బాలీవుడ్ నటి ఐశ్వర్య రాయ్ బచ్చన్ అందానికే ఐకానిక్‌గా ఉండే సౌందర్యం ఆమె సొంతం. ఎంతమంది అందగత్తలైన ఆమెకు సాటి రారు. అలాంటి అద్భుతమైన అందం ఆమెది. ఐదుపదుల వయసులో కూడా అంతే గ్లామర్‌గా ఉండటం విశేషం. ఎక్కడ ఐశ్వర్యరాయ కనిపించినా..అందాల రాణి వస్తుందని ఆత్రంగా చూస్తారు. అంతటి ఆకర్షణీయమైన అందాన్ని మెయింటైన్ చేసేందుకు ఐశ్వర్య ఏంచేస్తుందో ఓ ఇంటర్వ్యూలో వెల్లడించారు కూడా. అంతేగాదు ప్రతి మహిళ చర్మ సంరక్షణ కోసం ఏం చేయాలో కూడా చెప్పారామె. ఇంతకీ అవేంటో చూద్దామా..!.
మాజీ మిస్ ఇండియా ఐశ్వర్య రాయ్ ఇప్పటికి అంతే ఫిట్‌గా అందంగా కనిపిస్తారు. ఎక్కడ మచ్చ్చుకైనా..వృద్ధాప్య ఛాయలు కానరావు. అంతలా మేని ఛాయ మెరుస్తూ ఉండేందుకు ఐశ్వర్య ఎంతో కేర్ తీసుకుంటానని చెప్పారు. ఆరోగ్యం కోసం ఎన్ని జాగ్రత్తలు తీసుకుంటామో అలాగే చర్మ సంరక్షణ కూడా అంతే ముఖ్యమని అంటోంది ఐశ్వర్య రాయ్.
తాను కూడా ప్రతి భారతీయ మహిళ ఎలా ఉంటుందో తాను అలానే ఉంటానన్నారు. "అయితే ఆత్మగౌరవంతో, సరైన వ్యక్తిత్వంతో బతకాలి. ఎట్టిపరిస్థితుల్లోనూ ప్రతి స్త్రీ తన ఆత్మగౌరవాన్ని చంపుకుని జీవించాల్సిన పనిలేదు. అదీగాక మహిళలు నిద్ర లేచిన దగ్గర నుంచి గడియారంలోని ముల్లుకంటే వేగంగా ఆగకుండా పనిచేస్తూనే ఉంటారని అన్నారు.
అందువల్ల కనీసం కొద్దిసేపైనా మీ కోసం సమయం కేటాయించడం అత్యంత ముఖ్యం. హైడ్రేటెడ్‌గా పరిశుభ్రంగా ఉండేందుకు ప్రయత్నించండి. మీ గౌరవాన్ని ఇనుమడింప చేసే అందంపై దృష్టి పెట్టండి. అందులో ఎలాంటి తప్పు లేదు. తప్పసరిగా మొటిమలు, అలెర్జీలు వంటి బారిన పడకుండా స్కిన్‌కేర్‌లు వాడలన్నారు. తప్పనసరిగా మాయిశ్చరైజర్‌లను వాడమని సూచించింది. వంటపనులతో సతమతమయ్యే మహిళలు తమ చర్మ ఆరోగ్యం కోసం మాయిశ్చరైజర్లు వాడాలని అన్నారు." ఐశ్వర్యరాయ్.
(చదవండి: 'తుప్పా దోస విత్ చమ్మంతి పొడి' గురించి విన్నారా?)
Comments
Please login to add a commentAdd a comment