Hydration
-
Summer Season: డీ హైడ్రేషన్‌తో ఇబ్బందా? నివారించండి ఇలా..
వేసవిలో సర్వసాధారణంగా అందరికీ ఎదురయ్యే సమస్య డీ హైడ్రేషన్. సరైన సమయంలో గుర్తించకపోతే ఇదిప్రాణాపాయానికి కూడా దారితీసే ప్రమాదం లేకపోలేదు. శరీరంలోని జీవక్రియలు సజావుగా సాగాలంటే ద్రవపదార్థాలు తగినన్ని ఉండడం అవసరం. ఒకోసారి రకరకాల కారణాల వల్ల శరీరంలోని ద్రవపదార్థాలు ముఖ్యంగా నీటి శాతం బాగా తగ్గిపోయి వాంతులు, విరేచనాలు అవుతాయి. ఒకోసారిప్రాణాపాయ స్థితి కూడా ఏర్పడవచ్చు. వేసవిలో ఈ పరిస్థితి ఏర్పడే అవకాశాలు మరీ ఎక్కువ. అందువల్ల డీ హైడ్రేషన్‌ని నివారించేందుకు ఈ చిట్కాలు. డీ హైడ్రేషన్ గురికాకుండా ఉండాలంటే కనీసం రోజుకు 2 నుంచి 4 లీటర్ల నీటిని తాగాలి. దాహంగా అనిపిస్తే అశ్రద్ధ చేయకుండా వెంటనే నీరు తాగాలి. డీహైడ్రేషన్ కు గురయ్యామని సూచించే మొట్ట మొదటి సంకేతం ’దాహం’ అనిపించటం. డీ హైడ్రేషన్‌ను ఎలా గుర్తించాలంటే..? నోరంతా పొడిబారినట్లు, బుగ్గల చుట్టూ ఇసుక అట్ట కట్టినట్లుగా ఉన్నా తీవ్రమైన డీహైడ్రేషన్ ఎదుర్కోబోతున్నట్లు సంకేతంగా భావించాలి. తీవ్ర అలసట, నిద్ర పోవాలనే కోరిక ఉండడమూ డీ హైడ్రేషన్ లక్షణాలే. అలా ఉన్నప్పుడు చాలామంది నిద్రకు ఉపక్రమిస్తారు. దానికి బదులుగా వెంటనే కొంచెం మంచి నీళ్లు తాగితే ఉపశమనం లభిస్తుంది. భరించరాని తలనొప్పి కూడా డీహైడ్రేషన్ ను తెలియజేసే సాధారణ లక్షణం. సాధారణంగా కండర తిమ్మిర్లు శరీరంలో ఎలక్ట్రోలేట్ స్థాయుల అసమతుల్యతకు కారణంగా చెబుతారు. అయితే ఇది కూడా డీహైడ్రేషన్ ను సూచించే మరొక గుర్తు. కొంత శారీరక శ్రమను చేసిన తర్వాత హఠాత్తుగా చెమట పట్టడం నిలిచిపోతే, వెంటనే శరీరాన్ని హైడ్రేట్ చేయాలి. డీహైడ్రేషన్ ను తెలియచేసే తీవ్రమైన సంకేతాల్లో ఇది ఒకటి. ముదురు పసుపు రంగులో మూత్రం రావడం, మూత్ర విసర్జనలో మంటగా అనిపించడం డీ హైడ్రేషన్‌కు సంకేతాలు. అలాంటప్పుడు సబ్జా నీళ్లు లేదా బార్లీ నీళ్లు లేదా కొబ్బరి నీళ్లు తాగాలి. ఇవేవీ అందుబాటులో లేనప్పుడు కనీసం వెంటనే నీటిని తాగడం కూడా ప్రమాద నివారణకు సహకరిస్తుంది. చర్మం సహజ స్వభావాన్ని కోల్పోయినప్పుడు అంటే చర్మాన్ని పట్టుకుని లాగి వదిలితే వెంటనే వెనక్కి వెళ్లకుండా పైన నిలిచినట్లుగా ఉండే ఈ సమస్యలో ఉన్నట్లే భావించాలి. అస్పష్టమైన కంటిచూపు కూడా డీహైడ్రేషన్ సూచించే ఒక గుర్తు. రక్తంలో తక్కువ చక్కెర స్థాయులు ఉన్నప్పుడు కూడా అస్పష్టమైన కంటిచూపు కలుగుతుంది. అందుకే ఎప్పుడైనా నిర్ణీత సమయానికి భోజనం చేయలేకపోతే వెంటనే గ్లూకోజ్ నీరు తాగాలి. సులువుగా చేయగలిగేది తగినన్ని నీళ్లు తాగడం. కనీసం అదైనా సరిగా చేస్తుంటే ప్రమాదాన్ని నివారించిన వారమవుతాం. ఇవి చదవండి: ఈ సమ్మర్లో ఎనీ టైమ్.. ఎనీ వేర్.. అనిపించే డ్రెస్సులు ఇవే -
రోజూ 8 గ్లాసుల నీళ్లు తాగాలా?.. నిపుణులు ఏం చెప్తున్నారంటే..!
‘ఎన్నినీళ్లు తాగితే అంత మంచిది’ మనం తరచూ వినేమాట. అసలు ఒక వ్యక్తి రోజుకెన్ని నీళ్లు తాగాలన్న చర్చ నిత్యం జరుగుతూనే ఉంది. ఒక మనిషి ఆరోగ్యంగా ఉండేందుకు రోజూ కనీసం రెండు లీటర్లు అంటే.. ఎనిమిది గ్లాసుల నీళ్లు తాగాలని వైద్యులు, నిపుణులు చెప్పేమాట. అయితే.. అన్ని నీళ్లు అవసరం లేదని ఓ అధ్యయనం చెబుతోంది. అబెర్డీన్ విశ్వవిద్యాలయానికి చెందిన శాస్త్రవేత్తలు దీనిపై అధ్యయనం చేశారు. 23 దేశాల నుంచి 5,604 మంది అన్ని వయసులవారిని పరిశీలించారు. ఈ సర్వే ప్రకారం ఒకటిన్నర లీటర్లు తాగితే సరిపోతుందని చెబుతున్నారు. నీళ్లు ఎక్కువగా తాగితే ఓవర్‌హైడ్రేషన్ అయి దానివల్లా సమస్యలొస్తాయని వివరించారు. వాతావరణం వేడిగా ఉన్నప్పుడు, శారీరక శ్రమ చేసేవాళ్లు.. ఈ గ్లాసుల సంఖ్య పెంచాలని సూచిస్తున్నారు. అథ్లెట్లు, గర్భిణులు, పాలిచ్చే తల్లులు నీళ్లు ఎక్కువ తీసుకోవాలని సలహా ఇస్తున్నారు. ‘బరువును బట్టి నీళ్లు తాగాలి.. 20 కిలోల బరువుకు లీటర్ చొప్పున.. 40 కిలోల బరువుంటే రెండు లీటర్లు, 80 కిలోలుంటే 4 లీటర్లు తాగాలి’ అని అబెర్డీన్ విశ్వవిద్యాలయం ప్రొఫెసర్ జాన్ స్పీక్‌మాన్ చెబుతున్నారు. అయితే ఈ పరిమాణం మీరు తీసుకునే ఆహారం మీద ఆధారపడి ఉంటుందట. చదవండి: ఇరాన్ ఫుట్ బాల్ జట్టు ఓటమి.. స్వదేశంలో సంబరాలు.. కారణం ఇదే! -
అందుకే చలికాలంలో చర్మం పొడిబారిపోతుంది! ఈ జాగ్రత్తలు తీసుకున్నారంటే..
సీజన్ మారింది. వాతావరణంలో ఉష్ణోగ్రతలు తగ్గుముఖం పడుతున్నాయి. ఏటా వచ్చే ఈ మార్పును వాతావరణ శాఖ అధికారికంగా నమోదు చేస్తుంది. కానీ అంతకంటే ముందే మన దేహం సంకేతాలను జారీ చేస్తుంది. దుప్పటి పక్కకు తోసేసే పిల్లలు ఒద్దికగా దుప్పటిలో తమను తాము ఇముడ్చు కుంటారు. సాక్స్ వేసుకునేటప్పుడు సాఫీగా సాగిపోకుండా పాదాల చర్మానికి తగులుకోవడం, దారాలు లేవడం మరో సంకేతం. పెద్ద బైట్ తీసుకుందామని నోరు అమాంతం తెరిస్తే పొడిబారిన పెదవులు సహకరించవు. ఆరు నెలలుగా డ్రెస్సింగ్ టేబుల్ డ్రాల్లో ఉండిపోయిన లిప్‌బామ్‌లు, బాడీ లోషన్లు బయటకు వస్తాయి. కాలం మారింది... అందుకే లైఫ్ స్టైల్ కూడా మారి తీరాలి మరి. దేహం రాజీ పడదు చలికాలం దాదాపుగా అందరూ చేసే ప్రధానమైన పొరపాటు నీరు తక్కువగా తీసుకోవడం. ‘దాహం వేయలేదు కాబట్టి తక్కువగా తాగాం, దేహానికి అవసరమైతే దాహం వేస్తుంది కదా’ అని సౌకర్యవంతమైన సమాధానం చెప్పుకుంటే కుదరదు. చల్లటి నీటికి బదులు నార్మల్ వాటర్ లేదా గోరువెచ్చటి నీటిని ఎప్పటిలాగానే రెండు ముప్పావు నుంచి మూడు ముప్పావు లీటర్ల వరకు తీసుకోవాలి. మజ్జిగ, పండ్ల రసాల వంటి ద్రవాలను ఎక్కువ తీసుకున్నప్పుడు నీటి పరిమాణాన్ని కొంత వరకు తగ్గించుకోవచ్చు. ‘యూఎస్ నేషనల్ అకాడమీస్ ఆఫ్ సైన్సెస్, ఇంజనీరింగ్ అండ్ మెడిసిన్’ సూచన మేరకు సగటున ఒక మహిళ రోజుకు 2.7 లీటర్లు, మగవాళ్లు 3.7 లీటర్లు ద్రవాలు (నీరు, ఇతర ద్రవాహారం కలిపి) దేహానికి అవసరమని సూచించింది. ఏ కాలమైనా సరే... దేహంలోని వ్యర్థాలను బయటకు పంపించడానికి దేహక్రియలకు అవసరమైన ద్రవాలు దేహానికి అంది తీరాలి. అప్పుడే చర్మం పొడిబారకుండా, నిర్జీవంగా మారిపోకుండా ఆరోగ్యంగా ఉంటుంది. దేహంలోని వ్యర్థాలు విసర్జితం కాకుండా చర్మం మీద ఎన్ని లోషన్లు రాసినా దేహక్రియలు మెరుగుపడవు, చర్మఆరోగ్యం కూడా మెరుగవదనే విషయాన్ని మర్చిపోకూడదు. చదవండి: 23 కోట్ల బీమా సొమ్ము కోసం రైలు పట్టాలపై పడుకుని రెండు కాళ్లు..!! వెచ్చ‘టీ’లు ఈ సీజన్లో బాలెన్స్డ్ డైట్ తప్పని సరి. పగలు పుదీనా టీ, తులసి టీ, గ్రీన్ టీ, హెర్బల్ టీ, లెమన్ టీ, తాజా నిమ్మరసం తీసుకోవాలి. అందుబాటులో ఉంటే కొబ్బరి నీరు కూడా తాగచ్చు. కొబ్బరి నీరు ఎండాకాలంలో మాత్రమే తాగాలనుకోవడం కేవలం అపోహ మాత్రమే. వర్షాకాలమైనా, శీతాకాలమైనా కొబ్బరి నీరు ఆరోగ్యకరమే. రాత్రి భోజనానికి ముందు వెజిటబుల్ సూప్‌లు తాగాలి. పొట్టుతో కూడిన ధాన్యాలు, పప్పులు, నట్స్, మంచి నెయ్యి రోజువారీ ఆహారంలో ఉండాలి. మాంసాహారులైతే ఈ కాలంలో మ మటన్‌కు బదులు తేలిగ్గా జీర్ణమయ్యే చేపలు, చికెన్, గుడ్లు తీసుకోవచ్చు. వాల్నట్, అవిసె గింజలు తీసుకోవాలి. అలాగే బొప్పాయితోపాటు బత్తాయి, కమలాపండ్లు రోజూ తీసుకుంటే మంచిది. ఇక కూరల్లో ఈ సీజన్లో పండే అన్ని రకాల కూరగాయలు, క్యాలిఫ్లవర్, బ్రోకలి వారంలో ఒకసారైనా తీసుకుంటుంటే చర్మానికి మాయిశ్చర్ సహజంగా అందుతుంది. చదవండి: ఆ ఫొటోలు తీసినందుకు దేశం నుంచి శాశ్వతంగా బహిష్కరించారు.. ఎమోషనల్ ఈటింగ్ వద్దు ఆహార విహారాల్లో ఎన్ని జాగ్రత్తలు తీసుకున్నప్పటికీ కొందరిలో వారికి ఉన్న ఇతర ఆరోగ్యకారణాల రీత్యా ఈ కాలంలో విటమిన్ డీ 3, బీ12 లోపం ఏర్పడుతుంటుంది. బీ 12 లోపం మానసిక రుగ్మతలకు దారి తీస్తుంది. ప్రతి చిన్న విషయానికీ విపరీతమైన భావోద్వేగాలకు లోనవుతుంటారు. ఈ మానసిక అలజడి నుంచి సాంత్వన పొందడానికి ఎప్పుడూ ఏదో ఒకటి తింటూనే ఉంటారు. ఈ ఎమోషనల్ ఈటింగ్ చాలా సందర్భాల్లో ఓవర్ ఈటింగ్‌కు దారి తీస్తుంది. కాబట్టి దేహంలో బీ12, డీ3 విటమిన్ స్థాయులు తగ్గకుండా చూసుకోవాలి. అవసరం అనిపిస్తే విటమిన్ లెవెల్స్ టెస్టులతో నిర్ధారించుకుని తదనుగుణంగా జీవనశైలి మార్పులు చేసుకోవచ్చు. ఎండ మంచిదే! రోజూ కనీసం అరగంట సమయం అయినా సూర్యరశ్మి ఒంటి మీద పడాలి. అప్పుడే దేహంలో సెరోటోనిన్ స్థాయులు, మెలటోనిన్ స్థాయులు సక్రమంగా ఉంటాయి. అవి మంచి నిద్రకు, హార్మోన్స్ సమతుల్యతకు దోహదం చేస్తాయి. కాబట్టి ఈ విధమైన జీవనశైలితో దేహంలో వ్యాధినిరోధక శక్తిని పెంచుకోవచ్చు. చలికాలంలో దేహ సాధారణ ఆరోగ్యం గురించి శ్రద్ధ తీసుకోవడంతోపాటు రెండేళ్లుగా భయపెడుతున్న కరోనా వ్యాధిని, భౌతికదూరం వంటి జాగ్రత్తలను మర్చిపోకూడదు. చదవండి: పాదాలను బట్టి వారెలాంటివారో అంచనా వేయొచ్చట!!.. ఐతే.. -
Dry Eye Irritation: కంట్లో దురదా.. ఇలా చేస్తే సమస్యలకు చెక్ పెట్టవచ్చు!
మీ కళ్లు ఎర్రబడి, తరచు దురదతో బాధిస్తున్నాయా? ఐతే మీరు డ్రై ఐ సిండ్రోమ్ తో బాధపడుతున్నారన్నమాట. మధ్య వయస్కుల్లో, వృద్ధుల్లో ఇది సహజంగా కనిపించేదే అయినప్పటికీ ప్రస్తుత జీవనశైలి కారణంగా పిల్లల్లో, యుక్తవయసువారు కూడా ఈ సిండ్రోమ్ బారిన పడుతున్నారు. సాధారణంగా కన్నీటి గ్రంథులు పొడిబారితే డ్రై ఐ సిండ్రోమ్ సమస్య తలెత్తుతుంది. ఇది విపరీతంగా చికాకును, బాధను కలిగిస్తుంది. నిపుణులు సూచించిన ఈ కింది పద్ధతుల ద్వారా ఈ సిండ్రోమ్ నుంచి ఏ విధంగా బయటపడొచ్చో తెలుసుకుందాం.. ఎందుకు వస్తుందంటే.. వెలుతురు సరిగాలేని ప్రదేశాల్లో, ఎయిర్ కండిషన్డ్ గదుల్లో నివసించడం, ఎక్కువ సేపు కంప్యూటర్ స్క్రీన్లపై పనిచేయడం వంటి కారణాల రిత్యా ఈ సమస్యతలెత్తవచ్చు. అంతేకాకుండా కొన్ని మెడికల్ ట్రీట్మెంట్స్, హార్మోన్ల అసమతుల్యత, అలర్జీలు, వృద్ధాప్యం కూడా కళ్లు పొడిబారడానికి కారణం అవుతాయి. దీర్ఘకాలంపాటు పొడి కళ్ళ సమస్య ఉంటే మీ దృష్టికి కూడా ప్రమాదం జరిగే అవకాశం ఉంది. సహజ పద్ధతుల్లో చికిత్స ఇలా.. ►నీరు అధికంగా తాగాలి కంటి ఉపరితలం ఆరోగ్యంగా ఉండాలంటే తగిన మొత్తంలో నీరు అవసరం అవుతుంది. కంటిని శుభ్రపరచి, రక్షించడానికి ఉపయోగపడే ద్రవాలు విడుదల కావడానికి, లాక్రిమల్ గ్రంధులు సమర్థవంతంగా పనిచేయడానికి నీరు అధికంగా తాగడం ఉత్తమం. హైడ్రేటెడ్‌గా ఉండడం వలన ఆరోగ్యకరమైన సహజ కన్నీళ్లు, నూనెలు ఉత్పత్తి అవుతాయి. అయితే డీహైడ్రేటెడ్ వల్ల కంటి ఉపరితలం పొడిబారి చికాకు, దురద కలిగేలా చేస్తాయి. కాఫీ, ఆల్కహాల్.. వంటి ఇతర కెఫిన్ అధిరంగా ఉండే పానీయాలు శరీరాన్ని డీహైడ్రేట్ చేస్తాయి. వీటికి దూరంగా ఉండటం మంచిది. పుచ్చకాయ, పీచ్ పండ్లు, దోసకాయ, స్ట్రాబెర్రీ.. వంటి నీటి శాతం పుష్కలంగా ఉండే పండ్లు తినడం వల్ల కళ్లు పొడిబారకుండా నిరోధించవచ్చు. ►ఫ్యాటీ ఆమ్లాలు అధికంగా ఉండే ఆహారాన్ని తీసుకోవాలి అనేక అధ్యయనాల ప్రకారం ఫ్యాటీ ఆమ్లాలు తగిన మోతాదులో తీసుకోవడం వల్ల కళ్లు పొడిబారకుండా నిరోధించి కళ్లకవసరమైన నూనెలు సమృద్ధిగా అంది మృదువుగా ఉండేలా చేస్తాయని వెల్లడించాయి. ఒమేగా -3 ఫ్యాటీ ఆమ్లాల్లో ఈపీఏ, డీహెచ్ఏ నిష్పత్తి అధికంగా ఉంటుంది. ఇది కళ్లు పొడిబారడం వల్ల కలిగే మంటను నిరోధిస్తుంది. అవిసె గింజలు, గుడ్లు, చియా విత్తనాలు, చేపలు, వాల్‌నట్స్‌లలో ఒమేగా -3 ఫ్యాటీ ఆమ్లాలు నిండుగా ఉంటాయి. ►రెప్పవాల్చక పోవడం కంప్యూటర్ వంటి ఎలక్ట్రిక్ గాడ్జెట్లను రెప్పవేయకుండా తదేకంగా చూడటం వల్ల కూడా కళ్లు పొడిబారిపోతాయి. దీనినే డిజిటల్ ఐ స్ట్రైన్ అని కూడా అంటారు. ఏదిఏమైనప్పటికీ నిముషానికి కనీసం 15 నుంచి 30 సార్లైనా కనురెప్పలు ఆడించాలి. ప్రతి 20 నిముషాలకు ఒకసారి మీ కళ్లకు విశ్రాంతినివ్వడం వల్ల డ్రై ఐ సిండ్రోమ్ నుంచి కాపాడుకోవచ్చు. మీరు ఒకవేళ ఎలక్ట్రిక్ స్క్రీన్ ముందు గంటలకొద్దీ సమయం గడపవలసి వస్తే బ్లూ లైట్ ఫిల్టరింగ్ స్పెటికల్స్ (కళ్లద్దాలు) వాడటం మంచిది. ►కళ్లను శుభ్రపరచాలి ప్రతిరోజూ కళ్లకు మేకప్చేసే అలవాటుంటే.. తప్పనిరిగా కను రెప్పలను, కను బొమ్మలను, కంటి చుట్టు పక్కల చర్మాన్ని బేబీ షాంపూ లేదా మిల్డ్ సోప్‌లతో శుభ్రపరచుకోవాలి. తర్వాత వేడి నీటిలో ముంచిన గుడ్డను కళ్లపై కనీసం నిముషంపాటైనా ఉంచుకోవాలి. ఈ విధంగా చేయడం వల్ల కంటి పై మూసుకుపోయిన నూనె గ్రంథులు విచ్చుకోవడానికి, మంటను తగ్గించి చికాకును తొలగించడానికి ఉపయోగపడుతుంది. ►సన్ గ్లాసెస్ ధరించాలి కాలుష్యం, ధుమ్ము, ధూళి కూడా మీ కళ్లు పొడిబారేలా చేస్తాయి. సన్ గ్లాసెస్ వీటి నుంచి మీ కళ్లను కాపాడటమేకాకుండా సూర్యుడి నుంచి ప్రసరించే ప్రమాదకర యూవీ కిరణాల నుంచి కూడా రక్షణ కల్పిస్తుంది. ఇది కంటిలోని నల్ల గుడ్డును, కటకాన్ని, రెటీనాను, మాక్యులర్ డీజనరేషన్ ప్రమాదంలో పడకుండా కాపాడుతుందని నిపుణులు సూచిస్తున్నారు. చదవండి: ఆ సమస్యతో బాధపడేవారిలో గుండె జబ్బులు రెండింతలు ఎక్కువ! -
Overhydration: నీరు ఎక్కువ తాగుతున్నారా? ఈ సమస్యలు తప్పవు మరి!
రోజుకి తగినంత నీటిని తాగడం వల్ల కలిగే ఆరోగ్యప్రయోజనాల గురించి ఎన్నోయేళ్లుగా చెబుతూనే ఉన్నారు. ఐతే అతి ఎప్పుడూ అనర్థమే! నీటి విషయంలో అందుకు మినహాయింపు ఏమీ లేదు. నీరు అధికంగా తీసుకున్నా ప్రమాదమేనని నిపుణులు అంటున్నారు. అవును, డీ హైడ్రెషన్ లాగానే ఓవర్ హైడ్రేషన్ కూడా ఆరోగ్యానికి హానికరమే. అనేక మంది డైట్ స్పెషలిస్ట్స్ రోజుకు మూడు లీటర్లు లేదా అంతకంటే ఎక్కువ నీరు తాగమని సలహాలిస్తూ ఉంటారు. కానీ అది అంతమంచిపనేమీ కాదని ప్రముఖ నూట్రీషనిస్ట్ రేణు రాఖేజా ఇన్‌స్ట్రాగ్రామ్ ద్వారా హెచ్చరిస్తున్నారు. ఆమె ఏం చెబుతున్నారంటే.. నీరు ఎక్కువగా తాగితే ఏమౌతుంది? శరీరంలోని ఎలక్ట్రోలైట్స్‌లో పొటాషియమ్, సోడియం, మ్యాగ్నిషియం వంటి ఖనిజాలు ఉంటాయి. నీరు అధికంగా తాగితే ఎలక్ట్రోలైట్ లెవెల్స్ పడిపోవడానికి కారణమవుతుంది. ఫలితంగా గుండె, కిడ్నీల పనితీరులపై దుష్ర్పభావాన్ని చూపుతాయి. ప్రతిరోజూ అధికమోతాదులో నీరు తాగితే మినరల్స్ నిష్పత్తిలో సమతౌల్యం దెబ్బతిని బ్రెయిన్ ఫాగ్, బరువు పెరగడం, తలనొప్పి, కండరాల బలహీణతలకు కారణమౌతుంది. రేణు రాఖేజా ఫాలోవర్స్ నీరు అదికంగా తాగడం వల్ల వారు ఎదుర్కొన్న అనుభవాలను కామెంట్ల రూపంలో వెల్లడించారు. అద్భుతం.. ఎట్టకేలకు అనుభవ పూర్వకంగా నేను నమ్మినదాన్ని ఒకరు చెప్పారు అని ఒకరు కామెంట్ చెయగా.. చాలా కాలం క్రితం నేను కూడా ఈ విధమైన అనారోగ్యం గుండా వెళ్లాను. మా డాక్టర్ నన్ను తక్కువ నీటిని తాగమని సూచించారు. అప్పట్లో రోజుకు 4 లీటర్ల నీటిని తాగాను అని మరొకరు చెప్పుకొచ్చారు. అయితే రేణు రాఖేజా సూచనలు ఏమంటే.. దాహంగా ఉంటేనే నీటిని తాగాలి. ఇతర వేళల్లో పుచ్చకాయలు, స్పైనాచ్ పండ్లు.. వంటి నీరు అధికమోతాదులో ఉండే కూరగాయిలు లేదా పండ్లు తినాలి. అలాగే కొబ్బరి నీళ్లు, టీ, కాఫీ, జ్యూస్‌లతో కూడా శరీరాన్ని హైడ్రేటెడ్‌గా ఉంచుకోవచ్చు. రోజుకు 1.5 లీటర్ల నీరు తాగితే సరిపోతుందని సూచించారు. చదవండి: వైరల్: పె..ద్ద.. ఐస్‌గోళా ఖరీదెంతో తెలుసా? -
వేసవిలో హీరోయిన్ రకుల్ తాగే డ్రింక్ ఇదే..
అసలే వేసవి కాలం.. ఎండలు మండిపోతున్నాయి. వేడి తట్టుకోడానికి మజ్జిగ, కొబ్బరి నీళ్లు, చెరుకు రసం, నిమ్మ రసం, పుదీనా రసం వంటి ద్రావణాలను తీసుకుంటుంటారు. ఇవన్నీ ఓకే.. రకుల్ ప్రీత్‌సింగ్ ఇంకోటి కూడా చెబుతున్నారు. ‘‘ఈ వేసవి తాపంలో శరీరానికి బార్లీ నీళ్లు ఎంతో మేలు చేస్తాయి’’ అంటున్నారామె. ఆరోగ్యం, ఫిట్నెస్ కోసం యోగా, జిమ్‌లో వర్కవుట్లు చేస్తుంటారు రకుల్. ఆరోగ్యవంతమైన ఆహారాన్ని తీసుకుంటారు. తాజాగా ఎండ వేడి నుంచి చల్లబడటానికి రకుల్ సోషల్ మీడియాలో ఓ పోస్ట్ చేశారు. ‘‘వేసవి తాపాన్ని ఎలా తప్పించుకోవాలనుకుంటున్నారా? అయితే బార్లీ నీళ్లు బెస్ట్. ఈ ద్రావణాన్ని నా న్యూట్రిషనిస్ట్ సూచించారు. వేసవిలో వచ్చే ఆరోగ్య, జీర్ణ సమస్యలన్నింటినీ బార్లీ ద్రావణం దూరం చేస్తుంది. చోటా నామ్ (బార్లీని ఉద్దేశించి) బడా కామ్ (పేరు చిన్నదే అయినా పని పెద్దది)’’ అని చెప్పుకొచ్చారు రకుల్. పేరు చిన్నదే అయినా బాగా మేలు చేస్తుందన్నది రకుల్ ఉద్దేశం. రకుల్ చెప్పినట్లు బార్లీ వాటర్ తీసుకుంటే కూల్ అయిపోవచ్చు. -
6 గంటల నిద్రతో..అనర్థమే
వాషింగ్టన్: రోజూ ఆరు గంటలే నిద్రపోయే వారిలో డీహైడ్రేషన్ సమస్య ఉత్పన్నమవుతున్నట్లు తాజా అధ్యయనంలో తేలింది. నిద్రకు, డీహైడ్రేషన్‌కు ఎలాంటి సంబంధం ఉందన్న కోణంలో అమెరికాలోని పెన్సిల్వేనియా స్టేట్ వర్సిటీ పరిశోధకులు అధ్యయనం చేపట్టారు. అధ్యయనానికి చైనా, అమెరికాకు చెందిన యుక్త వయసు వారిని ఎంచుకున్నారు. రాత్రి 6, 8 గంటలు నిద్రపోతున్న వారి మూత్ర నమూనాలను పరీక్షించి పోల్చి చూడగా.. 6 గంటలు నిద్రపోతున్న వారిలో 16 నుంచి 59 శాతం డీహైడ్రేషన్ లక్షణాలున్నట్లు పరిశోధకులు గుర్తించారు. శరీరంలోని వాసొప్రెషన్ హార్మోనే దీనికి కారణమని తేల్చారు. ఈ హార్మోనే పగలు, రాత్రి శరీరంలో హైడ్రేషన్‌ను నియంత్రిస్తుందని చెప్పారు. నిద్రిస్తున్నప్పుడు ఆరు గంటల వ్యవధి తర్వాత ఈ హార్మోన్ అధిక మొత్తంలో విడుదలవుతుందని, ఒకవేళ 2 గంటలు ముందే నిద్రలేస్తే ఈ హార్మోన్ తగ్గి డీహైడ్రేషన్ బారిన పడుతున్నట్లు పరిశోధకుడు అషెర్ రోసింగర్ తెలిపారు. డీహైడ్రేషన్ వల్ల మూత్రంలో ఇన్ఫెక్షన్లు, కిడ్నీల్లో రాళ్లు వస్తాయని హెచ్చరించారు. అయితే 6 గంటలు నిద్రపోతే దానికి తగ్గట్టు ఎక్కువ నీటిని తాగితే ఏ సమస్యా ఉండదని ఆయన పేర్కొన్నారు. ఈ అధ్యయన వివరాలు జర్నల్ స్లీప్‌లో ప్రచురితమయ్యాయి. -
అతిగా నీరు తాగితే..
లండన్ : నీరు ఎక్కువగా తాగడం ఆరోగ్యానికి మంచిదే అయినా అతిగా నీటిని తాగితే అనర్థాలు తప్పవని వైద్య నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఓవర్ హైడ్రేషన్ కారణంగా సోడియం స్థాయిలు పడిపోయి శరీరం, మెదడు వాపు తలెత్తే ముప్పు అధికమని పరిశోధకులు పేర్కొన్నారు. మెదడు వాపు కారణంగా ప్రమాదకర హైపోనట్రెమియా పరిస్థితి తలెత్తుతుందని హెచ్చరించారు. ఈ ప్రమాదకర పరిస్థితికి కారణం ఏమిటన్నది ఇంకా వెల్లడికాకున్నా మెదడులో హైడ్రేషన్‌ను గుర్తించే వ్యవస్థలో లోపం వల్లనే హైపోనట్రెమియాకు దారితీస్తుందని అథ్యయనంలో వెల్లడైంది. డీహైడ్రేషన్‌కు లోనయినట్టు గుర్తించే మెదడులోని హైడ్రేషన్ సెన్సింగ్ న్యూరాన్లు డీహైడ్రేషన్‌ను మాత్రం పసిగట్టలేవని పరిశోధకులు వివరించారు. కెనడాలోని మెక్‌గిల్ యూనివర్సిటీ చేపట్టిన ఈ అథ్యయన వివరాలు జర్నల్ సెల్ రిపోర్ట్స్‌లో ప్రచురితమయ్యాయి. -
బేబీ బ్రెయిన్ అంటే?
గర్భిణీ స్త్రీలు ఎదుర్కొనే ‘బేబీ బ్రెయిన్’ సమస్య గురించి తెలియజేయగలరు. ఈ సమస్యకు సంబంధించిన లక్షణాలను ఎలా తెలుసుకోవాలి? – విజీ, జగిత్యాల సాధారణంగా బేబీ బ్రెయిన్ సమస్యను ప్రెగ్నెన్సీ బ్రెయిన్, అలాగే మొమ్మోసియా అని కూడా అంటారు. ఇది యాభైశాతం గర్భిణీలలో ఉండే అవకాశం ఉంటుంది. ఇది ఎందుకు జరుగుతుందనే దానికి చాలా కారణాలు ఉంటాయి. ఇంకా తెలియని కారణాల కోసం పరిశోధనలు జరుగుతున్నాయి. ఈ సమయంలో వచ్చే కొత్త మార్పులు, ఈస్ట్రోజన్, ప్రొజెస్టరాన్ హార్మోన్లు అధికంగా ఉండటం, ఇంకొక జీవం వస్తుందన్న ఆందోళన, ఒత్తిడి, ఆనందం, అలసట, నిద్ర సరిగా లేకపోవడం, వారిని ఎలా పెంచాలి, ఎలా ఉండాలి అనే సందేహాలు, అలా వాటి గురించే ఆలోచిస్తూ ఉండటం వల్ల ఏకాగ్రత లేకపోవడం జరుగుతుంది. కొన్ని విషయాలను మరచిపోవడం వంటిది కూడా జరుగుతుంది. ఈ సమస్యను అధిగమించడానికి కుటుంబ సభ్యుల సహకారం ఎంతో అవసరం. అలాగే ధ్యానం, యోగా, నడక వంటి చిన్నచిన్న వ్యాయామాలు చెయ్యడం వల్ల కూడా ఉపయోగకరంగా ఉంటుంది. గర్భిణీ స్త్రీలలో spontaneous subarachnoid hemorrhage సమస్య పెరుగుతుందని ఇటీవల చదివాను. దీని గురించి వివరంగా తెలియజేయగలరు. – ఆర్.రజిత, వరంగల్ spontaneous subarachnoid hemorrhage అంటే మెదడుకి, స్కల్బోన్ (పుర్రె ఎముక)కి మధ్యలో ఉండే Arachnoid పొర కింద ఉన్నట్టుండి బ్లీడింగ్ అవ్వడం. ఈ సమస్య గర్భిణీ స్త్రీలకు మాత్రమే కాకుండా ఎవరికైనా రావచ్చు. ఇది ఈ మధ్యకాలంలో నాలుగు శాతం నుంచి ఆరు శాతానికి పెరిగింది. Arachnoid పొర కింద ఉండే రక్తనాళాల్లోని కొన్నింటిలో ్చ aneurysm (అంటే రక్తనాళాల్లో కొంతభాగం వ్యాకోచించి కొద్దిగా ఉబ్బి ఉండటం) ఉండి, అది ప్రెగ్నెన్సీలో జరిగే హార్మోన్ల మార్పుల వల్ల, బీపీలో మార్పుల వల్ల ఇంకా బాగా ఉబ్బి, ఉన్నట్టుండి పగిలి రక్తస్రావం అవ్వడం జరుగుతుంది. అలాగే కొందరిలో arteriovenous malformations (అంటే మంచి రక్తం, చెడు రక్తాన్ని తీసుకెళ్లే రక్తనాళాలు కలవడం) ఉండి, అవి పగలడం, ఇంకా కొన్ని తెలియని కారణాల వల్ల spontaneous subarachnoid hemorrhage జరుగుతుంది. ఇది ఉన్నట్టుండి జరుగుతుంది కాబట్టి ముందుగానే గుర్తించడం చాలా కష్టం. తలకి దెబ్బ తగలడం వల్ల Arachnoid పొర కింద జరిగే బ్లీడింగ్‌ను Subarachnoid Hemorrhage అంటారు. ఉన్నట్టుండి విపరీతమైన తలనొప్పి, కళ్లు తిరగడం, వికారం, వాంతులు, కళ్లు కనిపించకపోవడం, స్పృహ కోల్పోవడం, ఫిట్స్ రావటం వంటి ప్రమాదకరమైన లక్షణాలు ఉంటాయి. బ్లీడింగ్ వల్ల మెదడుకి రక్త సరఫరా తగ్గడం, రక్తం గడ్డకట్టి మెదడుని అదిమెయ్యడం, మెదడు మీద ఒత్తిడి పెరిగి పైన చెప్పిన లక్షణాలు ఏర్పడతాయి. ఈ సమస్యను గుర్తించడానికి సీటీ స్కాన్, ఎమ్ఆర్ఐ, ఆంజియోగ్రామ్ వంటి పరీక్షలు చేయవలసి ఉంటుంది. ఇది ఎమర్జన్సీ కండీషన్ కాబట్టి వెంటనే హాస్పిటల్లో అడ్మిట్ చేసి, చికిత్స చేయవలసి ఉంటుంది. ఎంత జాగ్రత్తగా చికిత్స అందించినా కొందరిలో పరిస్థితి విషమించి ప్రాణాంతకం అయ్యే అవకాశాలు ఉంటాయి. వేసవికాలంలో గర్భిణీ స్త్రీలు తీసుకునే జాగ్రత్తలు, ఆహారం గురించి వివరంగా తెలియజేయగలరు. – జెఎల్, హైదరాబాద్ వేసవి కాలంలో మామూలు వారికే చాలా ఇబ్బందిగా ఉంటుంది. ఇక గర్భవతులకైతే ఇబ్బంది ఇంకా ఎక్కువగా ఉంటుంది. ఈ సమయంలో వారిలో ఉండే నీరసం, చిన్నచిన్న నొప్పులు, ఆయాసం వంటి ఇబ్బందులు వేసవి కాలంలో ఇంకా ఎక్కువగా ఉంటాయి. డీహైడ్రేషన్ ఎక్కువగా ఉంటుంది కాబట్టి మంచి నీరు ఎక్కువగా తీసుకోవాలి (కనీసం 2–3 లీటర్లు). అలాగే మజ్జిగ, కొబ్బరి నీళ్లు, పండ్ల రసాలు కూడా తీసుకోవాలి. ఆహారంలో వేపుళ్లు, నూనె, మసాలా పదార్థాలు ఎంత తక్కువగా తీసుకుంటే అంత మంచిది. ఆకుకూరలు, కూరగాయలు, తాజా పండ్లు తీసుకోవాలి. ఎండలో వీలైనంత వరకు బయటికి వెళ్లకుండా ఉండాలి. తెల్లవారుజామున, సాయంకాలం బాగా చల్లపడిన తర్వాత వాకింగ్ చెయ్యడం ఆరోగ్యకరం. కాటన్ బట్టలు, తేలికగా, లూజుగా, లేత రంగుల బట్టలనే వేసుకోవడం మంచిది. బయటకు వెళ్లేటప్పుడు సన్‌స్క్రీన్ లోషన్, సన్‌గ్లాసెస్, గొడుగు లేదా టోపీ వాడాలి. మధ్యాహ్న సమయాల్లో ఒక గంటసేపు నిద్రపోవాలి. ఎండకు కాళ్లవాపులు కొద్దిగా ఎక్కువగా ఉంటాయి. కాళ్లను ఎత్తుపై పెట్టుకొని కూర్చోవడం, పడుకునేటప్పుడు కాళ్ల కింద దిండును పెట్టుకుంటే కొద్దిగా ఉపశమనం లభిస్తుంది. డా‘‘ వేనాటి శోభ రెయిన్బో హాస్పిటల్స్ హైదర్‌నగర్ హైదరాబాద్ -
నాన్నకు డయాబెటిస్... నాకూ వస్తుందా?
నా వయసు 34 ఏళ్లు. మా నాన్నగారికి డయాబెటిస్ ఉంది. నాకు కూడా ఉందేమోనని అనుమానం వచ్చి, ఇటీవల ఎఫ్బీఎస్ (ఫాస్టింగ్ బ్లడ్ షుగర్) పరీక్ష చేయించుకున్నాను. ఆ పరీక్షలో ఫలితం 112 ఎంజీ/డీఎల్ అని వచ్చింది. నాకు డయాబెటిస్ లేదని చెప్పారు. అయితే మా నాన్నగారికి మధుమేహం ఉంది కాబట్టి నాకు కూడా కచ్చితంగా డయాబెటిస్ వస్తుందా. ఒకవేళ వస్తే ఏ వయసులో వస్తుంది? దయచేసి నాకు తగిన సలహా ఇవ్వండి. – సుధాకర్, సామర్లకోట మీకు ఎఫ్బీఎస్ పరీక్షల్లో వచ్చిన ఫలితాన్ని బట్టి చూస్తే మీరు ప్రీ–డయాబెటిక్ దశలో ఉన్నారని అర్థం. అంటే డయాబెటిస్ వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉన్న దశ అని అర్థం. మీ నాన్నగారికి డయాబెటిస్ ఉందని తెలిపారు కాబట్టి మీరు మరింత జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే డయాబెటిస్ వంశపారంపర్యంగా వచ్చే అవకాశాలు ఎక్కువ. ఈ దశలోనే తగిన జాగ్రత్తలు తీసుకుంటే డయాబెటిస్‌ను దరిచేరకుండా జాగ్రత్తపడవచ్చు. మీరు ముందుగా పరీక్షలు చేయించుకోవడం మంచి విషయం. ఎందుకంటే డయాబెటిస్ వచ్చిన తర్వాత నియంత్రించుకోవడం మినహా చేయగలిగినదేమీ లేదు. అయితే ఇప్పుడు తగిన జాగ్రత్తలు తీసుకోవడం ద్వారా డయాబెటిస్‌ను నివారించుకోవచ్చు. మీరు ఇకపై డాక్టర్లు సూచించిన ప్రకారం క్రమం తప్పకుండా రక్త పరీక్ష చేయించుకోండి. ఇకపై మీ జీవనశైలి, ఆహారపు అలవాట్లలో మార్పులు చేసుకోండి. ప్రధానంగా మీ బరువును అదుపులో ఉంచుకోవడం చాలా అవసరం. అధిక క్యాలరీలు, కొవ్వు ఎక్కువగా ఉండే ఆహారానికి దూరంగా ఉండండి. మద్యపానం, పొగాకు వంటి అలవాట్లు ఏమైనా ఉంటే వెంటనే వాటిని మానేయండి. ప్రతిరోజూ క్రమం తప్పకుండా వ్యాయామం చేయండి. అలా వీలుకాకపోతే కనీసం వారంలో ఐదురోజులైనా రోజుకు అరగంట పాటు కచ్చితంగా వ్యాయామం చేయండి. తాజా ఆకుకూరలు, పండ్లు ఎక్కువగా తీసుకోండి. పెసర్లు, మొలకెత్తి గింజలు శ్నాక్స్‌గా తీసుకుంటే చాలా మంచిది. వీలైనంతవరకు వేళకు తినండి. సాధ్యమైనంత వరకు ఒత్తిడిని దరిచేరనివ్వకండి. డయాబెటిస్ ఉన్నవారు బరువు తగ్గితే ప్రమాదమా? నా స్నేహితుడి వయసు 41 ఏళ్లు. డయాబెటిస్ వ్యాధి ఉంది. కొన్ని నెలల కిందటి వరకు కాస్తంత బొద్దుగా ఉండేవాడు. బరువు తగ్గడానికి రోజుకు 40 నిమిషాలు వ్యాయామం చేస్తున్నాడు. ఇంతకాలం తన బరువు అదుపులో ఉంది గానీ ఇటీవల అకస్మాత్తుగా బరువు తగ్గడం మొదలయ్యింది. చాలా కొద్దికాలంలోనే బాగా బరువు తగ్గి, చాలా సన్నగా కనిపిస్తున్నాడు. అతడిని చూస్తేనే ఆందోళనగా ఉంది. డయాబెటిస్ వ్యాధి ఉన్నవారు ఇలా అకస్మాత్తుగా బరువు తగ్గితే ఏదైనా ప్రమాదమా? – దామోదర్‌రావు, విజయవాడ సాధారణంగా ఏమాత్రం ఊబకాయం ఉన్నా బరువు తగ్గడం ఆరోగ్యానికి మంచిదనే అందరమూ అనుకుంటాం. శారీరక వ్యాయామం, క్యాలరీలు తక్కువగా ఉండే ఆహారం తీసుకుంటూ, క్రమంగా ఉండాల్సినంత బరువుకు చేరడం మంచిదే. ఇలా బరువు తగ్గడం కొలెస్ట్రాల్, బీపీని అదుపులో ఉంచి గుండె ఆరోగ్యాన్ని కాపాడుతుంది. దీనికితోడు బరువు తగ్గడం ఇన్సులిన్ రెసిస్టెన్స్‌ను తగ్గించడమే కాకుండా కండరాలు, కణజాలం, రక్తంలోని కొవ్వులు ఇన్సులిక్కు స్పందించేలా చేస్తుంది కూడా. శరీర కణజాలం, కండరాలు గ్లూకోజ్‌ను ఉపయోగించుకొని శక్తి పొందడానికి ఇన్సులిన్ అవసరమవుతుంది. ఇన్సులిన్ రెసిస్టెన్స్ వల్ల కండరాలు, కణజాలం గ్లూకోజ్‌ను వాడుకోవాలంటే మామూలు కంటే అధిక స్థాయిలో ఇన్సులిన్ అందుబాటులోకి రావాలి. టైప్–2 డయాబెటిస్‌లో ఈ పరిస్థితి ఉంటుంది. ఫలితంగా ఒక విషవలయం ఏర్పడుతుంది. ఇన్సులిన్ లెవల్ ఎక్కువ అవుతున్న కొద్దీ శరీరం బరువు తగ్గడం కష్టమవుతుంది. మరోవైపు శరీరం బరువు అధికమవుతున్నకొద్దీ ఇన్సులిన్ లెవెల్ పెరుగుతూ ఉంటుంది. ఈ చక్రవలయాన్ని ఛేదించడం కష్టం. డయాబెటిస్ వ్యాధిగ్రస్తులు ఉద్దేశపూర్వకంగా బరువు తగ్గించుకోవడం మంచిదే. కానీ తమ ప్రయత్నమే లేకుండా శరీరం బరువు తగ్గడం మాత్రం మంచి సూచన కాదు. రక్తంలో చక్కెర పరిమాణం ఎక్కువగా ఉన్నవారు వారు తరచూ మాత్ర విసర్జనకు వెళ్లాల్సి వస్తుంటుంది. ఇది డీ–హైడ్రేషన్‌కు దారితీస్తుంది. దాంతో శరీరం బరువు తగ్గిపోతుంది. డయాబెటిస్ వ్యాధిగ్రస్తులు చాలామంది మొదటిసారి డాక్టర్‌ను కలిసినప్పుడు చేసే ఫిర్యాదు తమ బరువు తగ్గిందనే. డయాబెటిస్తో పాటు థైరాయిడ్, క్యాన్సర్ వంటి వ్యాధుల వల్ల కూడా శరీరం బరువు తగ్గిపోతుంది. అందువల్ల వ్యాయామం, డైటింగ్ వంటి తమ ప్రయత్నాలు ఏమీ లేకుండా బరువు తగ్గడం ఒక ప్రమాద సూచిక. రక్తంలో చక్కెర పరిమాణంలో మార్పులకు మంచి ఇతర కారణాలు ఏమైనా ఉన్నాయేమో అని కచ్చితంగా తేల్చుకోవడం అవసరం. ఇక ఏమాత్రం ఆలస్యం లేకుండా మీ స్నేహితుడికి పూర్తిస్థాయి వైద్యపరీక్షలు చేయించండి. డాక్టర్ రామన్ బొద్దుల సీనియర్ ఎండోక్రైనాలజిస్ట్,యశోద హాస్పిటల్స్, సికింద్రాబాద్ -
ఆరోగ్య సంబంధిత పానీయాలపై దృష్టి: పెప్సికో
న్యూఢిల్లీ: శీతల పానీయాల ప్రముఖ తయారీ సంస్థ పెప్సికో ఆరోగ్య పరమైన డ్రింక్స్ తయారీపై ప్రధానంగా దృష్టి పెట్టింది. రోజు రోజుకి వినియోగదారుల్లో ఆరోగ్యం పట్ల శ్రద్ధ పెరుగుతున్న నేపథ్యంలో కొత్త డ్రింక్స్, తినుబంఢారాలను మార్కెట్లోకి తీసుకురానున్నట్లు సంస్థ వర్గాలు తెలిపాయి. ఈ క్రమంలో హైడ్రేషన్, ఫంక్షనల్ డ్రింక్స్‌కు మార్కెట్ అవకాశాలున్నాయని పెప్సికో బెవరేజ్ క్యాటగిరి ఇండియా వైస్ ప్రెసిడెంట్ విపుల్ ప్రకాశ్ పేర్కొన్నారు. ఫంక్షనల్ డ్రింక్స్‌లో విటమిన్లు, మినరల్స్ ఉంటాయని తెలిపారు. క్రీడాకారులు లక్ష్యంగా మౌంటెన్ డ్యూ బ్రాండ్‌లో గేమ్ ఫ్యూయల్ డ్రింక్‌ను గురువారం విడుదల చేసింది. ‘గేమ్ ఫ్యూయల్‌ను అమెరికా తర్వాత భారత్‌లోనే విడుదల చేసాం. ఈ ఏడాది చివరికల్లా మరో 2 కొత్త ఉత్పత్తులను వినియోగదారుల ముందుకు తీసుకువస్తాం’ అని విపుల్ ప్రకాశ్ చెప్పారు. -
అవి కిడ్నీ ఇన్ఫెక్షన్కు సూచనలు కావచ్చు..!
హోమియో కౌన్సెలింగ్ నా వయసు 45. నాది మార్కెటింగ్ జాబ్ కావడం వల్ల వృత్తిరీత్యా సిటీ అంతా తిరగవలసి వస్తుంది. ద్విచక్రవాహనంలో ప్రయాణం చేస్తుంటే తలనొప్పి, తలతిరగడం, నోరు ఎండిపోవడం వంటి సమస్యలతో బాధపడుతున్నాను. దయచేసి నా సమస్యలకు హోమియోలో ఏమైనా పరిష్కారం ఉంటే చెప్పగలరు. - టి.వి.ప్రమోద్, మహబూబ్‌నగర్ వేసవిలో ఎండలో ఎక్కువగా తిరిగినప్పుడు అలా కావడం సహజమే. వడదెబ్బ తగిలిందంటే ఇంకా చాలా సమస్యలు వస్తాయి. మెదడులో థెర్మోరెగ్యులేటర్ అనే కేంద్రం ఉంటుంది. ఇది ఎండలోకి వెళ్లినప్పుడు శరీరాన్ని చల్లబరచే ప్రయత్నం చేస్తుంది. విఫలమై నప్పుడు శరీరం వేడెక్కి, ఒళ్లంతా చెమటలు పట్టడం మొదలవుతుంది. దాంతో శరీరంలోని నీరంతా బయటికి వెళ్లిపోతుంది. అలా ఒంట్లో ఉన్న నీటిలో 25 శాతానికి మించి నీరు బయటకు వెళ్లిపోవడాన్ని డీ హైడ్రేషన్ అంటారు. డీ హైడ్రేషన్ ప్రభావం అందరి మీదా ఒకేలా ఉండదు. వయసు పైబడిన వారు, పసిపిల్లలు, మధుమేహవ్యాధిగ్రస్థులు డీ హైడ్రేషన్‌కు గురయ్యే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. డీ హైడ్రేషన్‌కు గురయినప్పుడు పొటాషియం తగ్గిపోయి కండరాల నొప్పులు, కండరాల బలహీనత ఏర్పడుతుంది. ఒక్కోసారి కాళ్లూ చేతులూ చచ్చుబడిపోతాయి. కారణాలు: మద్యపానం, కూల్ డ్రింక్స్, మసాలాలు అతిగా తీసుకోవడం, తగిన నీరు తాగకపోవడం వల్ల, రేడియేషన్, కీమోథెరపీ తీసుకుంటున్న క్యాన్సర్, హెచ్.ఐ.వి బాధితులు, మొండి జబ్బులు ఉన్న వారు కూడా డీ హైడ్రేషన్‌కు త్వరగా గురవుతారు. లక్షణాలు: తలనొప్పి, కండరాలనొప్పి, అలసట, నీరసం, కొద్దిపాటి జ్వరం, కడుపునొప్పి, వాంతులు, విరేచనాలు, కళ్లు మండటం, శరీరం వేడెక్కటం జాగ్రత్తలు: బయటికి వెళ్లేటప్పుడు, నీరు, పళ్లరసాలు, ఓఆర్ఎస్ ద్రావణాలు వెంటపెట్టుకుంటే డీ హైడ్రేషన్ బారిన పడరు. పళ్లరసాలు, మజ్జిగ, కొబ్బరినీళ్లు వంటి ద్రవాలు తీసుకోవాలి. రెండు మూడు లీటర్ల నీటిని అదనంగా తాగాలి. లేత రంగులు, వదులు దుస్తులు, ప్రత్యేకించి కాటన్ దుస్తులు ధరించడం శ్రేయస్కరం. నిర్ధారణ: రక్తపరీక్షలు, బిఎమ్ఐ, బియూఎన్, సీబిసి హోమియో చికిత్స: డీహైడ్రేషన్‌కు హోమియోపతిలో మంచి మందులు అందుబాటులో ఉన్నాయి. రోగి శారీరక, మానసిక లక్షణాలను అనుసరించి మందులను డాక్టర్ పర్యవేక్షణలో వాడాలి. డాక్టర్ మురళి కె. అంకిరెడ్డి ఎండీ (హోమియో) స్టార్ హోమియోపతి హైదరాబాద్ పీడియాట్రిక్ కౌన్సెలింగ్ మా బాబుకు పన్నెండేళ్లు. ఇప్పటికీ పక్కతడుపుతూనే ఉన్నాడు. రాత్రిళ్లు ప్రతి రెండు గంటలకోసారి మూత్రవిసర్జనకంటూ మమ్మల్ని నిద్రలేపుతుంటాడు. పగలు కూడా చాలా ఎక్కువసార్లే మూత్రానికి వెళ్తున్నాడు. మాకు తగిన సలహా ఇవ్వండి. - దీప్తి, ఆదిలాబాద్ మీరు చెబుతున్న లక్షణాలను బట్టి మీ బాబు కండిషన్‌ను ఇంక్రీజ్డ్ ఫ్రీక్వెన్సీ ఆఫ్ యూరినేషన్ అని చెప్పవచ్చు. ఎక్కువసార్లు మూత్రవిసర్జనకు వెళ్తుంటే అతడికి పాలీయూరియా అన్న కండిషన్ కూడా ఉందేమోనని అనుమానించాలి. ఈ సమస్యకు కారణాలూ ఎక్కువే. అందులో కొన్ని ముఖ్యమైనవి... నీళ్లు ఎక్కువగా తాగడం, యూరినరీ ఇన్ఫెక్షన్స్, మానసిక సమస్యలు, ఎండోక్రైన్ సమస్యలు, యూరినరీ బ్లాడర్ డిజ్‌ఫంక్షన్, దీర్ఘకాలిక కిడ్నీ సమస్యలు, మలబద్దకం వంటివి. అతడి సమస్యకు కచ్చితమైన కారణాన్ని తెలుసుకోడానికి కంప్లీట్ యూరిన్ అనాలిసిస్, 24 గంటల్లో అతడు విసర్జించే మూత్రపరిమాణం పరీక్షలతో పాటు యూరిన్ ఆస్మనాలిటీ, అల్ట్రాసౌండ్ ఆఫ్ కేయూబీ పరీక్షలు చేయించాలి. ఇలాంటి పిల్లల్లో సాధారణంగా సాయంత్రం నుంచి రాత్రివరకు నీళ్లు ఎక్కువగా తాగకుండా చూడటం, తియ్యటి పదార్థాలను ఎక్కువగా తీసుకోకుండా చూడటం వంటి జాగ్రత్తలు తీసుకోవాలి. దాంతో పాటు యూరిన్ పాస్ చేసేటప్పుడు విసర్జన పూర్తిగా చేసేలా చూడటం ప్రధానం. ఇలాంటి మంచి విసర్జక అలవాట్లతో ఈ సమస్య పూర్తిగా తగ్గుతుంది. అయితే పైన పేర్కొన్న కారణాలలో ఏవైనా ఉన్నాయేమో తెలుసుకునేందుకు అన్ని మూత్రపరీక్షలు (కంప్లీట్ యూరిన్ ఎగ్జామినేషన్) చేయించండి. మీరు ఒకసారి మీ పిల్లల వైద్యనిపుణుడిని సంప్రదించండి. డా. రమేశ్‌బాబు దాసరి సీనియర్ పీడియాట్రీషియన్,\ రోహన్ హాస్పిటల్స్, విజయనగర్ కాలనీ, హైదరాబాద్ కిడ్నీ కౌన్సెలింగ్ నా వయసు 38 ఏళ్లు. నాకు గత కొన్నిరోజుల నుంచి మూత్రవిసర్జన సమయంలో మంటగానూ, నొప్పిగానూ ఉంటోంది. అప్పుడప్పుడూ జ్వరం వస్తోంది. వాంతి వచ్చేలా అనిపిస్తోంది. డాక్టర్ దగ్గరికి వెళ్తే కొన్ని మందులు రాసిచ్చారు. ఒక వారం పాటు వాడినప్పటికీ ఎలాంటి మార్పూ లేదు. దయచేసి నా సమస్యకు తగిన పరిష్కారం చూపండి. - భద్రం, రాజమండ్రి మీరు తెలిపిన లక్షణాలను బట్టి చూస్తుంటే మీకు కిడ్నీలో గానీ, యూరినరీ బ్లాడర్‌లో గానీ ఇన్ఫెక్షన్ ఉన్నట్లు అనిపిస్తోంది. మూత్ర విసర్జన చేస్తున్నప్పుడు సాధారణంగా బ్యాక్టీరియా మన శరీరంలోకి దూరి ఇన్ఫెక్షన్ను కలిగిస్తుంది. ఒక్కోసారి కిడ్నీలోకి కూడా ప్రవేశిస్తుంది. ఈ క్రమంలో కిడ్నీ ఇన్ఫెక్షన్ చోటు చేసుకుంటుంది. అంతేకాకుండా శరీరక సంబంధాల ద్వారాగానీ, షుగర్ వ్యాధి వల్లగానీ ఈ కిడ్నీ లేదా యూరినరీ బ్లాడర్ ఇన్ఫెక్షన్ వస్తుంది. ఒకవేళ ఈ సమస్య కొన్ని నెలలపాటు నుంచి మిమ్మల్ని బాధపెడోతందంటే మీ కిడ్నీలో రాళ్లు లేదా మూత్రనాళంలో సమస్య ఉన్నట్లు అనుమానించాల్సి ఉంటుంది. మీకు జ్వరం కూడా వస్తోందని రాశారు. వాంతులు అవ్వడం లేదంటున్నారు. మరి నడుం పైభాగంలో మీకు ఎలాంటి నొప్పి గానీ అనిపించడం లేదా? తరచూ మూత్రం రావడం, నొప్పి లేదా మంట పుట్టడం లాంటి లక్షణాలతో కిడ్నీ లేదా యూరినరీ బ్లాడర్ సమస్యను కనుగొనలేము. అలాగే మూత్రం, ఎక్స్‌రే లాంటి పరీక్షల ద్వారా కూడా తెలుసులేము. ఇక మీకు మామూలుగా జ్వరం ఉండి, కాస్త నొప్పి, మంటతో బాధపడుతూ ఉండి, బాగానే తింటూ, నీరు తాగుతూ, ద్రవాహారం తీసుకోగలుతున్నారంటే కొన్ని యాంటీబయాటిక్స్ వాడితే సరిపోతుంది. కానీ మీకు వంద డిగ్రీలపైగా జ్వరం ఉండి, విపరీతమైన నొప్పి లేదా మంటతో బాధపడుతూ, ఏమీ తినలేకపోవడం, తాగలేకపోవడం లాంటి లక్షణాలుంటే మాత్రం మిమ్మల్ని వెంటనే ఆసుపత్రిలో చేర్చి, మీకు డాక్టర్ల పర్యవేక్షణలో చికిత్స అందించాల్సి ఉంటుంది. మీకు యాంటీబయాటిక్స్ ఇవ్వడంతో పాటు, ఐవీ ఫ్లుయిడ్స్ ఎక్కిస్తారు. కిడ్నీలో ఉండే ఇన్ఫెక్షన్ను సమూలంగా తీసేస్తారు. దీనికి రెండు వారాల సమయం పడుతుంది. నీరు ఎక్కువగా తీసుకోవడం వల్ల కిడ్నీలో ఉండే మలినాలు తొలగిపోతాయని ఇచ్చే సలహా మంచిదే గానీ బ్యాక్టీరియా ద్వారా కిడ్నీకి కలిగే తీవ్రమైన నష్టం గురించి చాలామందికి తెలియదు. అందుకే ఇలాంటి చిన్నపాటి హెచ్చరికలు వచ్చినప్పుడు సరైన పరీక్షలు చేయించుకొని తగిన చికిత్స తీసుకుంటే సరిపోతుంది. లేదా కిడ్నీ ఫెయిల్యూర్‌కు దారితీసే ప్రమాదం ఉంది. అందరిలోనూ కిడ్నీ ఫెయిల్యూర్ లక్షణాలు తొందరగా బయటపడవు. రోగం ముదిరిన తర్వాత మాత్రమే తెలిసే అవకాశం ఉంటుంది. అప్పుడు చేయిదాటిపోయే పరిస్థితులు ఏర్పడవచ్చు. కాబట్టి ఆరోగ్య సమస్యలు చిన్నవిగా ఉన్నప్పుడే మేల్కోవడం మంచిది. మీరు డాక్టర్‌ను సంప్రదించి మీ సమస్యకు తగిన పరిష్కారం పొందండి. డా.ఊర్మిళ ఆనంద్ సీనియర్ నెఫ్రాలజిస్ట్ - కిడ్నీ ట్రాన్స్‌ప్లాంట్ ఫిజీషియన్, యశోద హాస్పిటల్స్, సికింద్రాబాద్ -
మెడికేషన్స్...
ఎగ్జామ్ టిప్స్ ► సాధారణ జలుబు, జ్వరం, నోరు ఎండినట్టుగా అనిపించడం, తలనొప్పి వంటివి ఉంటే వయసుల వారీగా, బరువును బట్టి 60 - 180 రోజుకు ఒకటి చొప్పున ఇవ్వచ్చు. రెండు రోజుల్లోగా సమస్య తగ్గకపోతే వెంటనే వైద్యులను సంప్రదించాలి. ముక్కుకారడం వంటివి ఉంటే స్టీమ్ పట్టాలి. ► ఫ్లూ జ్వరాలు రాకుండా ఉండటానికి హెచ్ 1ఎన్ 1, హెచ్ 3ఎన్ 2 ఇన్‌ఫ్లూయెంజా ఏ అండ్ బీ వ్యాక్సిన్లను డాక్టర్ సిఫారసుతో ఇప్పించాలి. ►వయసుల వారీగా వ్యాక్సిన్లను తప్పనిసరిగా ఇప్పించాలి. దీని వల్ల రకరకాల వ్యాధుల నుంచి తట్టుకునే శక్తి వస్తుంది. ► సాధారణ జ్వరం, తలనొప్పిగా ఉన్నప్పుడు పారసెటిమాల్ వాడొచ్చు. రెండు రోజుల్లో తగ్గకపోవడం, చర్మానికి ర్యాష్ కనిపిస్తే వైరల్ ఫీవర్లు అయితే నిర్లక్ష్యం చేయకుండా డాక్టర్ చేత పరీక్షించి యాంటీబయోటిక్స్ వాడాలి. ► అజీర్తికి ట్యాబ్లెట్ (జెలూసిల్) వేసుకోవచ్చు. ఇది తక్షణ ఉపశమనాన్ని ఇస్తుంది. ► డీ-హైడ్రేషన్ కాకుండా చూసుకోవాలి. లూజ్ మోషన్స్ అయితే ఓరల్ రీహైడ్రేషన్ సాల్ట్ (ఎలక్ట్రాల్ పౌడర్) కలిపిన నీటిని ఇస్తూ ఉండాలి. అలాగే అరటిపండు, మజ్జిగ, అన్నం, వీటితో పాటుగా ల్యాక్టిక్ యాసిడ్ బేసిలస్ ట్యాబ్లెట్ ప్రతి ఆరు గంటలకోసారి ఇవ్వవచ్చు. సమస్య తగ్గించేవరకు ఈ ట్యాబ్లెట్లను వాడచ్చు. ► జ్వరంతో పాటు విపరీతమైన చలి, వణకడం వంటివి సంభవిస్తే వెంటనే ఫిజీషియన్‌ను సంప్రదించాలి. ► మల్టీ విటమిన్ ట్యాబ్లెట్లలో ఏదైనా ఒకటి పరీక్షల సమయంలో రోజూ ఇవ్వచ్చు. ► నిద్రపోవడానికి, నిద్రరాకుండా ఉండటానికి పిల్లలకు అస్సలు మెడిసిన్స్ ఇవ్వకూడదు. ఎదిగే వయసులో పిల్లలపై ఇవి దుష్ర్పభావాన్ని చూపుతాయి. భవిష్యత్తులో పిల్లలకు అదో వ్యసనంగా కూడా మారే ప్రమాదం ఉంటుంది.