ఆ మృతదేహం మా చెల్లిదే
Published Thu, Dec 29 2016 11:28 PM | Last Updated on Tue, Nov 6 2018 4:13 PM
- ఎస్పీకి ఫిర్యాదు చేసిన మృతురాలి అక్కలు
- కేసు దర్యాప్తులో పురోగతి
డోన్ టౌన్ : ఈ నెల 24వతేదీన వెల్దుర్తి మండలం అల్లుగుండు - మల్లెంపల్లె గ్రామాల మధ్య హంద్రీనీవా కాల్వలో లభ్యమైన మృతదేహం తమ చెల్లి తులసిదేనని ఆమె అక్కలు పుష్పలత, మాధవి గురువారం ఎస్పీ ఆకె రవికృష్ణ దృష్టికి తీసుకెళ్లారు. దీంతో మండలంలోని సీసంగుంతల గ్రామానికి చెందిన ఆమె భర్త రాజశేఖరే హత్యచేసి ఉంటాడని పోలీసులు అనుమానిస్తున్నారు. తులసి అక్కల వివరాల మేరకు..సీసంగుంతలకు చెందిన అనంతయ్య ఆచారీ కుమారుడు రాజశేఖర్, డోన్‌కు చెందిన డేవిడ్, సుశీలమ్మ మూడవ కుమార్తె తులసిని ప్రేమించి 2014లో పెళ్లి చేసుకున్నాడు. రాజశేఖర్ పంజాబ్‌లోని పటాన్ కోట్ మిలిటరీ బేస్‌లో జవాన్‌గా పనిచేస్తున్నారు. కొన్నాళకే వీరిమధ్య మనస్పర్థలు వచ్చాయి. భర్త తనను వేధిస్తున్నట్లు తులసి గతంలో పెట్టిన కేసు కూడా ప్రస్తుతం కోర్టులో నడుస్తోంది. రెండు నెలల క్రితం ఒక్కగానొక్క కూతురు మైథిలీ (1) అనారోగ్యంతో మృతిచెందినా రాకపోవడంతో రాజశేఖర్ రాకపోవడంతో తులసి గత నెల 24వ తేదీన ఆయన వద్దకు వెళ్తున్నట్లు చెప్పి పటాన్ కోట్‌కు బయల్దేరివెళ్లింది. ఈ నెల 18వరకు తమకు ఫోన్లో అందుబాటులో ఉందని, తర్వాత ఎలాంటి సమాచారం రాలేదని పుష్పలత, మాధవి ఎస్పీకి తెలిపారు.
Advertisement