Know Reason Behind Why Anushka Shetty Got Fat, Deets Inside - Sakshi
Sakshi News home page

Anushka Shetty: బొద్దుగా మారిన అనుష్క.. కారణం ఇదేనా?

Published Tue, Mar 28 2023 12:47 PM | Last Updated on Tue, Mar 28 2023 1:12 PM

Reason Behind Why  Anushka Shetty Got Fat - Sakshi

సిల్వర్ స్క్రీన్ పై హీరోయిన్ గా చాలా మంది రాణిస్తారు. వీరిలో కొంత మంది బ్యూటీస్ మాత్రమే ప్రయోగాలు చేయటానికి ఇష్టపడతారు. వారిలో అనుష్క ఒకరు. అనుష్క అందం అభినయం కలిసిన నటి. సూపర్ సినిమాతో తెరంగ్రేటం చేసిన అనుష్క...తన అందంతోనే కాదు..అభినయంతో కూడా ప్రేక్షకులను ఆకట్టుకుంది. అనుష్క నటనకే కాదు..గ్లామర్ కు కూడా ప్యాన్స్ ఉన్నారు. 

డైరెక్టర్ కె.రాఘవేంద్రరావు తనయుడు, కె.ప్రకాష్‌  దర్శకత్వంలో అనుష్క సైజ్ జీరో సినిమాలో నటించింది. సైజ్ జీరో ముందు వరకు అనుష్క చాలా స్లిమ్ గా ఉండేది. బాహుబలి, రుద్రమదేవి సినిమాల్లో నార్మల్ లుక్ లోనే కనిపించింది. సైజ్ జీరో కోసం అనుష్క చేసిన ప్రయోగం బెడిసి కొట్టింది. అనుష్క వెయిట్ కంట్రోల్ తప్పింది. ఆ సినిమా కోసం అనుష్క కావాలని విపరీతంగా బరువు పెరిగింది. రాజమౌళి వద్దని చెప్పిన వినకుండా ఆ సినిమాలో నటించింది అనుష్క. ఆ  సినిమా మీద నమ్మకంతో బాగా లావుగా మారిపోయింది. 

అనుష్క నమ్మకం పెట్టుకున్న ఈ సినిమా బాక్సాఫీస్ దగ్గర బోల్తా పడింది. తన యోగా పద్దతులు ద్వారా స్లిమ్ కావచ్చు అనుకున్న అనుష్క ప్రయత్నం సక్సెస్ కాలేదు. అనవసరంగా అనుష్క సైజ్ జీరో చేసిందనే కామెంట్స్ ఎక్కువైయ్యాయి.ఇక బాహుబలి 2 కోసం అనుష్క వెయిట్ లాస్ అవ్వటానికి ఎంత ట్రై చేసిన నార్మల్ లుక్ లోకి రాలేకపోయింది. దీంతో రాజమౌళి గ్రాఫిక్స్ తో ఏదో మ్యానేజ్ చేశాడు. 


 
బాహుబలి 2 తర్వాత నటించిన భాగమతి, నిశ్శబ్దం సినిమాలో అనుష్క లావుగానే కనిపించింది. నిశ్శబ్దం తర్వాత అనుష్క ఇంకో సినిమాకి గ్రీన్ సిగ్నల్ ఇవ్వలేదు. దీంతో అందరూ అనుష్క స్లిమ్ కావటం కోసం గ్యాప్ తీసుకుందనుకున్నారు. ఇక అనుష్క కూడా అమెరికా లో వెయిట్ లాస్ అయ్యేందుకు ట్రై చేసింది.  కానీ ఎలాంటి రిజల్ట్ అనుష్క కి అవి ఇవ్వలేదని..ఈ మధ్య  కర్ణాటకలోని ఓ ఆలయంలో కనిపించిన అనుష్క చూస్తే అర్ధమౌతుంది. ఇక సోషల్ మీడియా లో బాగా బొద్దుగా మారిన అనుష్క వీడియో వైరల్ అయింది. 

అయితే అనుష్క ఇంతలా వెయిట్ పెరగడానికి కారణం థైరాయిడ్ అనే ప్రచారం సోషల్ మీడియాలో జరుగుతోంది.. అందులో ఎంతవరకు నిజం ఉందనేది మాత్రం అనుష్కనే తేల్చాలి. ఇక అనుష్క బొద్దుగా మారటంపై చాలా మంది చాలా రకాలుగా కామెంట్స్ చేస్తున్నారు.అనుష్కకి సినిమాల్లో నటించే ఆలోచన లేదని..అందుకే ఫిట్ నెస్ విషయం పట్టించుకోవటం లేదంటూ డిస్కషన్ చేస్తున్నారు. ఇంకొంత మంది నెటిజన్స్ అనుష్క ఇలా లావు కనిపించటం వెనుక రీజన్ ఉండొచ్చని అభిప్రాయపడుతున్నారు.

 ప్రస్తుతం అనుష్క..యూవీ క్రియేషన్స్ లో మిస్ శెట్టి మిస్టర్ పొలిశెట్టి సినిమాలో నటిస్తుంది. ఈ సినిమా కోసమే అనుష్క లావు అయిందనే వాదనలు వినిపిస్తున్నాయి. రీసెంట్ గా రిలీజైన మిస్ శెట్టి..మిస్టర్ పొలిశెట్టి మూవీ పోస్టర్ అండ్ లిరికల్ సాంగ్ లో అనుష్క అంత బొద్దుగా కనిపించలేదు. అయితే ఈ సినిమా విషయంలో కూడా అనుష్క లావుగా కనిపించకుండా ఉండేందుకు గ్రాఫిక్స్ వాడారనే మాట టీటౌన్ లో వినిపిస్తోంది. ఇక అనుష్క ఫ్యాన్స్ మాత్రం స్వీటీ మళ్లీ నార్మల్‌ లుక్ లో రావాలనుకుంటున్నారు.కానీ ఫ్యాన్స్ కల నిజం అయ్యేలా లేదు. 

ఎందుకంటే ప్రసస్తుతం అనుష్క వయస్సు నాలుగు పదులు దాటేసింది. ఏజ్ పరంగా చూసుకున్న అనుష్క నార్మల్ లుక్ లోకి..ఫ్యాన్స్ కోరుకున్న విధంగా తయారు కావాలంటే కొంచెం కష్టమే. కానీ అనుష్క కి సినిమా అంటే చాలా ఇష్టం. అందుకే ఎంత రిస్క్ అయినా చేస్తుంది. అందుకే సైజ్ జీర్ చేసింది. ఆ సినిమా మీద ప్రేమే మళ్లీ అనుష్క ను స్లిమ్ గా మార్చేలా చేస్తుందేమో చూడాలి. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement