'స్కిల్‌' దొంగ బాబే  | AP CID On Chandrababu APSSDC Scam | Sakshi
Sakshi News home page

'స్కిల్‌' దొంగ బాబే

Published Wed, Jan 17 2024 5:50 AM | Last Updated on Wed, Jan 17 2024 7:19 AM

AP CID On Chandrababu APSSDC Scam - Sakshi

ఏపీ స్కిల్‌ డెవలప్‌మెంట్‌ కార్పొరేషన్‌ (ఏపీఎస్‌ఎస్‌డీసీ) కుంభకోణంలో చంద్రబాబే అవినీతి తిమింగళం అని మరోసారి నిగ్గు తేలింది. యువతకు నైపుణ్య శిక్షణ పేరిట ఆయన గారు సాగించిన బాగోతం చూసి యావత్‌ దేశం అవాక్కయ్యింది. అసలు జర్మనీకి చెందిన సీమెన్స్‌ కంపెనీకి తెలియకుండానే ఆ కంపెనీ పేరుతో ప్రాజెక్ట్‌ను కాగితాలపై సృష్టించడం.. రూ.370 కోట్ల ప్రాజెక్ట్‌ వ్యయాన్ని ఏకంగా రూ.3,300 కోట్లకు పెంచడం.. సీమెన్స్‌ కంపెనీ పేరున జీవో జారీ చేసి, తన బినామీ కంపెనీ డిజైన్‌ టెక్‌ కంపెనీతో ఒప్పందం చేసుకోవడం.. ఉన్నతాధికారుల ఆదేశాలను బేఖాతరు చేస్తూ నిబంధనలకు విరుద్ధంగా ప్రభుత్వ నిధులు రూ.271 కోట్లు విడుదల చేయడం.. షెల్‌ కంపెనీల ద్వారా అక్రమ నిధులు తన నివాసానికే చేర్చడం.. పైగా అంతా పద్దతి ప్రకారం చేశామంటూ అడ్డగోలుగా వాదించడం.. మరోమారు చర్చకు వచ్చింది.  

సాక్షి, అమరావతి: స్కిల్‌ స్కామ్‌ వంటి ఎన్నో కుంభకోణాల ద్వారా కొల్లగొట్టిన అక్రమ నిధుల తరలింపు కోసం ఏర్పాటు చేసుకున్న అవినీతి నెట్‌వర్క్‌ గుట్టును సీఐడీ ఛేదించడం.. స్కిల్‌ స్కామ్‌లో ఏసీబీ కోర్టు బాబుకు రిమాండ్‌ విధించడం.. సాక్ష్యాధారాలన్నీ బలంగా ఉండటంతో ఏసీబీ కోర్టు తీర్పులో, విచారణలో జోక్యం చేసుకోమని సుప్రీంకోర్టు చెప్పడం చూస్తుంటే చంద్రబాబే అసలు దొంగ అని మరోసారి ఎలుగెత్తి చాటినట్లయింది. సీమెన్స్‌ కంపెనీకి తెలియకుండా ప్రాజెక్ట్‌ను రూపొందించిందీ ఆయనేనని, అక్రమంగా మళ్లించిన నిధులు చేరింది ఆయన నివాసానికే అన్నది సీఐడీ నిగ్గు తేల్చిన విషయం తెలిసిందే.

దాంతో సీఐడీ ఆయనపై కేసు నమోదు చేసింది. కీలక ఆధారాలతో ఈ కేసులో చంద్రబాబును ఏ–1గా పేర్కొంటూ చార్జ్‌షీట్‌ నమోదు చేసింది. ఆయనపై ఐపీసీ సెక్షన్లు 120(బి), 166, 167, 418, 420, 465, 468, 471, 477(ఏ), 409, 201, 109 రెడ్‌విత్‌ 34, 37లతోపాటు అవినీతి నిరోధక చట్టం సెక్షన్లు 13(2) రెడ్‌విత్‌ 13(1) (సి), (డి) కింద అభియోగాలు నమోదు చేశారు. టీడీపీ ప్రభుత్వంలో కార్మీక శాఖ మంత్రిగా వ్యవహరించిన కింజరాపు అచ్చెన్నాయుడు ఏ–2గా, మరో 38 మందిని నిందితులుగా పేర్కొంటూ సిట్‌ కేసు నమోదు చేసింది. గత ఏడాది సెప్టెంబరు 9న చంద్రబాబును అరెస్ట్‌ చేసి విజయవాడ ఏసీబీ న్యాయస్థానంలో హాజరు పరిచింది.

ఈ స్కామ్‌లో చంద్రబాబు పాత్రను నిర్ధారిస్తూ సీఐడీ అధికారులు సమర్పించిన నివేదికతో సంతృప్తి చెందిన న్యాయమూర్తి ఆయనకు జ్యుడిíÙయల్‌ రిమాండ్‌ విధించారు. దాంతో పోలీసులు ఆయన్ను రాజమహేంద్రవరం సెంట్రల్‌ జైలుకు తరలించారు. ఖైదీ నంబర్‌ 7691గా ఆయన అక్కడ 52 రోజులు జ్యుడిíÙయల్‌ రిమాండ్‌లో ఉన్నారు. పలుమార్లు బెయిల్‌ పిటిషన్‌ తిరస్కరణకు గురైన తర్వాత అనారోగ్య కారణాలను చూపిస్తూ దాఖలు చేసిన బెయిల్‌ పిటిషన్‌తో హైకోర్టు బెయిల్‌ మంజూరు చేసింది. విజనరీగా వేసుకున్న ముసుగు తొలగి చంద్రబాబు ఏ–1 అన్న నిజం ప్రపంచానికి తెలిసింది. స్కిల్‌ స్కామ్‌ ఎలా సాగిందంటే.. 

సీమెన్స్‌ పేరిట ఉత్తుత్తి ప్రాజెక్టు 
► డిజైన్‌ టెక్‌ కంపెనీకి చెందిన సంజయ్‌ దంగాను పిలిపించుకుని యువతకు నైపుణ్యాల శిక్షణ పేరిట ఉత్తుత్తి ప్రాజెక్టును తెరపైకి తెచ్చారు. జర్మనీకి చెందిన సీమెన్స్‌ కంపెనీ ముసుగులో ఆ కంపెనీకి ఏమాత్రం తెలియకుండానే ప్రాజెక్టుకు రూపకల్పన చేశారు. భారత్‌లో ఆ కంపెనీ ఎండీగా ఉన్న సుమన్‌ బోస్, డిజైన్‌టెక్‌ ఎంపీ వికాస్‌ వినాయక్‌ కని్వల్కర్‌ సహకారంతో చంద్రబాబు అక్రమాలకు తెర తీశారు.  

► విద్యా శాఖ ద్వారా సీమెన్స్‌ కంపెనీ పేరుతో 2014 ఆగస్టులో ఒప్పందం కుదుర్చుకున్నారు. ఆ మేరకు జీవో జారీ చేశారు. కేబినెట్‌ ఆమోదం కూడా లేకుండానే ఏపీ స్కిల్‌ డెవలప్‌మెంట్‌ కార్పొరేషన్‌(ఏపీఎస్‌ఎస్‌డీసీ) ఏర్పాటు చేశారు. తద్వారా సీమెన్స్‌ కంపెనీతో ఒప్పందం కుదుర్చుకున్నట్టు మభ్యపుచ్చారు. 

► ఈ ప్రాజెక్ట్‌లో చంద్రబాబు బినామీలు, సన్నిహితులే అంతా తామై వ్యవహరించారు. ఏపీఎస్‌ఎస్‌డీసీకి అప్పట్లో డైరెక్టర్‌గా ఉన్న రిటైర్డ్‌ ఐఏఎస్‌ అధికారి, చంద్రబాబు సన్నిహితుడు కే లక్ష్మీనారాయణ, ఎండీగా ఉన్న గంటా సుబ్బారావు కీలకంగా వ్యవహరించారు. గంటా సుబ్బారావును ఏకంగా ఏపీఎస్‌ఎస్‌డీసీ ఎండీ–సీఈవో పోస్టుతోపాటు ఉన్నత విద్యా శాఖ ఎక్స్‌ అఫీషియో కార్యదర్శి, డిపార్ట్‌మెంట్‌ ఆఫ్‌ స్కిల్‌ డెవలప్మెంట్‌ – ఇన్నోవేటివ్‌ కార్పొరేషన్‌ కార్యదర్శి, ముఖ్యమంత్రికి ఎక్స్‌ అఫీషియో కార్యదర్శిగా ఏకంగా నాలుగు పోస్టులు కట్టబెట్టారు.   

► ఉన్నత విద్య శాఖ ముఖ్య కార్యదర్శికి ఎలాంటి పాత్ర లేకుండా గంటా సుబ్బారావుతో నేరుగా నిధులు మంజూరు ప్రక్రియ కొనసాగించడానికి కుతంత్రం పన్నారు. అనంతరం సీమెన్స్‌ కంపెనీ సీనియర్‌ డైరెక్టర్‌ జీవీఎస్‌భాస్కర్‌ సతీమణి, యూపీ క్యాడర్‌ ఐఏఎస్‌ అధికారి అపర్ణను ఏపీఎస్‌ఎస్‌డీసీ డిప్యూటీ సీఈవోగా నియమించారు. ఇది పరస్పర ప్రయోజనాల విరుద్ధ చట్టానికి వ్యతిరేకమైనా సరే చంద్రబాబు ప్రభుత్వం పట్టించుకోలేదు. 

► సాఫ్ట్‌వేర్, హార్డ్‌వేర్, ఇతర అంశాలకు సంబంధించిన ఇన్వాయిస్‌లు, ప్రాథమిక నివేదిక ప్రకారం ఈ ప్రాజెక్టు విలువ రూ.370 కోట్లు మాత్రమే. చంద్రబాబు దీన్ని అమాంతం రూ.3,300 కోట్లకు పెంచేసి ఆ మేరకు నివేదిక రూపొందించాలని ఆదేశించారు. ప్రభుత్వం పది శాతం నిధులు సమకూరిస్తే సీమెన్స్, డిజైన్‌టెక్‌ 90 శాతం పెట్టుబడి పెట్టేలా ఒప్పందం కుదుర్చుకున్నట్టు 2015 జూన్‌ 30న ఉత్తర్వులు జారీ చేశారు.

షెల్‌ కంపెనీల ద్వారా డబ్బులు  
► డిజైన్‌ టెక్‌కు చెల్లించిన రూ.371 కోట్లను షెల్‌ కంపెనీల ద్వారా బోగస్‌ ఇన్వాయిస్‌లు సమర్పించి వివిధ దశల్లో అక్రమంగా తరలించారు. ప్రతి దశలోనూ షెల్‌ కంపెనీల సృష్టికర్తలు, దళారుల కమీషన్లు పోనూ చంద్రబాబుకు రూ.241 కోట్లు చేర్చారు. టీడీపీ ప్రభుత్వం పుణేకు చెందిన డిజైన్‌ టెక్‌ కంపెనీకి రూ.371 కోట్లు చెల్లించింది.  

► డిజైన్‌ టెక్‌ కంపెనీ నుంచి పుణెలోని పీవీఎస్‌పీ అనే షెల్‌ కంపెనీకి రూ.238.29 కోట్లు, ఢిల్లీలోని ఏసీఐ కంపెనీకి రూ.2.71 కోట్లు అంటే మొత్తం రూ.241 కోట్లు తరలించారు.   

► మొత్తం రూ.140.53 కోట్లను ఆ కంపెనీల బ్యాంకు ఖాతాల నుంచి యోగేశ్‌ గుప్తా డ్రా చేసి మనోజ్‌ వాసుదేవ్‌ పార్థసానికి అందించారు. మనోజ్‌ పార్ధసాని ఆ నగదు మొత్తాన్ని చంద్రబాబు పీఎస్‌ పెండ్యాల శ్రీనివాస్‌కు హైదరాబాద్‌లో ముట్టజెప్పారు. అంటే ఆ రూ.140.53 కోట్లను చంద్రబాబు బంగ్లాకు చేర్చారు.  

► మిగిలిన రూ.100.47 కోట్లను పీవీఎస్‌పీ కంపెనీ దుబాయి, సింగపూర్‌లోని కంపెనీలకు మళ్లించింది. ఆ నిధులను మళ్లీ హవాలా మార్గంలో హైదరాబాద్‌కు తరలించారు. అక్కడ మనోజ్‌ పార్థసాని ద్వారా చంద్రబాబు పీఎస్‌ పెండ్యాల శ్రీనివాస్‌కు అందించారు. అనంతరం చంద్రబాబు బంగ్లాకు చేర్చారు. ఏపీఎస్‌ఎస్‌డీసీకి చెందిన రూ.241 కోట్లు అవినీతి నెట్‌వర్క్‌ ద్వారా ఇలా గుట్టు చప్పుడు కాకుండా చంద్రబాబు బంగ్లాకు వచ్చి చేరాయి.  

అమెరికాకు శ్రీనివాస్‌.. దుబాయ్‌కి మనోజ్‌  
► అక్రమ నిధుల తరలింపు పాత్రధారులు చంద్రబాబు ఆదేశాలతో విదేశాలకు పరారయ్యారు. విచారణకు రావాలని నోటీసులు జారీ చేయగానే చంద్రబాబు పీఎస్‌ పెండ్యాల శ్రీనివాస్‌ అమెరికాకు, షాపూర్జీ–పల్లోంజీ కంపెనీ ప్రతినిధి మనోజ్‌ పార్థసాని దుబాయ్‌కు ఉడాయించారు. టీడీపీ హయాంలోనే 2017లోనే ఏపీఎస్‌ఎస్‌డీసీ కుంభకోణం గుట్టు రట్టైంది.  

► కేంద్ర జీఎస్టీ అధికారులు పుణెలోని పలు షెల్‌ కంపెనీల్లో సోదాలు చేసి భారీగా నకిలీ ఇన్‌వాయిస్‌లను గుర్తించారు. వాటిలో ఏపీఎస్‌ఎస్‌డీసీకి సరఫరా చేసిన నకిలీ ఇన్వాయిస్‌లను గుర్తించడంతో ఏపీ ఏసీబీ అధికారులకు సమాచారమిచ్చారు. అయితే దీనిపై విచారణ చేయకుండా ఏసీబీని చంద్రబాబు అడ్డుకున్నారు. ఆ వెంటనే ఏపీఎస్‌ఎస్‌డీసీ ఆఫీసులో ఈ ప్రాజెక్ట్‌కు సంబంధించిన ఫైళ్లను మాయం చేశారు.  

ప్రాజెక్ట్‌ గురించి తెలియదన్న సీమెన్స్‌  
► సీఐడీ అధికారులు జర్మనీలోని సీమెన్స్‌ కంపెనీ ప్రధాన కార్యాలయాన్ని సంప్రదించగా అసలు తమకు ఆ ప్రాజెక్టు గురించే తెలియదని స్పష్టం చేసింది. ఆ వెంటనే సీమెన్స్‌ కంపెనీ భారత్‌లోని తమ ఎండీ సుమన్‌ బోస్‌ను పదవి నుంచి తొలగించింది. ఈ కేసులో కీలక సాక్షులైన ఐవైఆర్‌ కృష్ణారావు, పీవీ రమేశ్, సునీత తదితరులు చంద్రబాబు ఆదేశాలతోనే నిబంధనలకు విరుద్ధంగా నిధులను విడుదల చేసినట్లు వాంగ్మూలం ఇచ్చారు. స్కిల్‌ స్కామ్‌లో కీలక పాత్రధారిగా ఉన్న ఏసీఐ కంపెనీ ఎండీ చంద్రకాంత్‌ షా మొత్తం అవినీతి నెట్‌వర్క్‌ను వెల్లడిస్తూ వాంగ్మూలం ఇచ్చారు. ఏపీఎస్‌ఎస్‌డీసీ కుంభకోణానికి కర్త కర్మ క్రియ అంతా చంద్రబాబే అన్నది నిర్ధారణ అయింది.   
► తాము ఇచ్చింది మూడో పార్టీ నివేదికే కాదని.. కేవలం ఏపీఎస్‌ఎస్‌డీసీ ఇచ్చిన పత్రాల పరిశీలన మాత్రమేనని సెంటర్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ టూల్‌ డిజైన్‌ (సీఐటీడీ) స్పష్టం చేసింది. సీఐటీడీ నివేదిక ఇవ్వక మునుపే డిజైన్‌ టెక్‌కు టీడీపీ సర్కారు నిధులు విడుదల చేసేసింది.   

► ఈ కుంభకోణంపై కేంద్ర దర్యాప్తు సంస్థ ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌ (ఈడీ) కూడా దర్యాప్తు చేపట్టింది. షెల్‌ కంపెనీల లావాదేవీల విషయాన్ని గుర్తించింది. ఇప్పటికే రూ.70 కోట్లు హవాలా మార్గంలో తరలించినట్టు నిర్ధారించింది. డిజైన్‌ టెక్‌కు చెందిన రూ.31.20 కోట్ల విలువైన ఫిక్స్‌డ్‌ డిపాజిట్లను ఈడీ శుక్రవారం జప్తు చేసింది. మొత్తం 26 మందికి నోటీసులు జారీ చేసి పలువురిని ఇప్పటికే విచారించింది. పలువురిని అరెస్టు చేసింది. ఈ ప్రాజెక్టులో రూ.355 కోట్ల మేర ఖజానాకు గండి పడిందని కాగ్‌ కూడా నిగ్గు తేలి్చంది. ఈ వాస్తవాల కారణంగానే.. ఈ కేసు 2017లో నమోదైనందున చంద్రబాబుకు 17ఏ వర్తించదని సుప్రీంకోర్టు కూడా చెప్పడం గమనార్హం. న్యాయ నిపుణులు కూడా  పాత కేసులకు పాత చట్టమే వర్తిస్తుందని తేల్చి చెబుతున్నారు.  

నో రూల్స్‌.. రూ.371 కోట్లు ఇచ్చేయండి   
► సీమెన్స్‌ కంపెనీకి తెలియకుండా సుమన్‌ బోస్‌ నడిపిన ఉత్తర ప్రత్యుత్తరాల్లో (నేరుగా ముఖ్యమంత్రి హోదాలో ఉన్న చంద్రబాబుకు లేఖలు రాశారు) గ్రాంట్‌ ఇన్‌ ఎయిడ్‌ అనే పదం ఎక్కడా లేదు. ఆ స్థానంలో ‘గ్రాంట్‌ ఇన్‌ కైండ్‌’ అని పేర్కొన్నారు. ప్రాజెక్టు వ్యయంగా చెప్పుకున్న రూ.3,300 కోట్లలో 90 శాతం కాదు కదా కనీసం ఒక్క రూపాయి విలువైన ఆర్థిక సహకారంగానీ, వస్తు సహాయాన్ని గానీ అందించ లేదు. అయినా ఏపీఎస్‌ఎస్‌డీసీ తన వాటా కింద జీఎస్టీ కలిపి డిజైన్‌ టెక్‌ కంపెనీకి రూ.371 కోట్లు చెల్లించేశారు.  

► అప్పటి ఆర్థిక శాఖ ముఖ్య కార్యదర్శి పీవీ రమేశ్, ప్రత్యేక కార్యదర్శిగా ఉన్న సునీత అభ్యంతరం తెలిపినా పట్టించుకోలేదు. ఈ విషయాన్ని పీవీ రమేశ్‌ తన నోట్‌ ఫైల్‌లో పొందుపరిచారు. అప్పటి ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఐవైఆర్‌ కృష్ణారావు కూడా ఒప్పుకోలేదు. అయినప్పటికీ చంద్రబాబు.. గంటా సుబ్బారావు చెప్పినట్లుగా నిధులు విడుదల చేయాలని ఐవైఆర్‌ కృష్ణారావును ఆదేశించారు.  

► దీంతో నోట్‌ ఫైళ్లలో సీఎం కాలమ్‌లో ‘ఏఐ’ (ఆఫ్టర్‌ ఇష్యూ..) అని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నోట్‌ చేశారు. అప్పటి సీఎం ఆదేశాల మేరకు నిబంధనలకు విరుద్ధంగా ఏపీఎస్‌ఎస్‌డీసీ ద్వారా డిజైన్‌ టెక్‌ కంపెనీకి రూ.371 కోట్లు మంజూరు చేశారు. ఇందుకు సంబంధించి మొత్తం 13 నోట్‌ ఫైళ్లలో అప్పటి ముఖ్యమంత్రిగా చంద్రబాబు సంతకాలు చేశారు. అప్పటి మంత్రి అచ్చెన్నాయుడు
5 చోట్ల సంతకాలు చేశారు.   

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement