సాక్షి, హైదరాబాద్: హైదరాబాద్ నగరంలో మరోసారి ఈడీ సోదాలు కలకలం సృష్టిస్తున్నాయి. జూబ్లీహిల్స్, మణికొండ, పంజాగుట్టలో మంగళవారం(ఆగస్టు1) ఉదయం నుంచే దాడులు జరుపుతోంది. మాలినేని సాంబశివరావుతో పాటు పలువురి ఇళ్లు, కార్యాలయాల్లో ఈడీ అధికారులు తనిఖీలు చేపట్టారు. మొత్తం 15 బృందాలతో ఏకకాలంలో సోదాలు చేస్తున్నారు.
కాగా మాలినేని సాంబశివరావు నాలుగు కంపెనీలకు డైరెక్టర్లుగా కొనసాగుతున్నారు. ట్రాన్స్ ట్రై పవర్ ప్రాజెక్ట్, టెక్నో యూనిట్ ఇన్ఫ్రా టెక్, కాకతీయ క్రిస్టల్ పవర్ లిమిటెడ్, ట్రాన్స్ ట్రై రోడ్డు ప్రాజెక్ట్‌లకు డైరెక్టర్‌గా ఉన్నారు.
ఇదిలా ఉండగా 2020 జనవరిలో మలినేని సాంబశివరావు కంపెనీపై సీబీఐ దాడులు జరిపింది. ట్రాన్స్ ట్రాయ్ కంపెనీ నుంచి ట్రాన్స్ ట్రాయ్ సింగపూర్ లిమిటెడ్‌కు నిధులు బదిలీ అయ్యాయన్న ఆరోపణలతో సోదాలు జరిపింది. దీంతో మనీలాండరింగ్ జరిగినట్టు ఈడి అభియోగం మోపింది. యూనియన్ బ్యాంక్ నుండి ట్రాన్స్ ట్రాయ్ కంపెనీ రూ. 300 కోట్ల రూపాయల రుణాలు పొందగా.. తిరిగి ఆ రుణాలు చెల్లించకపోవడంపై సీబీఐ కేసు నమోదు చేసింది.
రూ. 260 కోట్ల రూపాయలను ఇతర కంపెనీకి మళ్ళీ ఇచ్చినట్టు సీబీఐ గుర్తించింది. లోన్ కోసం తీసుకున్న డబ్బులను బంగారం, వెండి ఆభరణాలకు ఖర్చు చేశారంటూ ఆరోపించింది. 2013లో ట్రాన్స్ ట్రాయ్‌ను కెనరా బ్యాంక్ ఆడిట్ చేసింది. అప్పటినుంచి బ్యాంక్‌ల లిస్ట్‌లో నాన్ పర్ఫామింగ్ అసెట్‌గా మారింది ట్రాన్స్ ట్రాయ్. ఇక ఇదే కంపెనీకి మలినేని సాంబశివరావు డైరెక్టర్‌గా ఉన్నారు.
చదవండి: సీఎం కేసీఆర్ ప్రజలనే కాదు, రాముడినీ మోసం చేశారు: భట్టి
Comments
Please login to add a commentAdd a comment