రెండు మృతదేహాలు లభ్యం
Published Sat, Dec 24 2016 7:58 PM | Last Updated on Wed, Sep 26 2018 6:21 PM
- హత్య చేసినట్లు పడేసినట్లు అనుమానాలు
- కేసు దర్యాప్తు చేస్తున్న పోలీసులు
వెల్దుర్తి రూరల్: స్థానిక పోలీస్ స్టేషన్ పరిధిలోని హెచ్‌ఎన్‌ఎస్‌ఎస్(హంద్రీ నీవా కాలువ) మల్లెపల్లె పంపింగ్ స్టేషన్ (పీఎస్–3)వద్ద రెండు గుర్తు తెలియని మృతదేహాలు కనిపించారు. శనివారం ఉదయం మృతదేహాలను గమనించిన సిబ్బంది.. పోలీసులకు సమాచారమందించారు. డోన్ సీఐ శ్రీనివాసులు, వెల్దుర్తి ఎస్‌ఐ–2 నగేశ్, పోలీసులు మృతదేహాలను పంచాయతీ సిబ్బంది సహాయంతో వెలికితీసి విచారణ ప్రారంభించారు. పోలీసుల వివరాల ప్రకారం.. మృతుల్లో ఒకరు మహిళగా, మరొకరు యువకునిగా గుర్తించారు. మహిళను టవల్‌తో గొంతుకు బిగించి హత్య చేసి.. గోనెసంచిలో కట్టి హంద్రీకాలువలో పడవేసినట్లు అనుమానముందన్నారు. గోనెసంచి విప్పి చూడగా ఆమె ఒంటిపై బ్లూ కలర్ చుడీదార్, రెడ్‌కలర్ పైజామా, పైన స్వెటర్‌లతో పాటు గొంతుకు టవల్ బిగించి ఉందన్నారు. వయసు 25నుంచి 30మధ్యలో ఉండొచ్చన్నారు. అలాగే యువకుని ఒంటిపై గీతల టీషర్ట్ ఉందని, బ్లాక్ కలర్ షార్ట్‌తో పాటు షూ వేసుకున్నాడన్నారు. వయసు 25నుంచి 35సంవత్సరాల లోపు ఉంటుందన్నారు. వీరి వద్ద నుంచి ఆధారాలు ఏవీ లభించలేదని, మృతదేహాలను కర్నూలు మార్చురీకి తరలిస్తున్నట్లు వారు తెలిపారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నామని.. ఆనవాలు గుర్తించిన వారు వెల్దుర్తి పోలీస్‌స్టేషన్‌లో సంప్రదించవలసినదిగా వారు కోరారు.
Advertisement
Advertisement