TDP Chandrababu Cases Petitions And Political Updates..
3:56 PM, Nov 24, 2023
పొత్తుల్లో నాది అంతులేని కథ : పవన్ కళ్యాణ్
- రాజకీయ పొత్తులపై ముసుగు తీసిన పవన్ కళ్యాణ్
- ఏ పార్టీతోనైనా కలుస్తాను
- చాలా మంది నాది ఏ ఇజం, ఒక్కోసారి ఒక్కోలా ఉంటాను అంటారు..,
- కమ్యూనిస్ట్ తో కలుస్తాడు, బీజేపీ వాళ్ళతో ఉంటారు అంటారు..
- నాది హ్యుమనిజం : పవన్ కళ్యాణ్
- ప్రస్తుతం తెలంగాణలో బీజేపీతో పొత్తు, ఏపీలో టీడీపీతో పొత్తు
- గతంలో బీఎస్పీతో పొత్తు, అంతకు ముందు కమ్యూనిస్టులతో పొత్తు
- పొత్తుల్లో కొత్త రికార్డు దిశగా పవన్ కళ్యాణ్ నేతృత్వంలోని జనసేన
చాలా మంది నాది ఏ ఇజం, ఒక్కోసారి ఒక్కోలా ఉంటాను అంటారు, కమ్యూనిస్ట్ తో కలుస్తాడు, బీజేపీ వాళ్ళతో ఉంటారు అంటారు..నాది హ్యుమనిజం. నాకు తెలంగాణ నేల సనాతన ధర్మం నేర్పింది.
— JanaSena Party (@JanaSenaParty) November 23, 2023
నా తెలంగాణ కోటి రతనాల వీణ అని కీర్తించిన దాశరథి కృష్ణమాచార్య గారు ఒకవైపు ఎర్ర జెండా పట్టి మరోవైపు వేదాలను… pic.twitter.com/UXzhqhkfD1
3:25 PM, Nov 24, 2023
విమానం ఆగిపోయినా.. ప్రభుత్వంపై ఏడుపా?
- పవన్ కళ్యాణ్ విశాఖ పర్యటనపై జనసేన రాజకీయం
- బేగంపేట నుంచి విశాఖకు రావాల్సిన ప్రత్యేక విమానంలో సాంకేతిక లోపం
- లోపం ఉందని తెలియడంతో ప్రత్యేక విమానాన్ని రద్దు చేసిన ఎయిర్‌పోర్టు అధికారులు
- విశాఖలో పవన్ పర్యటనను ప్రభుత్వం అడ్డుకుంది : జనసేన కేవీఎస్ఎన్ రాజు
- ఎయిర్ పోర్టు అధికారులు రద్దు చేసేలా కొందరు సమాచారం ఇచ్చారు : రాజు
- జనసేన ఆరోపణలు హస్యాస్పదం : YSRCP
- ఒక విమానాన్ని అనుమతించాలా? లేదా? అన్నది ఎయిర్‌పోర్ట్ అధికారుల నిర్ణయం
- అయినా పవన్ కళ్యాణ్ విశాఖకు వస్తే ఎవరికి అభ్యంతరం?
- ప్రభుత్వంపై బురద జల్లి పవన్ కళ్యాణ్ గ్రాఫ్ పెంచుకోవాలన్న మీ కక్కుర్తికి ఇదే నిదర్శనం
2:55 PM, Nov 24, 2023
విశాఖపై విష ప్రచారం
- విశాఖ : మిలినియం టవర్స్‌పై పచ్చమీడియా, టీడీపీ సోషల్ మీడియా తప్పుడు ప్రచారం
- కంపెనీలు వెళ్లిపోతున్నాయంటూ దుష్ప్రచారం
- మిలినియం టవర్స్‌లో ఉన్న కంపెనీలకు ఎలాంటి నోటీసులూ ఇవ్వని ప్రభుత్వం
- టవర్ - ఏలో కొనసాగుతున్న కాండియట్ బిజినెస్ సర్వీసెస్ ఇండియా కంపెనీ
- మాకు ఎలాంటి నోటీసులు రాలేదని, స్పష్టంచేసిన కాండియట్ బిజినెస్ సర్వీసెస్
- మా ఉద్యోగులు చక్కగా పనిచేస్తున్నారని వెల్లడించిన కాండియట్
- ప్రస్తుతం టవర్ -బిలో ఎలాంటి కంపెనీలూ లేవు
- ఈ మధ్యే ప్రభుత్వానికి అప్పగింత
- ఖాళీ ఉన్న కార్యాలయాలనే పరిపాలన కోసం వినియోగించాలని నిర్ణయం
- విశాఖలో పరిపాలన అనగానే తెగబడి తప్పుడు ప్రచారం చేస్తున్న ఎల్లో మీడియా
2:35 PM, Nov 24, 2023
విశాఖను ఆశీర్వదించాలే తప్ప.. విష ప్రచారం వద్దు : సీదిరి
- శ్రీకాకుళం జిల్లాలో మంత్రి సీదిరి అప్పలరాజు
- విశాఖ రాజధాని ఉత్తరాంధ్ర వాసుల చిరకాల కల.
- గతం లో ప్రజల ఆకాంక్ష తీరక సాయుధ పోరాటం చేసిన చరిత్ర వుంది.
- సీఎం జగన్ ప్రజల ఆకాంక్ష తీర్చారు.
- విశాఖ రాజధానిలో పరిపాలన శాఖల కార్యాలయాల కోసం భవనాలు సమకూర్చితే పచ్చ మీడియా సిగ్గులేకుండా కబ్జా అని రాస్తోంది
- చంద్రబాబు, లోకేష్, రామోజీ రావు, పవన్ కళ్యాణ్ హైదరాబాద్‌లో ఉండి ఏపీలో ప్రజల్ని నిర్దేశిస్తారా.?
- ఉత్తరాంధ్ర తెలుగుదేశం నాయకులు బానిస బ్రతుకులు బ్రతకడం అవసరమా.?
- ఏపీలో ఆధార్ కార్డ్ లేని వాళ్లు మనకు రాజధాని వద్దు అంటుంటే టీడీపీ లో ఉండటానికి సిగ్గు లేదా.?
- ఇక్కడ వలసలు నివారించాలి అంటే గొప్ప రాజకీయ నిర్ణయం జరగాలి. ఇతర ప్రాంతాలతో సరి తూగాలంటే విశాఖ రాజధాని అవ్వాల్సిందే.!
- ఈ ప్రాంత అభివృద్ధికి కావాల్సిన పనులు సీఎం జగన్ చేస్తుంటే ఎందుకు అడ్డుపడతారు.?
- విశాఖ లో ఐటీ ఇండస్ట్రీ దివంగత ముఖ్యమంత్రి డా.YSR వలన వచ్చింది.
- వైజాగ్‌కు దేశంలోనే పెద్ద పారిశ్రామిక వేత్తలు అంబానీ, అదానీ లాంటి వాళ్లను సీఎం జగన్ తీసుకొచ్చారు
1:30 PM, Nov 24, 2023
కోర్టులతో ఆటలా.? ఇది సరికాదు.!
- ఎస్సై నియామకాల వివాదంపై ఏపీ హైకోర్టులో తెలుగుదేశం మద్ధతుదారు న్యాయవాది జడ శ్రావణ్ పిటిషన్
- మాన్యువల్‌గా చేసిన కొలతల ప్రక్రియను తప్పుబట్టిన న్యాయవాది జడ శ్రావణ్
- పిటిషన్ వేయడంతో మరోసారి ఎస్సై అభ్యర్థులకు కొలతల ప్రక్రియ చేపట్టాలని సూచించిన హైకోర్టు
- హైకోర్టు సూచనలతో ఎస్సై అభ్యర్థులకు మరోసారి కొలతల ప్రక్రియ, వీడియోను కోర్టుకు సమర్పించిన ప్రభుత్వం
- అభ్యర్ధులకు ఎత్తు అంశంలో అన్యాయం జరగలేదన్న ఏపీ ప్రభుత్వం
- 45 వేల మంది యువత భవిష్యత్ కు సంబంధించిన అంశమని, స్టే ఎత్తివేయాలని హైకోర్టును అభ్యర్ధించిన ఏపీ ప్రభుత్వం
- హైకోర్టు సమక్షంలో అభ్యర్ధులకు తిరిగి ఎత్తు కొలుస్తామన్న జడ్జి
- అభ్యర్ధులు తప్పుడు ఆరోపణలు చేసినట్లు నిరూపితమైతే ఒక్కో అభ్యర్ధికి రూ.లక్ష జరిమానా విధిస్తామన్న హైకోర్టు
- ఈ నెల 29న ఎంతమంది హాజరవుతారో లేఖ పూర్వకంగా తెలపాలని పిటిషనర్ తరపు న్యాయవాది జడ శ్రావణ్ కు హైకోర్టు ఆదేశాలు
- తదుపరి విచారణను ఈ నెల 29కి వాయిదా వేసిన ఏపీ హైకోర్టు
12:00 PM, Nov 24, 2023
విశాఖపై విషం చిమ్ముతోన్న ఈనాడు, రామోజీ
నిజాలు మీరే గమనించండి
ఈనాడు రాసిందేంటీ?
విధ్వంసక విధానాలతో ఇప్పటికే HSBC వంటి ఐటీ సంస్థలు విశాఖను వదిలి వెళ్లిపోయాయి.
ఒకసారి నిజాలేంటో పరిశీలిస్తే..
2016లో ఇండియాలో 24 బ్రాంచ్‌లను మూసేయాలని HSBC నిర్ణయం తీసుకుంది : ది హిందూ దిన పత్రిక
(HSBC India to shut down 24 branches -The Hindu May 20, 2016 )
ఏడాదిన్నర కింద కంపెనీలో చోటు చేసుకున్న మార్పుల మూలంగా ప్రపంచవ్యాప్తంగా బ్రాంచీలను కుదించాలని బోర్డు నిర్ణయం తీసుకుంది.
మన దేశంలో చెన్నై, కోల్‌కతాతో పాటు విశాఖ శాఖనూ మూసేయాలని నిర్ణయించింది.
(News 18, Dec 16 2021)
ఇందులో సీఎం జగన్‌కు సంబధం ఏంటీ? విశాఖలో HSBC బ్రాంచ్‌కు ప్రభుత్వానికి ఎలా ముడిపెడతారు?
11:50 AM, Nov 24, 2023
ఇసుక కుంభకోణం కేసు 30వ తేదికి వాయిదా
- ఇసుక కుంభకోణంలో చంద్రబాబు బెయిల్ పిటిషన్‌పై విచారణ వాయిదా
- ఈనెల 30వ తేదీకి విచారణ వాయిదా వేసిన ఏపీ హైకోర్టు
11:49 AM, Nov 24, 2023
ఇన్నర్ రింగ్ రోడ్ కేసు 29కి వాయిదా
- ఇన్నర్ రింగ్ రోడ్ కేసులో చంద్రబాబు ముందస్తు బెయిల్ పై విచారణ వాయిదా
- విచారణను ఈనెల 29కి వాయిదా వేసిన హైకోర్టు
- చంద్రబాబుపై తొందరపాటు చర్యలు తీసుకోవద్దని హైకోర్టు ఆదేశం
- కేసులో తదుపరి ఉత్తర్వులు వచ్చే వరకు చర్యలు తీసుకోవద్దని హైకోర్టు ఆదేశం
11:45 AM, Nov 24, 2023
అసలు సంగతి ఇదా.. నారాయణ
- ఏపీలో మేము టీడీపీ కలవాలనుకుంటున్నాం : సీపీఐ నారాయణ
- కానీ టీడీపీ పక్క చూపులు చూస్తుంది
- బీజేపీతో టీడీపీని కలిపేందుకు మధ్యవర్తిత్వం చేస్తున్నారు
- బీజేపీ, టీడీపీ, జనసేన కలిసి పోటీ చేస్తే ఏపీలో మళ్లీ సీఎం జగనే అధికారంలోకి వస్తారు : నారాయణ
11:40 AM, Nov 24, 2023
సుప్రీంకోర్టులో చంద్రబాబు బెయిల్ రద్దు సవాల్ పిటిషన్
- స్కిల్ డెవలప్ మెంట్ కేసులో చంద్రబాబు బెయిల్ రద్దు పిటిషన్‌ను సుప్రీంకోర్టులో మెన్షన్ చేసిన ఏపీ సీఐడీ
- తమ పిటిషన్‌ను త్వరగా విచారించాలని లేఖ ద్వారా సీజేఐని కోరిన ఏపీ సీఐడీ తరపు న్యాయవాదులు
- చంద్రబాబు బెయిల్ రద్దు పిటిషన్ సుప్రీంకోర్టులో మంగళవారం విచారణకు వస్తుందని భావిస్తున్న ఏపీ సీఐడీ
- ఈ కేసులో ఇప్పటికే చంద్రబాబుకు బెయిల్ ఇచ్చిన ఏపీ హైకోర్టు
- హైకోర్టు తీర్పును సవాల్ చేస్తూ సుప్రీంకోర్టులో సీఐడీ పిటిషన్
10:40 AM, Nov 24, 2023
470 పేజీల అఫిడవిట్ దాఖలు
- అమరావతి ఇన్నర్ రింగ్ రోడ్డు అలైన్మెంట్ కుంభకోణంలో చంద్రబాబు దాఖలు చేసిన పిటిషన్ పై హైకోర్టులో నేడు విచారణ
- ఐఆర్ఆర్ కేసులో చంద్రబాబుకు ముందస్తు బెయిల్ ఇవ్వొద్దని కోరిన సీఐడీ
- ఏపీ హైకోర్టులో అడిషనల్ అఫిడవిట్ దాఖలు
- 470 పేజీలతో అడిషినల్ అఫిడవిట్ దాఖలు చేసిన ఏపీ సీఐడీ
09:56 AM, Nov 24, 2023
సిక్కోలు కాదు.. వైజాగ్‌కే స్టాప్
- పాదయాత్ర విషయంలో కొడుక్కు సర్ది చెప్పలేక తలపట్టుకుంటోన్న చంద్రబాబు
- శ్రీకాకుళంలోని ఇచ్ఛాపురం వరకు యువగళం పాదయాత్ర నిర్వహించాలన్న చంద్రబాబు
- అంతదూరం నడవలేను, వైజాగ్‌తో సరిపెడతానంటోన్న లోకేష్ బాబు
- ఇప్పటికే చాలా దూరం నడిచాను, ఇక నా వల్ల కాదంటున్న లోకేష్
- పైగా గతంలో చంద్రబాబు కూడా వైజాగ్ వరకే యాత్రను చుట్టేసిన వైనాన్ని గుర్తు చేస్తోన్న లోకేష్
- మధ్యలో వదిలేశానన్న అపకీర్తి లేకుండా యువగళాన్ని విశాఖలో వైండ్ అప్ చేయాలన్న యోచనలో లోకేష్
- ఎంత నడిచినా, ఏం చేసినా డిసెంబర్ వరకేనంటోన్న చినబాబు
08:59 AM, Nov 24, 2023
నేడు చంద్రబాబు ముందస్తు బెయిల్ పిటిషన్లపై హైకోర్టులో విచారణ
- ఇసుక కేటాయింపులు, ఐఆర్ఆర్ కేసుల్లో విచారించనున్న ఏపీ హైకోర్టు
- నేడు హైకోర్టులో అడిషనల్ అఫిడవిట్ ఫైల్ చేయనున్న ఏపీ సీఐడీ
- ఐఆర్ఆర్ కేసులో చంద్రబాబుకు ముందస్తు బెయిల్ ఇవ్వొద్దని కోరనున్న సీఐడీ
08:52 AM, Nov 24, 2023
తెలంగాణలో పవన్ కళ్యాణ్ కొత్త సమీకరణాలు
- భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో పవన్ కళ్యాణ్ వింత విచిత్ర ప్రసంగం
- తెలంగాణలో, కేంద్రంలో బీజేపీ అధికారంలోకి రావాలన్న పవన్ కళ్యాణ్
- ఆంధ్రప్రదేశ్ రాజకీయాల ఊసెత్తని పవన్ కళ్యాణ్
- కేసీఆర్, కేటీఆర్, రేవంత్ రెడ్డి, హనుమంత రావుతో నాకు పరిచయాలున్నాయి : పవన్
- పరిచయాలు వేరు రాజకీయాలు వేరు : పవన్
- నేను మోదీ నాయకత్వంలోనే పని చేస్తా : పవన్
- నీను కెసిఆర్‌ను, BRSను తిట్టడం లేదు : పవన్
- ఎందుకంటే.. ఏపీలో లాగా బాగా తిరిగితే తప్ప BRS గురించి నాకు అర్థం కాదు: పవన్
- తెలంగాణ లో కూడా ఇక నుంచి పూర్తి స్థాయి లో తిరుగుతా
- ఇవాళ నుంచే మొదలు పెడుతున్నా ఇక కాస్కోండి : పవన్
- ఆంధ్రప్రదేశ్ రాజకీయంపై వచ్చిన వారి కేకలు
- ఇబ్బందికర పరిస్థితి తప్పించేందుకు జనసేన కార్యకర్తల పోటీ నినాదాలు
- ఆంధ్రప్రదేశ్‌కు కాబోయే సీఎం పవన్ అంటూ జనసేన నేతల నినాదాలు
08:46 AM, Nov 24, 2023
తమ్ముడు గారు... మన దారి తెలంగాణలో ఎటు.? ఏపీలో ఎటు.?
- పవన్ వ్యాఖ్యలపై పార్టీలో, కార్యకర్తల్లో అయోమయం
- వారం రోజుల్లో తెలంగాణ ఎన్నికలు ముగిసిపోతాయి
- జనసేన అభ్యర్థులు పోటీ చేసిందే ఎనిమిది స్థానాల్లో
- పవన్ కళ్యాణ్ ప్రచారానికి వచ్చిందే అత్యంత ఆలస్యంగా
- పవన్ కళ్యాణ్ ఆలస్యంగా ఇప్పుడొచ్చి తొడలు కొట్టడమెందుకు?
- తెలంగాణలో ఎన్నికలు ముగిసాకా పవన్ కళ్యాణ్ తిరిగితే ఏమొస్తుంది?
- పైగా కాస్కోండి అని పవన్ సవాల్ విసిరితే ఎవరు పట్టించుకుంటారు?
- నేను నమ్ముకున్న సిద్ధాంతానికి వెనుకడుగు వేసే వాడిని కాదని స్టేట్‌మెంట్ ఇస్తే జనం విశ్వసిస్తారా?
- ఇప్పటివరకు జనసేన సిద్ధాంతమేంటీ? పవన్ సిద్ధాంతమేంటీ?
- ఏ పార్టీతో మనం పొత్తులో ఉన్నాం? ఎవరి వెంట తిరుగుతున్నాం?
- 2014లో ఎందుకు పోటీ చేయలేదు? 2019లో ఒంటరిగా ఎందుకు దిగాం?
- ఇప్పుడు ఏం కారణం చెప్పి 2023లో పవన్ కళ్యాణ్ చంద్రబాబుతో పొత్తు అని ప్రకటించాడు?
- సిద్ధాంతం పక్కనబెట్టి పవన్‌కళ్యాణ్‌లోనయినా స్పష్టత ఉందా?
- తెలంగాణలో ఎవరికి ఓటేయమంటున్నాం? ఏపీలో ఏం కావాలని అడుగుతాం?
- ఆలస్యంగా రావడమే కాకుండా.. మిగతా నియోజకవర్గాల్లో డిటో అనుకోవాలంటూ మెసెజ్‌లేంటీ?
- పార్ట్‌టైం పొలిటిషియన్ అని చాటుకోవడమెందుకు?
- మద్ధతు ఇవ్వాలి అంటున్నారు కానీ, ఓటేయమని ఎందుకు అడగడం లేదు?
- నోరు తెరిస్తే గద్దర్ ఆశయాన్ని గెలిపించమంటున్నారు.. గద్దర్ బిడ్డ కాంగ్రెస్ అభ్యర్థి అన్న విషయం మరిచిపోతున్నారా?
- అసలు మద్ధతు ఇవ్వాల్సింది బీజేపీకా? లేక చంద్రబాబు సూచనల మేరకు గద్దర్ పార్టీ అయిన కాంగ్రెస్‌కా?
07:33 AM, Nov 24, 2023
నేడు సీజేఐ ముందు చంద్రబాబు బెయిలు రద్దు పిటిషన్ ప్రస్తావన
- స్కిల్ డెవలప్‌మెంట్ స్కాంలో హైకోర్టు ఇచ్చిన బెయిలు రద్దు చేయాలన్న పిటిషన్ త్వరగా విచారించాలని సుప్రీంకోర్టును కోరనున్న ఏపీ సీఐడీ
- ఇటీవల దాఖలు చేసిన పిటిషన్‌ను సీజేఐ ధర్మాసనం ముందు ప్రస్తావించనున్న సీఐడీ
- ఈ మేరకు మెన్షనింగ్ జాబితాలో చేర్చాలని గురువారం రిజిస్ట్రీకి సీఐడీ తరఫు న్యాయవాది విజ్ఞప్తి
07:30 AM, Nov 24, 2023
ప్రివిలేజ్ ఫీజు తొలగింపుతో టీడీపీ నేతలు లబ్ధి పొందారు
చంద్రబాబు ఆదేశాల మేరకే ఫీజు తొలగింపు ఫైల్ సిద్ధమైంది
ఫీజు తొలగింపు వల్ల ఖజానాకు రూ.1,299 కోట్ల మేర నష్టం వాటిల్లింది
ఇది పూర్తిగా రాజకీయ నిర్ణయం
దర్యాప్తు అధికారులను టీడీపీ నేతలు బెదిరిస్తున్నారు
చంద్రబాబు, రవీంద్రకు బెయిల్ ఇస్తే దర్యాప్తు ముందుకెళ్లదు
వారి ముందస్తు బెయిల్ పిటిషన్లు కొట్టేయండి
హైకోర్టుకు నివేదించిన అడ్వొకేట్ జనరల్ శ్రీరామ్
విచారణ సోమవారానికి వాయిదా
ప్రపంచంలో అతిపెద్ద డీప్‌ఫేక్ చంద్రబాబే. 14 ఏళ్ళు ముఖ్యమంత్రిగా చేసింది చెప్పుకోవడానికి ఏమీ లేదు కాబట్టి అధికారం కోసం అడ్డదారులు వెతుక్కుంటున్నాడు. ఈ సవాలక్ష రోగాల బాబుని ప్రజలు నమ్మే స్థితిలో లేరు.#CorruptBabuNaidu #GajaDongaChandrababu#EndofTDP pic.twitter.com/OtAOUxJNtc
— YSR Congress Party (@YSRCParty) November 23, 2023
07:28 AM, Nov 24, 2023
స్కిల్ స్కాంలో ఇప్పటివరకు ఏం జరిగింది?
టీడీపీ ప్రభుత్వ హయాంలో జరిగిన స్కిల్ స్కాం
నిరుద్యోగులకు శిక్షణ పేరిట తెరపైకి ఓ ఒప్పందం
జర్మనీ కేంద్రంగా ఉన్న ప్రఖ్యాత టెక్నాలజీ కంపెనీ సీమెన్స్‌తో ఒప్పందం అంటూ ప్రచారం
సీమెన్స్ 90% ఇస్తుందని, తాము కేవలం 10% మాత్రమే చెల్లించాలని అప్పటి టిడిపి ప్రభుత్వం ప్రచారం
ఆఘామేఘాల మీద 10% వాటా కింద రూ.371 కోట్లు మధ్యవర్తి కంపెనీలకు చెల్లింపు
అధికారులు అంగీకరించకపోయినా బలవంతం చేసిన చంద్రబాబు, స్వయంగా 13 చోట్ల సంతకాలు, ఇదే విషయాన్ని ఫైళ్లలో రాసిన అధికారులు
షెల్ కంపెనీల ద్వారా రూ 241 కోట్ల పక్కదారి
విచారణలో అసలు తమకు ఒప్పందంతో సంబంధమే లేదని లిఖిత పూర్వకంగా తెలిపిన సీమెన్స్
పన్ను చెల్లించకపోవడంతో కుట్రను గమనించిన డైరెక్టరేట్ జనరల్ (GST ఇంటెలిజెన్స్)
ఆధారాలు సేకరించి నాటి చంద్రబాబు ప్రభుత్వానికి కుంభకోణం జరిగిందని తెలిపిన GST
విషయం బయటకు రావడంతో తేలు కుట్టిన దొంగలా చంద్రబాబు
స్వయంగా దర్యాప్తు చేయడంతో పాటు రాష్ట్ర ప్రభుత్వాన్ని అప్రమత్తం చేసిన GST శాఖ
నిధులన్నీ సూట్‌కేస్ కంపెనీల ద్వారా పక్కదారి పట్టాయని గుర్తించిన ఇన్‌కమ్‌టాక్స్ శాఖ
కొల్లగొట్టిన సొమ్ములో రూ. 27 కోట్లు నేరుగా టీడీపీ బ్యాంకు ఖాతాకు చేరినట్టు బ్యాంకు స్టేట్‌మెంట్లను గుర్తించిన CID
రికార్డులను ఏసీబీ కోర్టుకు సమర్పించిన సీఐడి
ఈ కుంభకోణంపై జాతీయ దర్యాప్తు సంస్థ ఈడీ విచారణ చేపట్టి పలువురి అరెస్ట్
చంద్రబాబుపై 120(బి), 166, 167,418, 420, 465, 468, 201, 109, రెడ్ విత్ 34 and 37 ఐపీసీ సెక్షన్ల కింద కేసు నమోదు
సీఆర్‌పీసీ సెక్షన్ 50(1) కింద నోటీస్ ఇచ్చిన సీఐడీ
1988 ప్రివెన్షన్ ఆఫ్ కరెప్షన్ చట్టం కింద సెప్టెంబర్ 9వ తేదీన నంద్యాలలో చంద్రబాబును అరెస్ట్ చేసిన సీఐడీ పోలీసులు
సెప్టెంబర్ 10న రాజమండ్రి సెంట్రల్ జైలుకు తరలింపు
ఐదు పర్యాయాలు జ్యుడీషియల్ రిమాండ్ పొడిగింపు
రిమాండ్ ఖైదీగా 7691 నెంబర్‌తో 52 రోజులపాటు చంద్రబాబు
కంటికి శస్త్ర చికిత్స అభ్యర్థన మేరకు మానవతా దృక్ఫథంతో అక్టోబర్ 31వ తేదీన నాలుగు వారాల పాటు మధ్యంతర బెయిల్ మంజూరు చేసిన ఏపీ హైకోర్టు
నవంబర్ 20న రెగ్యులర్ బెయిల్ మంజూరు చేసిన హైకోర్టు
07:12 AM, Nov 24, 2023
చంద్రబాబు ముఠాకు ఎదురుదెబ్బ
- ఫైబర్‌నెట్ కేసులో నిందితుల ఆస్తుల అటాచ్‌మెంట్
- ఏడు స్థిరాస్తుల అటాచ్‌మెంట్‌కు న్యాయస్థానం అనుమతి
- ఈ కేసులో నిందితులుగా ఉన్నచంద్రబాబు సన్నిహితుల ఆస్తుల అటాచ్‌మెంట్‌కు ఏసీబీ న్యాయస్థానం అనుమతి
- సీఐడీ దాఖలు చేసిన అటాచ్‌మెంట్ పిటిషన్‌ను ఆమోదిస్తూ న్యాయస్థానం ఉత్తర్వులు
- ఫైబర్‌నెట్ కేసులో చంద్రబాబు సహా పలువురిపై సీఐడీ కేసు నమోదు
- ఇందులో చంద్రబాబు ఏ–25, ఏ–1 వేమూరి హరికృష్ణకు చెందిన టెరాసాఫ్ట్ కంపెనీ, ఏ–13 టెరాసాఫ్ట్ కంపెనీ ఎండీ తుమ్మల గోపీచంద్
Comments
Please login to add a commentAdd a comment