విజయవాడ : కృష్ణాజిల్లా ఉంగుటూరు మండలం మానికొండలో మంగళవారం ఆర్థరాత్రి దొంగలు బీభత్సం సృష్టించారు. గ్రామంలోని దొంగలు ఓ ఇంట్లో చోరబడి 13 కాసుల బంగారంతోపాటు రూ. లక్ష నగదు అపహరించారు. ఆ విషయాన్ని బుధవారం గుర్తించిన ఇంటి యజమానులు పోలీసులను ఆశ్రయించారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. అందులోభాగంగా పోలీసులు ఇంటికి చేరుకుని... దొంగతనం జరిగిన తీరును పరిశీలించారు.