Rakul Preet Singh Interesting Comments About Her Fitness - Sakshi
Sakshi News home page

Rakul Preet Singh: 'సినిమా కోసం అలాంటి పని మాత్రం చేయను'

Published Sat, Dec 18 2021 10:31 AM | Last Updated on Sat, Dec 18 2021 12:28 PM

Rakul Preet Singh Interesting Comments About Her Fitness - Sakshi

Rakul Preet Singh Interesting Comments About Her Fitness: ‘వెంకటాద్రి ఎక్స్‌ప్రెస్‌’ సినిమాతో తెలుగులో హీరోయిన్‌గా ఎంట్రీ ఇచ్చిన రకుల్‌ ప్రీత్‌ సింగ్‌ ప్రస్తుతం వరుస సినిమాలతో దూసుకెళ్తుంది. హిందీ సహా ఇతర భాషల్లోనూ సక్సెస్‌ఫుల్‌ చిత్రాల్లో నటిస్తుంది. తాజాగా ఓ ఇంటర్వ్యలో మాట్లాడిన రకుల్‌ తన కెరీర్‌కు సంబంధించి ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది. సాధారణంగా పాత్ర డిమాండ్‌ చేస్తే దేనికైనా రెడీ అంటూ హీరోలతో సమానంగా పోటీపడుతుంటారు మన ముద్ముగుమ్మలు. అయితే తన విషయంలో ఆ ఒక్క పని మాత్రం చేయను అంటుంది రకుల్‌.

అదేంటంటే.. సినిమా కోసం ఎంతైనా కష్టపడతాను కానీ బరువు పెరగడం, తగ్గడం లాంటివి చేయమంటే మాత్రం నా వల్ల కాదంటుంది ఈ పంజాబీ భామ. బరువు అనేది సహజమైన ప్రక్రియ. కావాలని బరువు పెరిగినా, తగ్గినా శరీరంపై తీవ్ర ప్రభావం పడుతుంది. అది అనారోగ్య సమస్యలకి దారి తీస్తుంది. అందుకే తెలిసి తెలిసి ఆ తప్పు చేయను. నాకు నా ఫిట్‌నెస్‌ చాలా కీలకం. అయినా నా అదృష్టం కొద్దీ ఇప్పటివరకు నన్ను అలా ఎవరూ అడగలేదు అని పేర్కొంది. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement