పుప్పాలగూడ భూముల వ్యవహారం.. హైకోర్టులో తెలంగాణ సర్కార్‌కు చుక్కెదురు | Puppalaguda Lands Issue High Court Bench Dismiss Telangana Govt Petition | Sakshi
Sakshi News home page

పుప్పాలగూడ భూముల వ్యవహారం.. హైకోర్టులో తెలంగాణ సర్కార్‌కు మరోసారి చుక్కెదురు

Published Tue, May 10 2022 10:41 AM | Last Updated on Tue, May 10 2022 5:16 PM

Puppalaguda Lands Issue High Court Bench Dismiss Telangana Govt Petition - Sakshi

సాక్షి, హైదరాబాద్‌: రంగారెడ్డి జిల్లా పుప్పాలగూడలోని సర్వే నంబరు 335, 336, 338, 340, 341, 342లో 80.25 ఎకరాల కాందిశీకులకు సంబంధించిన భూముల వ్యవహారంలో రాష్ట్ర ప్రభుత్వానికి మరోసారి చుక్కెదురైంది. ఈ భూమిపై కాందిశీకులకు హక్కులు ఉన్నాయంటూ సింగిల్‌ జడ్జి ఇచ్చిన తీర్పును సవాల్‌ చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం దాఖలు చేసిన అప్పీళ్లను హైకోర్టు ద్విసభ్య ధర్మాసనం కొట్టివేసింది.

అన్ని అంశాలను పరిగణనలోకి తీసుకొనే సింగిల్‌ జడ్జి తీర్పు ఇచ్చారని, ఆ తీర్పులో జోక్యం చేసుకోమంటూ ఈ మేరకు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ సతీష్‌ చంద్ర శర్మ, జస్టిస్‌ అభినంద్‌కుమార్‌ షావిలి ధర్మాసనం ఇటీవల తీర్పునిచ్చింది. కాందిశీకులకు 1956లో కేటాయించిన భూమిని మిగులు భూమిగా పేర్కొంటూ ఏపీఐఐసీకి కేటాయిస్తూ 2008లో రెవెన్యూ శాఖ జీవో జారీచేసింది. ఈ జీవోను సవాల్‌చేస్తూ పలువురు హైకోర్టులో పిటిషన్లు దాఖలు చేశారు.
చదవండి👉🏻ఇంగ్లిష్‌–1 బండిల్‌లో కెమిస్ట్రీ ప్రశ్నపత్రాలు!

‘వాసుదేవ్‌కు 1956లో ప్రభుత్వం ఈ భూమిని కేటాయించింది. తర్వాత వాసుదేవ్‌ పలువురికి ఈ భూమిని విక్రయించారు. ఇందులో 11.05 ఎకరాలను 1968లో ఇద్దరు వ్య క్తులు అతని నుంచి కొనుగోలు చేశారు. అయితే ఈ భూమి యూఎల్‌సీ పరిధిలో ఉందంటూ 2006లో ప్రభుత్వం ఆ మేరకు ప్రొసీడింగ్స్‌ ఇచ్చింది. వాసుదేవ్‌కు 2006లో నోటీసులు ఇచ్చేందుకు ప్రయత్నించగా ఆ చిరునామాలో లేరని రెవె న్యూ అధికారులు పేర్కొన్నారు. 1998లోనే వాసుదేవ్‌ చనిపోయారు.

ఈ నేపథ్యంలో ప్రభుత్వం చట్టబద్దంగా కేటాయించిన భూమిని నిబంధనలకు విరుద్ధంగా మిగులు భూమిగా చూపించడం, పట్టాదారుకు నోటీసులు ఇవ్వకుండా ఆ కేటాయింపులను రద్దు చేయడం చట్టవిరుద్ధం. ఈ మేరకు ఏపీఐఐసీకి కేటాయిస్తూ ఇచ్చిన జీవోను చట్టవిరుద్ధంగా ప్రకటిస్తున్నాం. కేటాయింపులు రద్దు చేస్తున్నాం’అని సింగిల్‌ జడ్జి 2017లో తీర్పునిచ్చారు. 
చదవండి👉 300 మందికి పైగా ఔట్‌సోర్సింగ్‌ జేపీఎస్‌లకు ఉద్వాసన 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement