అనంతపురం: హంద్రీనీవా ప్రాజెక్టు సాధన కోసం ఆగస్టు 2 నుంచి ఉద్యమం చేస్తామని వైఎస్సార్సీపీ ఎమ్మెల్యే వై విశ్వేశ్వరరెడ్డి అన్నారు. అనంతకు నీరివ్వాలని చంద్రబాబు మనసులో లేదు కాబట్టే ఇతర ప్రాంతాలకు తరలించే ప్రయత్నం చేస్తున్నారని ఆరోపించారు. అనంతపురం జిల్లా ఆయకట్టుకు నీరిచ్చిన తర్వాతే ఇతర ప్రాంతాలకు నిధులు ఇవ్వాలని, లేదంటే ఆందోళన తప్పదని ఆయన హెచ్చరించారు.