Kids Healthy Food Tips Telugu: Superfoods To Kids Gain Weight Naturally - Sakshi
Sakshi News home page

Healthy Weight Gain Tips: గుడ్లు, బెల్లం, తేనె, అవకాడో.. పిల్లలకు వీటిని తినిపిస్తే..

Published Thu, Apr 21 2022 11:22 AM | Last Updated on Thu, Apr 21 2022 1:06 PM

Health Tips In Telugu: Superfoods To Kids Gain Weight Naturally - Sakshi

Healthy Weight Gain Tips For Kids: పిల్లలు పెరిగి పెద్దవుతున్న కొద్దీ బరువు కూడా పెరుగుతూ ఉంటారు. కొంతమంది పిల్లలు మాత్రం ఉండవలసిన దాని కన్నా తక్కువ బరువు ఉంటారు. మీ పిల్లలు బరువు తక్కువగా ఉన్నారంటే, వారు తగిన ఆహారం తీసుకోవడం లేదని, ఒకవేళ తీసుకున్నా, అది వారి వొంటికి పట్టడం లేదనీ అర్థం.

తగినంత బరువు లేకపోతే పిల్లల్లో మానసిక వికాసం కూడా సరిగా ఉండదు. చదివినవి గుర్తు ఉండదు. అందువల్ల వారు తినే ఆహారం మీద దృష్టి పెట్టడం అవసరం. దాని మీద అవగాహన కోసం...

జంక్‌ఫుడ్, ఫ్యాట్, షుగర్‌ ఎక్కువ ఉన్న ఆహారం వల్ల పిల్లలు కొంత బరువు పెరుగుతారేమో కానీ దాని వల్ల ఆరోగ్యం దెబ్బ తింటుంది. ఈ జంక్‌ ఫుడ్స్‌ పిల్లలకి కావాల్సిన పోషకాలని అందించలేవు. అందువల్ల వారు ఆరోగ్యంగా బరువు పెరిగేందుకు తోడ్పడే ఆహారాన్ని పెట్టాలి. అలాంటి వాటిలో పాలు ముఖ్యమైనవి. 

గుడ్లు: ఎగ్స్‌లో ప్రొటీన్‌ సమృద్ధిగా ఉంటుంది. పిల్లల బరువుని క్రమబద్ధీకరించడంలో గుడ్లు ఎంతో సాయం చేస్తాయి. వి గ్రోత్‌ మజిల్స్, శారీరక కణజాలం పెంపొందేలా చేయడంలో ఎగ్స్‌ పాత్ర కీలకమైనది. ఇందుకోసం బాగా ఉడికించిన గుడ్డును వారు ఇష్టపడేలా కొంచెం ఉప్పు, మిరియాలపొడి లేదా వారు తినే మరేవైనా పదార్థాల కాంబినేషన్‌తో కొంచెం కొంచెంగా మీ పిల్లలకి అలవాటు చేయండి.

చికెన్‌: పిల్లలకి చికెన్‌ హై క్యాలరీ, హై ప్రొటీన్‌ ఫుడ్‌ అవుతుంది. చికెన్‌లో ఉండే ఫాస్ఫరస్‌ వల్ల ఎముకలు, పళ్ళు ఆరోగ్యంగా ఉంటాయి. లివర్, కిడ్నీ మాత్రమే కాక కేంద్ర నాడీ వ్యవస్థ మొత్తం చికెన్‌ వల్ల శక్తి పుంజుకుంటుంది.  

బెల్లం: బెల్లంలో ఐరన్‌తో పాటూ ఎసెన్షియల్‌ మినరల్స్‌ ఉన్నాయి. చెరుకు రసం నుండి తయారయ్యే బెల్లం రిఫైండ్‌ షుగర్‌ కంటే మంచిది. మీ పిల్లలకి ఇంకొన్ని ఆరోగ్యకరమైన క్యాలరీలు అందాలంటే వారికి నచ్చిన ఆహార పదార్థాలలో ఆర్గానిక్‌ బెల్లాన్ని కలపండి. అయితే, బెల్లాన్ని తగిన మోతాదులోనే ఇవ్వాలని గుర్తు పెట్టుకోండి.

తేనె: ఆరోగ్యంగా బరువు పెరగడానికి సాయం చేసే వాటిలో తేనె కూడా ఒకటి. తేనెలో 17% నీరు, 82% కార్బోహైడ్రేట్స్‌ ఉంటాయి. కొవ్వు శాతం చాలా తక్కువ. టోస్ట్, శాండ్విచెస్, దిబ్బరొట్టెల వంటి వాటికి టీ స్పూన్‌ తేనె కలపాలి. అయితే, తేనె కూడా తగిన మోతాదులోనే తీసుకోవాలి.

డ్రై ఫ్రూట్, నట్స్‌: జీడిపప్పు, బాదం పప్పు, వాల్నట్స్, ఆప్రికాట్స్‌ వంటి డ్రై ఫ్రూట్స్‌ని ఇష్టపడని పిల్లలు అరుదుగానే ఉంటారు. నేరుగా తీసుకుంటే అలాగే పెట్టవచ్చు. లేదంటే వీటిని స్నాక్స్‌లాగా యూజ్‌ చేసుకోవచ్చు. లేదా ఐస్‌క్రీమ్స్, స్మూతీల్లో కలపవచ్చు. ఆరోగ్యకరంగా బరువు పెరగడానికి అవసరమైన ఐరన్, విటమిన్స్, మెగ్నీషియం, ప్రొటీన్, హెల్దీ ఫ్యాట్స్‌ వంటివన్నీ డ్రై ఫ్రూట్స్, నట్స్‌లో ఉన్నాయి.

ప్యాన్‌కేక్స్‌: ఫారిన్‌లో ప్యాన్‌కేక్స్‌ అంటారు. మన దేశంలో అయితే అట్లు అంటారు.  పిల్లలు దోసెలని ఇష్టంగానే తింటారు. వీటిని బ్రేక్‌ ఫాస్ట్‌లా పెట్టవచ్చు లేదా స్నాక్‌గా కూడా తినిపించవచ్చు. దోసెలలో ఉండే ఇన్‌గ్రీడియెంట్స్‌ను హై క్యాలరీ ఫుడ్స్‌ గా పరిగణించవచ్చు. 

ఓట్మీల్‌: ఇందులో ఉండే డైటరీ ఫైబర్‌ పిల్లల్లో అరుగుదల బాగా జరిగేలా చూస్తుంది. ఇందులో గ్లూటెన్‌ కూడా ఉండదు. కార్బోహైడ్రేట్స్, ప్రొటీన్లు, స్టార్చ్‌ ఉంటాయి, ఇవి పిల్లలకి  ఎంతో మేలు చేస్తాయి. 

బీన్స్, పప్పులు: ప్రొటీన్‌ పుష్కలం గా లభించేది వీటిలోనే. బీన్స్‌లో ఉండే సాల్యుబుల్‌ ఫైబర్‌ బ్లడ్‌ షుగర్‌ ని క్రమబద్ధీకరించి, మూడ్‌ స్వింగ్స్‌ లేకుండా చేస్తుంది కాబట్టి పిల్లలకి వారికి నచ్చిన పద్ధతిలో బీన్స్‌ వండి పెట్టడం ఎంతో మేలు. 

అరటి పండు: మనకి సంవత్సరం పొడుగూతా దొరికే అరటి పండులో పోషకాలు సమృద్ధిగా ఉంటాయి. అరుగుదల సరిగ్గా జరిగేలా చేస్తాయి. ఇందులో ఫైబర్, పొటాషియం, మెగ్నీషియం, విటమిన్‌ బీ 6 వల్ల ఆరోగ్యకరంగా బరువు పెరగడానికి పిల్లలకు అరటి పండు కూడా ఒక మంచి ఆప్షన్‌గా చెప్పుకోవచ్చు. 

అవకాడో: ఇందులో విటమిన్స్‌ సీ, ఈ, కే, బీ6, పొటాషియం, ఫ్యాట్, ఫైబర్, లుటీన్, బీటా కెరొటిన్, ఒమెగా 3 ఫ్యాటీ యాసిడ్స్‌ ఉండడం వలన ఓవరాల్‌ హెల్త్‌ బాగుండడానికి అవకాడో ఎంతో సాయం చేస్తుంది. అవకాడోని స్మూతీలా చేసి తీసుకోవచ్చు.

మొక్కజొన్న: వీటిలో ఉండే కెరొటినాయిడ్స్‌ కంటి ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి అంతే కాక, మొక్కజొన్న లో పిండిపదార్థాలు కూడా ఎక్కువే. మొక్కజొన్న కండె ఉడికించి పిల్లలకి పెట్టవచ్చు.

చిలగడదుంప: దీనిలో ఫైబర్, విటమిన్స్‌ బి,సి ఐరన్, కాల్షియం, సెలీనియం వంటి మినరల్స్‌ ఉన్నాయి. ఇందులో ఉండే యాంటీ ఆక్సిడెంట్స్‌ బీటా కెరొటిన్‌ చేసుకోవడానికి హెల్ప్‌ చేస్తుంది.

బంగాళ దుంప: ఆలూని ఇష్టపడని పిల్లలు తక్కువ. కాబట్టి దీన్ని మీ పిల్లల ఆహారంలో చేర్చడం తేలికే. వీటిలో విటమిన్స్‌ ఏ, సీ ఇంకా ఫైబర్, కార్బోహైడ్రేట్స్‌ కూడా ఉంటాయి. ఇవన్నీ పిల్లలు ఆరోగ్యకరంగా బరువు పెరగడానికి సహకరిస్తాయి.

ఫ్రూట్‌ స్మూతీ: పిల్లలకే కాదు, పండ్లు ఎవరికైనా ఎంతో మంచివి, ఎదిగే వయసులో ఉన్న పిల్లలకి మరీ మంచివి. కానీ, కొందరు పిల్లలకి పండ్లు నచ్చవు, ముఖం తిప్పుకుంటారు. అలాంటప్పుడు వీటిని స్మూతీలా చేసి ఇచ్చారనుకోండి,పేచీ పెట్టకుండా తాగేస్తారు.

చివరగా...
పిల్లలందరి శరీర తత్త్వం ఒకేలా ఉండదు. బరువు తక్కువ ఉన్న పిల్లలకి పెట్టడానికి ప్రొటీన్, కార్బోహైడ్రేట్స్, హెల్దీ ఫ్యాట్స్, ఇంకా ఫైబర్‌ ఉన్న ఫుడ్స్‌ ఎంచుకోవడం మేలు.

అన్నింటికీ మించి వారు తిననని మారాం చేస్తుంటే బలవంతం చేసి నోటిలో కుక్కడం వల్ల బరువు పెరగరు సరికదా, అసలు తినడమంటేనే ఇష్టపడకుండా పోయే ప్రమాదం ఉంది కాబట్టి వాళ్లు ఇష్టపడే ఆహారాన్ని లేదా ఇష్టపడే రీతిలో తినిపించడం మేలు. 

చదవండి: Summer Care: ఏసీ గదిలో ఎక్కువసేపు గడుపుతున్నారా.. జాగ్రత్త!

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement