Actress Namitha Shocking Revelation About Her Heavy Weight Gain - Sakshi
Sakshi News home page

నా బరువుకు కారణం అదే.. పుకార్లు నమ్మొద్దు: నమిత

Published Thu, Feb 4 2021 7:29 PM | Last Updated on Thu, Feb 4 2021 10:22 PM

Actress Namitha Reveals Reason Behind Her Weight Gain - Sakshi

‘జెమిని’, ‘సొంతం’ సినిమాల్లో సన్నగా నాజుకు నడుముతో కుర్రాళ్లను కట్టిపేడేశారు హీరోయిన్‌ నమిత. అయితే ఆ తర్వాత కొన్ని సినిమాల్లో నటించిన ఆమె కొంతకాలం గ్యాప్‌ తర్వాత ‘సింహా’, ‘బిల్లా’ మూవీల్లో మెరిసారు. అయితే ఈ మూవీస్‌లో ఆమె బోద్దుగా కనిపించడంతో రానురాను నమితకు సినిమా ఆఫర్లు తగ్గిపోయాయి. ఈ క్రమంలో 2017లో తెలుగు అబ్బాయి వీరేంద్ర చౌదరిని ఆమె వివాహం చేసుకుని సెటిల్‌ అయిపోయారు. కాగా ఇప్పుడు నమిత మళ్లీ సినిమాలపై దృష్టి పెట్టారని, ఇందుకోసం ఆమె లావు తగ్గేందుకు కసరత్తులు చేస్తున్నట్లు ఇటీవల వార్తలు వినిపిస్తున్నాయి. దీంతో ఆమె బరువు పెరగడంపై సోషల్‌ మీడియాలో విమర్శలు వెల్లువెతున్నాయి. గతంలో నమిత విపరితంగా మద్యం సేవించడం వల్లే  అంత బరువు పెరిగారని నెటిజన్లు ట్రోల్‌‌ చేయడం ప్రారంభించారు. (చదవండి: భర్తతో విడాకులు..అది బ్రేకప్‌లా ఉంది : నటి)

దీంతో తాజాగా నమిత తనపై వస్తు‍న్న పుకార్లపై స్పందించారు... థైరాయిడ్‌, పీసీఓడీ అరోగ్య సమస్యల వల్లే అధిక బరువు పెరిగానన్నారు. అంతేగాని మద్యం సేవించడం వల్ల కాదని స్పష్టం చేశారు. తనపై వస్తున్న పుకార్లను నమ్మెద్దని కూడా ఆమె తెలిపారు. ‘ఒకప్పుడు నేను తీవ్ర మానసిక ఒత్తిడికి లోనయ్యాను. ఈ క్రమంలో జీవితాన్ని కోల్పోయాననే భావన కలిగింది. మానసిక ప్రశాంత కరువైంది. దానికి తోడు థైరాయిడ్‌, పీసీఓడీ సమస్యలు, వీటి వల్లే అధిక బరువు పెరిగాను. అయితే ఆ సమమంలో యోగా, ఫిజికల్‌ ఆక్టివిటీస్‌తో తిరిగి ప్రశాంతతను పొందగలిగాను’ అంటూ ఆమె చెప్పుకొచ్చారు. అయితే ప్రస్తుతం తను 90 కిలోల బరువు ఉన్నానని, అందులో దాపరికం ఏం లేదన్నారు. (చదవండి: పెళ్లికి ముందు ఆ ఒప్పందం పెట్టుకున్నాం: ప్రియాంక)

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement