్ట్ర ప్రభుత్వం డీకేటీ పట్టాల రూపంలో పంపిణీ చేస్తుంది. గత నాలుగున్నరేళ్ల కాలంలో ఈ కార్యక్రమం ద్వారా 26,287 మంది గిరిజనులకు 39,272 ఎకరాల భూమిని పంపిణీ చేయడం గమనార్హం. పునర్విచారణతో లబ్ధి అడవులు, గ్రామ పొలిమేర (సరిహద్దు) భూములు తదితర కారణాలతో గత ప్రభుత్వాల హయాంలో 73,469 మంది గిరిజనుల దరఖాస్తులను తిరస్కరించారు. తమకు పట్టాలివ్వాలని గిరిజనులు గోడు వెళ్లబోసుకోవడంతో వైఎస్సార్సీపీ ప్రభుత్వం వచ్చాక పునర్విచారణ చేసి పట్టాలిచ్చే కార్యక్రమాన్ని చేపట్టింది. ఇప్పటివరకు అల్లూరి సీతారామరాజు జిల్లా పరిధిలో సుమారు 25,380 దరఖాస్తులపై పునర్విచారణ జరిపి 40,930 ఎకరాలను పట్టాలుగా ఇచ్చారు. గతంలో తిరస్కరణకు గురైన పోలవరం ముంపు గ్రామాలకు చెందిన దరఖాస్తులను సైతం పునఃపరిశీలించి 2,372 గిరిజన కుటుంబాలకు 6,407 ఎకరాలను పోడు వ్యవసాయం కోసం పట్టాలుగా ఇచ్చారు. ఇంకా పెండింగ్‌లో ఉన్న దరఖాస్తులపై పునర్విచారణ జరిపి అర్హత ఉన్న వారికి న్యాయం చేయాలని ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ఆదేశించడం గమనార్హం. పెద్దమనసు చాటుకున్న జగన్ అటవీ భూములకు హక్కు పత్రాల పంపిణీలో మన రాష్ట్రం దేశంలోనే ఆదర్శంగా నిలిచింది. 2005 డిసెంబర్ 13కు ముందు సాగులో ఉన్న అటవీ భూమిపై మాత్రమే పోడు భూమి హక్కులను గుర్తించేలా చట్టం ఉంది. పట్టాలు పంపిణీకి శ్రీకారం చుట్టిన 2008 జనవరి 1 నుంచి ఆ చట్టాన్ని పొడిగించాలని, దానివల్ల ఎక్కువ మంది గిరిజనులకు మేలు జరుగుతుందని కేంద్ర ప్రభుత్వాన్ని కోరుతూ సీఎం జగన్ లేఖ రాశారు. ఇది పేద గిరిజనులపై సీఎం జగన్‌కు ఉన్న ప్రేమ, పెద్దమనసుకు నిదర్శనం. ఏజెన్సీ ప్రాంతంలో పట్టా భూములు, సొంత భూముల సాగులో గిరిజన రైతులను ప్రభుత్వం అన్ని విధాలుగా ప్రోత్సహిస్తోంది. రాష్ట్రంలో 3,40,043 మంది గిరిజన రైతులకు రైతు భరోసా పథకం ద్వారా సుమారు రూ.484.02 కోట్లు వారి ఖాతాలకే జమ చేసి అండగా నిలిచారు. రైతు భరోసా అందుకునే గిరిజన రైతుల సంఖ్య 2019–20లో 2,82,871 మంది కాగా.. ఇప్పుడు ఆ సంఖ్య 3,40,043కు పెరిగింది. ఎటువంటి పక్షపాత ధోరణి లేకుండా అర్హులైన వారందరికీ లబ్ధి చేకూర్చాలన్నదే సీఎం జగన్ ఉద్దేశం. –పీడిక రాజన్నదొర, ఉపముఖ్యమంత్రి రీ సర్వే మహాయజ్ఞం రాష్ట్రంలో వివాదరహితంగా భూ యాజమాన్య హక్కులు, క్లియర్ టైటిలింగ్ వ్యవస్థ అమలు కోసం నిర్వహిస్తున్న వైఎస్సార్ జగనన్న శాశ్వత భూహక్కు, భూరక్ష పథకం విజయవంతంగా అమలు జరుగుతోంది. దీనిద్వారా ప్రభుత్వ హామీతో శాశ్వత ఆస్తి హక్కు పత్రాన్ని భూ యజమానికి ఇస్తున్నారు. ఈ కార్యక్రమం కోసం 10,185 మంది గ్రామ సర్వేయర్లు, 2688 మంది వీఆర్ఓలు, 5417 మంది పంచాయతీ కార్యదర్శులు, 3786 మంది ప్లానింగ్ కార్యదర్శులు, 679 మంది మొబైలు మేజిస్ట్రేట్ల సేవలను ప్రత్యేకంగా వినియోగిస్తున్నారు. గ్రామ సచివాలయాల్లోనే రిజిస్ట్రేషన్ సేవలు అందిస్తున్నారు. ఇప్పటికే రెండు దశల్లో నాలుగు వేల గ్రామాల్లో భూముల రీ సర్వే పూర్తయింది. ఆయా గ్రామాల్లో రిజిస్ట్రేషన్ సేవలు కూడా అందుబాటులోకి వచ్చాయి. 42.6 లక్షల ఎకరాల భూముల రీ సర్వే పూర్తి కాగా 4.8 లక్షల మ్యుటేషన్లు జరిగాయి. సరిహద్దు వివాదాలకు సంబంధించి 45 వేల కేసులను పరిష్కరించారు. 17.53 లక్షల భూహక్కు పత్రాలు పంపిణీ చేశారు. భూముల సరిహద్దులు గుర్తిస్తూ 49.04 లక్షల రాళ్లు పాతారు. మూడో విడతలో మరో 2 వేల గ్రామాల్లో సర్వేను వచ్చే ఏడాది జనవరి 31కి పూర్తి చేసేలా సన్నాహాలు చేస్తున్నారు. -
ఖమ్మంలో ఉద్రిక్తత.. పోలీసుల లాఠీచార్జ్!
సాక్షి, ఖమ్మం: ఖమ్మం జిల్లాలోని వెలుగుమట్లలో ఉద్రిక్త వాతావరణం చోటుచేసుకుంది. భూదాన్ భూముల్లో పేదలు వేసుకున్న గుడిసెల కూల్చివేతకు రంగం సిద్ధమైంది. ఈ క్రమంలో అక్కడికి వచ్చిన అధికారులను స్థానికులు అడ్డుకున్నారు. దీంతో, ఇరు వర్గాల మధ్య ఘర్షణలు చోటుచేసుకున్నాయి. ఈ నేపథ్యంలో పోలీసులు లాఠీచార్జ్ చేసినట్టు తెలుస్తోంది. వివరాల ప్రకారం.. వెలుగుమట్లలో 147, 148,149 సర్వే నంబర్లలో భూదాన్‌కు సంబంధించిన 62 ఎకరాలు భూమి ఉంది. ఈ క్రమంలో 2014లోనే ఈ భూములకు సంబంధించి స్థానికులు దరఖాస్తు చేసుకున్నారు. అయినప్పటికీ ప్రభుత్వం భూములను ఇవ్వలేదు. దీంతో, పోరాటం కొనసాగుతోంది. తాజాగా, పేదలు అక్కడ వేసుకున్న గుడిసెలను అధికారులు కూల్చివేసే ప్రయత్నం చేస్తున్నారు. ఇది కూడా చదవండి: కటిక చీకట్ల కాంగ్రెస్ కావాలా.. బీఆర్ఎస్ రావాలా: కేటీఆర్ ఇంట్రెస్టింగ్ కామెంట్స్ -
ఉత్తరాంధ్రకు ద్రోహం చేసే కుట్రలు సాగుతున్నాయి : ఎంపీ విజయసాయి రెడ్డి
-
సాదాబైనామా..50 ఏళ్ల హైరానా..! 9.24 లక్షల దరఖాస్తులు పెండింగ్
సాక్షి, హైదరాబాద్: సాదాబైనామా.. తెల్ల కాగితాలపై రాసుకుని జరిపే భూముల క్రయ విక్రయ లావాదేవీలకు పెట్టిన పేరు ఇది. ఈ సాదాబైనామాలు సాధారణమైనవేమీ కాదు.. రామాయణమంత చరిత్ర ఉంది అంటే అతిశయోక్తి కాదు. వందల ఏళ్ల చరిత్ర ఉన్న సాదాబైనామాలు సమస్యల్లో చిక్కుకుని 50 ఏళ్లు గడిచినా ఇంతవరకు శాశ్వత పరిష్కారం మాత్రం లభించడం లేదు. ఇప్పటికీ రాష్ట్రంలో 9.24 లక్షల దరఖాస్తులు సాదాబైనామా కింద పరిష్కారం కోసం పెండింగ్‌లో ఉన్నాయంటే పరిస్థితి ఏంటో అర్థం చేసుకోవచ్చు. ఆర్వోఆర్ (రికార్డ్ ఆఫ్ రైట్స్) చట్టం–1971 అమల్లో ఉన్నప్పుడు 2.4 లక్షల దరఖాస్తులు పెండింగ్‌లో ఉండగా, కొత్త రెవెన్యూ చట్టం (2020) అమల్లోకి వచ్చాక మరో 7 లక్షల దరఖాస్తులు పరిష్కారం కోసం వచ్చాయి. 12 రోజుల్లోనే 7 లక్షల మంది కేవలం తెల్లకాగితంపై రాసుకున్నవి కావడం, ఎలాంటి రిజిస్ట్రేషన్ పత్రాలూ లేకపోవడంతో ఏళ్లు గడిచే కొద్దీ వివాదాలు పెరుగుతూ వచ్చాయి. ఈ నేపథ్యంలోనే సాదాబైనామాల క్రమబద్ధీకరణ మొదలయ్యింది. ఈ క్రమంలో తెలంగాణ రాష్ట్రం ఏర్పాటైన తర్వాత ఇప్పటివరకు రెండుసార్లు సాదాబైనామా దరఖాస్తులు స్వీకరించారు. 2014 జూన్ 2 లోపు తెల్లకాగితాలపై రాసుకున్న లావాదేవీల క్రమబద్ధీకరణ కోసం దరఖాస్తులు ఆహ్వానించగా 2.4 లక్షల మంది దరఖాస్తు చేసుకున్నారు. ఆ దరఖాస్తులు వచ్చి ఏళ్లు గడుస్తున్నా పరిష్కారం లభించలేదు. 2020లో రాష్ట్ర ప్రభుత్వం కొత్త రెవెన్యూ చట్టాన్ని అమల్లోకి తెచ్చింది. అప్పటివరకు అమల్లో ఉన్న ఆర్వోఆర్ చట్టం–1971కి సవరణలు చేసి ఆర్వోఆర్ చట్టం–2020ని అమల్లోకి తెచ్చింది. 2020, అక్టోబర్ 29న ఈ చట్టం అమల్లోకి రాగా, అక్టోబర్ 30 నుంచి నవంబర్ 10 వరకు మరోమారు సాదాబైనామాల క్రమబద్ధీకరణకు అవకాశం కల్పించారు. ఈ 12 రోజుల్లోనే 7 లక్షల మంది తమ సాదాబైనామా లావాదేవీలను క్రమబద్ధీకరించాలని కోరుతూ ప్రభుత్వానికి దరఖాస్తు చేసుకోవడం గమనార్హం. కాగా రెండోసారి దరఖాస్తులు తీసుకున్నప్పుడు కూడా 2014, జూన్ 2నే కటాఫ్ డేట్‌గా నిర్ణయించారు. కానీ ఇప్పటివరకు ఆ 9.4 లక్షల దరఖాస్తులకు మోక్షం లభించలేదు. 1971 చట్టం అమల్లోకి వచ్చిన తర్వాతే.. సాదాబైనామా లావాదేవీలు గతంలో అధికారికంగా చెల్లుబాటు అయ్యేవి. 1948లో హైదరాబాద్ రాష్ట్రంగా ఉన్నప్పుడు హైదరాబాద్ రికార్డ్ ఆఫ్ రైట్స్ యాక్ట్–1948 ప్రకారం సాదాబైనామా లావాదేవీలను తహశీల్దార్లు క్రమబద్ధీకరించే వారు. రిజిస్ట్రేషన్లు, నోటిమాట, తెల్ల కాగితాల ద్వారా జరిగిన భూముల క్రయవిక్రయ లావాదేవీలను పరిగణనలోకి తీసుకుని జమాబందీ ద్వారా తహశీల్దార్లు పట్టాదారు పాస్ పుస్తకం జారీ చేసేవారు. 1970 వరకు ఇదే విధానం అమల్లో ఉంది. ఆ తర్వాత ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో 1948 చట్టాన్ని సవరించి 1971 ఆర్వోఆర్ చట్టాన్ని అమల్లోకి తెచ్చినప్పుడు ఈ సాదాబైనామాల విషయంలో నిబంధనలు మార్చారు. భూమి కొనుగోలు లావాదేవీలపై రిజిస్ట్రేషన్ డాక్యుమెంట్ ఉంటేనే పట్టాదారు పాస్‌పుస్తకం ఇవ్వాలనే నిబంధన పెట్టారు. దీంతో తెల్లకాగితాలు, నోటిమాట లావాదేవీలు అధికారికంగా చెల్లకుండా పోయాయి. ఆ తర్వాత 1989లో ఓసారి 1971 చట్టాన్ని సవరించారు. దీని ప్రకారం తహశీల్దార్లకు సాదాబైనామాలను పరిష్కరించే అధికారం కల్పించారు. అప్పటి నుంచి ఇప్పటివరకు ఈ సవరణ చట్టం ద్వారానే సాదాబైనామాలను క్రమబద్ధీకరిస్తున్నారు. 1989, 2000, 2014, 2020లో నాలుగుసార్లు ఇలా సాదాబైనామాల పరిష్కారానికి దరఖాస్తులు స్వీకరించారు. కొత్త చట్టంలో అధికారాలేవీ..? అయితే 2020లో అమల్లోకి వచ్చిన కొత్త రెవెన్యూ చట్టంలో తహశీల్దార్లకు గానీ, ఇతర ఏ స్థాయి రెవెన్యూ యంత్రాంగానికి గానీ సాదాబైనామాలను పరిష్కరించే అధికారం కల్పించలేదు. అసలు సాదాబైనామాల ప్రస్తావనే లేదని భూచట్టాల నిపుణులు చెపుతున్నారు. కొత్త చట్టం అమల్లోకి వచ్చాక నోటిఫికేషన్ ఇచ్చి మరీ 7 లక్షల దరఖాస్తులు స్వీకరించిన ప్రభుత్వం.. పరిష్కార వ్యవస్థను కొత్త చట్టంలో ఏర్పాటు చేయకపోవడం గమనార్హం. ఇప్పుడు మొత్తం 9.4 లక్షల (20 లక్షల ఎకరాల విస్తీర్ణం ఉంటుందని అంచనా.) సాదాబైనామాల దరఖాస్తులను పరిష్కరించాలంటే చట్ట సవరణే మార్గమని, ఆర్వోఆర్ చట్టం–2020కి సవరణ జరిగేంతవరకు ఈ సాదాబైనామాల క్రమబద్ధీకరణ సాధ్యం కాదని నిపుణులు చెబుతున్నారు. ఇప్పటివరకు వచ్చిన దరఖాస్తుల మాట అలా ఉంచితే... 2014 జూన్ 2 తర్వాత జరిగిన సాదాబైనామాల పరిస్థితి ఏంటనేది అంతుచిక్కని ప్రశ్నగా మారింది. మరి, చట్ట సవరణ, కొత్త దరఖాస్తుల స్వీకరణ, కటాఫ్ డేట్ మార్పు లాంటి అంశాల్లో ప్రభుత్వం ఏం చేస్తుందో..సాదాబైనామాల అంశాన్ని ఎప్పటికి శాశ్వతంగా పరిష్కరిస్తుందో వేచి చూడాల్సిందే. -
అసైన్డ్‌పై రియల్ కన్ను! ఎకరాకు రూ.20 లక్షలకు చెల్లింపు, ధరణిలోనూ
సాక్షి, రంగారెడ్డి జిల్లా: అసైన్డ్ భూములపై కొంత మంది రియల్టర్ల కన్నుపడింది. వీటిని అమ్మడం, కొనడం నేరమని తెలిసినా చేజిక్కించుకునేందుకు ప్రయత్నిస్తున్నారు. ప్రభుత్వం ఎప్పుడైనా వీటిని స్వాధీనం చేసుకోవచ్చని స్థానికంగా ప్రచారం చేస్తూ.. రైతులను భయాందోళనకు గురిచేస్తున్నారు. వీరి నుంచి తక్కువ ధరకు కొల్లగొట్టే కుట్రకు తెరలేపారు. రెవెన్యూ శాఖలోని లొసుగులకు తోడు అధికార పార్టీ పెద్దల అండదండలు వీరికి కలిసొస్తోంది. న్యాయపరమైన చిక్కులు, అధికారులతో ఏ సమస్యలు ఎదురైనా అన్నీ తామే చూసుకుంటామని నమ్మబలుకుతున్నారు. రిజిస్ట్రేషన్‌కు ముందే అసైన్డ్‌దారుల పేరుతో ఎన్ఓసీ సంపాదించి రూ.కోట్లు విలువ చేసే భూములను చవక ధరలకు కొనుగోలు చేస్తున్నారు. ఈ వ్యవహారాన్ని అడ్డుకోవాల్సిన యంత్రాంగం వీరిచ్చే కమీషన్లకు కక్కుర్తి పడి అడ్డగోలుగా ఎన్ఓసీలు జారీ చేసి, రిజిస్ట్రేషన్లు చేస్తున్నట్లు ఆరోపణలు ఉన్నాయి. భూ అగ్రిమెంట్ సమయంలో అసైన్డ్ దారులకు వ్యాపారులునగదు రూపంలో కాకుండా చెక్కుల రూపంలో చెల్లిస్తుండటం గమనార్హం. అబ్దుల్లాపూర్‌మెట్‌లో.. పెద్దఅంబర్‌పేట్‌లోని సర్వే నంబర్ 244లో నాలుగెకరాలు, సుర్మాయిగూడ సర్వే నంబర్ 128లో వంద ఎకరాలకుపైగా, బాటసింగారం సర్వే నంబర్ 10లో సుమారు 20 ఎకరాల అసైన్డ్ భూమి ఉంది. రూ.కోట్లు విలువ చేసే ఈ భూములపై వరంగల్, కరీంనగర్, నల్లగొండ జిల్లాకు చెందిన అధికార పార్టీ నేతలు, అనుచరుల కన్నుపడింది. రెవెన్యూలోని లొసుగులను అడ్డుపెట్టుకుని అసైన్డ్ దారుని పేరుతోనే ఎన్ఓసీ పొందేందుకు యత్నిస్తున్నారు. అగ్రీమెంట్లు చేసుకుని, కొంత అడ్వాన్స్ కూడా ఇస్తున్నట్లు తెలిసింది. అబ్దుల్లాపూర్‌మెట్ కొత్త పోలీసు స్టేషన్ వెనుకభాగంలో సర్వే నంబర్ 283లోని 350పైగా ఎకరాల అసైన్డ్ భూమి ఉంది. ప్రస్తుతం వంద ఎకరాల వరకు ఖాళీగా ఉంది. దీనిపై రియల్టర్ల కన్ను పడింది. మహేశ్వరంలో.. మహేశ్వరం మండలం మహబ్బుత్నగర్లో రంగనాథసాయి పేరిట 9.06 ఎకరాల భూములున్నాయి. ప్రభుత్వం వీటిని 1988లోనే సీలింగ్ భూములుగా గుర్తించి, స్వాధీనం చేసుకుని స్థానిక తహసీల్దార్‌కు అప్పగించింది. ఆ తర్వాత ఇందులోని ఆరెకరాలను అప్పటి ఆర్డీఓ ఉత్తర్వుల (ఎ/ 6345/1987) మేరకు 1989 జనవరిలో భూమిలేని ఆరుగురు పేదలకు అసైన్ చేశారు. మరో 3.06 ఎకరాలను ఇద్దరు ఎక్స్ సర్వీస్మెన్లకు కేటాయించారు. బహిరంగ మార్కెట్లో ప్రస్తుతం దీని విలువ ధర రూ.60 కోట్ల పైమాటే. విలువైన ఈ భూమిపై ఓ ప్రముఖ సంస్థ కన్నుపడింది. పక్కనే ఉన్న తమ భూమిలో అసైన్డ్ భూములను కలిపేసుకుంది. ఇందుకు సంబంధించిన పత్రాలను బ్యాంకులో తనఖా పెట్టి రుణం కూడా తీసుకుంది. ఈ విషయం బ్యాంకు, రెవెన్యూ అధికారులకు తెలిసి ఒత్తిడి చేయడంతో.. తీసుకున్న లోన్ డబ్బులు తిరిగి చెల్లించింది. కానీ సదరు భూమి మాత్రం ఇప్పటికీ సంస్థ ఆధీనంలోనే ఉండటం, స్వాధీనం చేసుకునేందుకు అధికారులు వెనకడుగు వేస్తుండటం విశేషం. ఇబ్రహీంపట్నంలో చెర్లపటేల్‌గూడ రెవెన్యూలోని సర్వే నంబర్ 710లో 83 ఎకరాల భూమిని 70 మందికి అసైన్ చేశారు. కొంత సాగుకు అనుకూలంగా ఉండగా, మరికొంత ప్రతికూలంగా ఉంది. ఈ భూమిని దక్కించుకునేందుకు కొంత మంది రియల్టర్లు యత్నిస్తున్నారు. నల్లగొండ, వరంగల్ జిల్లాలకు చెందిన రాజకీయ నాయకులు, వారి అనుచరులు, వ్యాపారులు ఈ భూములపై కన్నేశారు. స్థానికంగా ఉన్న రెవెన్యూ అధికారులు కూడా వీరికి సహకరిస్తున్నారు. పొల్కపల్లి, దండుమైలారం, రాయపోలు రెవెన్యూ పరిధిలో కూడా అసైన్డ్ భూముల క్రయవిక్రయాలు జోరుగా సాగుతున్నాయి. యాచారంలో.. మొండిగౌరెల్లి, నల్లవెల్లి, కొత్తపల్లి, తక్కెళ్లపల్లి, మా ల్, మంతన్‌గౌరెల్లి రెవెన్యూ పరిధిలో అసైన్డ్ భూము లు అధికంగా ఉన్నాయి. ఇప్పటికే కుర్మిద్ద, తాడిపర్తి, నానక్‌నగర్, నక్కర్తమేడిపల్లిలోని సుమారు పది వేల ఎకరాల అసైన్డ్ భూములను ప్రభుత్వం ఫార్మాసిటీ పేరుతో సేకరించింది. బాధితులకు రూ.8 లక్షలు నష్టపరిహారంగా ఇచ్చింది. ఫార్మాసిటీ భూ సేకరణను బూచిగా చూపిస్తున్న రియల్టర్లు మిగిలిన గ్రామాల్లోని రైతులను భయాందోళనలకు గురి చేస్తున్నారు. రైతుకు ఎకరాకు రూ.17 లక్షలు చెల్లిస్తూ, మరో రూ.2 లక్షలు మధ్యవర్తులు కమీషన్‌గా తీసుకుంటున్నారు. ఇప్పటికే 60– 70 ఎకరాలకు అడ్వాన్స్‌లు కూడా చెల్లించినట్లు సమాచారం. మొండిగౌరెల్లిలో సర్వే నంబర్ 19లో 575.30 ఎకరాలు ఉండగా, సర్వే నంబర్ 68లో 625.20 గుంటలు, సర్వే నంబర్ 127లో 122.22 ఎకరాల భూమి ఉంది. వీటిపై నగరానికి చెందిన కొంత మంది రియల్టర్ల కన్నుపడింది. ఈటల వ్యవహారంతో కలకలం బీజేపీ ఎమ్మెల్యే ఈటల రాజేందర్ కుటుంబానికి చెందిన జమున హేచరీస్ ఆధీనంలో (మెదక్ అచ్చంపేట) ఉన్న ఎనిమిది సర్వే నంబర్లలో 85.19 ఎకరాల అసైన్డ్ భూమిని 65 మంది లబ్ధిదారులకు పంపిణీ చేయడంతో జిల్లాలోని అసైన్డ్ భూముల అమ్మకాలు, కొనుగోలు అంశం మళ్లీ తెరపైకి వచ్చింది. మన జిల్లాలోని 26 మండలాల పరిధిలో 321 గ్రామాల్లో 6,471.03 ఎకరాల అసైన్డ్ భూమి ఉండగా, 5,440 మందికి 6,198.11 ఎకరాలు అసైన్ చేశారు. వీటిలో ఇప్పటికే చాలా భూములు పరాధీనమయ్యాయి. రైతులను మభ్యపెట్టి తక్కువ ధరకు భూములు కొనుగోలు చేసిన రియల్టర్ల నుంచి మళ్లీ భూములు స్వాధీనం చేసుకునేందుకు అనేక మంది యత్నిస్తుండటంతో వీటిని కొనుగోలు చేసిన రియల్టర్లలో ఆందోళన మొదలైంది. అమ్మడం, కొనడం నేరం అసైన్డ్ భూములు అమ్మడం, కొనడం నేరం. వీటిని రిజిస్ట్రేషన్ చేయలేము. అమ్మిన రైతులతో పాటు కొనుగోలు చేసిన వ్యాపారులపై కూడా కేసులు నమోదు చేస్తాం. ఇలాంటి ఘటనలు ఎక్కడ జరిగినా మా దృష్టికి తీసుకువస్తే చర్యలు తీసుకుంటాం. –వెంకటాచారి, ఆర్డీఓ, ఇబ్రహీంపట్నం -
పుప్పాలగూడ భూముల వ్యవహారం.. హైకోర్టులో తెలంగాణ సర్కార్‌కు చుక్కెదురు
సాక్షి, హైదరాబాద్: రంగారెడ్డి జిల్లా పుప్పాలగూడలోని సర్వే నంబరు 335, 336, 338, 340, 341, 342లో 80.25 ఎకరాల కాందిశీకులకు సంబంధించిన భూముల వ్యవహారంలో రాష్ట్ర ప్రభుత్వానికి మరోసారి చుక్కెదురైంది. ఈ భూమిపై కాందిశీకులకు హక్కులు ఉన్నాయంటూ సింగిల్ జడ్జి ఇచ్చిన తీర్పును సవాల్ చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం దాఖలు చేసిన అప్పీళ్లను హైకోర్టు ద్విసభ్య ధర్మాసనం కొట్టివేసింది. అన్ని అంశాలను పరిగణనలోకి తీసుకొనే సింగిల్ జడ్జి తీర్పు ఇచ్చారని, ఆ తీర్పులో జోక్యం చేసుకోమంటూ ఈ మేరకు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సతీష్ చంద్ర శర్మ, జస్టిస్ అభినంద్‌కుమార్ షావిలి ధర్మాసనం ఇటీవల తీర్పునిచ్చింది. కాందిశీకులకు 1956లో కేటాయించిన భూమిని మిగులు భూమిగా పేర్కొంటూ ఏపీఐఐసీకి కేటాయిస్తూ 2008లో రెవెన్యూ శాఖ జీవో జారీచేసింది. ఈ జీవోను సవాల్‌చేస్తూ పలువురు హైకోర్టులో పిటిషన్లు దాఖలు చేశారు. చదవండి👉🏻ఇంగ్లిష్–1 బండిల్లో కెమిస్ట్రీ ప్రశ్నపత్రాలు! ‘వాసుదేవ్‌కు 1956లో ప్రభుత్వం ఈ భూమిని కేటాయించింది. తర్వాత వాసుదేవ్ పలువురికి ఈ భూమిని విక్రయించారు. ఇందులో 11.05 ఎకరాలను 1968లో ఇద్దరు వ్య క్తులు అతని నుంచి కొనుగోలు చేశారు. అయితే ఈ భూమి యూఎల్సీ పరిధిలో ఉందంటూ 2006లో ప్రభుత్వం ఆ మేరకు ప్రొసీడింగ్స్ ఇచ్చింది. వాసుదేవ్‌కు 2006లో నోటీసులు ఇచ్చేందుకు ప్రయత్నించగా ఆ చిరునామాలో లేరని రెవె న్యూ అధికారులు పేర్కొన్నారు. 1998లోనే వాసుదేవ్ చనిపోయారు. ఈ నేపథ్యంలో ప్రభుత్వం చట్టబద్దంగా కేటాయించిన భూమిని నిబంధనలకు విరుద్ధంగా మిగులు భూమిగా చూపించడం, పట్టాదారుకు నోటీసులు ఇవ్వకుండా ఆ కేటాయింపులను రద్దు చేయడం చట్టవిరుద్ధం. ఈ మేరకు ఏపీఐఐసీకి కేటాయిస్తూ ఇచ్చిన జీవోను చట్టవిరుద్ధంగా ప్రకటిస్తున్నాం. కేటాయింపులు రద్దు చేస్తున్నాం’అని సింగిల్ జడ్జి 2017లో తీర్పునిచ్చారు. చదవండి👉 300 మందికి పైగా ఔట్సోర్సింగ్ జేపీఎస్‌లకు ఉద్వాసన -
జీవో111 పరిధిలో సీఎం సంబంధీకుల భూములు
సాక్షి, హైదరాబాద్: జీవో111 పరిధిలోని భూములను సీఎం సంబంధీకులు, ఉమ్మడి కరీంనగర్ జిల్లాకు చెందినవారు కొనుగోలు చేయడం వల్లే.. రాష్ట్ర ప్రభుత్వం ఆ జీవోను ఎత్తేసిందని మాజీ ఎంపీ కొండా విశ్వేశ్వర్‌రెడ్డి అన్నారు. ఇప్పటికే దాదాపు 25 వేల ఎకరాలు చేతులు మారాయని ఆయన ఆరోపించారు. 2014 తర్వాత ఈ పరిధిలో భూములు కొనుగోలు చేసిన ప్రాంతాలను గ్రీన్జోన్లుగా ప్రకటించాలని, అంతకుముందు నుంచి భూములున్న వారిని గ్రీన్‌జోన్ పరిధిలోకి తీసుకురావొద్దని అన్నారు. ఈ ప్రాంతాన్ని ‘సస్టెయినబుల్ డెవలప్మెంట్ జోన్’గా మార్చాలని డిమాండ్ చేశారు. జీవో 111ను ఎత్తేస్తూ రాష్ట్ర కేబినెట్ నిర్ణ యం నేపథ్యంలో కొండా విశ్వేశ్వర్‌రెడ్డి మాట్లాడుతూ.. ఇక్కడ సాగులో ఉన్న కూరగాయలు, వరి ఇతర పంటలకు వాడుతున్న పురుగు, కలుపు నివారణ మందులతోనే కాలుష్యం వ్యాపిస్తోందన్నారు. అందుకే అతి తక్కువ కాలుష్యాన్ని వ్యాప్తి చేసే పరిశ్రమలు పెట్టాలని తాను సూచించినట్లు గుర్తు చేశారు. హిమాయత్‌సాగర్, ఉస్మాన్‌సాగర్ జంట జలాశయాల్లో కాలుష్యాలు చేరకుండా ఇచ్చిన జీవో 111కు, పర్యావరణ పరిరక్షణకు పెద్దగా సంబంధం లేదని, 11కి.మీనుంచి అనేక కాలుష్యకారక పరిశ్రమలు ఉన్నాయని తెలిపారు. 1974లో అప్పటి కేంద్రం తెచ్చిన ‘సెంట్రల్ వాటర్‌యాక్ట్’ను వికారాబాద్ దాకా అమలు చేయాలని డిమాండ్ చేశారు. -
అప్పీల్‌కు వెళ్తాం
సాక్షి, హైదరాబాద్: సుప్రీంకోర్టు ధర్మాసనం హజరత్ హుస్సేన్ షావలీ దర్గా మణికొండ జాగీర్ భూముల విషయంలో ఇచ్చిన ఆదేశాలపై అప్పీల్‌కు వెళ్తామని రాష్ట్ర వక్ఫ్‌బోర్డు చైర్మన్ మహ్మద్ సలీం స్పష్టం చేశారు. మంగళవారం హైదరాబాద్ హజ్‌హౌస్‌లోని రాష్ట్ర వక్ఫ్ బోర్డు కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లా డారు. దర్గా భూముల అంశాన్ని సీరియస్‌గా తీసుకుంటామన్నారు. కోర్టు ఆదేశాలపై న్యాయ నిపుణలతో సమీక్షి స్తామని చెప్పారు. ఆ 1,654 ఎకరాల 32 గుంటల భూమి వక్ఫ్‌బోర్డుదేనని, అందుకు ఆధారాలు, సర్వే నివేదికలు తమ వద్ద ఉన్నాయని పేర్కొన్నారు. గతంలో వక్ఫ్ ట్రిబ్యునల్, రాష్ట్ర హైకోర్టు కూడా అవి వక్ఫ్ భూములేనని తేల్చి చెప్పిందని గుర్తు చేశారు. సుప్రీంకోర్టు ఆదేశాల్లో గెజిట్‌ను రద్దు చేయలేదని, మరోవైపు కట్టడాలకు సంబంధించి వక్ఫ్ బోర్డుకు పరిహారం చెల్లించాలని ప్రభు త్వాన్ని ఆదేశించిందన్నారు. ఒక్క సారి భూమి వక్ఫ్ అయితే ప్రపంచం అంతం వరకు అలానే ఉంటుందని స్పష్టం చేశారు. న్యాయ వ్యవస్థపై నమ్మకంతో అప్పీల్‌కు వెళ్తున్నట్లు వెల్లడించారు. మణి కొండతోపాటు శామీర్‌పేట వక్ఫ్ భూములూ బోర్డువేనని చెప్పారు. గతంలో టీడీపీ, కాంగ్రెస్ హయాంలోనే పెద్ద ఎత్తున వక్ఫ్ భూములు అన్యాక్రాంత మయ్యాయని ఆరోపించారు. -
పార్ట్ B ఓ ట్విస్ట్
సాక్షి, హైదరాబాద్: వివాదాస్పద భూముల పరిష్కారంపై కొత్త మెలిక పడింది. భూరికార్డుల ప్రక్షాళనలో భాగంగా పార్ట్–బీలో చేర్చిన ఈ భూరికార్డులను వారంలో క్లియర్ చేసి అర్హులైన రైతులకు పాసు పుస్తకాలు అందజేయాలని సీఎం కేసీఆర్ ఆదేశించినా ఈ ప్రక్రియ సజావుగా జరిగేటట్లు లేదు. పార్ట్–బీ భూములపై గతంలో విచారణ జరిపిన తహసీల్దార్లు అసెంబ్లీ ఎన్నికల సమయంలో వేరే మండలాలకు బదిలీ అయ్యారు. అయితే, ఈ భూములపై మళ్లీ విచారణ జరిపితేనే నిర్ధారిస్తామని కొత్త తహసీల్దార్లు మెలిక పెడుతున్నారు. అయితే, లోక్‌సభ ఎన్నికల పని ప్రారంభం కావడంతో తహసీల్దార్ల బదిలీలపై సస్పెన్స్ నెలకొంది. పెండింగ్‌లో 12.71 లక్షల ఎకరాలు రాష్ట్రవ్యాప్తంగా గత ఏడాది సెప్టెంబర్ నుంచి ప్రారంభమైన భూరికార్డుల ప్రక్షాళనలో భాగంగా మొత్తం 2.38 కోట్ల ఎకరాలకు సంబంధించిన దస్త్రాలను పరిశీలించి 2.25 కోట్ల ఎకరాల రికార్డులను రెవెన్యూ యంత్రాంగం సరిచేసింది. వివాదాస్పద భూములు, అటవీ, దేవాదాయ, కోర్టు కేసులు, అన్నదమ్ముల పంచాయితీలు, సరిహద్దు వివాదాలు, సివిల్ తగాదాలు, నిషేధిత జాబితా(22ఏ)లో ఉన్న 12.71 లక్షల ఎకరాల భూములను పార్ట్–బీలో చేర్చింది. ఇందులో కొన్ని సర్వే చేయాల్సి రావడం, మరికొన్ని తీవ్ర వివాదాల్లో ఉండటంతో ఎన్నికలకు ముందు తహసీల్దార్లు పకడ్బందీగా విచారణ జరిపారు. దరఖాస్తులను పరిశీలించి స్పాట్ వెరిఫికేషన్ చేయడంతోపాటు పంచనామాలు నిర్వహించారు. అన్నదమ్ముల మధ్య పంచాయితీలున్న భూముల్లో ఇరుపక్షాలను పిలిపించి విచారించారు. అటవీ, దేవాదాయ శాఖలతో లింకు ఉన్న భూముల విషయంలో ఆయా శాఖల నుంచి సర్వే నంబర్లవారీగా నివేదికలు తెప్పించుకున్నారు. అయితే, ఈ నివేదికలకు, రెవెన్యూ రికార్డులకు సరిపోలకపోవడంతో ఆ భూములను సర్వే చేయాలని నిర్ణయించారు. ఈ అంశాలన్నింటి నేపథ్యంలో పార్ట్–బీ భూములను సజావుగా పార్ట్–ఏలో చేర్చాలంటే గతంలో ఆయా భూములపై విచారణ జరిపిన తహసీల్దార్లు ఉంటేనే మంచిదనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. ఎన్నికల పనులు షురూ.. ఎన్నికల ముందు వేరే స్థానాలకు బదిలీ చేసిన తహసీల్దార్లను పాత స్థానాలకు బదిలీ చేసే విషయంలో రాష్ట్ర ప్రభుత్వం ఇంకా నిర్ణయం తీసుకోలేదు. లోక్‌సభ ఎన్నికలు సమీపిస్తున్న నేపథ్యంలో తహసీల్దార్లకు ఎన్నికల పని ప్రారంభమైంది. లోక్‌సభ ఎన్నికల కోసం పోలింగ్స్టేషన్లను హేతుబద్ధీకరించాలని, గ్రామీణ ప్రాంతాల్లో 1,100, పట్టణ ప్రాంతాల్లో 1,300 ఓట్ల కన్నా ఎక్కువ ఉన్న చోట్ల కొత్త పోలింగ్స్టేషన్లను గుర్తించాలని సోమవారమే కేంద్ర ఎన్నికల సంఘం నుంచి ఉత్తర్వులు వచ్చాయి. దీనికితోడు ఈ నెల 26న ఓటర్ల జాబితా ముసాయిదా ప్రకటన వెలువడనుంది. అనంతరం అభ్యంతరాలు, క్లెయిమ్‌లు, తొలగింపు, నమోదు ప్రక్రియను ఫిబ్రవరి 22 వరకు చేపట్టి తుది జాబితా ప్రకటిస్తారు. ఈలోపు లోక్‌సభ ఎన్నికల షెడ్యూల్ కూడా వచ్చే అవకాశాలున్నాయి. ఇప్పుడు తహసీల్దార్లను పాత స్థానాలకు బదిలీ చేసినా మళ్లీ లోక్‌సభ ఎన్నికల సమయంలో బదిలీలు అనివార్యమవుతాయి. ఈ నేపథ్యంలో పార్ట్–బీలో చేర్చిన భూములను సరిదిద్దే ప్రక్రియలో తప్పుదొర్లే అవకాశం తోపాటు జాప్యం జరిగే పరిస్థితులు కనిపిస్తున్నాయి. బదిలీలు చేయాలి ఎన్నికల సందర్భంలో తహసీల్దార్లను సుదూర ప్రాంతాలకు బదిలీ చేశారు. అప్పటి నుంచి కుటుంబాలకు దూరంగా ఉండి తహసీల్దార్లు విధులు నిర్వహించాల్సి వస్తోంది. ఇప్పుడు మళ్లీ లోక్‌సభ ఎన్నికల పేరుతో తహసీల్దార్ల బదిలీలను నిలిపివేయడం వారి మానసిక ఆందోళనకు కారణమవుతోంది. ప్రభుత్వం సహృదయంతో స్పందించి తహసీల్దార్లను ఎన్నికల ముందున్న స్థానాలకు బదిలీ చేయాలి. – వంగా రవీందర్‌రెడ్డి, అధ్యక్షుడు, తెలంగాణ రెవెన్యూ సర్వీసెస్ అసోసియేషన్. -
కోనప్పరెడ్డిగారిపల్లిలోనూ అదే మోసం..!
చంద్రగిరి : జాతీయ రహదారి విస్తరణలో ఇళ్లు, పొలాలు కోల్పోతున్న రైతుల వద్ద ఖాళీ పత్రాలపై సంతకాలు చేయించుకున్న ఘటన పాకాల మండలం కోనప్పరెడ్డిగారిపల్లి, చంద్రగిరి మండలం అగరాల గ్రామంలో ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ‘సాక్షి’ దినపత్రికలో ప్రభుత్వ అధికారుల మోసంపై బుధవారం వచ్చిన కథనంతో బాధితుల్లో చైతన్యం వచ్చింది. కోనప్పరెడ్డిగారిపల్లిలోని సుమారు 80 కుటుంబాల వద్ద అధికారులు ఖాళీ పత్రాలపై సంతకాలు చేయించుకుని మోసం చేసినట్లు గ్రహించిన బాధితులు అందోళనకు సన్నద్ధమయ్యారు. తహసీల్దార్ కార్యాలయాన్ని ముట్టడిస్తాం పూతలపట్టు–నాయుడుపేట జాతీయ రహదారి ఆరులైన్ల రోడ్డు నిర్మాణంలో భాగంగా నిరుపేదలు, నిరక్షరాస్యులైన తమను నట్టేటముంచి, ప్రభుత్వ పెద్దలకు పట్టం కట్టేందుకు అధికారులు తమ పొట్ట కొడుతున్నారన్నారని బాధితులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. రెవెన్యూ అ«ధికారులు తమను బెదిరించి, మోసం చేసి అక్రమంగా సంతకాలు చేయించుకున్నారని తెలిపారు. రెవెన్యూ అధికారులు తమ దగ్గర నుంచి సంతకాలు తీసుకున్న పత్రాలు తిరిగి ఇచ్చేయాలని వారు డిమాండ్ చేస్తున్నారు. లేకుంటే గురువారం పాకాల తహసీల్దార్ కార్యాలయాన్ని ముట్టడిస్తామని హెచ్చరించారు. బాధితులకు ఎమ్మెల్యే చెవిరెడ్డి అండ.. అగరాల, కోనప్పరెడ్డిగారిపల్లిలో రెవెన్యూ అధికారుల మోసాన్ని తెలుసుకున్న చంద్రగిరి ఎమ్మెల్యే డాక్టర్ చెవిరెడ్డి భాస్కర్‌రెడ్డి బుధవారం సాయంత్రం బాధితులతో మాట్లాడారు. కూలికెళ్తే గాని పూటగడవని పేదలను ఇలా మోసం చేయడం సమంజసం కాదన్నారు. విస్తరణ బాధితులకు న్యాయం చేసేందుకు కోర్టును ఆశ్రయిస్తామని హెచ్చరించారు. బాధితులను మోసం చేసి సంతకాలు తీసుకున్న ఖాళీ పత్రాలను వెంటనే తిరిగిచ్చేయాలని ఆయన కోరారు. అనంతరం పాకాలవారిపల్లి, కోనంగివారిపల్లిలోని బాధితులతో ఆయన సమావేశం నిర్వహించారు. -
ప్రజలు, రైతులను ఇబ్బందిపెట్టొద్దు
వైఎస్సార్ సీపీ నేతలు విజయలక్ష్మి, రాజా అన్నవరం భూముల క్రయ, విక్రయాలపై ఈఓ నిలదీత రైతులు, ప్రజలతో కలిసి ఆందోళన కోరుకొండ : గత కొన్నేళ్లుగా కోరుకొండ ప్రజలు, రైతుల స్వాధీనంలో ఉన్న భూములను క్రయ విక్రయాలు చేయకుండా అన్నవరం దేవస్థానం నిలిపివేయడం తగదని వైఎస్సార్సీపీ సీజీసీ సభ్యురాలు జక్కంపూడి విజయలక్ష్మి, పార్టీ యూత్ రాష్ట్ర ఆధ్యక్షుడు జక్కంపూడి రాజా లు అన్నారు. గురువారం కోరుకొండ శ్రీలక్షీ్మనరసింహస్వామివారి కల్యాణం ఎర్పాట్లపై సమీక్షకు వచ్చిన అన్నవరం దేవస్థానం ఈఓ కె. నాగేశ్వరరావుకు రైతులు, ప్రజల సమస్య వివరించారు. స్వామివారికి వివిధ ప్రాంతాల్లో ఉన్న భూములకు రిజిస్ట్రేషన్లు జరుగుతున్నపుడు ఇక్కడి భూముల విక్రయాలు నిలిపివేయడం తగదని నిలదీశారు. ఆడ పిల్ల పెళ్లిళ్లకు ఇండ్లు, పొలాలు కట్నకానుకలుగా ఇచ్చారని, నేడు నిలిచిపోయిన క్రయ విక్రయాల వల్ల కొందరి వివాహాలు నిలిచిపోయాయన్నారు. ఎమ్మెల్యే పెందుర్తి వెంకటేష్, ఎంపీ మురళీమోహ¯ŒSలు ఈ ఇబ్బందులను పట్టించుకోవడం లేదని వారు అన్నారు. కోరుకొండ దేవస్థానికి చెందిన రూ. 58 లక్షల నగదు ఖర్చులపై పూర్తిగా వివరించాలన్నారు. ఈ మేరకు సుమారు గంటకు పైగా ఆందోళన జరిగింది. ఈఓ నాగేశ్వరరావు మాట్లాడుతూ అందరికి న్యాయం జరిగేలా సమస్యను ఉన్నతా«ధికారుల దృష్టికి తీసుకెళ్తానని హామీఇచ్చారు. వివిద పార్టీల నాయకులు, రైతులు, ప్రజలు నక్కా రాంబాబు, తాడి హరిశ్చంద్రప్రసాద్‌రెడ్డి. గరగ మధు, తోరాటి శ్రీను, సూరిశెట్టి భద్రం, అడపా శ్రీనివాస్, రొంగల శ్రీనులతో పాటు, డీఎస్పీ ఏవీఏల్ ప్రసన్నకుమార్ తదితరులున్నారు. -
‘పథకం’తో.. పతనమా?
‘ఎత్తిపోతల’కు భూసేకరణతో బతుకు భారమేనని ఆందోళన ∙ తమ భూములు ఇచ్చేది లేదంటున్న అన్నదాతలు వారంతా చిన్న, సన్నకారు రైతులే.. ఉన్న కొద్దిపాటి భూమే వారికి జీవనాధారం. దానిపైనే వారి ఆశలన్నీ. అయితే ఇప్పటి వరకు ఆనందంగా ఉన్న ఆ రైతుల్లో ఆందోళన నెలకొంది. పురుషోత్తపట్నం ఎత్తిపోతల పథకం నిర్మాణం కోసం తమ భూములు కోల్పోవలసి వస్తుందనే గుబులు మొదలైంది. భూసేకరణ పేరుతో తమ పంట భూములు కోల్పోతే తామంతా వీధిన పడతామని, బతుకు భారమవుతుందని, ఆత్మహత్యలే శరణ్యం అని అన్నదాతలు కన్నీరుమున్నీరవుతున్నారు. భూసేకరణ జాబితా రావడం, అందులో సుమారు 80మంది వరకు రైతులు భూములు కోల్పోతారని తెలియడంతో వారంతా ’కలవరపడుతున్నారు. – పురుషోత్తపట్నం (సీతానగరం) పురుషోత్తపట్నం ఎత్తి పోతల పథకానికి సంబంధించి సుమారు 200 ఎకరాలు భూసేకరణ చేసేందుకు అధికారులు సిద్ధమవుతున్నారు. పది పంపులతో నెలకొల్పుతున్న ఈ పథకం కోసం సుమారు పదికిలో మీటర్ల మేర పైపులై¯ŒS వెళ్లనుంది. ఇందులో సుమారుగా 80 ఎకరాలు ప్రభుత్వ భూమి ఉంటే.. మిగిలింది స్థానిక రైతుల నుంచి సేకరించేందుకు అధికారులు సిద్ధమయ్యారు. భూసేకరణలో రైతులకు చెల్లించే ధర అనుకూలంగా ఉంటే వారికి నగదు చెల్లిస్తామని, లేకుంటే పైప్‌లై¯ŒS భూమి కింద నుంచి వెళుతున్నందున లీజుకి తీసుకుని ప్రభుత్వం నగదు చెల్లిస్తుందని అధికారులు చెబుతున్నారు. పోలవరం ఎడమ కాలువ ఏలేరు రిజర్వాయర్ వరకు 58 కిలోమీటర్లు ఉందని, ఇక్కడ వరకు మూడు ప్యాకేజీలలో రెండు ప్యాకేజీలు పూర్తయ్యాయని, ఒక ప్యాకేజీలో పనులు పూర్తయ్యే సమయానికి కాలువ పనులు పూర్తి చేస్తామని పోలవరం ఎల్ఎంసీ ఎస్ఈ సుగుణాకరరావు ‘సాక్షి’కి తెలిపారు. ఎందుకివ్వాలి.. పురుషోత్తపట్నం ఎత్తిపోతల పథకం వల్ల మాకు ఒరిగేదేమి లేదని, తమ పంట భూములను ఎక్కడో ఉన్న వారి లబ్ధికి ఎందుకు ఇవ్వాలంటూ రైతులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. తమ పంట భూముల నుంచి పైప్‌లై¯ŒS వేసి, తమ భూములను తీసుకుంటే సహించేది లేదని హెచ్చరిస్తున్నారు. మాకు ఉన్న కొద్దిపొలంను ఎవరికోసమో కాజేస్తారా? అంటూ ప్రశ్నిస్తున్నారు. మాకు ఉన్న కొద్దిపాటి పొలాన్ని ఎత్తిపోతల పథకానికి ఇచ్చేది లేదని రైతులు అంటున్నారు. ఆ భూమినైనా ఉంచండి రెండు ఎకరాల భూమి ఉంది. అమ్మాయికి వివాహమైంది. కట్నం గా ఎకరం ఇచ్చా. ఉన్న భూమి నుంచి పైప్‌లై¯ŒSకు తీసుకుంటే నా బతుకేంటి. నా భూమి నాకు ఉంచండి. – కలగర చిన సుబ్బారావు, రామచంద్రపురం ఎలా పోషించాలి ఉన్నది రెండెకరాలు. అప్పు రూ.12 లక్షలు. ఇద్దరు పిల్లలు ఉన్నారు. నా భూమి నుంచి పైప్‌లై¯ŒS వెళుతుంది. ఉన్న భూమి పోతే నా కుటుంబాన్ని ఎలా పోషించాలి. మానోటి వద్ద కూడు లాగవద్దు. – అయినంపూడి వెంకట రామారావు, రామచంద్రపురం బతుకు భారమే.. ఉన్నది ఎకరంన్నర భూమి. అందులో నుంచి ఎత్తిపోతల పథకం పైప్‌లై¯ŒS వెళుతుందని, భూమి తీసుకుంటున్నామని అంటున్నారు. నాకు ఉన్న ఆ భూమే ఆధారం. భూమి తీసుకుంటే బతకడమే చాలా కష్టమవుతుంది. – నందిపాటి పాపారావు, రామచంద్రపురం మరణమే శరణ్యం నాకు ఉన్నదే యాభైసెంట్ల భూమి అందులో నుంచి పైప్‌లై¯ŒS వెళుతుందంటున్నారు. నాకున్న ఆధారం అదే. ఆ భూమి పోతే మరణమే శరణ్యం. దయచేసి నా భూమి పోకుండా చూడండి. – కొండిపాటి వీర వెంకట సత్యనారాయణ, రామచంద్రపురం రోడ్డున పడినట్టే అమ్మాయి, అబ్బాయి, భార్య ఉన్నారు. నాకు ఉన్నది ఎకరం భూమి. అందులో నుంచి పథకం పైప్‌లై¯ŒS వెళుతుందంటున్నారు. ఆ భూమి లేకపోతే కుటుంబమంతా రోడ్డున పడినట్టే. – దుద్దిపూడి వెంకట రామారావు, రామచంద్రపురం జీవించడం కష్టమే.. ఎకరా 30 సెంట్ల భూమి ఉంది. వ్యవసాయ కుటుంబం. అమ్మాయికి వివాహం చేశాం. అప్పు ఇంకా తీరలేదు. అబ్బాయి చదువుకుంటున్నాడు. ఉన్న పొలం పథకంలో పోతే జీవనాధారం పోయినట్టే. – అట్రు పద్మావతి, రామచంద్రపురం ఎలా బతికేది అమ్మాయి, అబ్బాయి. ఇద్దరూ చదువుకుంటున్నారు. ఉన్న పొలం 60 సెంట్లు భూమి. అందులో నుంచి పైప్‌లై¯ŒS వెళుతుంది. మాకున్న ఆ భూమి ప్రభుత్వ తీసుకుంటే మేము ఎలా బతకాలి. – దుర్దిపూడి అనంత పద్మావతి, రామచంద్రపురం -
సెజ్ భూములుండగా.. పేదలవే కావాలా?
తుని : కాకినాడ సెజ్ కోసం సేకరించిన వేలాది ఎకరాల భూములు ఉండగా దివీస్ మందుల పరిశ్రమ కోసం పేద రైతుల భూములను తీసుకుని వారి కడుపు కొట్టడం దారుణమని తుని ఎమ్మెల్యే దాడిశెట్టి రాజా అన్నారు. దివీస్ భూసేకరణకు వ్యతిరేకంగా తొండంగి మండలంలోని తీర ప్రాంతంలో గురువారం నిర్వహించిన సభను పోలీసులు భగ్నం చేశారు. పోలీసుల లాఠీచార్జిలో గాయపడి తుని ఏరియా ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న మట్టా లక్షి్మని ఎమ్మెల్యే రాజా పరామర్శించారు. ఈ సందర్భంగా ఆయన విలేకరులతో మాట్లాడుతూ దివీస్ పరిశ్రమకు సెజ్ భూముల్లో 500 ఎకరాలు కేటాయిస్తే సరిపోతుందన్నారు. ఇందుకు భిన్నంగా కారు చౌకగా పేదల భూములను ధారాదత్తం చేయడానికి ప్రభుత్వం కుట్ర చేస్తోందన్నారు. సెజ్ భూములైతే ఎకరాకు రూ.75 లక్షల చొప్పున చెల్లించాల్సి ఉంటుందన్నారు. అదే పేదల భూములను రూ. 5 లక్షలకు అప్పనంగా కొట్టేయవచ్చనే ఉద్దేశంతో పోలీసులను అడ్డం పెట్టుకున్నారని ఆరోపించారు. ప్రజలకు జరుగుతున్న ఆన్యాయాన్ని ప్రశ్నించిన ఎమ్మెల్యేనైన తనను తీవ్రవాదిగా సీఎం చంద్రబాబు చిత్రీకరిస్తున్నారని రాజా మండిపడ్డారు. ఎమ్మెల్యేగా ప్రజల తరఫున నిలవాల్సిన బాధ్యత తమపై ఉందన్న విషయాన్ని ప్రభుత్వ పెద్దలు గుర్తించక పోవడం వారి అజ్ఞానికి నిదర్శనమన్నారు. పేద రైతుల కోసం ఎంత వరకైనా పోరాటం చేస్తామని స్పష్టం చేశారు. ప్రభుత్వం ప్రజల కోసం పనిచేయాలి తప్ప కార్పొరేట్ కంపెనీల కోసం కాదన్నారు. -
భట్టి విక్రమార్కతో ఏకీభవిస్తున్నా: రేవంత్‌రెడ్డి
కేసీఆర్ అధికారంలోకి వచ్చిన తర్వాతే డీఎల్ఎఫ్ భూముల బదలాయింపు జరిగిందన్న భట్టి విక్రమార్క వాదనతో తాను ఏకీభవిస్తున్నట్లు టీడీఎల్పీ ఉపనేత రేవంత్‌రెడ్డి చెప్పారు. అసెంబ్లీలో భూబాగోతాన్ని లేవనెత్తిన తనను అధికారపక్షం మాట్లాడనివ్వలేదని ఆయన అన్నారు. డీఎల్ఎఫ్ నుంచి అర్హతలు లేని మరో కంపెనీకి భూమిని బదలాయించి, దానికి ప్రతిగా డీఎల్ఎఫ్కు ఖరీదైన భూములు ఇచ్చేశారని ఆయన ఆరోపించారు. కేసీఆర్ నిర్ణయం వల్ల మైహోం కంపెనీ అధినేత రామేశ్వరరావుకు రూ. 300 కోట్ల లబ్ధి చేకూరిందన్నారు. సీఎం కేసీఆర్ విచారణ జరిపిస్తే ఇది కుంభకోణమని తాను నిరూపిస్తానని రేవంత్ సవాలు చేశారు. ఆపరేషన్ బ్లూస్టార్ పేరుతో తన గొంతు నొక్కి, ప్రాణాలు హరించాలని చూస్తే ప్రజాస్వామ్యానికి మంచిది కాదన్నారు. అవినీతి బాగోతం బయటపడుతుందనే అధికారపక్షం మాట్లాడకుండా సభ నుంచి పారిపోయిందని ఎద్దేవా చేశారు. చర్చ ముగిసిపోయిన తర్వాత ఈ వ్యవహారంపై ఫైళ్లను స్పీకర్ వద్ద ఉంచితే ఏం ప్రయోజనం ఉంటుందని ప్రశ్నించారు. ప్రభుత్వం తప్పు చేసిందన్న తమ వాదనను కాంగ్రెస్ ఎమ్మెల్యే భట్టి విక్రమార్క నిరూపించారని రేవంత్ రెడ్డి చెప్పారు.