
సాక్షి, హైదరాబాద్ : తండ్రి కూతురు లిఫ్ట్‌లో ఇరుక్కుని నరకయాతన పడిన సంఘటన హైదరాబాద్‌లోని మణికొండలో చోటు చేసుకుంది. ల్యాంకో హిల్స్‌లో నివాసం ఉంటున్న ఓ వ్యక్తి ఆదివారం తన కూతురుతో కలిసి లిఫ్ట్ ఎక్కాడు. అయితే సాంకేతిక లోపం కారణంగా లిఫ్ట్ ఆగిపోయింది. సహాయం కోసం 40 నిమిషాల పాటు అతడు ఆర్తనాదాలు చేశాడు. అయినా ఎవరూ రాకపోవడంతో స్వయంగా లిప్ట్ తలుపులు తెరిచేందుకు విశ్వప్రయత్నాలు చేశాడు. చివరకి తన ప్రయత్నం ఫలించి తలుపులు తెరచుకోవడంతో లిఫ్ట్ నుంచి కూతురితో క్షేమంగా బయటపడ్డారు. ఆ దృశ్యాలు ఆక్కడి సీసీ కెమెరాలో రికార్డు అయ్యాయి.
Comments
Please login to add a commentAdd a comment