Nov 26th: చంద్రబాబు కేసు అప్‌డేట్స్‌ | TDP Chandrababu Cases, Petitions And Political Updates On 26 November | Sakshi
Sakshi News home page

Nov 26th: చంద్రబాబు కేసు అప్‌డేట్స్‌

Published Sun, Nov 26 2023 7:09 AM | Last Updated on Sun, Nov 26 2023 7:22 PM

TDP Chandrababu Cases, Petitions And Political Updates On 26 November - Sakshi

TDP Chandrababu Cases Petitions And Political Updates..

07:16PM, Nov 26, 2023
స్కిల్ కేసులో చంద్రబాబు బెయిల్ రద్దు పిటిషన్ పై ఈ నెల 28న సుప్రీంకోర్టులో విచారణ 

  • జస్టిస్ బేలా త్రివేది, జస్టిస్ సతీష్ చంద్ర ధర్మాసనం ముందు విచారణ
  • స్కిల్ కేసులో బాబుకు రెగ్యులర్ బెయిల్ మంజూరు చేసిన ఏపీ హైకోర్టు
  • ఏపీ హైకోర్టు తీర్పును సుప్రీంలో సవాల్ చేసిన సీఐడీ
  • బెయిల్ మంజూరులో హైకోర్టు పరిధి దాటిందని ఏపీ సీఐడీ పిటిషన్
  • మంగళవారం చంద్రబాబు పిటిషన్‌పై సుప్రీంలో విచారణ

07:15PM, Nov 26, 2023
తెలంగాణ రాజకీయాలు ఏపీపై ప్రభావం ఉండదు : అంబటి 

  • అక్కడ ఏ ప్రభుత్వం వచ్చినా మాతో సత్సంబంధాలే ఉంటాయి
  • వారాహికి తెలంగాణలో లైసెన్స్ లేదనుకుంటా?
  • బాబు చెబితేనే వారాహి.. ఆయన డైరెక్షన్ లోనే వెళ్తుంది

07:00PM, Nov 26, 2023
విశాఖలో రూ.50 వేల చెక్కు ఇచ్చి సీఎం జగన్‌ను దూషించాడు : మంత్రి అంబటి

  • పవన్ గడ్డం పెరిగినా.. ఫ్లైట్ లేటైనా జగనే కారణమంటాడు
  • ప్యాకేజీ తీసుకుని పవన్ మాట్లాడుతున్నాడు
  • చంద్రబాబు కాంగ్రెస్ కి, పవన్ బీజేపీకి.. ఏంటయ్యా మీ నీచ రాజకీయాలు
  • పవన్ కి ఈ రాష్ట్రంతో ఏం సంబంధం... నీకు ఊరు, ఇల్లు, ఓటు ఇక్కడ లేవు
  • ఎక్కడ పోటీ చేస్తాడో కూడా పవన్ కు తెలియదు
  •  పవన్ పీకే కాదు... కేకే... కిరాయి కల్యాణ్
  • రాజశేఖర్ రెడ్డి గురించి మాట్లాడే అర్హత పిల్ల పవన్ కు ఉందా?
  • ఆగిపోయిన హాస్యకథా చిత్రం రేపటి నుంచి మళ్లీ మొదలవుతుంది
  • అసలు పుత్రుడు చేసే కామెడీ రేపటి నుంచి చూడొచ్చు

04:05PM, Nov 26, 2023

చంద్రబాబు, లోకేష్, పవన్‌కు వెల్లంపల్లి ఛాలెంజ్

  • ఆర్యవైశ్యులకు నేనేమి చేశానో చర్చకు సిద్ధంగా ఉన్నా
  • టీడీపీ ఆఫీస్‌కు రమ్మన్నా వచ్చేందుకు నేను సిద్ధమే
  • ఆర్యవైశ్య సంఘాల ముసుగులో నన్ను ఇబ్బంది పెట్టాలని కొన్ని రాజకీయ పార్టీలు ప్రయత్నిస్తున్నాయి
  • చంద్రబాబు ఎప్పుడూ ఆర్యవైశ్యులకు ప్రాధాన్యత ఇవ్వలేదు
  • వైఎస్ జగన్ సీఎం అయ్యాక ఆర్యవైశ్యులకు అనేక రాజకీయ, నామినేటెడ్ పదవులిచ్చారు
  • చంద్రబాబు, పవన్, బీజేపీ హిందూ ద్రోహులు
  • టీడీపీ హయాంలో ఆలయాలు కూల్చివేస్తే బీజేపీ పట్టించుకోలేదు
  • విజయవాడ పశ్చిమ టికెట్ వైశ్యులకు ఇచ్చే దమ్ము లోకేష్‌కు ఉందా?
  • పోతిన మహేష్ సిగ్గులేకుండా చంద్రబాబుకి చెంచాగిరి చేస్తున్నాడు
  • నియోజకవర్గానికి ఇన్‌ఛార్జిని పెట్టలేని దద్దమ్మలు నాకు చెప్తున్నారు

04:02PM, Nov 26, 2023

పవన్ కల్యాణ్‌పై అడపా శేషు ఫైర్

  • కాపులను చంద్రబాబుకు పవన్ తాకట్టు పెట్టారు
  • కులాల మధ్య చిచ్చుపెట్టేలా పవన్ వ్యాఖ్యలు
  • పవన్‌‌కు ఏపీకి వచ్చినప్పుడు వచ్చే పూనకం తెలంగాణలో ఎందుకు రావడం లేదు
  • ఏపీలో బాబు, పవన్‌కు ప్రజలే బుద్ధి చెబుతారు

04:00PM, Nov 26, 2023

  • రేపు నారా లోకేష్ యువగళం పాదయాత్ర పునఃప్రారంభం
  • పొదలాడ వద్ద రేపు(సోమవారం) ఉ.10.19కి పాదయాత్రను ప్రారంభించనున్న లోకేష్
  • ఉ.11.20 గంటలకు తాటిపాకలో నారా లోకేష్ బహిరంగ సభ

03:05 PM, Nov 26, 2023

మీ పొత్తుకో దండం! మా సీట్లకే సరి పెడతారా?

  • జనసేనకు 30 సీట్లు ఇవ్వాలని టీడీపీ నేతల యోచన
  • పొత్తులపై చంద్రబాబు నిర్ణయానికి టీడీపీ శ్రేణులు కట్టుబడి ఉంటాయి : బుద్ధ వెంకన్న
  • లోకేష్ పాదయాత్రలో తెదేపా, జనసేన శ్రేణులు పాల్గొంటాయి: బుద్దా వెంకన్న 
  • పొత్తులపై సొంత పక్షంలోనే అనుమానాలు సందేహాలు ఉన్నాయా? 
  • జనసేన కి ఎన్ని సీట్లు ఇస్తారన్నదానిపై పార్టీలో అంతర్గతంగా అసమ్మతి తలెత్తుతోందా? 
  • లోకేష్ పాదయాత్రకి కచ్చితంగా రావాలని జనసేన కార్యకర్తలను తెలుగుదేశం ఎందుకు పట్టు బట్టుతోంది? 
  • రాయలసీమ కోస్తా ఉత్తరాంధ్ర మూడు ప్రాంతాల్లో ఒక్కోచోట పది చొప్పున జనసేనకు సీట్లు కేటాయిన్చడం ఖాయమేనా?

01:58 PM, Nov 26, 2023
ఫైబర్‌నెట్‌ కేసు.. చంద్రబాబు ముఠాకు ఎదురుదెబ్బ 

  • ఫైబర్‌నెట్‌ కేసులో నిందితుల ఆస్తుల అటాచ్‌మెంట్‌ 
  • ఏడు స్థిరాస్తుల అటాచ్‌మెంట్‌కు న్యాయస్థానం అనుమతి  
  • ఈ కేసులో నిందితులుగా ఉన్నచంద్రబాబు సన్నిహి­తుల ఆస్తుల అటాచ్‌మెంట్‌కు ఏసీబీ న్యాయ­స్థానం అనుమతి
  • సీఐడీ దాఖలు చేసిన అటాచ్‌మెంట్‌ పిటిషన్‌ను ఆమోదిస్తూ న్యాయ­స్థానం ఉత్తర్వులు
  • ఫైబర్‌నెట్‌ కేసులో చంద్రబాబు సహా పలువురిపై సీఐడీ కేసు నమోదు
  • ఇందులో చంద్ర­బాబు ఏ–25, ఏ–1 వేమూరి హరికృష్ణకు చెందిన టెరాసాఫ్ట్‌ కంపెనీ, ఏ–13 టెరా­సాఫ్ట్‌ కంపెనీ ఎండీ తుమ్మల గోపీచంద్‌

12:34 PM, Nov 26, 2023
విలువలు లేని రాజకీయాలకిది నిదర్శనం.. ఎంపీ విజయసాయిరెడ్డి ట్వీట్‌..

  • ప్రియాంక వాద్రా ర్యాలీల్లో టీడీపీ వాళ్లు జెండాలు పట్టుకుని పాల్గొనడానికి సిగ్గుండాలి.
  • చంద్రబాబు గారి, పురంధేశ్వరి గారి విలువలు లేని రాజకీయాలకిది నిదర్శనం
  • బీజేపీలో ఉంటూ టీడీపీ బాకా ఊదుతున్న పురందేశ్వరి గారు తమ బావ పార్టీ తెలంగాణలో కాంగ్రెస్‌తో జత కట్టడంపై ఏమంటారో మరి!

11:34 AM, Nov 26, 2023
ఈ నెల 28న సుప్రీంకోర్టులో చంద్రబాబు బెయిల్‌ రద్దు కేసు..
ఏపీ ప్రభుత్వం దాఖలు చేసిన పిటిషన్‌పై విచారణ
విచారణ చేయనున్న జస్టిస్ బేలా త్రివేది, జస్టిస్ సతీష్ చంద్ర శర్మ ధర్మాసనం 

పిటీషన్‌లో  కీలక అంశాలు:

  • బెయిల్‌ మంజూరు విషయంలో సుప్రీంకోర్టు పదేపదే ఇచ్చిన ఆదేశాల పరిధిని హైకోర్టు అతిక్రమించింది: ఏపీ ప్రభుత్వం
  • పిటిషనర్లు వాదించని, వారు కోరని అంశాల్లోకి కూడా హైకోర్టు వెళ్లేందుకు ప్రయత్నించింది
  • హైకోర్టు తన అధికారపరిధిని అతిక్రమిస్తూ తీర్పులో వ్యాఖ్యానాలు చేసింది
  • కేసు మెరిట్స్‌ గురించి, ఔచిత్యం గురించి, ఆధారాలదర్యాప్తులో లోపాలుగురించి బెయిల్‌ పిటిషన్‌ సమయంలోనే వ్యాఖ్యానించింది
  • దర్యాప్తుపై ఇప్పటికే టీడీపీ పార్టీ నాయకులు, ప్రతినిధులు నిరంతరం రాళ్లు వేస్తూనే ఉన్నారు
  • ఇలాంటి సమయంలో బెయిల్‌ సందర్భంగా కోర్టు చేసిన వ్యాఖ్యానాలను వారు సానుకూలంగా మలుచుకునే అవకాశం ఉంది
  • సీడీఐ కోరిన సమాచారాన్ని ఇప్పటివరకూ టీడీపీ ఇవ్వనే లేదు
  • కేసుల మూలాల గురించి హైకోర్టు తీర్పులో పేర్కొనడం ట్రయల్‌ కోర్టు అధికారాలను హరించడమే
  • ఇది చాలా ఆందోళనకరమైన విషయం, బెయిల్‌ దశలోనే న్యాయ పరిధిని మీరడమే అవుతుంది
  • బెయిల్‌ సందర్భంగా సీఐడీ అభ్యంతరాలపై తిరిగి పిటిషనర్‌ ఎలాంటి వాదనలు చేయలేదు
  • దర్యాప్తు సమయంలో బెయిల్‌ పిటిషన్‌ సందర్భంగా హైకోర్టు తీరు అనూహ్యమైనది


10:51 AM, Nov 26, 2023
స్కిల్‌ స్కాంలో ఇప్పటివరకు ఏం జరిగింది?

  • టీడీపీ ప్రభుత్వ హయాంలో జరిగిన స్కిల్‌ స్కాం
  • నిరుద్యోగులకు శిక్షణ పేరిట తెరపైకి ఓ ఒప్పందం
  • జర్మనీ కేంద్రంగా ఉన్న ప్రఖ్యాత టెక్నాలజీ కంపెనీ సీమెన్స్‌తో ఒప్పందం అంటూ ప్రచారం
  • సీమెన్స్‌ 90% ఇస్తుందని, తాము కేవలం 10% మాత్రమే చెల్లించాలని అప్పటి టీడీపీ ప్రభుత్వం ప్రచారం
  • ఆఘామేఘాల మీద 10% వాటా కింద రూ.371 కోట్లు మధ్యవర్తి కంపెనీలకు చెల్లింపు
  • అధికారులు అంగీకరించకపోయినా బలవంతం చేసిన చంద్రబాబు, స్వయంగా 13 చోట్ల సంతకాలు, ఇదే విషయాన్ని ఫైళ్లలో రాసిన అధికారులు
  • షెల్ కంపెనీల ద్వారా  రూ 241 కోట్ల పక్కదారి
  • విచారణలో అసలు తమకు ఒప్పందంతో సంబంధమే లేదని లిఖిత పూర్వకంగా తెలిపిన సీమెన్స్‌
  • పన్ను చెల్లించకపోవడంతో కుట్రను గమనించిన డైరెక్టరేట్ జనరల్ (GST ఇంటెలిజెన్స్)
  • ఆధారాలు సేకరించి నాటి చంద్రబాబు ప్రభుత్వానికి కుంభకోణం జరిగిందని తెలిపిన GST
  • విషయం బయటకు రావడంతో తేలు కుట్టిన దొంగలా చంద్రబాబు
  • స్వయంగా దర్యాప్తు చేయడంతో పాటు రాష్ట్ర ప్రభుత్వాన్ని అప్రమత్తం చేసిన GST శాఖ
  • నిధులన్నీ సూట్‌కేస్‌ కంపెనీల ద్వారా పక్కదారి పట్టాయని గుర్తించిన ఇన్‌కమ్‌టాక్స్‌ శాఖ
  • కొల్లగొట్టిన సొమ్ములో రూ. 27 కోట్లు నేరుగా టీడీపీ బ్యాంకు ఖాతాకు చేరినట్టు బ్యాంకు స్టేట్‌మెంట్లను గుర్తించిన CID
  • రికార్డులను ఏసీబీ కోర్టుకు సమర్పించిన సీఐడి
  • ఈ కుంభకోణంపై జాతీయ దర్యాప్తు సంస్థ ఈడీ విచారణ చేపట్టి పలువురి అరెస్ట్
  • చంద్రబాబుపై 120(బి), 166, 167,418, 420, 465, 468, 201, 109, రెడ్‌ విత్‌ 34 and 37 ఐపీసీ సెక్షన్ల కింద కేసు నమోదు
  • సీఆర్‌పీసీ సెక్షన్ 50(1) కింద నోటీస్ ఇచ్చిన సీఐడీ
  • 1988 ప్రివెన్షన్ ఆఫ్ కరెప్షన్ చట్టం కింద సెప్టెంబర్‌ 9వ తేదీన నంద్యాలలో చంద్రబాబును అరెస్ట్‌ చేసిన సీఐడీ పోలీసులు
  • సెప్టెంబర్‌ 10న రాజమండ్రి సెంట్రల్‌ జైలుకు తరలింపు
  • ఐదు పర్యాయాలు జ్యుడీషియల్‌ రిమాండ్‌ పొడిగింపు
  • రిమాండ్‌ ఖైదీగా 7691 నెంబర్‌తో 52 రోజులపాటు చంద్రబాబు
  • కంటికి శస్త్ర చికిత్స అభ్యర్థన మేరకు మానవతా దృక్ఫథంతో అక్టోబర్‌ 31వ తేదీన నాలుగు వారాల పాటు మధ్యంతర బెయిల్‌ మంజూరు చేసిన ఏపీ హైకోర్టు
  • నవంబర్‌ 20న రెగ్యులర్‌ బెయిల్‌ మంజూరు చేసిన హైకోర్టు

9:38 AM, Nov 26, 2023
నవంబర్‌ 29 కోసం చంద్రబాబు ఎదురుచూపులు

  • నవంబర్‌ 29తో కోర్టు ఆంక్షలు, నవంబర్‌ 30తో తెలంగాణ ఎన్నికలు
  • సైకిల్‌ రిపేర్‌కు సమయం ఆసన్నమయిందన్న ఆలోచనలో చంద్రబాబు
  • ఏం చేద్దాం? ఎలా చేద్దాం? పార్టీ శ్రేణులను ఎలా చైతన్యపరచాలి?
  • ఇచ్ఛాపురం వరకు నడవమంటే లోకేష్‌ వినడాయే?
  • రెగ్యులర్‌గా ఏపీలో ఉండి వారాహి  యాత్ర చేయమంటే పవన్‌ వినడాయే?
  • నియోజకవర్గాల్లో డబ్బులు ఖర్చు పెట్టమంటే సీనియర్లు పట్టించుకోరాయే?
  • కనీసం సింగిల్‌గా తెలుగుదేశం పోటీ చేద్దామంటే గెలుస్తుందన్న నమ్మకం లేదాయే?
  • పవన్‌ కళ్యాణ్‌ను నమ్ముకుని తెలుగుదేశం ముందుకెళ్లగలదా?
  • ఇన్నాళ్లు తిరిగిన చక్రం ఇప్పుడు రాష్ట్రంలో అసలే తిరగడం లేదెందుకు?
  • ఢిల్లీలో మన మాటకు ఈ స్థాయిలో విలువెందుకు తగ్గిపోయింది?
  • కార్యకర్తలను ఏమని చెప్పి ఒప్పించాలి?
  • జనసేనకు కేటాయించే సీట్లపై టీడీపీ క్యాడర్‌కు ఏమని చెప్పాలి?

8:01 AM, Nov 26, 2023
సంతకం సాక్షిగా.. మద్యంలో ముడుపులు!

  • మద్యం కేసులో సుస్పష్టంగా బయటపడుతున్న ఆధారాలు
  • నోట్ ఫైళ్లపై చంద్రబాబు, కొల్లు రవీంద్ర సంతకాలు
  • అడ్డగోలుగా మద్యం దుకాణాలు, బార్ల ప్రివిలేజ్ ఫీజులు రద్దు
  • ప్రభుత్వ ఖజానాకు రూ.1,299.64 కోట్లు నష్టం  వాటిల్లేలా పావులు కదిపిన చంద్రబాబు
  • ఆర్ధిక శాఖ అనుమతి, ఆమోదం లేకుండా తతంగం
  • కేబినెట్ భేటీ ముగిశాక గుట్టుగా చీకటి జీవోలు జారీ
  • టీడీపీ సర్కారు తీరును తప్పు బట్టిన ప్రిన్సిపల్ అకౌంటెంట్ జనరల్
  • ఇన్నాళ్లూ మా బాబుకు ఏమీ తెలియదంటూ బుకాయించిన ఎల్లో గ్యాంగ్
     

7:54 AM, Nov 26, 2023
తెలంగాణాలో ఒకలా, ఆంధ్రాలో మరోలా రాజకీయం.. పేర్ని నాని ఫైర్‌

  • పవన్‌ శ్వాస బాబు కోసమే
  • చంద్రబాబును అధికారంలో చూడాలన్నదే ఆయన కాంక్ష 
  • మీ హయాంలో ఒక్క ఫిషింగ్‌ హార్బర్‌ జెట్టీ అయినా కట్టారా? 
  • సీఎం జగన్‌ సంక్షేమ కార్యక్రమాలతో మత్స్యకారులకు ఎంతో మేలు 
  • చంద్రబాబు కార్యాలయాలకు వందల కోట్లు దుబారా 
  • వావి వరుసల్లేకుండా పవన్, చంద్రబాబుల రాజకీయం 
  • తెలంగాణాలో ఒకలా, ఆంధ్రాలో మరోలా రాజకీయం 
     

7:20 AM, Nov 26, 2023
టీడీపీ నిర్వాకం.. లండన్‌లో ఏపీ ప్రజల వ్యక్తిగత డేటా

  • ఇళ్లలోకి చొరబడి వివరాలు సేకరిస్తున్న టీడీపీ కార్యకర్తలు
  • టీడీపీ మేనిఫెస్టో వెబ్‌సైట్‌కి ఆ వివరాలు అనుసంధానం
  • ఆ సమాచారం అంతా లండన్‌లోని సర్వర్‌లో నిక్షిప్తం
  • ఇందుకోసం ప్రజల ఫోన్‌ నంబర్లు, వారి ఓటీపీ నంబర్ల కోసం ఒత్తిడి
  • రాజకీయ అవసరాల కోసం ప్రజల భద్రతను పణంగా పెట్టిన చంద్రబాబు

7:15 AM, Nov 26, 2023
ఈనెల 28న సుప్రీంలో చంద్రబాబు బెయిల్ రద్దు కేసు

  • స్కిల్ స్కాం కేసులో హైకోర్టు బెయిల్ మంజూరు
  • హైకోర్టు తీర్పును సవాల్ చేస్తూ సుప్రీంలో పిటిషన్
  • సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేసిన ఏపీ ప్రభుత్వం 

7:10 AM, Nov 26, 2023
నిన్న రాజంపేట.. నేడు నెల్లూరు.. పచ్చమూకల డేటా చౌర్యం

  • నెల్లూరులో ప్రజల సున్నిత వ్యక్తిగత సమాచారం సేకరిస్తున్న టీడీపీ దొంగల ముఠా
  • ఆధార్, ఓటర్ కార్డులు, మొబైల్ నెంబర్, ఓటీపీ వివరాల సేకరణ
  • ఓటర్ల తనిఖీ పేరుతో బరితెగింపు
  • ఇంటింటికీ టీడీపీ మాజీ మంత్రి నారాయణ అనుచరులు
  • మహిళలు, యువతుల ఫొటోలను కూడా వదలని వైనం
  • ప్రజలు నిలదీయడంతో పరారు
  • ఒకరిని చితకబాది పోలీసులకు అప్పగించిన స్థానికులు 
     

7:08 AM, Nov 26, 2023
రేపటి నుంచే లోకేష్ యువగళం పాదయాత్ర పునః ప్రారంభం

  • యువగళం పాదయాత్ర ఆగిన చోటు నుంచే తిరిగి ప్రారంభం
  • కోనసీమ జిల్లాలో నారా లోకేష్ పాదయాత్ర షెడ్యూల్ రిలీజ్
  • రేపు ఉ. 10.19 గంటలకు యువగళం పాదయాత్ర ప్రారంభం
  • మొదటి రోజు తాటిపాకలో నారా లోకేష్ బహిరంగ సభ
  • ఇచ్చాపురం వరకు చేయాలన్న చంద్రబాబు, విశాఖ తో సరిపెడతానన్న చిన్నబాబు
     

7:06 AM, Nov 26, 2023
ఈ నెల 27న ఢిల్లీకి చంద్రబాబు

  • సుప్రీంకోర్టు న్యాయవాది సిద్ధార్థ్ లూథ్రా కుమారుడి పెళ్లి రిసెప్షన్ కు హాజరుకానున్న చంద్రబాబు
  • నేడు సిద్ధార్థ్ లూథ్రా కుమారుడి వివాహం
  • ఈనెల 28 వరకు ఢిల్లీలోనే చంద్రబాబు బస

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement