ప్రతీకాత్మక చిత్రం
రోజుకి తగినంత నీటిని తాగడం వల్ల కలిగే ఆరోగ్యప్రయోజనాల గురించి ఎన్నోయేళ్లుగా చెబుతూనే ఉన్నారు. ఐతే అతి ఎప్పుడూ అనర్థమే! నీటి విషయంలో అందుకు మినహాయింపు ఏమీ లేదు. నీరు అధికంగా తీసుకున్నా ప్రమాదమేనని నిపుణులు అంటున్నారు. అవును, డీ హైడ్రెషన్ లాగానే ఓవర్ హైడ్రేషన్ కూడా ఆరోగ్యానికి హానికరమే. అనేక మంది డైట్ స్పెషలిస్ట్స్ రోజుకు మూడు లీటర్లు లేదా అంతకంటే ఎక్కువ నీరు తాగమని సలహాలిస్తూ ఉంటారు. కానీ అది అంతమంచిపనేమీ కాదని ప్రముఖ నూట్రీషనిస్ట్ రేణు రాఖేజా ఇన్‌స్ట్రాగ్రామ్ ద్వారా హెచ్చరిస్తున్నారు. ఆమె ఏం చెబుతున్నారంటే..
నీరు ఎక్కువగా తాగితే ఏమౌతుంది?
శరీరంలోని ఎలక్ట్రోలైట్స్‌లో పొటాషియమ్, సోడియం, మ్యాగ్నిషియం వంటి ఖనిజాలు ఉంటాయి. నీరు అధికంగా తాగితే ఎలక్ట్రోలైట్ లెవెల్స్ పడిపోవడానికి కారణమవుతుంది. ఫలితంగా గుండె, కిడ్నీల పనితీరులపై దుష్ర్పభావాన్ని చూపుతాయి. ప్రతిరోజూ అధికమోతాదులో నీరు తాగితే మినరల్స్ నిష్పత్తిలో సమతౌల్యం దెబ్బతిని బ్రెయిన్ ఫాగ్, బరువు పెరగడం, తలనొప్పి, కండరాల బలహీణతలకు కారణమౌతుంది.
రేణు రాఖేజా ఫాలోవర్స్ నీరు అదికంగా తాగడం వల్ల వారు ఎదుర్కొన్న అనుభవాలను కామెంట్ల రూపంలో వెల్లడించారు.
అద్భుతం.. ఎట్టకేలకు అనుభవ పూర్వకంగా నేను నమ్మినదాన్ని ఒకరు చెప్పారు అని ఒకరు కామెంట్ చెయగా.. చాలా కాలం క్రితం నేను కూడా ఈ విధమైన అనారోగ్యం గుండా వెళ్లాను. మా డాక్టర్ నన్ను తక్కువ నీటిని తాగమని సూచించారు. అప్పట్లో రోజుకు 4 లీటర్ల నీటిని తాగాను అని మరొకరు చెప్పుకొచ్చారు.
అయితే రేణు రాఖేజా సూచనలు ఏమంటే..
దాహంగా ఉంటేనే నీటిని తాగాలి. ఇతర వేళల్లో పుచ్చకాయలు, స్పైనాచ్ పండ్లు.. వంటి నీరు అధికమోతాదులో ఉండే కూరగాయిలు లేదా పండ్లు తినాలి. అలాగే కొబ్బరి నీళ్లు, టీ, కాఫీ, జ్యూస్‌లతో కూడా శరీరాన్ని హైడ్రేటెడ్‌గా ఉంచుకోవచ్చు. రోజుకు 1.5 లీటర్ల నీరు తాగితే సరిపోతుందని సూచించారు.
Comments
Please login to add a commentAdd a comment