ఈ ఫుడ్‌ ఏ హీరోయినూ తినదు! | Kriti Sanon To Gain 15 Kgs For Her Upcoming Film Mimi | Sakshi
Sakshi News home page

ఆయిల్‌ ఫుడ్‌ను ఆవురావురుమని లాగిస్తోన్న హీరోయిన్‌

Feb 3 2020 2:35 PM | Updated on Feb 3 2020 2:59 PM

Kriti Sanon To Gain 15 Kgs For Her Upcoming Film Mimi - Sakshi

సినిమాల కోసం హీరోయిన్లు పడే కష్టాలు అన్నీ ఇన్నీ కావు. వారు ఎంచుకునే సినిమాకు తగ్గట్టుగా వాళ్లు కూడా ఫిట్‌నెస్‌ను మార్చుకుంటూ ఉంటారు. సూపర్‌స్టార్‌ మహేశ్‌బాబు నేనొక్కడినే చిత్రంతో తెలుగులో గుర్తింపు సంపాదించుకుంది కృతి సనన్‌. ఆ తర్వాత బాలీవుడ్‌కు పాగా మార్చిన ఈ హీరోయిన్‌ పలు సక్సెస్‌ఫుల్‌ చిత్రాల్లో నటించింది. తాజాగా మరాఠీ మూవీ ‘మాలా ఐ వైచై’ ఆధారంగా తెరకెక్కుతున్న మిమి అనే బాలీవుడ్‌ సినిమాలో నటిస్తోంది. ఇందులో తొలుత నర్తకిగా దర్శనమిచ్చే కృతి.. సినిమా ముగింపుకు వచ్చేసరికి సరోగసి మదర్‌గా కనిపిస్తుంది.

తల్లి పాత్రలో నూటికి నూరు మార్కులు వేయించుకోవడం కోసం ముద్దుగొమ్మ బొద్దుగుమ్మగా మారేందుకు విశ్వప్రయత్నాలు చేస్తున్న విషయం తెలిసిందే. చెమటలు కక్కేలా జిమ్‌లు, ఎక్సర్‌సైజ్‌లు అంటూ తిరగడం మాని హాయిగా పుష్టిగా తినడం ప్రారంభించింది. ఇక ఆమె ఉదయంపూట ఏం టిఫిన్‌ తీసుకుందో తెలిస్తే మీరు షాక్‌ అవుతారు. పూరీ, శనగల కూర, వీటికి తోడుగా హల్వ. ఈ మేరకు ఆమె తీసుకున్న అల్పాహారం ఫొటోను  సోషల్‌ మీడియాలో పోస్ట్‌ చేసింది. ‘ఆయిల్‌ ఫుడ్‌ను చూస్తేనే ఆమడదూరం పరుగుపెట్టే భామ.. ఇప్పుడు దాన్ని ఆవురావురుమని తింటోంది’, ‘ఈ ఫుడ్‌ను ఈవిడ తప్ప.. ఏ హీరోయినూ తినదు’ అని నెటిజన్లు ఛలోక్తులు విసురుతున్నారు. (కృతి సనన్‌.. రెండోసారి)

సినిమా కోసం బాగానే కష్టపడుతోందని కొంతమంది నెటిజన్లు ఆమెపై ప్రశంసలు సైతం కురిపిస్తున్నారు. ఇక మిమి చిత్రం గురించి కృతి సనన్‌ మాట్లాడుతూ.. ‘ఈ సినిమాలో చేస్తున్న పాత్ర నా మనసుకు ఎంతగానో నచ్చింది. దీనికోసం ఏమైనా చేస్తా. బరువు పెరగడం నాకు కొత్త, 15 కిలోలు పెరగడం నాకు చాలెంజింగ్‌గా ఉంది. అయితే లావెక్కితే ఎలా ఉంటానో నన్ను నేను చూసుకోవాలని నాకూ ఆతృతగా ఉంది’ అని చెప్పుకొచ్చింది. కాగా ఈ సినిమాను జూలైలో విడుదల చేయడానికి చిత్రబృందం సన్నాహాలు చేస్తోంది.

చదవండి: రూ. 200 కోట్ల క్లబ్‌లో ‘దర్బార్‌’

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement