Nov 23rd: చంద్రబాబు కేసు అప్‌డేట్స్‌ | TDP Chandrababu Cases, Petitions And Political Updates On 23 November | Sakshi
Sakshi News home page

Nov 23rd: చంద్రబాబు కేసు అప్‌డేట్స్‌

Published Thu, Nov 23 2023 7:06 AM | Last Updated on Thu, Nov 23 2023 5:17 PM

TDP Chandrababu Cases, Petitions And Political Updates On 23 November - Sakshi

TDP Chandrababu Cases Petitions And Political Updates..

4:50 PM, Nov 23, 2023
హైకోర్టులో మద్యం కేసు

  • మద్యం కేసులో చంద్రబాబు ముందస్తు బెయిల్ పిటిషన్ విచారణ సోమవారానికి వాయిదా
  • మద్యం కేసులో ప్రభుత్వం తరపున వాదనలు వినిపించిన ఏజీ
  • చంద్రబాబు తరపున సీనియర్ న్యాయవాది నాగముత్తు వాదనలు
  • ప్రివిలేజ్ ఫీజు రద్దు చేయాలని ఎక్సైజ్ కమిషనర్ ప్రతిపాదన పంపారు
  • ఎక్సైజ్ కమిషనర్ ప్రతిపాదనను క్యాబినెట్ ఆమోదించింది
  • ఫైల్ పై అప్పటి రెవెన్యూ స్పెషల్ సీఎస్ సంతకాలు చేశారు
  • ప్రివిలేజ్ ఫీజు రద్దు చంద్రబాబు వ్యక్తిగత నిర్ణయం కాదు: నాగముత్తు

03:56 PM, Nov 23, 2023
హైకోర్టులో మద్యం కేసు

  • చంద్రబాబు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు జరిగిన మద్యం కుంభకోణం
  • ఇష్టానుసారంగా మద్యం కంపెనీలకు అనుమతి ఇచ్చిన చంద్రబాబు
  • ఈ కేసులో ముందస్తు బెయిల్ మంజూరు చేయాలంటూ బాబు, కొల్లు రవీంద్ర పిటిషన్లు
  • బాబు, కొల్లు రవీంద్ర ముందస్తు బెయిల్ పిటిషన్లపై హైకోర్టులో విచారణ
  • చంద్రబాబు నిర్ణయాల వల్ల రాష్ట్ర ఖజనాకు రూ.1500 కోట్ల నష్టం వాటిల్లిందని తేల్చిన కాగ్‌
  • టిడిపి నేతల బార్లు, డిస్టిల్లరీలకు అనుకూలంగా చంద్రబాబు నిర్ణయాలు
  • (చదవండి : చంద్రబాబు సృష్టించిన మద్యం కంపెనీలు)

03:33 PM, Nov 23, 2023
రింగ్‌ రోడ్డు అక్రమ మలుపుల కేసు హైకోర్టులో విచారణ

  • ఇన్నర్ రింగ్ రోడ్డు కేసులో చంద్రబాబు ముందస్తు బెయిల్ పిటిషన్ పై విచారణ
  • చంద్రబాబు తరపున హైకోర్టులో టిడిపి లీగల్‌ టీం వాదనలు
  • విచారణను రేపటికి వాయిదా వేసిన హైకోర్టు

03:06 PM, Nov 23, 2023
మీకో దండం పవన్‌ బాబు.. మా దారి మేం చూసుకుంటాం

పవన్‌ కళ్యాణ్‌ తీరుతో పార్టీకి జనసైనికుల గుడ్‌బై

  • కృష్ణా జిల్లా గుడివాడ జనసేన పార్టీకి బిగ్ షాక్
  • జనసేన పార్టీకి గుడ్ బై చెప్పిన జనసైనికులు
  • తన అనుచర గణంతో కలిసి జనసేన పార్టీ సభ్యత్వానికి రాజీనామా చేసిన డాక్టర్ మాచర్ల రామకృష్ణ

డాక్టర్ మాచర్ల రామకృష్ణ (జనసేన ఆర్కే)

  • పదిమందికి మేలు చేసే వ్యక్తులకు మద్దతు ఇస్తాను
  • గుడివాడ ప్రజలకు మంచి జరగడమే మా అంతిమ లక్ష్యం
  • కృష్ణాజిల్లాలో కార్యకర్తలను పట్టించుకునే నాయకుడు లేడు
  • గుడివాడలో జనసేన నేతలు గ్రూపులుగా విడిపోయి వ్యక్తిగత ప్రయోజనాలకే ప్రాధాన్యమిస్తున్నారు
  • పార్టీ నేతల వ్యవహారశైలి మారకుంటే జనసేనలో నాయకులే మిగులుతారు
  • పదేళ్లుగా పవన్ పేరు జపించాం,జనసేన జెండా భుజాల పై మోశాం
  • పార్టీ పేరు మీద యువత అంతా కలిసి వేలాది సేవా కార్యక్రమాలు నిర్వహించాం
  • జిల్లాలో కార్యకర్తకు భరోసా ఇచ్చే నాయకుడేడి?
  • జిల్లా కమిటీలు కూడా వేయలేని  స్థితిలో జనసేన పార్టీ ఉంది.!
  • జిల్లా నేతల వ్యవహార శైలి నచ్చకే పార్టీ సభ్యత్వానికి రాజీనామా చేస్తున్నాం
     

02:56 PM, Nov 23, 2023
తమ్ముడు గారు... మన దారి తెలంగాణలో ఎటు.? ఏపీలో ఎటు.?

  • పవన్‌ వ్యాఖ్యలపై పార్టీలో, కార్యకర్తల్లో అయోమయం
  • వారం రోజుల్లో తెలంగాణ ఎన్నికలు ముగిసిపోతాయి
  • జనసేన అభ్యర్థులు పోటీ చేసిందే ఎనిమిది స్థానాల్లో
  • పవన్‌ కళ్యాణ్‌ ప్రచారానికి వచ్చిందే అత్యంత ఆలస్యంగా
  • పవన్‌ కళ్యాణ్‌ ఆలస్యంగా ఇప్పుడొచ్చి తొడలు కొట్టడమెందుకు?
  • తెలంగాణలో ఎన్నికలు ముగిసాకా పవన్‌ కళ్యాణ్‌ తిరిగితే ఏమొస్తుంది?
  • పైగా కాస్కోండి అని పవన్‌ సవాల్‌ విసిరితే ఎవరు పట్టించుకుంటారు?
  • నేను నమ్ముకున్న సిద్ధాంతానికి వెనుకడుగు వేసే వాడిని కాదని స్టేట్‌మెంట్‌ ఇస్తే జనం విశ్వసిస్తారా?
  • ఇప్పటివరకు జనసేన సిద్ధాంతమేంటీ? పవన్‌ సిద్ధాంతమేంటీ?
  • ఏ పార్టీతో మనం పొత్తులో ఉన్నాం? ఎవరి వెంట తిరుగుతున్నాం?
  • 2014లో ఎందుకు పోటీ చేయలేదు? 2019లో ఒంటరిగా ఎందుకు దిగాం?
  • ఇప్పుడు ఏం కారణం చెప్పి 2023లో పవన్‌ కళ్యాణ్‌ చంద్రబాబుతో పొత్తు అని ప్రకటించాడు?
  • సిద్ధాంతం పక్కనబెట్టి పవన్‌కళ్యాణ్‌లోనయినా స్పష్టత ఉందా?
  • తెలంగాణలో ఎవరికి ఓటేయమంటున్నాం? ఏపీలో ఏం కావాలని అడుగుతాం?
  • ఆలస్యంగా రావడమే కాకుండా.. మిగతా నియోజకవర్గాల్లో డిటో అనుకోవాలంటూ మెసెజ్‌లేంటీ?
  • పార్ట్‌టైం పొలిటిషియన్‌ అని చాటుకోవడమెందుకు?
  • మద్ధతు ఇవ్వాలి అంటున్నారు కానీ, ఓటేయమని ఎందుకు అడగడం లేదు?
  • నోరు తెరిస్తే గద్దర్‌ ఆశయాన్ని గెలిపించమంటున్నారు.. గద్దర్‌ బిడ్డ కాంగ్రెస్‌ అభ్యర్థి అన్న విషయం మరిచిపోతున్నారా?
  • అసలు మద్ధతు ఇవ్వాల్సింది బీజేపీకా? లేక చంద్రబాబు సూచనల మేరకు గద్దర్‌ పార్టీ అయిన కాంగ్రెస్‌కా?

02:36 PM, Nov 23, 2023
తెలంగాణలో పవన్‌ కళ్యాణ్‌ కొత్త సమీకరణాలు

  • భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో పవన్ కళ్యాణ్ వింత విచిత్ర ప్రసంగం
  • తెలంగాణలో, కేంద్రంలో బీజేపీ అధికారంలోకి రావాలన్న పవన్ కళ్యాణ్‌
  • ఆంధ్రప్రదేశ్‌ రాజకీయాల ఊసెత్తని పవన్‌ కళ్యాణ్‌
  • కేసీఆర్, కేటీఆర్, రేవంత్ రెడ్డి, హనుమంత రావుతో నాకు  పరిచయాలున్నాయి : పవన్‌
  • పరిచయాలు వేరు రాజకీయాలు వేరు : పవన్‌
  • నేను మోదీ నాయకత్వంలోనే పని చేస్తా : పవన్‌
  • నీను కెసిఆర్‌ను, BRSను తిట్టడం లేదు : పవన్‌
  • ఎందుకంటే.. ఏపీలో లాగా బాగా తిరిగితే తప్ప BRS గురించి నాకు అర్థం కాదు: పవన్‌
  • తెలంగాణ లో కూడా ఇక నుంచి పూర్తి స్థాయి లో తిరుగుతా
  • ఇవాళ నుంచే మొదలు పెడుతున్నా ఇక కాస్కోండి : పవన్‌
  • ఆంధ్రప్రదేశ్‌ రాజకీయంపై వచ్చిన వారి కేకలు
  • ఇబ్బందికర పరిస్థితి తప్పించేందుకు జనసేన కార్యకర్తల పోటీ నినాదాలు
  • ఆంధ్రప్రదేశ్‌కు కాబోయే సీఎం పవన్ అంటూ జనసేన నేతల నినాదాలు

02:25 PM, Nov 23, 2023
ఏపీ హైకోర్టులో మద్యం కేసు

  • ఏపీ హైకోర్టు: గత ప్రభుత్వంలో జరిగిన మద్యం కుంభకోణం
  • ముందస్తు బెయిల్ మంజూరు చేయాలంటూ చంద్రబాబు నాయుడు, కొల్లు రవీంద్ర పిటిషన్లు
  • హైకోర్టులో సిఐడి తరఫున అడ్వకేట్ జనరల్ శ్రీరామ్ వాదనలు

01:45 PM, Nov 23, 2023
చంద్రబాబు శిష్యులకు పవన్‌ శిష్యుల అల్టిమేటం.!

  • ఏపీ ఎన్నికలకు ముందే తెలుగుదేశం, జనసేనల మధ్య కుల చిచ్చు
  • కూకట్‌పల్లిలో తేడా వస్తే.. ఏపీలో రిటర్న్‌ గిఫ్ట్‌ ఇస్తాం
  • కమ్మ సెటిలర్లకు కాపు సెటిలర్ల బహిరంగ లేఖ
  • కూకట్‌పల్లిలో జనసేన తరపున బరిలో కాపు నాయకుడు ప్రేమ్‌కుమార్‌
  • కూకట్‌పల్లిలో కమ్మ సామాజిక వర్గం ఓట్లకు ఇప్పటికే చంద్రబాబు బ్రీఫింగ్‌
  • కమ్మలంతా కాంగ్రెస్‌కు ఓటేయాలంటూ సూచించిన చంద్రబాబు
  • భగ్గుమంటోన్న కాపులు, జనసేనను బలిపశువు చేయొద్దని వార్నింగ్‌
  • మీరు మమ్మల్ని ఇక్కడ ఓడిస్తే.. మీకు అదే గతి పడుతుందని హెచ్చరిక
  • నిన్నటి నుంచి కూకట్‌పల్లి వాట్సాప్‌ గ్రూప్‌లో సర్క్యులేట్‌ అవుతోన్న లేఖ
  • లేఖను ఇప్పటివరకు ఖండించని కమ్మ, కాపు సామాజిక నేతలు

01:03 PM, Nov 23, 2023
సిక్కోలు కాదు.. వైజాగ్‌కే స్టాప్‌

  • పాదయాత్ర విషయంలో కొడుక్కు సర్ది చెప్పలేక తలపట్టుకుంటోన్న చంద్రబాబు
  • శ్రీకాకుళంలోని ఇచ్ఛాపురం వరకు యువగళం పాదయాత్ర నిర్వహించాలన్న చంద్రబాబు
  • అంతదూరం నడవలేను, వైజాగ్‌తో సరిపెడతానంటోన్న లోకేష్‌ బాబు
  • ఇప్పటికే చాలా దూరం నడిచాను, ఇక నా వల్ల కాదంటున్న లోకేష్‌
  • పైగా గతంలో చంద్రబాబు కూడా వైజాగ్‌ వరకే యాత్రను చుట్టేసిన వైనాన్ని గుర్తు చేస్తోన్న లోకేష్‌
  • మధ్యలో వదిలేశానన్న అపకీర్తి లేకుండా యువగళాన్ని విశాఖలో వైండ్‌ అప్‌ చేయాలన్న యోచనలో లోకేష్‌
  • ఎంత నడిచినా, ఏం చేసినా డిసెంబర్‌ వరకేనంటోన్న చినబాబు

01:03 PM, Nov 23, 2023
ఇన్నర్‌ రింగ్‌రోడ్‌ అలైన్‌మెంట్‌ కేసు.. విచారణ రేపటికి వాయిదా

  • ఇన్నర్‌ రింగ్‌రోడ్‌ అలైన్‌మెంట్‌ స్కాంలో బాబు ముందస్తు బెయిల్‌ పిటిషన్‌
  • ​ముందస్తు బెయిల్‌ పిటిషన్‌పై పూర్తయిన బాబు తరపు లాయర్‌ వాదనలు
  • తదుపరి విచారణ రేపటికి వాయిదా వేసిన హైకోర్టు

10:43 AM, Nov 23, 2023
స్కిల్ డెవలప్‌మెంట్‌లో రూ.241 కోట్లు దోచుకుందెవరు?: మంత్రి బుగ్గన

  • మేఘా సంస్థకు ప్రభుత్వ గ్యారెంటీ పచ్చి అబద్ధం
  • రుణానికి సంబంధించిన పూర్తి బాధ్యత మేఘా సంస్థదే, ప్రభుత్వానికి సంబంధం లేదు
  • ఆరోగ్యశ్రీపై టీడీపీ వెచ్చించింది రూ.5,177 కోట్లు మాత్రమే
  • వైఎస్సార్‌సీపీ ప్రభుత్వం పెట్టిన ఖర్చు రూ.9,514.84 కోట్లు
  • చంద్రబాబు కళ్లల్లో పడటం కోసం ఓ వ్యక్తి ఇష్టమొచ్చినట్లు మాట్లాడుతున్నారు 
  • మేఘా కంపెనీ ప్రభుత్వ గ్యారెంటీతో రూ. 2000 కోట్లు అప్పు తెచ్చుకుందని అర్థం లేని ఆరోపణలు
  • గ్యారంటీ లెటర్ అంటే ఏంటో మీకు కనీస అవగాహన లేదు
  • ఈ విషయం  తప్పు కాదనే ఆర్థిక అంశాలలో అవగాహన ఉన్న మాజీ ఆర్థిక శాఖ మంత్రి యనమల ఎందుకు మాట్లాడటం లేదు.?
  • ఏ పనీ చేయకుండా ఏదో చేస్తున్నామనేలా హైప్ చేసి  స్కిల్ డెవలప్ మెంట్‌లో రూ.241 కోట్లు దోచుకుందెవరు?
  • రాజధాని అమరావతి పేరుతో వేల కోట్లు సంపాదించిందెవరు?
  • ఇన్నర్ రింగ్ రోడ్డుని మెలికలు తిప్పి అక్రమాలకు పాల్పడిందెవరు?
  • సామాన్య ప్రజల్లో మా ప్రభుత్వ సంక్షేమ విధానాలు, పరిపాలనపై ఉన్న అభిమానాన్ని, నమ్మకాన్ని దెబ్బతీయాలనే కుట్ర 
  • అందుకే ప్రైవేట్ సంస్థకు ప్రభుత్వ గ్యారంటీ అంటూ మా మీద బురద చల్లుతున్నారని ప్రజలకు అర్థమయ్యింది.

07:52 AM, Nov 23, 2023
టీడీపీని బతికించడమే అజెండాగా అడుగులు

  • పోలీసులను కొట్టిన కేసులో టీడీపీ నేత బీటెక్‌ రవి అరెస్ట్‌ 
  • రెండు గంటల్లోనే మేజిస్ట్రేట్‌ ఎదుట హాజరు 
  • పోలీసులు కొట్టి ఉంటే మేజిస్ట్రేట్‌కు ఎందుకు చెప్పలేదు?
  • టీడీపీ నేతను అరెస్ట్‌ చేస్తే బీజేపీ నేత సీఎం రమేశ్‌ పరామర్శా!
  • రవిని కొట్టారని, బెదిరించారని దుష్ప్రచారం ఎవరి కోసం? 
  • వైఎస్సార్‌ జిల్లాలో టీడీపీకి పెద్ద దిక్కుగా మారిన సీఎం రమేశ్‌
  • చంద్రబాబు పన్నాగంతోనే మ్యాచ్‌ ఫిక్సింగ్‌ రాజకీయం 

07:33 AM, Nov 23, 2023
ఇన్నర్‌ రింగ్‌రోడ్‌ అలైన్‌మెంట్‌ స్కాంలో బాబు ముందస్తు బెయిల్‌ పిటిషన్‌

  • బాబు ముందస్తు బెయిల్‌ పిటిషన్‌పై ఇవాళ హైకోర్టులో విచారణ
  • గత ప్రభుత్వంలో జరిగిన మద్యం కుంభకోణంలో తమకు ముందస్తు బెయిల్‌ మంజూరు చేయాలంటూ బాబు, కొల్లు రవీంద్ర పిటిషన్‌
  • బాబు, కొల్లు రవీంద్ర ముందస్తు బెయిల్‌ పిటిషన్‌పై ఇవాళ హైకోర్టులో విచారణ

07:19 AM, Nov 23, 2023
చంద్రబాబు మోసాలకు అడ్డుకట్ట వేయాల్సిందే

  • చంద్రబాబు మోసాల నుంచి ఉత్తరాంధ్ర ప్రజలు మేలుకోవాలి : మంత్రి సీదిరి అప్పలరాజు
  • విశాఖను రాజధానిగా చేస్తే చంద్రబాబు అడ్డుకుంటున్నారు
  • విశాఖ రాజధాని అయితే యువతకు ఇక్కడే ఉపాధి లభిస్తుంది
  • ఉత్తరాంధ్ర నుంచి వలసలు ఆగుతాయి
  • విశాఖ రాజధాని అయితే ఇక్కడ భూములకు రేట్లు పెరుగుతాయి
  • ఒక కులం కోసం అమరావతిని రాజధాని చేశారు
  • వైజాగ్ లో రాజధాని వద్దని చంద్రబాబుకు ఎవరైనా చెప్పారా?
  • సిగ్గులేకుండా రామోజీరావు అబద్ధాలు రాస్తున్నారు
  • వెనుకబడిన కులాలు అంటే చంద్రబాబుకు ద్వేషం
  • చంద్రబాబును ఓడించేది ఒక మత్స్యకారుడే
  • మత్స్యకారులను అణగదొక్కాలని చూసిన వ్యక్తి చంద్రబాబు

07:17 AM, Nov 23, 2023
స్కిల్‌ స్కాంలో ఇప్పటివరకు ఏం జరిగింది?

