స్వరభాస్కర్
ఈ లాక్‌డౌన్ సమయంలో బరువు పెరిగే పనిలో బిజీగా ఉన్నారు బాలీవుడ్ హీరోయిన్ స్వరభాస్కర్. కృష్ణ సేన్ అలియాస్ స్వీటీ సేన్ అనే ఓ అమ్మాయి అబ్బాయిగా మారి రెండుసార్లు వివాహం చేసుకుంది. ఈ విషయం అప్పట్లో దేశవ్యాప్తంగా చర్చనీయాంశమైంది. ఈ స్వీటీ సేన్ బయోపిక్‌లో స్వరభాస్కర్ నటించనున్నారు. ఈ చిత్రం గురించి స్వరభాస్కర్ మాట్లాడుతూ – ‘‘ఈ లాక్‌డౌన్ సమయంలో ఫుల్‌గా తింటూ బరువు పెరుగుతున్నాను.
స్వీట్స్, కార్బొహైడ్రేట్స్ ఉన్న పదార్థాలను ఎక్కువగా తీసుకుంటున్నాను. కొన్నిసార్లు అర్ధరాత్రి జంక్ ఫుడ్ తీసుకుంటున్నాను. ఇదంతా కృష్ణ సేన్ బయోపిక్ కోసమే. ఈ లాక్‌డౌన్ ఎప్పుడు ముగుస్తుందో, షూటింగ్స్ తిరిగి ఎప్పుడు ప్రారంభమవుతాయో ఎవరికీ కచ్చితంగా తెలియదు. లాక్‌డౌన్ ముగిసిన తర్వాత నా ప్రస్తుత మూవీ కమిట్‌మెంట్స్‌ని పూర్తి చేసి ఈ ఏడాది చివర్లోనే ఈ బయోపిక్‌ను స్టార్ట్ చేయాలనుకుంటున్నాం’’ అన్నారు. ఈ బయోపిక్‌కు స్వర ఓ నిర్మాత కూడా కావడం విశేషం.
Comments
Please login to add a commentAdd a comment