అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో కమలా హారిస్‌పై డొనాల్డ్ ట్రంప్ ఘనవిజయం సాధించి అందరి దృష్టిని ఆకర్షించారు. అగ్రరాజ్యం 47వ అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టనున్నా ట్రంప్ చాలా బరువు కోల్పోయినట్లుగా కనిపిస్తున్నారు. మునుపటి ట్రంప్‌లా కాకుండా చాలా స్లిమ్‌గా ఉన్నారు. ఆయన బరువు తగ్గేందుకు ఏవేవో వాడుతున్నారంటూ నెట్టింట తెగ వైరల్ అవుతోంది.
కానీ అందులో ఏ మాత్రం నిజంలేదు. ఓ ఇంటర్వ్యూలో తానెందుకు బరువు తగ్గారో స్వయంగా వివరించారు ట్రంప్. ప్రస్తుతం తాను చాలా బిజీగా ఉండటం వల్లే హాయిగా తినే సమయం లేకపోయిందని అందువల్లే బరువు తగ్గినట్లు చెప్పుకొచ్చారు. అయితే ఇలా ఆహారంపై శ్రద్ధ చూపకుండా పనిలో బిజీగా ఉంటే బరువు తగ్గిపోతామా..?. ఇలా అందరికీ సాధ్యమేనా..?.
అధ్యక్ష్య ఎన్నికల కారణంగా వచ్చే ఒక విధమైన ఒత్తిడి, బిజీ షెడ్యూల్ తదితరాలు ట్రంప్ బరువు కోల్పోయేందుకు దారితీశాయి. ఇక్కడ ట్రంప్ నిరవధిక ప్రచార ర్యాలీల కారణంగా సరిగా భోజనం చేయలేకపోయానని చెప్పారు. ఓ పక్క వేళకు తిండి తిప్పలు లేకపోవడం, మరోవైపు ఎన్నికల్లో గెలుపు ఎవరిది అన్న ఆందోళన తదితరాలే ఆయన బరువు తగ్గేందుకు ప్రధాన కారణాలు. మొత్తంగా దీని ప్రభావం వల్ల ట్రంప్ దాదాపు 9 కిలోలు తగ్గిపోయారు. నిజానికి ఒత్తిడి కారణంగా బరువు పెరగాలి కానీ ట్రంప్ విషయంలో అందుకు విరుద్ధంగా ఉంది. ఇదెలా అంటే..
మానిసిక ఆరోగ్య నిపుణులు బరువు తగ్గడం అనేది మనస్సు, శరీరానికి సంబంధించినదని చెబుతున్నారు. ఇక్కడ శారీరక ఆరోగ్యాన్ని ఒత్తిడి ఎలా ప్రభావితం చేస్తుంది అని చెప్పేందుకు స్వయంగా ట్రంప్ ఒక ఉదాహరణ అని అన్నారు. ఎప్పుడైనా ఒత్తిడికి లోనైతే శరీరంలో కార్డిసాల్ అనే హార్మోన్ విడుదలవుతుంది. అందుకు అనుగుణంగా శరీరం ప్రతిస్పందిస్తుంది. దీంతో రక్తప్రవాహంలో కార్టిసాల్ స్థాయిలు ఒక్కసారిగా పెరిగి విపరీతమైన ఆకలి లేదా ఆకలి లేకపోవడం వంటి మార్పులకు లోనవుతుంది.
ప్రతిఒక్కరిలో ఈ ఒత్తిడి ఒక్కో విధంగా ప్రభావితం చేస్తుందని చెబుతున్నారు నిపుణులు. కొందరు దీని కారణంగా బరువు తగ్గొచ్చు, మరికొందరూ పెరగొచ్చు అని అన్నారు. అంతేగాదు కొందరిలో ఈ ఒత్తిడి బ్రెయిన్‌ని ఆడ్రినల్ హార్మోన్ విడుదలచేసేలా ప్రేరేపిస్తుంది. ఫలితంగా తినాలనే కోరిక ఆటోమేటిగ్గా తగ్గిపోవడం మొదలవుతుంది. అలాగే జీర్ణాశయంపై కూడా తీవ్ర ప్రభావం చూపి కేలరీలు బర్న్ అయ్యేలా చేసి బరువు కోల్పోయేందుకు దారితీస్తుంది.
మరికొందరికి మాత్రం.. ఒత్తిడిలోనైతే ఇదే కార్డిసాల్ అధిక కేలరీలు కలిగిన చక్కెరతో కూడిన పదార్థాలను తినేలా ప్రేరేపిస్తుంది. దీని వల్ల చాలామందికి పొత్తికడుపు పెద్దగా లావుగా ఉండటం లేదా బానపొట్ట తదితరాలకు కారణమని చెబుతున్నారు నిపుణులు. ఇలాంటి వ్యక్తులు కనీస శారీరక శ్రమ చెయ్యనట్లయితే ఒబెసిటికి దారితీసే ప్రమాదం ఉందని హెచ్చరిస్తున్నారు నిపుణులు.
Comments
Please login to add a commentAdd a comment