  • టీడీపీ ప్రభుత్వ హయాంలో జరిగిన స్కిల్‌ స్కాం
  • నిరుద్యోగులకు శిక్షణ పేరిట తెరపైకి ఓ ఒప్పందం
  • జర్మనీ కేంద్రంగా ఉన్న ప్రఖ్యాత టెక్నాలజీ కంపెనీ సీమెన్స్‌తో ఒప్పందం అంటూ ప్రచారం
  • సీమెన్స్‌ 90% ఇస్తుందని, తాము కేవలం 10% మాత్రమే చెల్లించాలని అప్పటి టిడిపి ప్రభుత్వం ప్రచారం
  • ఆఘామేఘాల మీద 10% వాటా కింద రూ.371 కోట్లు మధ్యవర్తి కంపెనీలకు చెల్లింపు
  • అధికారులు అంగీకరించకపోయినా బలవంతం చేసిన చంద్రబాబు, స్వయంగా 13 చోట్ల సంతకాలు, ఇదే విషయాన్ని ఫైళ్లలో రాసిన అధికారులు
  • షెల్ కంపెనీల ద్వారా  రూ 241 కోట్ల పక్కదారి
  • విచారణలో అసలు తమకు ఒప్పందంతో సంబంధమే లేదని లిఖిత పూర్వకంగా తెలిపిన సీమెన్స్‌
  • పన్ను చెల్లించకపోవడంతో కుట్రను గమనించిన డైరెక్టరేట్ జనరల్ (GST ఇంటెలిజెన్స్)
  • ఆధారాలు సేకరించి నాటి చంద్రబాబు ప్రభుత్వానికి కుంభకోణం జరిగిందని తెలిపిన GST
  • విషయం బయటకు రావడంతో తేలు కుట్టిన దొంగలా చంద్రబాబు
  • స్వయంగా దర్యాప్తు చేయడంతో పాటు రాష్ట్ర ప్రభుత్వాన్ని అప్రమత్తం చేసిన GST శాఖ
  • నిధులన్నీ సూట్‌కేస్‌ కంపెనీల ద్వారా పక్కదారి పట్టాయని గుర్తించిన ఇన్‌కమ్‌టాక్స్‌ శాఖ
  • కొల్లగొట్టిన సొమ్ములో రూ. 27 కోట్లు నేరుగా టీడీపీ బ్యాంకు ఖాతాకు చేరినట్టు బ్యాంకు స్టేట్‌మెంట్లను గుర్తించిన CID
  • రికార్డులను ఏసీబీ కోర్టుకు సమర్పించిన సీఐడి
  • ఈ కుంభకోణంపై జాతీయ దర్యాప్తు సంస్థ ఈడీ విచారణ చేపట్టి పలువురి అరెస్ట్
  • చంద్రబాబుపై 120(బి), 166, 167,418, 420, 465, 468, 201, 109, రెడ్‌ విత్‌ 34 and 37 ఐపీసీ సెక్షన్ల కింద కేసు నమోదు
  • సీఆర్‌పీసీ సెక్షన్ 50(1) కింద నోటీస్ ఇచ్చిన సీఐడీ
  • 1988 ప్రివెన్షన్ ఆఫ్ కరెప్షన్ చట్టం కింద సెప్టెంబర్‌ 9వ తేదీన నంద్యాలలో చంద్రబాబును అరెస్ట్‌ చేసిన సీఐడీ పోలీసులు
  • సెప్టెంబర్‌ 10న రాజమండ్రి సెంట్రల్‌ జైలుకు తరలింపు
  • ఐదు పర్యాయాలు జ్యుడీషియల్‌ రిమాండ్‌ పొడిగింపు
  • రిమాండ్‌ ఖైదీగా 7691 నెంబర్‌తో 52 రోజులపాటు చంద్రబాబు
  • కంటికి శస్త్ర చికిత్స అభ్యర్థన మేరకు మానవతా దృక్ఫథంతో అక్టోబర్‌ 31వ తేదీన నాలుగు వారాల పాటు మధ్యంతర బెయిల్‌ మంజూరు చేసిన ఏపీ హైకోర్టు
  • నవంబర్‌ 20న రెగ్యులర్‌ బెయిల్‌ మంజూరు చేసిన హైకోర్టు

07:12 AM, Nov 23, 2023
చంద్రబాబు ముఠాకు ఎదురుదెబ్బ 

  • ఫైబర్‌నెట్‌ కేసులో నిందితుల ఆస్తుల అటాచ్‌మెంట్‌ 
  • ఏడు స్థిరాస్తుల అటాచ్‌మెంట్‌కు న్యాయస్థానం అనుమతి  
  • ఈ కేసులో నిందితులుగా ఉన్నచంద్రబాబు సన్నిహి­తుల ఆస్తుల అటాచ్‌మెంట్‌కు ఏసీబీ న్యాయ­స్థానం అనుమతి
  • సీఐడీ దాఖలు చేసిన అటాచ్‌మెంట్‌ పిటిషన్‌ను ఆమోదిస్తూ న్యాయ­స్థానం ఉత్తర్వులు
  • ఫైబర్‌నెట్‌ కేసులో చంద్రబాబు సహా పలువురిపై సీఐడీ కేసు నమోదు
  • ఇందులో చంద్ర­బాబు ఏ–25, ఏ–1 వేమూరి హరికృష్ణకు చెందిన టెరాసాఫ్ట్‌ కంపెనీ, ఏ–13 టెరా­సాఫ్ట్‌ కంపెనీ ఎండీ తుమ్మల గోపీచంద్‌

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement