-
‘ఎత్తిపోతల’కు భూసేకరణతో బతుకు భారమేనని ఆందోళన
-
∙ తమ భూములు ఇచ్చేది
-
లేదంటున్న అన్నదాతలు
వారంతా చిన్న, సన్నకారు రైతులే.. ఉన్న కొద్దిపాటి భూమే వారికి జీవనాధారం. దానిపైనే వారి ఆశలన్నీ. అయితే ఇప్పటి వరకు ఆనందంగా ఉన్న ఆ రైతుల్లో ఆందోళన నెలకొంది. పురుషోత్తపట్నం ఎత్తిపోతల పథకం నిర్మాణం కోసం తమ భూములు కోల్పోవలసి వస్తుందనే గుబులు మొదలైంది. భూసేకరణ పేరుతో తమ పంట భూములు కోల్పోతే తామంతా వీధిన పడతామని, బతుకు భారమవుతుందని, ఆత్మహత్యలే శరణ్యం అని అన్నదాతలు కన్నీరుమున్నీరవుతున్నారు. భూసేకరణ జాబితా రావడం, అందులో సుమారు 80మంది వరకు రైతులు భూములు కోల్పోతారని తెలియడంతో వారంతా ’కలవరపడుతున్నారు.
– పురుషోత్తపట్నం (సీతానగరం)
పురుషోత్తపట్నం ఎత్తి పోతల పథకానికి సంబంధించి సుమారు 200 ఎకరాలు భూసేకరణ చేసేందుకు అధికారులు సిద్ధమవుతున్నారు. పది పంపులతో నెలకొల్పుతున్న ఈ పథకం కోసం సుమారు పదికిలో మీటర్ల మేర పైపులై¯ŒS వెళ్లనుంది. ఇందులో సుమారుగా 80 ఎకరాలు ప్రభుత్వ భూమి ఉంటే.. మిగిలింది స్థానిక రైతుల నుంచి సేకరించేందుకు అధికారులు సిద్ధమయ్యారు. భూసేకరణలో రైతులకు చెల్లించే ధర అనుకూలంగా ఉంటే వారికి నగదు చెల్లిస్తామని, లేకుంటే పైప్‌లై¯ŒS భూమి కింద నుంచి వెళుతున్నందున లీజుకి తీసుకుని ప్రభుత్వం నగదు చెల్లిస్తుందని అధికారులు చెబుతున్నారు. పోలవరం ఎడమ కాలువ ఏలేరు రిజర్వాయర్ వరకు 58 కిలోమీటర్లు ఉందని, ఇక్కడ వరకు మూడు ప్యాకేజీలలో రెండు ప్యాకేజీలు పూర్తయ్యాయని, ఒక ప్యాకేజీలో పనులు పూర్తయ్యే సమయానికి కాలువ పనులు పూర్తి చేస్తామని పోలవరం ఎల్‌ఎంసీ ఎస్‌ఈ సుగుణాకరరావు ‘సాక్షి’కి తెలిపారు.
ఎందుకివ్వాలి..
పురుషోత్తపట్నం ఎత్తిపోతల పథకం వల్ల మాకు ఒరిగేదేమి లేదని, తమ పంట భూములను ఎక్కడో ఉన్న వారి లబ్ధికి ఎందుకు ఇవ్వాలంటూ రైతులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. తమ పంట భూముల నుంచి పైప్‌లై¯ŒS వేసి, తమ భూములను తీసుకుంటే సహించేది లేదని హెచ్చరిస్తున్నారు. మాకు ఉన్న కొద్దిపొలంను ఎవరికోసమో కాజేస్తారా? అంటూ ప్రశ్నిస్తున్నారు. మాకు ఉన్న కొద్దిపాటి పొలాన్ని ఎత్తిపోతల పథకానికి ఇచ్చేది లేదని రైతులు అంటున్నారు.
ఆ భూమినైనా ఉంచండి
రెండు ఎకరాల భూమి ఉంది. అమ్మాయికి వివాహమైంది. కట్నం గా ఎకరం ఇచ్చా. ఉన్న భూమి నుంచి పైప్‌లై¯ŒSకు తీసుకుంటే నా బతుకేంటి. నా భూమి నాకు ఉంచండి.
– కలగర చిన సుబ్బారావు, రామచంద్రపురం
ఎలా పోషించాలి
ఉన్నది రెండెకరాలు. అప్పు రూ.12 లక్షలు. ఇద్దరు పిల్లలు ఉన్నారు. నా భూమి నుంచి పైప్‌లై¯ŒS వెళుతుంది. ఉన్న భూమి పోతే నా కుటుంబాన్ని ఎలా పోషించాలి. మానోటి వద్ద కూడు లాగవద్దు.
– అయినంపూడి వెంకట రామారావు, రామచంద్రపురం
బతుకు భారమే..
ఉన్నది ఎకరంన్నర భూమి. అందులో నుంచి ఎత్తిపోతల పథకం పైప్‌లై¯ŒS వెళుతుందని, భూమి తీసుకుంటున్నామని అంటున్నారు. నాకు ఉన్న ఆ భూమే ఆధారం. భూమి తీసుకుంటే బతకడమే చాలా కష్టమవుతుంది.
– నందిపాటి పాపారావు, రామచంద్రపురం
మరణమే శరణ్యం
నాకు ఉన్నదే యాభైసెంట్ల భూమి అందులో నుంచి పైప్‌లై¯ŒS వెళుతుందంటున్నారు. నాకున్న ఆధారం అదే. ఆ భూమి పోతే మరణమే శరణ్యం. దయచేసి నా భూమి పోకుండా చూడండి.
– కొండిపాటి వీర వెంకట సత్యనారాయణ, రామచంద్రపురం
రోడ్డున పడినట్టే
అమ్మాయి, అబ్బాయి, భార్య ఉన్నారు. నాకు ఉన్నది ఎకరం భూమి. అందులో నుంచి పథకం పైప్‌లై¯ŒS వెళుతుందంటున్నారు. ఆ భూమి లేకపోతే కుటుంబమంతా రోడ్డున పడినట్టే.
– దుద్దిపూడి వెంకట రామారావు, రామచంద్రపురం
జీవించడం కష్టమే..
ఎకరా 30 సెంట్ల భూమి ఉంది. వ్యవసాయ కుటుంబం. అమ్మాయికి వివాహం చేశాం. అప్పు ఇంకా తీరలేదు. అబ్బాయి చదువుకుంటున్నాడు. ఉన్న పొలం పథకంలో పోతే జీవనాధారం పోయినట్టే.
– అట్రు పద్మావతి, రామచంద్రపురం
ఎలా బతికేది
అమ్మాయి, అబ్బాయి. ఇద్దరూ చదువుకుంటున్నారు. ఉన్న పొలం 60 సెంట్లు భూమి. అందులో నుంచి పైప్‌లై¯ŒS వెళుతుంది. మాకున్న ఆ భూమి ప్రభుత్వ తీసుకుంటే మేము ఎలా బతకాలి.
– దుర్దిపూడి అనంత పద్మావతి, రామచంద్రపురం