TDP Chandrababu Cases Petitions And Political Updates..
7:25 PM, Nov 22, 2023
లోన బాధ.. పైన ప్రచారం
- ఎట్టకేలకు ప్రచారానికి వచ్చిన పార్ట్‌టైం పొలిటిషియన్
- తప్పనిసరి పరిస్థితుల్లో తెలంగాణ ఎన్నికల్లో పోటికి దిగిన జనసేన
- కాంగ్రెస్‌కు మద్ధతివ్వాలని పవన్‌పై లోన తెలుగుదేశం ఒత్తిడి
- ఇన్నాళ్లు ప్రచారానికి దూరంగా ఉన్న పవన్ కళ్యాణ్
- బీజేపీ నుంచి ఒత్తిడి పెరగడంతో చివరికి ప్రచారానికి వచ్చిన పవన్
- వరంగల్ లో పవన్ కల్యాణ్ ఎన్నికల ప్రచారం
- తెలంగాణలో బీసీని ముఖ్యమంత్రిగా చూడాలన్న పవన్ కల్యాణ్
On the campaign trail in Telangana with Senani ! pic.twitter.com/AyDcQCmIrw
— Manohar Nadendla (@mnadendla) November 22, 2023
7:25 PM, Nov 22, 2023
టిడిపి, జనసేన పిటిషన్ల పర్వం
- స్మార్ట్ మీటర్ల ఏర్పాటుపై పిల్ దాఖలు చేసిన మాజీమంత్రి సోమిరెడ్డి
- సోమిరెడ్డి పిటిషన్‌పై ఏపీ హైకోర్టులో విచారణ
- కౌంటర్ దాఖలు చేయాలని కోర్టు ఆదేశం
- విచారణ నాలుగు వారాలకు వాయిదా
7:05 PM, Nov 22, 2023
కాపు రిజర్వేషన్లపై హరిరామ పిటిషన్
- కాపులకు 5 శాతం రిజర్వేషన్లు అమలు చేయాలని జోగయ్య పిటిషన్
- మాజీ మంత్రి హరిరామ జోగయ్య పిటిషన్ పై ఏపీ హైకోర్టులో విచారణ
- కౌంటర్ దాఖలు చేసిన ప్రభుత్వం
- తమకు కౌంటర్ కాపీ అందలేదని పేర్కొన్న పిటిషనర్ అడ్వకేట్
- కౌంటర్ కోసం రిప్లై అఫిడవిట్ వేయాలని పిటిషనర్ కు కోర్టు ఆదేశం
- తదుపరి విచారణ జనవరి 4కి వాయిదా వేసిన కోర్టు
6:45 PM, Nov 22, 2023
చంద్రబాబు మోసాలకు అడ్డుకట్ట వేయాల్సిందే
- చంద్రబాబు మోసాల నుంచి ఉత్తరాంధ్ర ప్రజలు మేలుకోవాలి : మంత్రి సీదిరి అప్పలరాజు
- విశాఖను రాజధానిగా చేస్తే చంద్రబాబు అడ్డుకుంటున్నారు
- విశాఖ రాజధాని అయితే యువతకు ఇక్కడే ఉపాధి లభిస్తుంది
- ఉత్తరాంధ్ర నుంచి వలసలు ఆగుతాయి
- విశాఖ రాజధాని అయితే ఇక్కడ భూములకు రేట్లు పెరుగుతాయి
- ఒక కులం కోసం అమరావతిని రాజధాని చేశారు
- వైజాగ్ లో రాజధాని వద్దని చంద్రబాబుకు ఎవరైనా చెప్పారా?
- సిగ్గులేకుండా రామోజీరావు అబద్ధాలు రాస్తున్నారు
- వెనుకబడిన కులాలు అంటే చంద్రబాబుకు ద్వేషం
- చంద్రబాబును ఓడించేది ఒక మత్స్యకారుడే
- మత్స్యకారులను అణగదొక్కాలని చూసిన వ్యక్తి చంద్రబాబు
6:15 PM, Nov 22, 2023
చంద్రబాబుకు ఎంత సేపు స్వార్థ ప్రయోజనాలే
- చంద్రబాబు డైరిలో సామాజిక వర్గం అంటే సొంతకులం
- కులగణన చేసే ధైర్యం మాకే ఉంది:మంత్రి చెల్లుబోయిన
- కులగణన ద్వారా 139 సామాజిక వర్గాలకు లాభం:స్పీకర్ తమ్మినేని
- ఏపి కులగణన దేశానికి ఆదర్శంగా నిలిచింది
- పేదల జీవన ప్రమాణాలు పెంచడమే అభివృద్ధి: స్పీకర్ తమ్మినేని
5:10 PM, Nov 22, 2023
రేపు హైకోర్టులో విచారణ
- చంద్రబాబు, కొల్లు రవీంద్ర ముందస్తు బెయిల్ పిటిషన్లపై విచారణ రేపటికి వాయిదా
- గత ప్రభుత్వంలో జరిగిన ఇసుక కుంభకోణంలో ముందస్తు బెయిల్ పిటిషన్
- మద్యం కేసులోనూ చంద్రబాబు,కొల్లు రవీంద్ర ముందస్తు బెయిల్ పిటిషన్లు
- తదుపరి విచారణను ఎల్లుండికి వాయిదా వేసిన ఏపీ హైకోర్టు
- రేపు మధ్యాహ్నం బెంచ్ ముందుకు పిటిషన్ వచ్చే అవకాశం.
5:00 PM, Nov 22, 2023
ఎవరికి ష్యూరిటీ? ఎవరికి గ్యారంటీ?
- బాబు ష్యూరిటీ-భవిష్యత్తుకు గ్యారంటీపై జనసేనలో అంతర్గతంగా చర్చ
- తెలుగుదేశం ప్రోగ్రాంను మనకు ఎందుకు అంటగడుతున్నారు?
- అసలే చంద్రబాబు ట్రాక్ రికార్డు సరిగా లేదు..!
- గతంలో మ్యానిఫెస్టోలు మాయం చేసిన చరిత్ర చంద్రబాబుది.!
- ఇప్పుడు భవిష్యత్తుకు గ్యారంటీ అంటే ఎవరు నమ్ముతారు?
- జనసేనను కలుపుకుని ఉమ్మడిగా ప్రచారం చేద్దామని టిడిపి వాళ్లంటున్నారు
- ఉమ్మడిగా వెళ్లాలనుకుంటే.. ఉమ్మడి ఎజెండా ఉండాలి కదా..!
- బాబు ష్యూరిటీ అని జనసేన వాళ్లెలా చెబుతాం?
- నినాదంలో పవన్ కళ్యాణ్ పేరు ఉండొద్దా?
4:30 PM, Nov 22, 2023
పవన్, నాదెండ్ల ఏం చేస్తున్నారంటే.?
- వైఎస్ఆర్సీపీలో చేరిన జనసేన కేంద్ర కార్యాలయ ఇంఛార్జ్ సందీప్, జనసేన పార్టీ రాయలసీమ రీజియన్ ఇంఛార్జ్ పద్మావతి
- పార్టీ కండువా కప్పి ఆహ్వానించిన రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సజ్జల
- పసుపులేటి సందీప్, జనసేనకు గుడ్‌బై చెప్పిన నేత
- పవన్ కల్యాణ్ యువతను మభ్యపెడతాడు
- తన స్వార్థం కోసం పవన్ ఎంతో మందిని బలి చేశారు
- టీడీపీ కోసమే పవన్ కల్యాణ్ పనిచేస్తున్నాడు
- పార్టీ ఆఫీసుకు వచ్చే హవాలా డబ్బును నాదెండ్ల మారుస్తుంటాడు
4:00 PM, Nov 22, 2023
ఢిల్లీలో సిఐడి అనగానే ఏపీలో టిడిపికి వణుకెందుకు?
- చంద్రబాబు బెయిల్‌పై టిడిపి ఇష్టాసారంగా వ్యాఖ్యలు
- చంద్రబాబు బెయిల్‌ను CID ఎలా సవాల్ చేస్తుంది? : టిడిపి
- హైకోర్టు ఇచ్చిన బెయిల్‌పై సుప్రీంకోర్టుకు ఎలా వెళ్తారు? : టిడిపి
- సుప్రీంకోర్టుకు వెళ్లడమంటే ప్రజాధనం దుర్వినియోగం అయినట్టే : టిడిపి
- టిడిపి తీరుపై YSRCP విమర్శలు
- అవినీతి చేసింది కాకుండా.. వ్యవస్థలపై విమర్శలా? : YSRCP
- తప్పు చేయలేదని ఏ కోర్టు ముందయినా మీరు చెప్పారా? : YSRCP
- అనారోగ్యం పేరు చెప్పి బెయిల్ తెచ్చుకోలేదా? : YSRCP
- ఇప్పుడు సుప్రీంకోర్టుకు వెళ్లారనగానే అంత వణుకెందుకు? : YSRCP
2:30 PM, Nov 22, 2023
మద్యం కేసు పిటిషన్లపై మొదలైన విచారణ
- మద్యం కేసులో చంద్రబాబు, కొల్లు రవీంద్ర ముందస్తు బెయిల్ పిటిషన్లు
- పిటిషన్లపై ఏపీ హైకోర్టులో విచారణ
- చంద్రబాబు తరఫున వాదనలు వినిపిస్తున్న సుప్రీంకోర్టు లాయర్ నాగముత్తు
- సీఐడీ తరఫున వాదనలు వినిపిస్తున్న అడ్వొకేట్ జనరల్ శ్రీరామ్
1:18 PM, Nov 22, 2023
బాబు లాయర్ల వాదనలు ఇవి
- ఇసుక స్కాం కేసులో చంద్రబాబు ముందస్తు బెయిల్ పిటిషన్ పై విచారణ వాయిదా
- విచారణను మధ్యాహ్నానికి వాయిదా వేసిన ఏపీ హైకోర్టు
- వాదనలు వినిపించిన చంద్రబాబు న్యాయవాదులు
- 2016 లో కేబినెట్ ఆమోదంతో అప్పటి ప్రభుత్వం ఉచిత ఇసుక పాలసీని అమల్లోకి తెచ్చింది
- 2019 లో సీఎం గా చంద్రబాబు పదవీ కాలం ముగిసింది
- 2023 లో APMDC ఫిర్యాదు చేసింది
- ఉచిత ఇసుక పాలసీ పై ప్రస్తుత ప్రభుత్వం 2019 సెప్టెంబర్ లో సమీక్ష జరిపి మార్పులు చేర్పులు చేసింది
- ఇసుక వ్యవహారం పై NGT, సుప్రీం కోర్టుకు పలు అఫిడవిట్లు సమర్పించారు
- అన్నీ తన చేతిలో ఉన్న APMDC మూడేళ్ల తర్వాత 2023 లో ఫిర్యాదు చేసింది
- చంద్రబాబుకు ముందస్తు బెయిల్ ఇస్తే.. విచారణకు సహకరిస్తారు
12:58 PM, Nov 22, 2023
విచారణకు చంద్రబాబు సహకరిస్తారు
- ఇసుక స్కాం కేసులో ముందస్తు బెయిల్ పిటిషన్‌పై వాదనలు వినిపించిన చంద్రబాబు లాయర్లు
- విచారణకు చంద్రబాబు సహకరిస్తారు
- ముందస్తు బెయిల్ ఇవ్వండి
- 2016లో కేబినెట్ ఆమోదంతోనే అప్పటి ప్రభుత్వం ఉచిత ఇసుక పాలసీ తెచ్చింది
- 2019లో సీఎంగా చంద్రబాబు పదవీకాలం ముగిసింది
- 2023లో ఏపీ ఎండీసీ ఫిర్యాదు చేసింది
- ప్రస్తుత ప్రభుత్వం ఇసుక పాలసీపై 2019 సెప్టెంబర్‌లో సమీక్ష జరిపి మార్పులు చేసేఇంది
- ఎన్జీటీ, సుప్రీం కోర్టుకు పలు అఫిడవిట్లు సమర్పించారు
- అన్నీ తన చేతిలో ఉన్న ఏపీ ఎండీసీ.. మూడేళ్ల తర్వాత సీఐడీకి ఫిర్యాదు చేసింది
- అక్రమాలు జరిగాయన్నప్పుడు మూడేళ్ల తర్వాతే ఎందుకు కేసు పెట్టారు?
- నెలరోజులుగా చంద్రబాబుపై వరుస కేసులు నమోదు చేస్తున్నారు
ఇదీ చదవండి: అమ్మ చంద్రబాబూ.. ఇసుక స్కాంలో ఇంత జరిగిందా?
12:40 PM, Nov 22, 2023
ఇసుక స్కాం కేసు పిటిషన్ విచారణ లంచ్ తర్వాత
- ఇసుక స్కాం కేసులో చంద్రబాబు ముందస్తు బెయిల్ పిటిషన్
- వాదనలు వినిపించిన చంద్రబాబు తరఫు లాయర్లు
- విచారణ మధ్యాహ్నానికి వాయిదా వేసిన ఏపీ హైకోర్టు
- లంచ్ తర్వాత పిటిషన్‌పై వాదనలు విననున్న బెంచ్
11:56 AM, Nov 22, 2023
హైకోర్టులో మధ్యాహ్నం మద్యం కేసు
- నేడు మద్యం కేసులో చంద్రబాబు ముందస్తు బెయిల్ పై విచారణ
- మధ్యాహ్నం 2.15 గంటలకు విచారించనున్న హైకోర్టు
- మద్యం కంపెనీలకు ఇష్టానుసారంగా అనుమతులు ఇచ్చారని అభియోగాలు
- చంద్రబాబు, కొల్లు రవీంద్ర ముందస్తు బెయిల్ పిటిషన్లపై విచారణ
- ఇవ్వాళ కోర్టులో సీఐడీ తరపు న్యాయవాది వాదనలు
- నిన్ననే చంద్రబాబు తరపున వాదనలు వినిపించిన న్యాయవాది నాగముత్తు
11:36 AM, Nov 22, 2023
బీటెక్ రవి కేసు విచారణ
- బీటెక్ రవి బెయిల్ పిటిషన్ పై కడప కోర్టులో విచారణ
- ఈ నెల 14న బీటెక్ రవిని అరెస్ట్ చేసిన వల్లూరు పోలీసులు
11:25 AM, Nov 22, 2023
ఇసుక కేసు అక్రమాలపై హైకోర్టులో విచారణ
- టీడీపీ ప్రభుత్వ హయాంలో జరిగిన ఇసుక కుంభకోణం
- ఉచిత ఇసుక కేసులో చంద్రబాబు ముందస్తు బెయిల్ పిటిషన్‌పై విచారణ
- చంద్రబాబు ముందస్తు బెయిల్ పిటిషన్‌పై ఇవాళ హైకోర్టులో విచారణ
- 2014లో రాష్ట్ర విభజనకు ముందు రీచ్‌ల వారీగా వేలం పాటలు
- చంద్రబాబు వచ్చాక పలు మార్పులు
- తొలుత డ్వాక్రా మహిళా సంఘాలకు రీచ్‌లు అప్పగిస్తున్నామని ప్రకటన
- మహిళా సంఘాల ముసుగులో ఇసుకపై పూర్తి నియంత్రణ టీడీపీ నేతలదే
- మంత్రివర్గ ఆమోదం లేకుండానే ఇసుకపై చంద్రబాబు నిర్ణయాలు
- ఎమ్మెల్యేలు, మంత్రులు, పలుకుబడి ఉన్న టీడీపీ నేతల ఇష్టారాజ్యం
- చంద్రబాబు ఇంటికి కిలోమీటర్ దూరంలో ఉన్న కృష్ణా నదిలో కూడా భారీ ఎత్తున ఇసుక అక్రమ తవ్వకాలు
- ఏపీలో 2014-19 మధ్య జరిగిన ఇసుక అక్రమాలపై నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ సీరియస్
- చంద్రబాబు ప్రభుత్వానికి వంద కోట్ల రూపాయల జరిమానా విధించిన నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్
- ఇప్పుడు టీడీపీకి మద్దతు ఇస్తున్న న్యాయవాది శ్రవణ్ కుమార్ ఆ రోజుల్లో టీడీపీ ప్రభుత్వంపై ఫిర్యాదు
- కేవలం ఇసుకలోనే పదివేల కోట్ల దోపిడీ జరిగిందని ఎన్.జి.టి.కి ఫిర్యాదు
- CID నమోదు చేసిన కేసులో చంద్రబాబు మధ్యంతర, ముందస్తు బెయిల్ పై విచారణ
- ఇసుక అక్రమాల కేసులో ఏ2గా ఉన్న చంద్రబాబు
- APMDC ఫిర్యాదుతో కేసు నమోదు చేసిన సీఐడీ
10:55 AM, Nov 22, 2023
స్కిల్ స్కాంలో ఇప్పటివరకు ఏం జరిగింది?
- టీడీపీ ప్రభుత్వ హయాంలో జరిగిన స్కిల్ స్కాం
- నిరుద్యోగులకు శిక్షణ పేరిట తెరపైకి ఓ ఒప్పందం
- జర్మనీ కేంద్రంగా ఉన్న ప్రఖ్యాత టెక్నాలజీ కంపెనీ సీమెన్స్‌తో ఒప్పందం అంటూ ప్రచారం
- సీమెన్స్ 90% ఇస్తుందని, తాము కేవలం 10% మాత్రమే చెల్లించాలని అప్పటి టిడిపి ప్రభుత్వం ప్రచారం
- ఆఘామేఘాల మీద 10% వాటా కింద రూ.371 కోట్లు మధ్యవర్తి కంపెనీలకు చెల్లింపు
- అధికారులు అంగీకరించకపోయినా బలవంతం చేసిన చంద్రబాబు, స్వయంగా 13 చోట్ల సంతకాలు, ఇదే విషయాన్ని ఫైళ్లలో రాసిన అధికారులు
- షెల్ కంపెనీల ద్వారా రూ 241 కోట్ల పక్కదారి
- విచారణలో అసలు తమకు ఒప్పందంతో సంబంధమే లేదని లిఖిత పూర్వకంగా తెలిపిన సీమెన్స్
- పన్ను చెల్లించకపోవడంతో కుట్రను గమనించిన డైరెక్టరేట్ జనరల్ (GST ఇంటెలిజెన్స్)
- ఆధారాలు సేకరించి నాటి చంద్రబాబు ప్రభుత్వానికి కుంభకోణం జరిగిందని తెలిపిన GST
- విషయం బయటకు రావడంతో తేలు కుట్టిన దొంగలా చంద్రబాబు
- స్వయంగా దర్యాప్తు చేయడంతో పాటు రాష్ట్ర ప్రభుత్వాన్ని అప్రమత్తం చేసిన GST శాఖ
- నిధులన్నీ సూట్‌కేస్ కంపెనీల ద్వారా పక్కదారి పట్టాయని గుర్తించిన ఇన్‌కమ్‌టాక్స్ శాఖ
- కొల్లగొట్టిన సొమ్ములో రూ. 27 కోట్లు నేరుగా టీడీపీ బ్యాంకు ఖాతాకు చేరినట్టు బ్యాంకు స్టేట్‌మెంట్లను గుర్తించిన CID
- రికార్డులను ఏసీబీ కోర్టుకు సమర్పించిన సీఐడి
- ఈ కుంభకోణంపై జాతీయ దర్యాప్తు సంస్థ ఈడీ విచారణ చేపట్టి పలువురి అరెస్ట్
- చంద్రబాబుపై 120(బి), 166, 167,418, 420, 465, 468, 201, 109, రెడ్ విత్ 34 and 37 ఐపీసీ సెక్షన్ల కింద కేసు నమోదు
- సీఆర్‌పీసీ సెక్షన్ 50(1) కింద నోటీస్ ఇచ్చిన సీఐడీ
- 1988 ప్రివెన్షన్ ఆఫ్ కరెప్షన్ చట్టం కింద సెప్టెంబర్ 9వ తేదీన నంద్యాలలో చంద్రబాబును అరెస్ట్ చేసిన సీఐడీ పోలీసులు
- సెప్టెంబర్ 10న రాజమండ్రి సెంట్రల్ జైలుకు తరలింపు
- ఐదు పర్యాయాలు జ్యుడీషియల్ రిమాండ్ పొడిగింపు
- రిమాండ్ ఖైదీగా 7691 నెంబర్‌తో 52 రోజులపాటు చంద్రబాబు
- కంటికి శస్త్ర చికిత్స అభ్యర్థన మేరకు మానవతా దృక్ఫథంతో అక్టోబర్ 31వ తేదీన నాలుగు వారాల పాటు మధ్యంతర బెయిల్ మంజూరు చేసిన ఏపీ హైకోర్టు
- నవంబర్ 20న రెగ్యులర్ బెయిల్ మంజూరు చేసిన హైకోర్టు
09:39 AM, Nov 22, 2023
బాబు, కొల్లు రవీంద్ర ముందస్తు బెయిల్ పిటిషన్‌పై ఇవాళ హైకోర్టులో విచారణ
- లిక్కర్ స్కాంలో చంద్రబాబు, కొల్లు రవీంద్ర ముందస్తు బెయిల్ పిటిషన్
- బాబు, కొల్లు రవీంద్ర ముందస్తు బెయిల్ పిటిషన్‌పై ఇవాళ హైకోర్టులో విచారణ
- ఇసుక స్కాంలో చంద్రబాబు ముందస్తు బెయిల్ పిటిషన్
- బాబు ముందస్తు బెయిల్ పిటిషన్‌పై ఇవాళ హైకోర్టులో విచారణ
09:10 AM, Nov 22, 2023
బాబుకు శిక్ష తప్పదు: ఎంపీ మోపిదేవి వెంకటరమణ
- అధికారంలో ఉండగా రాష్టాన్ని నిలువు దోపిడీ చేశాడు
- పలు అవినీతి కేసుల్లో అడ్డంగా దొరికిపోయి.. బెయిల్‌పై బయటకొచ్చిన చంద్రబాబుకు జైలుశిక్ష పడడం తథ్యం
- లేని వ్యాధులు తెచ్చుకుని చంద్రబాబు బెయిల్ తెచ్చుకున్నాడు
- ఈ విషయం రాష్ట్ర ప్రజలందరికీ తెలుసు
- వ్యవస్థలను మేనేజ్ చేయడం, ఉన్నదాన్ని లేనట్టుగా, లేనిది ఉన్నట్టుగా చెప్పడం చంద్రబాబుకు వెన్నతో పెట్టిన విద్య
08:14 AM, Nov 22, 2023
జైలు ఎపిసోడ్ నేర్పిన పాఠాలేంటీ?
- చంద్రబాబుకు ఎన్నో విషయాలపై స్పష్టత ఇచ్చిన జైలు జీవితం
- పార్టీలో ద్వితీయ శ్రేణి నాయకత్వం విషయంలో ఉన్నదంతా డొల్లే
- ఎన్టీఆర్‌కు చంద్రబాబు ఉన్నట్టు, చంద్రబాబుకు మరొకరు లేరన్న విషయంపై స్పష్టత
- లోకేష్‌పై, చినబాబు నాయకత్వంపై ఇప్పటివరకు పెట్టుకున్నవన్ని భ్రమలే
- పార్టీలో ఉన్న సీనియర్ల వల్ల ఫలితం శూన్యం
- అచ్చెన్న, యనమల, గోరంట్ల, సోమిరెడ్డి, పయ్యావుల, కోట్ల.. పేరుకే సీనియర్లు
- కష్టకాలంలో ఏ సీనియర్ కూడా పార్టీని నడిపించే సత్తా లేదని సుస్పష్టం
- పార్టీ సీనియర్లలో కొరవడిన సబ్జెక్ట్ నాలెడ్జ్
- పవన్ కళ్యాణ్‌ను నమ్ముకోవడం పార్టీ దౌర్భాగ్యం అని తేలినా.. ఏమి చేయలేని వైనం
- పార్టీ ఆందోళన కార్యక్రమాల్లో ఎవరూ రుపాయి ఖర్చు పెట్టలేదని క్లారిటీ
- మీడియాలో కనిపించే మై"కింగ్"లు వేరు, క్షేత్రస్థాయిలో పని చేసే వారు వేరు అన్నదానిపై స్పష్టత
- కిం.. కర్తవ్యం.? ఏం చేస్తే పార్టీ పట్టాలెక్కుతుంది? చంద్రబాబు మంత్రాంగాలు
07:36 AM, Nov 22, 2023
‘మద్యం’ కేసులో బాబు ముందస్తు బెయిల్ పిటిషన్‌పై విచారణ నేటికి వాయిదా
- వాదనలు వినిపించిన చంద్రబాబు, కొల్లు రవీంద్ర న్యాయవాదులు
- శాసన సభ ఆమోదంతోనే ప్రివిలేజ్ ఫీజు తొలగించినట్లు తెలిపిన బాబు
- గవర్నర్ సైతం ఆమోదముద్ర వేశారని వెల్లడి
- సీఐడీ వాదనల నిమిత్తం విచారణ నేటికి వాయిదా
07:02 AM, Nov 22, 2023
చంద్రబాబు ముఠాకు ఎదురుదెబ్బ
- ఫైబర్‌నెట్ కేసులో నిందితుల ఆస్తుల అటాచ్‌మెంట్
- ఏడు స్థిరాస్తుల అటాచ్‌మెంట్‌కు న్యాయస్థానం అనుమతి
- ఈ కేసులో నిందితులుగా ఉన్నచంద్రబాబు సన్నిహితుల ఆస్తుల అటాచ్‌మెంట్‌కు ఏసీబీ న్యాయస్థానం అనుమతి
- సీఐడీ దాఖలు చేసిన అటాచ్‌మెంట్ పిటిషన్‌ను ఆమోదిస్తూ న్యాయస్థానం ఉత్తర్వులు
- ఫైబర్‌నెట్ కేసులో చంద్రబాబు సహా పలువురిపై సీఐడీ కేసు నమోదు
- ఇందులో చంద్రబాబు ఏ–25, ఏ–1 వేమూరి హరికృష్ణకు చెందిన టెరాసాఫ్ట్ కంపెనీ, ఏ–13 టెరాసాఫ్ట్ కంపెనీ ఎండీ తుమ్మల గోపీచంద్
07:01 AM, Nov 22, 2023
నారా చంద్రబాబు నాయుడు.. ఏ కేసు.? స్టేటస్ ఏంటీ?
కేసు : స్కిల్ స్కాం @ హైకోర్టు
స్టేటస్ : నవంబర్ 20న బెయిల్ ఇచ్చిన హైకోర్టు
వివరణ : నవంబర్ 28వరకు చంద్రబాబుపై ఆంక్షలు, చికిత్స చేయించుకున్న వివరాలు సమర్పించాలని ఆదేశంకేసు : స్కిల్ స్కాం @ సుప్రీంకోర్టు
అంశం : క్వాష్ పిటిషన్
స్టేటస్ : సుప్రీంకోర్టులో పెండింగ్
వివరణ : ఈ నెలాఖరుకు తీర్పు వచ్చే అవకాశంకేసు : ఇసుక కుంభకోణం @ హైకోర్టు
అంశం : ముందస్తు బెయిల్ పిటిషన్
స్టేటస్ : హైకోర్టులో జరుగుతున్న విచారణ
వివరణ : నవంబర్ 22కి తదుపరి విచారణ వాయిదా
కేసు : ఫైబర్ నెట్ పేరిట నిధుల దోపిడి
అంశం : ముందస్తు బెయిల్ పిటిషన్
స్టేటస్ : సుప్రీంకోర్టులో పెండింగ్
వివరణ : నవంబర్ 30కి తదుపరి విచారణ వాయిదాకేసు : అంగళ్లులో అల్లర్లు రెచ్చగొట్టిన కేసు
అంశం : ముందస్తు బెయిల్ పిటిషన్
స్టేటస్ : మంజూరు చేసిన హైకోర్టు
వివరణ : ఏ1గా ఉన్న చంద్రబాబు, మరో 170 మంది ఇతర నిందితులుకేసు : ఇన్నర్ రింగ్ రోడ్డులో అక్రమాల కేసు
అంశం : ముందస్తు బెయిల్ పిటిషన్
స్టేటస్ : హైకోర్టులో జరుగుతున్న విచారణ
వివరణ : నవంబర్ 22కి వాయిదా పడ్డ కేసు
కేసు : మద్యం విధానాల్లో అక్రమాలకు పాల్పడి నిధులు కొట్టేసిన కేసు
అంశం : ముందస్తు బెయిల్ పిటిషన్
స్టేటస్ : హైకోర్టులో జరుగుతున్న విచారణ
వివరణ : నవంబర్ 24కి వాయిదా పడ్డ విచారణ
06:59 AM, Nov 22, 2023
హైకోర్టు తీర్పును రద్దు చేయండి
- చంద్రబాబుకు బెయిల్ విషయంలో పరిధి దాటింది
- సుప్రీంకోర్టులో ఎస్సెల్పీ దాఖలు చేసిన రాష్ట్ర ప్రభుత్వం
- సుప్రీంకోర్టు నిర్దేశించిన కొలమానాలను హైకోర్టు అతిక్రమించింది
- కేసు లోతుల్లోకి వెళ్లి క్లీన్ చిట్ ఇచ్చే ప్రయత్నం చేసింది
- ట్రయల్ కోర్టును ప్రభావితం చేసేలా ఆ తీర్పు ఉంది
- మినీ ట్రయల్ నిర్వహణ.. 39 పేజీల తీర్పే ఇందుకు నిదర్శనం
- దుర్వినియోగం చేసిన నిధులు టీడీపీ ఖాతాల్లోకి వెళ్లాయి
- అందుకు పూర్తి ఆధారాలున్నా ఏ మాత్రం పట్టించుకోలేదు
- చంద్రబాబుకు రాజకీయ పలుకుబడి ఉంది.. సాక్షులను బెదిరించడం ద్వారా దర్యాప్తును ప్రభావితం చేస్తారు
- హైకోర్టు తేల్చిన అంశాలు వాస్తవ విరుద్ధం
Comments
Please login to add a commentAdd a comment