
ప్రతీకాత్మక చిత్రం
లండన్ : నీరు ఎక్కువగా తాగడం ఆరోగ్యానికి మంచిదే అయినా అతిగా నీటిని తాగితే అనర్థాలు తప్పవని వైద్య నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఓవర్ హైడ్రేషన్ కారణంగా సోడియం స్థాయిలు పడిపోయి శరీరం, మెదడు వాపు తలెత్తే ముప్పు అధికమని పరిశోధకులు పేర్కొన్నారు. మెదడు వాపు కారణంగా ప్రమాదకర హైపోనట్రెమియా పరిస్థితి తలెత్తుతుందని హెచ్చరించారు.
ఈ ప్రమాదకర పరిస్థితికి కారణం ఏమిటన్నది ఇంకా వెల్లడికాకున్నా మెదడులో హైడ్రేషన్‌ను గుర్తించే వ్యవస్థలో లోపం వల్లనే హైపోనట్రెమియాకు దారితీస్తుందని అథ్యయనంలో వెల్లడైంది. డీహైడ్రేషన్‌కు లోనయినట్టు గుర్తించే మెదడులోని హైడ్రేషన్ సెన్సింగ్ న్యూరాన్లు డీహైడ్రేషన్‌ను మాత్రం పసిగట్టలేవని పరిశోధకులు వివరించారు. కెనడాలోని మెక్‌గిల్ యూనివర్సిటీ చేపట్టిన ఈ అథ్యయన వివరాలు జర్నల్ సెల్ రిపోర్ట్స్‌లో ప్రచురితమయ్యాయి.
Comments
Please login to add a commentAdd a comment