ఓటీటీ, థియేటర్ రిలీజెస్... ఈ రెండింటిలోనూ నటీమణులకు సంబంధించి అద్భుతమైన నటనకు చెప్పుకోదగ్గ సంవత్సరంగా 2024 నిలుస్తుంది. వారి నట ప్రతిభకు మాత్రమే కాకుండా భారతీయ సినిమా, ఓటీటీ ప్లాట్‌ఫామ్‌లలోని వైవిధ్యానికి, అద్భుత కథాకథనాలను హైలైట్ చేసిన సంవత్సరంగా కూడా 2024 గురించి చెప్పవచ్చు...
టాప్ టెన్‌లో ఒకటి... దో పట్టీ
గ్లామర్ పాత్రలు మాత్రమే కాదు నటనకు సవాలు విసిరే పాత్రలలో కూడా మెప్పించగలనని నిరూపించింది కృతీసనన్. సంక్లిష్టమైన సంబంధాలు, గృహహింసను ప్రతిబింబించే గ్రిప్పింగ్ డ్రామా ‘దో పట్టీ’లో సౌమ్య, శైలిగా ద్విపాత్రాభినయం చేసింది. జీవితంలో ఎదురయ్యే సవాళ్లను దృఢసంకల్పంతో ఎదుర్కొనే మహిళగా తన నటనతో ప్రేక్షకుల మన్ననలు ΄పొందింది. పాత్రలలో భావోద్వేగాన్ని పండించడం లో కృతీసనన్ తనదైన నటనను ప్రదర్శించింది. నెట్‌ఫ్లిక్స్‌లో విడుదలైన ‘దో పట్టీ’ ప్రపంచవ్యాప్తంగా నాన్–ఇంగ్లీష్ సినిమాల టాప్–టెన్ జాబితాలో ఒకటిగా నిలిచింది.
నవ్వుతూనే భయపడేలా... భయపడుతూనే నవ్వేలా!
చాలా తక్కువ స్క్రీన్ టైమ్‌తో, ఆకట్టుకునే ట్విస్ట్‌లతో ‘స్త్రీ–2’లో మెప్పించింది శ్రద్ధాకపూర్. హాస్యం, హారర్‌ను మేళవించిన ఆమె నటన అదుర్స్ అనిపించింది. ఫ్రెష్ లుక్‌తో, చక్కని టైమింగ్‌తో ఆకట్టుకుంది. ‘సీక్వెల్ కోసం చాలా జాగ్రత్తలు తీసుకోవాలి. ఇది కత్తిమీద సాములాంటిది. ఎంటర్‌టైనింగ్ డైలాగులు ఉన్న‘స్త్రీ–2’లో అద్భుతమైన నటీనటులు ఉన్నారు’ అంటుంది శ్రద్ధా కపూర్.
అయితే ఆ అద్భుతమైన నటీనటులలో అందరి కంటే శ్రద్ధాకపూర్ ఎక్కువ మార్కులు తెచ్చుకుంది. ‘స్త్రీ–2’ విజయంతో ఇప్పుడు ‘స్త్రీ–3’కు ఉత్సాహంగా రెడీ అవుతోంది.
16 కిలోల బరువు పెరిగింది!
ప్రముఖ పంజాబీ గాయకుడు అమర్‌సింగ్ చమ్కీల జీవితం ఆధారం గా తెరకెక్కిన ‘అమర్ సింగ్ చమ్కీల’ అనే బయోగ్రఫీ డ్రామాలో పరిణీతి చోప్రా పవర్‌ఫుల్ పెర్ఫార్మెన్స్‌తో ప్రశంసలు అందుకుంది. ప్రతి సన్నివేశంలో పాత్ర పట్ల అంకితభావం కనిపిస్తుంది. ఈ సినిమా కోసం పరిణీతి చోప్రా ఏకంగా 16 కిలోల బరువు పెరిగింది!
‘చమ్కీల’ సినిమాలో అమర్ జోత్ కౌర్ పాత్రలో చోప్రాకు నటించే అవకాశం ఇచ్చిన డైరెక్టర్ ఇంతియాజ్ అలీ షూటింగ్‌కు ముందు... ‘కానీ మీరు ఆమెలా కనిపించడం లేదు’ అన్నాడు. అంతే.. బరువు పెరగడంపై దృష్టి పెట్టింది పరిణీతి చోప్రా. వర్కవుట్స్ చేస్తూ ఫిట్‌గా ఉన్న అమ్మాయి కాస్తా పాత్ర కోసం ఎడా పెడా తినేసి బరువు పెరిగింది.పరిణీతి చోప్రా ఉత్తమ నటన గురించి చెప్పుకునే చిత్రాలలో ‘చమ్కీల’ అగ్రస్థానంలో నిలుస్తుంది.
వెరీ స్ట్రాంగ్ ఉమెన్
సంప్రదాయ మహారాష్ట్ర మహిళగా ‘సర్ఫీర’లో రాధిక మదన్ అద్భుత నటన ప్రదర్శించింది. ప్రేమను పంచే భార్యగా, బలమైన వ్యక్తిత్వం, తిరగబడే శక్తి ఉన్న మహిళగా ఆమె పాత్ర ఆకట్టుకుంది.
విభిన్నమైన పాత్రలు పొషించడం రాధికకు కొత్త కాకపొయినా ‘సర్ఫీర’లో పాత్ర స్ఫూర్తిని ప్రతిబింబించేలా ప్రాంమాణికమైన నటనతో ఆకట్టుకుంది. విమర్శకుల ప్రశంసలతో పాటు ఎంతోమంది అభిమానులను సంపాదించింది. ‘మరాఠీ భాష, యాసపై రాధికకు ఉన్న పట్టు ఈ సినిమాలో హైలైట్.‘కంటెంట్ డ్రైవెన్ స్క్రిప్ట్‌లు ఎంచుకోవడంలో ముందు ఉంటుంది’ అని తన గురించి వినిపించే మాటను మరోసారి నిజం అని నిరూపించింది రాధికా మదన్.
మాటలు కాదు... మాస్టర్ క్లాస్
ఈ హసీన్ దిల్రూబా (2021)కి సీక్వెల్‌గా వచ్చిన ‘ఫిర్ ఆయి హసీన్ దిల్రూబా’లో తాప్సీ పన్ను మరోసారి తన బహుముఖ ప్రజ్ఞను చాటుకుంది. రొమాన్స్, సస్పెన్స్, డ్రామాలను బ్యాలెన్స్ చేయడం లో తన నటనతో మాస్టర్ క్లాస్ అనిపించుకుంది. కుట్రల ఉచ్చులో చిక్కుకుపొయే ‘రాణి కాశ్యప్’ పాత్రను పొషించి చిరస్మరణీయమైన నటనను ప్రదర్శించింది. ఎంతో సంక్లిష్టమైన పాత్రను కూడా అవలీలగా పొషించింది.
‘లవ్ అంటే పిచ్చి కాదు’ అంటున్న తాప్సీ ప్రేమ చుట్టూ ఉండే నమ్మకం నుంచి త్యాగం వరకు ఎన్నో అంశాలను ప్రతిఫలించే పాత్రలో నటించి మెప్పించింది.‘రాణి పాత్రను పొషించినందుకు గర్వంగా ఉంది. నా క్యారెక్టర్ ద్వారా ఓపెన్ మైండ్‌తో ఉన్నప్పుడే ప్రతికూల పరిస్థితులతో పొరాడగలమని చెప్పాను’ అంటున్న తాప్సీ పన్ను సీక్వెల్‌లో లోతైన భావోద్వేగాలను ప్రదర్శించి మొదటి భాగంతో పొల్చితే ఎక్కువ మార్కులు తెచ్చుకుంది.
భయపడింది... భయపెట్టింది!
‘భూల్ భులైయా 3’ ఫ్రాంచైజీతో మంజులికగా మెరిసింది విద్యాబాలన్. మంత్రముగ్ధులను చేసే నటనతో ప్రేక్షకుల, విమర్శకుల ప్రశంసలు అందుకుంది. ‘అమీ జే తోమర్’ పాటకు మాధురీ దీక్షిత్ కలిసి చేసిన డ్యాన్స్ ‘వావ్’ అనిపించింది. ‘భూల్ భులైయా 2’లో నటించడానికి ‘సారీ’ చెప్పింది విద్యాబాలన్. ‘భూల్ భులైయా నాకు బాగా నచ్చిన సినిమా. నేను బాగా నటించగలనా అనే సందేహం, రిస్క్ తీసుకోకూడదు అనుకోవడం వల్లే నో చెప్పాల్సి వచ్చింది’ అంటుంది విద్య.
అయితే ‘భూల్ భులైయా 3’ కోసం మరోసారి తన దగ్గరకు వచ్చినప్పుడు మాత్రం నో చెప్పలేకపొయింది. స్క్రిప్ట్ బాగా నచ్చడమే కారణం. ‘ఈ సినిమాలో నేను నటించాల్సిందే’ అని డిసైడైపొయిన విద్యాబాలన్ తన నటనతో ‘భూల్ భులైయా 3’ని మరో స్థాయికి తీసుకువెళ్లింది.
Comments
Please login to add a commentAdd a comment