మీరు ఊబకాయంతో బాధపడుతున్నారా? వ్యాయామం చేయాలంటే బద్దకమా? అయితే మీకో శుభవార్త! అధిక బరువును నియంత్రించే హార్మోన్ తొందర్లో మన ముందుకు రాబోతోంది. అవును .. న్యూయార్క్ శాస్త్రవేత్తలు ఈ హార్మోన్ ను కనిపెట్టారు. దీనికి "MOTS-c" అని పేరు కూడా పెట్టారు. అంతేకాదు ఈ హార్మోన్ సహాయంతో వృద్ధాప్యంలో వచ్చే ఇన్సులిన్ సమస్యల్ని కూడా కట్టడి చేయొచ్చని తమ పరిశోధనలో తేలిందిని వారు చెబుతున్నారు.
పెద్ద వయసులో వచ్చే వ్యాధుల నియంత్రణలో ఇదొక మంచి పరిణామమని సదరన్ కాలిఫోర్నియా యూనివర్శిటీ కి చెందిన పించాస్ కోచెన్, జెరెంటాలజీ నిపుణుడు డేవిడ్ లియోనార్డ్ చెబుతున్నారు. ఎలుకలపై దీన్ని పరిశోధించి చూసినపుడు మంచి ఫలితాలు కనిపించాయని వారు ప్రకటించారు.