మెడికేషన్స్...
ఎగ్జామ్ టిప్స్
► సాధారణ జలుబు, జ్వరం, నోరు ఎండినట్టుగా అనిపించడం, తలనొప్పి వంటివి ఉంటే వయసుల వారీగా, బరువును బట్టి 60 - 180 రోజుకు ఒకటి చొప్పున ఇవ్వచ్చు. రెండు రోజుల్లోగా సమస్య తగ్గకపోతే వెంటనే వైద్యులను సంప్రదించాలి. ముక్కుకారడం వంటివి ఉంటే స్టీమ్ పట్టాలి.
► ఫ్లూ జ్వరాలు రాకుండా ఉండటానికి హెచ్ 1ఎన్ 1, హెచ్ 3ఎన్ 2 ఇన్‌ఫ్లూయెంజా ఏ అండ్ బీ వ్యాక్సిన్లను డాక్టర్ సిఫారసుతో ఇప్పించాలి.
►వయసుల వారీగా వ్యాక్సిన్లను తప్పనిసరిగా ఇప్పించాలి. దీని వల్ల రకరకాల వ్యాధుల నుంచి తట్టుకునే శక్తి వస్తుంది.
► సాధారణ జ్వరం, తలనొప్పిగా ఉన్నప్పుడు పారసెటిమాల్ వాడొచ్చు. రెండు రోజుల్లో తగ్గకపోవడం, చర్మానికి ర్యాష్ కనిపిస్తే వైరల్ ఫీవర్లు అయితే నిర్లక్ష్యం చేయకుండా డాక్టర్ చేత పరీక్షించి యాంటీబయోటిక్స్ వాడాలి.
► అజీర్తికి ట్యాబ్లెట్ (జెలూసిల్) వేసుకోవచ్చు. ఇది తక్షణ ఉపశమనాన్ని ఇస్తుంది.
► డీ-హైడ్రేషన్ కాకుండా చూసుకోవాలి. లూజ్ మోషన్స్ అయితే ఓరల్ రీహైడ్రేషన్ సాల్ట్ (ఎలక్ట్రాల్ పౌడర్) కలిపిన నీటిని ఇస్తూ ఉండాలి. అలాగే అరటిపండు, మజ్జిగ, అన్నం, వీటితో పాటుగా ల్యాక్టిక్ యాసిడ్ బేసిలస్ ట్యాబ్లెట్ ప్రతి ఆరు గంటలకోసారి ఇవ్వవచ్చు. సమస్య తగ్గించేవరకు ఈ ట్యాబ్లెట్లను వాడచ్చు.
► జ్వరంతో పాటు విపరీతమైన చలి, వణకడం వంటివి సంభవిస్తే వెంటనే ఫిజీషియన్‌ను సంప్రదించాలి.
► మల్టీ విటమిన్ ట్యాబ్లెట్లలో ఏదైనా ఒకటి పరీక్షల సమయంలో రోజూ ఇవ్వచ్చు.
► నిద్రపోవడానికి, నిద్రరాకుండా ఉండటానికి పిల్లలకు అస్సలు మెడిసిన్స్ ఇవ్వకూడదు. ఎదిగే వయసులో పిల్లలపై ఇవి దుష్ర్పభావాన్ని చూపుతాయి. భవిష్యత్తులో పిల్లలకు అదో వ్యసనంగా కూడా మారే ప్రమాదం ఉంటుంది.